సంపాదకీయం

చదువుల దుకాణాలకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలలు పాఠ్య పుస్తకాలను అమ్ముకునే దుకాణాలుగా మారి ఉండడం ‘కేంద్రీయ ఉన్నత విద్యామండలి’ వారు జారీ చేసిన సరికొత్త ఆదేశానికి నేపథ్యం. వాణిజ్య విద్యా ప్రపంచంలోని ప్రత్యేకతలలో ప్రధానమైనది చదువు చెప్పడం కాదు, చదువులకు సామగ్రిని అమ్మడం. ఈ అమ్మకాలకు స్వస్తి చెప్పాలని ‘అనుబంధ’ పాఠశాలల యాజమాన్యాలకు కేంద్రీయ ఉన్నత విద్యామండలి- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సిబిఎస్‌ఇ- ఆదేశించడం అలస్యంగానైనా సంభవించిన శుభ పరిణామం! దశాబ్దుల కిందట జరుగవలసి ఉండిన ఈ పరిణామం ఇప్పటికైనా సంభవించడం హర్షణీయం. కానీ, ప్రభుత్వేతర ‘అనుబంధ’ పాఠశాలల యాజమాన్యాల వారు ఈ ఉత్తర్వులను వమ్ము చేయడానికి రకరకాల పద్ధతులను కనిపెట్టే అవకాశం లేకపోలేదు. ఈ పాఠశాలల యాజమాన్యాల వారు తమ ప్రాంగణాల్లో కాక, కొంత దూరంలో దుకాణాలు తెరిచే అవకాశం ఉంది. ఆ దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలని పాఠశాలల అధిపతులు విద్యార్థుల తల్లిదండ్రులను నిర్దేశించవచ్చు! రెండవది, సిబిఎస్‌ఇకి అనుబంధంగా ఉన్న పాఠశాలలకు మాత్రమే ఈ ‘అఖిలభారత స్థాయి’ ఉత్తరువు వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ‘పాఠ్య ప్రణాళిక’లను అమలు చేస్తున్న వాణిజ్య పాఠశాలలు- కార్పొరేట్ స్కూల్స్-కు, ప్రభుత్వేతర పాఠశాలలకు ఈ ఉత్తర్వువు వర్తించదు. అందువల్ల దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు వర్తించే విధంగా పార్లమెంటులో చట్టం చేయాలి. దానివల్ల మాత్రమే పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న దోపిడీ కొంతవరకూ తగ్గుతుంది. పూర్తిగా తగ్గడం అ న్నది పాఠశాలల యా జమాన్యాల నైతిక ని ష్ఠపై ఆధారపడి ఉంది! ‘కాపీ’కొట్టి ఉత్తీర్ణులైన వారు, డిగ్రీలను పొందినవారు, లంచాలు ఇచ్చి పాఠశాలలను నిర్వహించడానికి అనుమతులు పొందిన వారు నైతికనిష్ఠను కలిగి ఉంటారనుకోవడం భ్రమ! ఏమైనప్పటికీ సిబిఎస్‌ఇ వారు విధించిన కొత్త నిబంధన వల్ల పాఠశాలల వారు పాఠ్య పుస్తకాలను అమ్మి సొమ్ము చేసుకోవడం తగ్గిపోతుంది. పాఠ్య పుస్తకాలను అమ్మడం ద్వారా మాత్రమే కాదు ‘గణవేషం’- యూనిఫారమ్- ‘పదవేషం’- బూట్లు- పెన్సిళ్లు, రబ్బర్లు, తెల్ల కాగితాలు, నోటు పుస్తకాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లను సైతం తమ ప్రాంగణంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ‘్ఫజుల’ను దండిగా దండుకొని విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేయడం దోపిడీ ప్రక్రియలో ప్రధానమైన అంశం!
