సంపాదకీయం

స్నేహ సింహళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన వల్ల సంభవించిన తక్షణ ఫ లితం.. ఉభయదేశాలు మరింత సన్నిహితం కావడం! ఉభయ దేశాల సాన్నిహిత్యం సహజమైనది, చారిత్రక ప్రస్థాన పథంలో నిరంతరం ప్రస్ఫుటించినది, సనాతనమైనది. ద్వైపాక్షిక స్నేహ సంబంధాలు క్షీణించడం అపవాదం-ఎక్సెప్షన్-మాత్రమే! ఈ ‘గ్రహణం’ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందన్న భావం విస్తరించడం మోదీ ప్రభుత్వ దౌత్యనీతి సాధించిన మరో విజయం. రాజకీయ, ఆర్థిక అంశాలకు, ఉభయ దేశాల ఉమ్మడి భద్రతకు, సమాన సాంకేతిక వారసత్వానికి ప్రాధాన్యం పెరగడం మోదీ పర్యటన సందర్శంగా ప్రస్ఫుటించిన శుభ సంకేతం! ‘మీ దేశపు భద్రతతో మా దేశం భద్రత ముడివడి ఉంది..’ అని తేయాకు తోటల శ్రామిక ప్రతినిధుల సభలో మోదీ ప్రకటించినప్పుడు చెలరేగిన హర్షధ్వానాలు ఇందుకు నిదర్శనం! ‘బీభత్సం’ కాని, ‘మైత్రి’ కాని ప్రభుత్వాల ద్వారా విస్తరించడం లేదు. మనసుల ద్వారా మాత్రమే విస్తరిస్తున్నాయి-ఈ నకారాత్మక-నెగిటివ్, సకారాత్మక-పాజిటివ్- ప్రభావ విస్తరణ గురించి మోదీ ‘సింహళ’ వేదికల పైనుండి వివరించగలిగాడు. పాకిస్తాన్ మనసులోని విద్వేషాన్ని, విధ్వంస ప్రవృత్తిని భారత, శ్రీలంక ప్రభుత్వాలు ఉమ్మడిగా నిరసించడం మోదీ పర్యటన సాధించిన వ్యూహాత్మక విజయం! దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోని భూ సమాంతర కక్ష్యలో ప్రవేశపెట్టిన మన దేశం ఇరుగు పొరుగు దేశాల మధ్య మరో మైత్రీమార్గాన్ని నిర్మించింది. కొలంబో నుం చి వారణాసి వరకు ఈ స్నేహ పథంలో విమానాలు పయనించనున్నాయి. ఇదంతా మనసులోని సకారాత్మకమైన స్నేహ సు గంధం. తేయాకు తోటలలోని ఈ క మ్మటి పరిమళాలను మూటకట్టుకుని వచ్చిన వేలాది ‘్భరతీయ సంతతి’ ప్రజలు సభ తీరిన వేళ ఈ మైత్రి మరోసారి ధ్రువపడింది! ‘తేనీరు’తోను, తేయాకు తోటలకు తనకు గల అనుబంధాన్ని ఈ భారతీయ సంతతి మహాసభలో నరేంద్ర మోదీ ప్రస్తావించడం ‘చమత్కృతి’ మాత్రమే కాదు, చారిత్రక ధ్యాసను కలిగించిన వాస్తవ ద్యుతి.. తేయాకు తోటలు శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు. లక్షలాది భారతీయ సంతతివారు ఈ తేయాకు వనాలకు జీవ జలాలుగా మారడం చరిత్ర! రెండు శతాబ్దుల క్రితం బ్రిటన్ ‘పాలకులు’ వేలాదిమందిని ఇతర భారత ప్రాంతాల నుంచి సింహళ ద్వీపానికి తరలించుకుని పోవడం చరిత్ర. భారతదేశంలో భాగమై ఉండిన సింహళ ద్వీపాన్ని దురాక్రమించిన బ్రిటన్ ‘దొరలు’ ఆ తరువాత సింహళాన్ని భారత్ నుంచి విడగొట్టారు. సింహళాన్ని ‘సిలోన్’గా మార్చారు.!
