సంపాదకీయం

గోరక్షణకు గుజరాత్ స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ శాసనసభ తాజాగా ఆమోదించిన ‘పశుగణ పరిరక్షణ సవరణ బిల్లు’ విజ్ఞత విస్తరిస్తోందనడానికి నిదర్శనం. ఆవును హత్యచేసే నేరస్థులకు పదునాలుగేళ్ల కారాగృహ నిర్బంధ శిక్షను విధించడానికి ఈ బిల్లు వీలుకల్పిస్తోంది! క్రీస్తుశకం 2011వ సంవత్సరంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన ‘పశుగణ పరిరక్షణ’ సవరణ చట్టం ప్రకారం గోవును వధించే నేరస్థులకు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్షను విధించడానికి వీలుంది. ఇప్పుడు ఆమోదించిన బిల్లు ‘గోవంశ’ పరిరక్షణకు మరింత దోహదం చేయగలదు. ఇలాంటి కఠినమైన శిక్షను విధించడానికి వీలైన చట్టాలు లేని కారణంగానే దశాబ్దుల తరబడి దేశంలోని కోట్లాది ఆవులను దూడలను పెయ్యలను కోడెలను చంపి విదేశాలకు వాటి మాంసాన్ని ఎగుమతి చేయడానికి వీలు కలిగింది. దేశంలోని మొత్తం ప్రజలలో గోమాంసం ‘అప్పుడప్పుడు’ తింటున్న వారి సంఖ్య కేవలం నాలుగు శాతమని అనేక పరిశోధనలలో ధ్రువపడిన సత్యం. వీరిలో కూడ కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే నియతంగా గోమాంసం తినేవారు ఉన్నారట! అందువల్ల దశాబ్దుల తరబడి ‘స్వతంత్ర భారతదేశం’లో కోట్లాది గోవులను, గోసంతతిని వధించడం కేవలం స్వదేశీయ గోమాంస భుక్కులకూ సరికాదు! భారతీయ గోమాంసం రుచి మరిగిన విదేశాలలోని ‘అమానవీయ’ వినియోగదారుల కోసం ఈ దేశంలోని యంత్ర వధశాలల కసాయి గుండెలవారు కోట్లాది గోవులను హత్యచేయడం నడిచిన చరిత్ర, ఇప్పటికీ గడుస్తున్న చరిత్ర. గోమాంసాన్ని డబ్బాలలో భద్రపరచి విదేశాలకు ఎగుమతి చే యడం వల్ల మా త్రమే అధికాధిక గో సంతతి హత్యలకు గురైపోయింది! అం దువల్ల గో మాంసం ఎగుమతులను సంపూర్ణంగా నిషేధించ డం వల్ల మాత్రమే ఆవులను, గోజాతులను రక్షించడానికి వీలుకలుగుతుం ది! ఇది ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు అన్ని రాష్ట్రాలలోను గ్రహించవలసిన అంశం! దేశమంతటా సర్వసమగ్రమైన గోరక్షణ చట్టాలు అమలు అయినందువల్ల దేశ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగబోదన్నది రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు గుర్తించవలసిన మరో ప్రధాన అంశం! ఎందుకంటె కేవలం ఒకటిన్నర శాతం ప్రజలు మాత్రమే నియతంగా ‘గోమాంసం’ తింటున్నారట! తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సమష్టి జాతీయ సంప్రదాయాలకు మధ్య ‘సంఘర్షణ’ ఏర్పడినప్పడు జాతీయ నిష్ఠగల పౌరులు వైయక్తిక రుచుల కంటె సమష్టి సంప్రదాయాలను పాటించడానికి ప్రాధాన్యం ఇవ్వడం న్యాయం. ప్రపంచంలోని అన్ని నాగరిక దేశాలలోను ప్రభుత్వాలు, ప్రజలు ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు! మన దేశంలో కూడ ఎందుకని పాటించరాదు? అనాదిగా ఆవును అమ్మతో సమానంగా భావించడం ఈ దేశ ప్రజల సమష్టి సంప్రదాయం!