ఒక సంస్థ వారు తయారు చేసిన పెన్సిళ్లను, బాల్‌పాయింట్ పెన్నులను మాత్రమే తమ విద్యార్థులు కొనాలన్న నిబంధనలను కూడా కార్పొరేట్ విద్యాసంస్థల ‘కామందులు’ అమలు చేస్తున్నారు. ఈ సామగ్రిని భారీ ఎత్తున కొనుగోలు చేసి ఆయా ఉత్పత్తిదారుల నుంచి పాఠశాలల యాజమాన్యాల వారు భారీగా డిస్కౌంట్‌ను పొందుతున్నారు. అందువల్ల ఈ రాయితీ- డిస్కౌంట్-లో కొంత శాతం తాము దిగమింగినప్పటికీ ‘కనీసం చిల్లర ధర’- మినిమమ్ రిటైల్ ప్రైస్-ఎంఆర్‌పి- కంటే తక్కువకు విద్యార్థులకు ఈ ఉపకరణాల- స్టేషనరీ-ను పాఠశాలల యాజమాన్యాలు అమ్మవచ్చు. కానీ ఎంఆర్‌పి కంటే ఎక్కువగానే విద్యార్థుల నుంచి వసూలు చేయడం అనేక పాఠశాలల ప్రాంగణాలల్లోని దుకాణాలు అనుసరిస్తున్న వ్యాపార నీతి! వాటర్ బాటిల్‌లను, టిఫిన్- లంచ్ బాక్సులను, వీటిని పెట్టడానికి నగిషీ బ్యాగులను సైతం తాము నిర్దేశించిన రీతిలో నిర్దేశించిన చోట కొనాలన్నది దోపిడీ రంగపు పాఠశాలల యాజమాన్యాలు విధిస్తున్న నిబంధన. తల్లిదండ్రులు ఇతర చోట్ల ఇతర సంస్థల ఉపకరణాలను కొనివ్వబోతే- అలా వద్దని కానె్వంటు పిల్లలు అమ్మానాన్నలకు సలహాలిస్తున్నారు. పాఠశాలలో అమ్మే పాఠ్య పుస్తకాలను, ఉపకరణాలను అసలు ధరల కంటే తక్కువకు అమ్మాలని 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువు జారీ చేసిదంట! కానీ ఈ ఉత్తరువు అమలు జరిగిన జాడ లేదు. పాఠ్య పుస్తకాలను కొనవలసిన మూడు దుకాణాలను ప్రతి పాఠశాల నిర్దేశించాలన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన మరో నిబంధన...
కానీ ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు నిర్దేశితమైన మూడు దుకాణాలలోనే ఎందుకని కొనాలి? ఫలానా దుకాణంలోనే మందులను కొనవలసిందిగా కార్పొరేట్ డాక్టర్లు నిర్దేశిస్తున్నారు. ఆ దుకాణం వాడు డాక్టరు గారికి కమీషన్ ముట్టచెబుతాడు. అదే విధంగా పాఠశాల యాజమాన్యం నిర్దేశించే దుకాణాల వారు పాఠశాల యాజమాన్యాలకు కమీషన్లు ముట్టచెబుతారు. పాఠ్యపుస్తకాలను, యూనిఫారమ్‌లను, స్టేషనరీ ఉపకరణాలను, లంచ్ బాక్సులను ఎక్కడైనా కొనుక్కోవచ్చునన్న నిబంధన ఏర్పడితే దుకాణం దారులు పోటీపడి విద్యార్థులకు డిస్కౌంట్ ఇస్తారు. కానీ విధిగా తమ దుకాణంలోనే కొంటారని ధ్రువపడిన తరువాత దుకాణం దారులు ధరలను మరింత పెంచి అమ్ముతున్నారు. వివిధ సంస్థలు పాఠ్య పుస్తకాలను ముద్రించవచ్చు. కానీ దేశమంతటా కేంద్రీయ విద్యాలయాలల్లో ఒకే పాఠ్య ప్రణాళిక అమలు జరిగినట్టుగా, అన్ని ప్రభుత్వేతర పాఠశాలల వారు దేశమంతటా ఒకే విధమైన పాఠాలను బోధించాలన్న నిబంధన ఏర్పడాలి. అలా జరిగినపుడు ఏ సంస్థ ముద్రించినా, అమ్మినా పాఠ్యపుస్తకాల్లో అవే పాఠాలు ఉంటాయి. ఒకే విధమైన ధరలు కూడా అమలు కాగలవు. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య ప్రణాళికను బోధించే ప్రభుత్వేతర పాఠశాలలు కూడ రాష్టమ్రంతటా ఒకే విధమైన పాఠ్యాంశాలు బోధించాలి. పాఠ్యపుస్తకాలను ఏ సంస్థ ముద్రించినప్పటికీ పాఠ్యాంశాలు మారవు, ధరలు మారవు.
ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ దిగజారి ఉండడం ప్రభుత్వేతర యాజమాన్యాలు ఫీజులను పెంచి దోపిడీ చేస్తుండడానికి కారణం. ఈ భయంకరమైన దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉద్యమిస్తున్నారు, విజయవాడలో ఆందోళన చేస్తున్నారు, దేశమంతటా నిరసనలు తెలుపుతున్నారు.. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి స్థిరపడిన నిరుపేద దంపతులు నిరంతరం విపరీతమైన శ్రమ చేస్తున్నారు. భర్త ‘అడ్డా’పై నిలబడి కూలిపనికి పోతున్నాడు, భార్య నాలుగైదు ఇళ్లలో ‘పాచి’ పని చేస్తుంది. ఇలా ఇద్దరూ సంపాదిస్తున్నప్పటికీ ఇద్దరు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడంలో సమయపాలన చేయడం వారికి సాధ్యం కావడం లేదు. అందువల్ల హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు వారి పిల్లలను ‘నిలబెట్టి’ అవమానిస్తున్నారు. తరగతులకు హాజరు కానివ్వడం లేదు. పరీక్షలు వ్రాయనివ్వడం లేదు.