శ్రీలంకలోని లక్షలాది భారతీయ సంతతి ప్రజలు తేయాకు తోటలను పండిస్తున్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు వెనె్నముక ఈ ‘్భరతీయ సంతతి!’ భారతీయ సంతతి ప్రజలు వేలాదిగా పాల్గొన్న సభలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, ప్రధాని విక్రమసింహతో కలిసి మన ప్రధాని హాజరు కావడం ఉభయ దేశాల ప్రజల చారిత్రక స్నేహానికి మరో ధ్రువీకరణ! ఇరుగు పొరుగు దేశాల నైసర్గిక స్థితి మారదు. కానీ ఆయా దేశాల మధ్య సంబంధాలలో మార్పు రావచ్చు! మన పొరుగుదేశాల పట్ల మన మనస్సులలో సకారాత్మక భావం సహజంగా నెలకొని ఉంది. కానీ పాకిస్తాన్ ‘మనస్సు’లో నెలకొన్న ‘నకారాత్మక భావం’ నిరంతరం విద్వేషాన్ని వెళ్లగక్కుతోంది! మన దేశాన్ని బలహీన పరచడానికి చైనా యత్నిస్తుండడం మన ఇరుగు పొరుగు మైత్రీ విధానానికి గొప్ప ప్రతిబంధకంగా పరిణమించింది. ‘దక్షిణ ఆసియా ఉపగ్రహం’ పథకంలో చేరడానికి పాకిస్తాన్ నిరాకరించడం చైనా వ్యూహంలో భాగం. అయితే శ్రీలంకకూ మన దేశానికి మధ్య ‘రగడ’ రాజేయడానికి చైనా చేస్తున్న కుట్ర బెడిసికొడుతోంది! మహేంద్ర రాజపక్ష అధ్యక్షుడుగా ఉండిన సమ యంలో కొంతవరకు కొనసాగిన ఈ కుట్ర సిరిసేన అధ్యక్షుడుగా కావడంతో కూలబడింది. మోదీ తన పర్యటనలో మహేంద్ర రాజపక్షను కూడ కలుసుకోవడం మన సమన్వయ విధానానికి మరో సాక్ష్యం.
కొలంబో ఓడరేవులో మే 16వ తేదీన తమ జలాంతర్గామి లంగరు వేయడానికి అనుమతి ఇవ్వాలన్న చైనా కోరికను శ్రీలంక ప్రభుత్వం తిరస్కరించడం మోదీ పర్యటనకు సమాంతర పరిణామం! గతంలో అనేక సార్లు శ్రీలంక ఓడరేవులో చైనా జలాంతర్గాములు అనేక రోజులపాటు లం గరు వేయడం పట్ల మన ప్రభుత్వం నిరసనలు తెలిపింది! విద్రోహ బీభత్స సంస్థ ‘తమిళ ఈలం లిబరేషన్ టైగర్ల’-ఎల్‌టిటిఇ-పై శ్రీలంక ప్రభుత్వం జరిపిన పోరాటాన్ని శ్రీలంకలోని సాధారణ తమిళ ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన దమనకాండగా కొందరు ప్రచారం చేయడం మనకు, శ్రీలంకకు మధ్య అవిశ్వాసాన్ని కలిగించిన విపరిణా మం! సందు చూ సుకుని చొరబడిపోయిన చైనా ప్రభు త్వం శ్రీలంకలో త న సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి యత్నించింది. ఇందులో భాగంగానే శ్రీలంకలోని ఓడరేవులను ‘అభివృద్ధి’ చేయడానికి యత్నించింది. మన దేశాన్ని దక్షిణం వైపునుంచి కూడ దిగ్బంధించాలన్న వ్యూహంలో భాగంగానే చైనా శ్రీలంకలోకి చొరబడింది! మహేంద్ర రాజపక్ష అధ్యక్షుడుగా ఉండిన సమయంలో శ్రీలంకతో మన సంబంధాలు క్షీణించడం చైనా వ్యూహంలో భాగం! మరో దక్షిణపు పొరుగు దేశమైన మాల్‌దీవులలో చైనా చరిత్రలో మొదటిగా ఐదేళ్ల క్రితం దౌత్య కార్యాలయాన్ని నెలకొల్పింది. మాల్‌దీవుల రాజధానిలోని విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే వాణిజ్యక్రమాన్ని మనకు దక్కకుండా చేసింది!
మహేంద్ర రాజపక్ష 2015 జనవరిలో జరిగిన ఎన్నికలలో పదవీచ్యుతుడు కావడానికి ఒక ప్ర ధాన కారణం ఈ చైనా అనుకూలత! జనం భారత వ్యతిరేకతను హర్షించలేదు! ఈ రెండేళ్లలో లంక విధానంలో మళ్లీ అంకురించిన భారత మైత్రి క్రమంగా వికసిస్తోంది! చైనా జలాంతర్గామిని శ్రీ లంక ప్రభుత్వం తిప్పికొట్టడం ఈ విస్తరణలో భాగం! ప్రధానిగా మోదీ శ్రీలంకను సందర్శించడం ఇది రెండవసారి! ఉభయ దేశాల మధ్య గల సమాన సంస్కృతి రెండు పర్యటనలలోను ప్రధాన ఇతివృత్తమైంది. వివిధ దేశాలవారు పాల్గొన్న అతిప్రధాన బౌద్ధ ఉత్సవంలో మోదీ ప్రసంగం ఈ సమాన సంస్కృతిని ధ్వనింపచేసింది! బుద్ధుడు విశ్వశాంతికి దోహదకరం. గౌతమబుద్ధుడు భారత, శ్రీలంకల మధ్య వారధి!