సంపాదకీయం

నకిలీ ప్రమాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యావంతులు కాని వారు విద్యావంతులుగా ‘ము ద్ర’లు వేసుకుంటుండడం వాణిజ్య విద్యా సంస్థలు-కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్- పుట్టలుగా గుట్టలుగా పెరిగిపోవడం వల్ల సంభవించిన విపరిణామం. ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-వల్ల ఈ విపరిణామం మరింతగా ప్రభావితం చేస్తోంది! భారీగా శుల్కాల- ఫీజెస్-ను దండుకుంటున్న ‘కార్పొరేట్’ విద్యా సంస్థలవారు తమ సంస్థల్లోని విద్యార్థులందరూ గొప్ప ప్రతిభతో ఉత్తీర్ణులవడానికి వీలైన వ్యవస్థలను నిర్మించుకోవడం ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం. ప్రతి కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలోను వందశాతం ఉత్తీర్ణత సాధించినట్టు ప్రచారమైంది, ప్రచారవౌతోంది. ఉత్తీర్ణులైన వారందరికీ తొంబయి శాతం కంటె ఎక్కువ ‘మార్కులు’ లభించినట్టు కూడ మరో ప్రచారం.. ఇలా ఉత్తీర్ణులైపోతున్న విద్యార్థులలో అరవై శాతం మంది నిరుద్యోగులుగా కొనసాగుతున్నారన్నది ‘అఖిల భారత సాంకేతిక విద్యామండలి’ వారు తేల్చిన నిగ్గు.. ఇంజనీరింగ్ విద్యార్థులు వేసవి సెలవులలో వివిధ పారిశ్రామిక సంస్థలలో ‘నెలరోజులు’, ఇంకా ఎక్కువ రోజులు శిక్షణ పొందాలని, అధ్యయన కార్యక్రమాల్లో పాల్గొనాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి- ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్- నిర్దేశిస్తుండగా దేశంలోని ఒక శాతం విద్యార్థులు మాత్రమే ఈ ‘ఇంటర్న్‌షిప్’కు హాజరవుతున్నారట! వివిధ రాష్ట్రాలలోని ‘ఇంజనీరింగ్’ విద్యా ప్రమాణాలు విభిన్నంగా ఉండడంతో, ఒకే రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ప్రమాణాలు కూడ భిన్నంగా ఉండడంతో దేశమంతటా పని చేయడానికి ఆయా కళాశాలల నుండి ఉత్తీర్ణులైన వారికి అర్హత ఉండడం లేదట! ఉన్నత విద్యకు సంబంధించి దేశమంతటా ఒకే విధమైన ‘ప్రమాణం’ ఉండాలన్నది గతంలో అమలు జరిగిన నిబంధన. ఈ గతం ఇ ప్పుడు సుదూర గతం! దేశవ్యాప్తంగా ఒకే సంస్థ పోటీ పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలకు అ భ్యర్థులను ఎంపిక చే స్తోంది. అదే విధంగా కనీసం స్నాతకోత్తర తరగతుల స్థాయి- పోస్టు గ్రాడ్యుయేట్-పరీక్షలను దేశవ్యాప్తంగా ఒకే సంస్థ నిర్వహించి పట్టాలను ప్రదానం చేస్తేనే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ‘ఇంజనీరింగ్’ పట్ట్భద్రులే కాదు, అన్ని విద్యా విభాగాల పోస్టు గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్లు సైతం ‘ప్రమాణాలు’ లేని, ఉద్యోగాలు రాని దురవస్థకు గురి అయి ఉన్నారు! రాష్ట్రాల వారీగా పరీక్షలు జరుగుతుండడం వల్ల మాత్రమే కాదు విశ్వవిద్యాలయాల వారీగా విడివిడిగా పరీక్షలు జరుగుతుండడంవల్ల ‘పోస్టు గ్రాడ్యుయేట్’ స్థాయి ‘ప్రమాణాలు’ దశాబ్దుల తరబడి పడిపోయాయి.. ఎందుకంటే అధిక శాతం ఉత్తీర్ణతకు ప్రమాణాలకు మధ్య జరుగుతున్న పోటీలో ప్రమాణాలు బలి అయిపోతున్నాయి!