ఈ జాతీయ సంప్రదాయాన్ని ఈ దేశాన్ని దురాక్రమించిన విదేశీయులు భగ్నం చేశారు! గోహననం విదేశీయ దురాక్రమణదారుల ‘విజయాని’కి చిహ్నం! ‘ఓడిన’ భరతజాతికి చెందిన ప్రతి సంప్రదాయాన్ని భగ్నం చేయాలన్న విజాతీయ బీభత్సకారుల వికృతానంద- శాడిస్ట్- ప్రవృత్తి ఆవులను హత్యచేసింది. ‘ఓడిన’ జాతికి ‘ఆరాధ్య’ అయిన ఆవును చంపడం ద్వారా తమ పైశాచిక విజయాన్ని వంచనతో గెలిచిన విజాతీయులు చాటుకున్నారు. ఆరబ్బులు, తురుష్కులు, బుడత కీచులు - పోర్చుగల్‌వారు-, ప్రాంచీలు- ఫ్రాన్స్‌వారు- ఫిరంగీలు- బ్రిటన్ దుండుగులు- ఒకరి తరువాత ఒకరుగా ఇలా ‘గోహనన’కాండను తమ విజయ చిహ్నంగా చాటుకున్నారు. క్రీస్తుశకం 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఘోరమైన వంచన పద్ధతుల ద్వారా ఓడించిన జిహాదీ బీభత్సకారులు దక్షిణ భారతమంతటా ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో పనికట్టుకొని ఆవులను చంపడం చరిత్ర. నడిబజారులోనే ఆవులను చంపి చర్మం ఒలిచి వండి తినడం ద్వారా జిహాదీలు స్వజాతీయుల మనోభావాలను ఘోరంగా గాయపరచడం చరిత్ర! ‘ఖిల్జీ’ జిహాదీలు మొదలు ‘రజాకార్’ జిహాదీల వరకు ఈ గోహనన చరిత్రను కొనసాగించారు! మైసూరు వంటి ‘సంస్థానాల’లోని గోరక్షణశాలలలోని ముచ్చటయిన కోడె దూడలను ‘బ్రిటన్’ అధికారులు కోయించి వేయించి కడుపు నింపుకున్న ఘట్టాలు పారతంత్య్ర చరిత్రలో ఆకృతిదాల్చిన వికృత ఘట్టాలు..
ఈ పారతంత్య్ర చరిత్ర ముగిసి దశాబ్దులు గడిచిపోయినప్పటికీ స్వజాతీయ సంప్రదాయాలు సర్వసమగ్రంగా పునరుద్ధరణకు నోచుకోకపోవడం మన దేశానికి మాత్రమే పరిమితమైన దౌర్భాగ్యం! ప్రపంచంలో దాస్య విముక్తమైన మిగిలిన దేశాల వారందరూ తమ స్వజాతీయ సంప్రదాయాలను పునరుద్ధరించుకోవడం అనేక దశాబ్దులుగా కొనసాగుతున్న పరిణామక్రమం! మూఢ విశ్వాసాలను సైతం ఆయా ‘విముక్త’ దే శాల వారు పునరుద్ధరించుకుంటున్నా రు! కానీ మన దేశంలో మాత్రం శాస్ర్తియమైన తార్కికమైన వాస్తవ ప్రగతి కారకమైన పద్ధతులను సైతం పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు తటపటాయిస్తుండడం జాతీయ వైపరీత్యం! గోవంశ సమగ్ర రక్షణ మూఢ విశ్వాసం కాదు, నిజమైన ప్రగతిని వకసింపచేయగల జీవన వ్యవహారం. ‘గవ్యాల’ ఆవునుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పంచితము, పేడ- వ్యవసాయ భూములను నిరంతరం పరిపుష్టం చేయడానికి దోహదం చేశాయి. ఇలా పరిపుష్టమయిన వ్యవసా య క్షేత్రాలు విరగపండి మనకు అన్న సమృద్ధిని కలిగించాయి. గోసంతతి అంతరించిపోవడం వల్ల ‘గవ్యాలు’ దొరకని గ్రా మాలలో కృత్రిమమైన ఎ రువులు వాడి వ్యవసా యం చేస్తున్నారు. ఈ కృత్రిమమైన ఎరువులు విష రసాయనాలు.. ఫలితంగా వ్యవసాయ భూములు పరిసరాలు ప్రకృతి మానవ జీవనం క్రమంగా విష పూరితం అయిపోయాయి..
స్వచ్ఛ్భారత పునర్నిర్మాణం అందువల్ల గోసంరక్షణతో ముడిపడి ఉంది. విష రసాయనాల నుంచి వ్యవసాయ భూములు విముక్తిని పొంది, ప్రాకృతిక జవసత్వాలతో పరిమళించాలంటే సేంద్రియ వ్యవసాయం మళ్లీ జీవం పోసుకోవాలి. ఇలా జీవం పోసుకోవాలంటే గోసంతతి ఇబ్బడిగా ముబ్బడిగా పదింతలుగా వర్ధిల్లాలి! అందువల్ల ఈ గోసంతతి ప్రవర్ధనకు దోహదం చేయగల గుజరాత్ ప్రభుత్వ చర్య అభినందనీయం. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రమేకాక కేంద్ర ప్రభుత్వం కూడ దీన్ని అనుసరించాలి. గోసంతతిని, పశు సంతతిని పరిరక్షించి పెంపొందించాలన్నది రాజ్యాంగం నిర్దేశిస్తున్న మార్గదర్శక సూత్రం.