సబ్ ఫీచర్

ప్రసూతి ప్రోత్సాహకాలు అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని 2013లో ప్రభుత్వం ఆమోదించింది. అది మొదలు విధానకర్తలు ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణపై అనేక వాగ్దానాలను గుప్పిస్తున్నారు. ప్రజారోగ్యం, క్షేమం, పనిసామర్థ్యాల పెరుగుదలకు ఆహార భద్రత చాలా అవసరం. దాదాపు భారతీయ మహిళలు అందరూ గర్భిణులుగా వున్న కాలంలో నీరసంగానే వుంటున్నారు. 15-18 మధ్య వయస్సు అమ్మాయిల్లో సగం మంది ఉండాల్సినంత శరీర బరువు వుండటం లేదని తాజా ఆరోగ్య సర్వే చెబుతోంది. గర్భస్థ శిశువులు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైనంత బరువు గర్భిణులు పెరగడం లేదు. ఇక్కడి గర్భిణులను పోషకాహార లోపం బాధిస్తున్నది. నెలలు నిండిన భారతీయ గర్భిణుల శరీర బరువు ఆఫ్రికా దేశాల్లో మహిళలు గర్భందాల్చిన తొలి నెలల్లో వున్నంత బరువు కూడా వుండటం లేదు. గర్భిణీ స్ర్తిలలో పోషకాహార లోపం ప్రసవ సమయంలో మహిళల అధిక మరణాలకు దారితీస్తున్నది. తక్కువ బరువు కలిగిన పిల్లల్ని కనాల్సి వస్తుంది. చిన్నారుల అనారోగ్యానికి ఇదే కారణమంటున్నారు వైద్య నిపుణులు.
ప్రతి గర్భిణికి, బాలింతకు అంగన్‌వాడి ద్వారా ఉచిత భోజన వసతి కల్పిస్తామని, ప్రసూతి ప్రోత్సాహకంగా విడతలు విడతలుగా రూ. 6 వేల నగదు చెల్లిస్తామని ఆహార భద్రతా చట్టం పేర్కొంది. (దీని ప్రకారం గర్భిణిగా వున్నప్పుడు 6 నెలలు, ప్రసూనంతరం 6 నెలలు ఉచిత భోజనం అందించాలి) ఒరిస్సా, తమిళనాడుల్లో ఈ కార్యక్రమం బాగుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇందిరాగాంధీ మాత్రిలా సహయోగ్ యోజన క్రింద 53 జిల్లాల్లోనే ఒక పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. ప్రసూతి ప్రోత్సాహకాలు అందించడం అనేది మంచి ఆలోచన.
ఇందిరాగాంధీ మాత్రిలా సహయోగ్ యోజన కార్యక్రమం అమలుపై సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని 2015 సెప్టెంబర్‌లో వివరణ కోరింది. ఆర్థికశాఖ ఈ కార్యక్రమానికి తగినన్ని నిధులు మంజూరుచేస్తే దాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయగలమని మహిళా, శిశు అభివృద్ధిశాఖ ప్రతినిధి ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చారు. ఈ పథకం నిబంధనలతో కూడిన నగదు బదిలీ కార్యక్రమం. అర్హులైన మహిళలు ఆరోగ్య కార్యకర్త దగ్గర తమ పేరు నమోదుచేసుకోవాలి. గర్భిణులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఐరన్ మాత్రలు వాడాలి. క్రమం తప్పక టీకాలు వేయించుకోవాలి. శిశువుకు పాలు తాగించి శిక్షణా తరగతులకు హాజరవ్వాలి. ఆరోగ్య కార్యకర్త తెలిపినవన్నీ సక్రమంగా పాటించిన గర్భిణులకే నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవన్నీ తల్లి బిడ్డ క్షేమంకోసం ఏర్పరచినవే కాని ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఆర్థిక సహాయం అందించడం అర్ధరహితం.
ఇందిరాగాంధీ మాత్రిలా సహయోగ్ యోజనను సార్వత్రికమని ఆహార భద్రతా చట్టం స్పష్టంగా చెప్పింది. ఈ పథకం ఆచరణలో రెండు కాన్పులకే పరిమితం చేయడం సమంజసమా?రూ. 6 వేలు గర్భిణులకు పోషకాహారంకోసం అందించడం పెద్ద మొత్తం కాదు. ఇంత చిన్న నగదుకోసం ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఎవరూ ఇష్టపడరు. పిల్లలను పెంచి పెద్ద చేయడం ఖర్చు, శ్రమలతో కూడిన పని. 5-18 మధ్య వయస్సు పిల్లలను చదివించడానికి దాదాపు 5వేలు ఖర్చు చేస్తున్నారని మానవాభివృద్ధిశాఖ నిర్వహించిన 2011 సర్వేలో తెలిసింది. సురక్షిత కాన్పుకోసం ప్రభుత్వం జనని సురక్షిత యోజన పథకం ఇంతకుముందే ప్రవేశపెట్టింది. ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు 1400/- ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు. ఈ పథకం ఫలితాలపై 6 ఏళ్ళు పరిశీలించారు. ఆసుపత్రి ప్రసవానికి ప్రోత్సాహం వున్నప్పటికి ఎవరూ ఎక్కువ మందిని కనడానికి ఇష్టపడటం లేదని ఆ పరిశీలనలో వెళ్లడైంది. పోషకాహార నగదు బదిలీ కూడా జనాభా పెంచదు. దీన్నిఅందరికి వర్తింపజేస్తే పేదల, అల్పసంఖ్యాక వర్గాలకు మేలు జరుగుతుంది. తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

- వి.వరదరాజు