పనికట్టుకుని శతాబ్దుల పాటు విద్యల ప్రమాణాలను దిగజార్చిన ప్రభుత్వాలు మరో వైపు ప్రమాణాలు పడిపోవడం పట్ల ఏడుపుకెత్తుకుంటుండడం విచిత్రం! విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల కళాశాలల సంఖ్యను పెంచడం, అధ్యాపకుల సంఖ్యను పెంచడం ఔచిత్యవంతం! కానీ విద్యా ప్రమాణాలను నిర్ణయించి పాఠ్యాంశాలను నిర్ధారించి, పరీక్షలను నిర్వహించి పట్టాలను ప్రదానం చేసే విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచవలసిన అవసరం ఏమిటి? విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగిన కొద్దీ ప్రమాణాలలో ‘అంతరం’ రావడం సహజం! జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత ఈ అంతరాలు మరింతగా విస్తరించిపోయాయి. వేఱు వేఱు పాఠ్యాంశాలు, వేఱువేఱు పరీక్షలు పొందడం ఇందుకు కారణం. కొన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి ‘సమాన’ పాఠ్య ప్రణాళికలు, సమన్వయ మండలి ఏర్పడిన చోట్ల సమాన ‘ప్రమాణాలు’ ప్రస్ఫుటించవచ్చు! కానీ విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగడం ప్రమాణాలలో ‘అంతరం’ సైతం పెరగడానికి దోహదం చేసింది! మా కళాశాలలో, మా జిల్లాలో, మా విశ్వవిద్యాలయంలో, మా రాష్ట్రంలో ఎక్కువ మంది పట్ట్భద్రులు, స్నాతకోత్తరులు, పరిశోధకులు, వృత్తి విద్యా పట్ట్భద్రులు అధికాధికంగా ఉండాలన్న ‘ఆరాటం’ సహజంగానే ప్రమాణాలను దిగజార్చి వేసింది! ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు వలెనే సాధారణ ‘అండర్’ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి సైతం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలన్న అభిప్రాయం బలపడుతుండడానికి ఇదీ కారణం. ‘బి.ఎ’ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరదలుచుకున్న వారిని ఎంపిక చేయడానికి ప్రతి రాష్టస్థ్రాయిలోను, ‘పోస్ట్ గ్రాడ్యుయేట్’ కోర్సులలో చేరే వారిని ఎంపిక చేయడానికి అఖిల భారత స్థాయిలోను ప్రవేశ పరీక్షలు నిర్వహించే ప్రతిపాదనను కేంద్ర మానవ శక్తి వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందట!
దేశంలో ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులు అవుతున్న ఇంజనీరింగ్ పట్ట్భద్రుల సంఖ్య ఎనిమిది లక్షలు. అంటే సగటున ఏటా ఐదు లక్షల మంది నిరుద్యోగులను కేవలం ‘ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్లు’ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడానికి కారణం నిరుద్యోగం.. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలలో యాబయి శాతం ‘సీట్లు’ ఈ ఏడాది భర్తీ కాలేదట! కళాశాలల సంఖ్య తగ్గిపోవడం, ఉన్న కళాశాలల్లో సీట్లు భర్తీకాకపోవడం.. దేశమంతటా నకిలీ విద్యాసంస్థలు పుట్టుకుని వచ్చాయి. పరీక్షలు రాయని వారికి, కళాశాలకు వెళ్లని వారికి ‘పట్టాలు’ లభిస్తుండడం విద్యా వ్యాపారంలో జరుగుతున్న అక్రమాలకు కొన్ని నిదర్శనాలు మా త్రమే! ఇటీవలి కాలంలో సంవత్సరమంతా కళాశాలకు హాజరు కాని విద్యార్థులకు యాజమాన్యాలు అటెండెన్స్ ఇవ్వడం ఓ ‘్ఫ్యషనై’పోయింది. ఇలా కా లేజీ ముఖం చూడని విద్యార్థులను కాలేజీకి వచ్చినట్టుగా పరిగణించడాన్ని ప్రభుత్వాలు పట్టించుకొనడం లేదు. ఇది అనధికార, అనైతిక దూర విద్య.. దేశంలో రెండు వందల డెబ్బయి తొమ్మిది ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యాసంస్థలు ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’-ఏఐసిటిఇ- అనుమతి లేకుండానే పనిచేస్తున్నాయట! హైదరాబాద్ నగరంలోనే ఇలాంటి ముప్పయి ఐదు సంస్థలు అక్రమంగా మొలుచుకుని వచ్చినట్టు ‘ఏఐసిటిఇ’ వెల్లడించింది! ఇలా వెల్లడి అయిన తరువాత కూడ ఈ ‘నకిలీ’ సంస్థలు ఇంజనీరింగ్, ఎమ్‌బిఏ, ఫార్మసీ వంటి కోర్సులలో విద్యార్థులను చేర్చుకుంటూనే ఉన్నాయట!
పట్ట్భద్రుల సంఖ్యను స్నాతకోత్తరుల సంఖ్యను పెంచడం, పట్టాలు పొందిన వారందరికీ ఉద్యోగాలనివ్వడం- ఈ రెండు లక్ష్యాల ప్రాతిపదికగా మన ఉన్నత విద్యా విధానం కొనసాగుతోంది! నిజంగా ప్రతిభ ఉన్నవారు మాత్రమే ‘ఉత్తీర్ణులు’ కావాలన్నది పాత కథ. ‘అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః’- అస్తవ్యస్తంగా ఆలోచించే వారు చేసే ‘మంచి’ కూడ భయంకరమైన పరిణామాలను కలిగిస్తుంది అని అన్నట్టుగా ‘సంఖ్య’ను పెంచాలన్న ప్రభుత్వాల విధానం రకరకాల వైపరీత్యాలను సృష్టించింది. విద్యావంతులు సౌశీల్యవంతులుగా కూడ రూపొందడానికి వీలైన పాఠ్యప్రణాళికలు గతంలో ఉండేవి. అవి మూతపడిపోవడం వల్ల సౌశీల్యం లేని వి ద్యావంతులు అధిక సంఖ్యలో తయారయ్యారు. ఈ ‘విద్యా’వంతులు విద్యావ్యాపారులుగా ‘నకిలీ’ సంస్థలను నిర్వహిస్తున్నారు! వౌలికమైన సమస్య ఇదీ..