మిర్చిమసాలా

నెటిజన్ల సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ తన మంత్రిమండలి నుంచి కపిల్ మిశ్రాను తొలగించడంతో ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ట్విట్టర్‌లో కేజ్రీవాల్ భార్య సునీత పేరుతో ఒక ట్వీట్ వ చ్చింది. ‘ప్రకృతి ఎప్పటికీ తప్పుచేయదు, కపిల్ మిశ్రా కూడా పోతాడు..’ అనేది ఆ ట్వీట్ సారాంశం. అ యితే- సునీత సెల్‌ఫోన్ నుంచి కేజ్రీయే అలా ట్వీట్లు చేస్తున్నారన్నది మిశ్రా ప్రత్యారోపణ. ‘కేజ్రీవాల్‌జీ.. మీ భార్య ఫోన్‌ను ఆమెకు తిరిగి ఇచ్చేయండి ..’ అంటూ మిశ్రా తిరిగి సెటైర్లు వేయడంతో నెటిజన్ల సంబరం ఇంతా అంతా కాదు..
- బివి ప్రసాద్

బుగ్గదీపాలు పోయినా..
రాష్ట్ర మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, క్యాబినెట్ ర్యాంకున్న ఇతర నేతలు, ఉన్నతాధికారులు, సిఎంలు, ఇతర వివిఐపిలు సహా అందరూ సమానమేనని ప్రధాని మోదీ ప్రకటించాక- వారి వాహనాలపై ‘బుగ్గలైట్లు’ పోయాయి. మోదీ గొప్ప పనిచేశారని జనం సంతోషించారు. అయితే, ‘బుగ్గలైట్లు’ కోల్పోయినా నేతల హంగామా తగ్గలేదు. ఆచరణలో అంతా తూతూ మంత్రంగానే ఉంది. వాహనాల్లో ప్రయాణించే వివిఐపిల హోదాకు తగ్గట్టుగా పోలీస్ ఎస్కార్టు జీపుల సైరన్లు మాత్రం జనాలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యనేతల వాహన శ్రేణి వస్తోందంటే చాలు- అరగంట ముందునుంచే రోడ్లపై జనసంచారం లేకుండా పోలీసులు సైరన్లు మోగిస్తూ హడావుడి చేస్తున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

నాణ్యత తెలిసింది..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇటీవల ఎపి మంత్రి నారాయణ కు మారుడు మెరుపు వే గంతో కారులో వె ళుతూ మెట్రో పిల్లర్‌ను ఢీకొని మరణించిన ఘటనలో రెండు విషయాలు వెలుగు చూశాయి. అవి- ఎన్ని కోట్లు ఖరీదు చేసే వా హనం అయినా రాష్ డ్రైవింగ్ చేస్తే ప్రాణపాయం తప్పదన్నది ఒకటి. మెట్రోరైల్ ప్రా జెక్టులో పిల్లర్లను అ త్యంత నాణ్యతా ప్ర మాణాలతో నిర్మిస్తున్నారన్నది మరొకటి. ఈ ప్రమాదం తర్వాత మెట్రో ఇంజనీరింగ్ నిపుణులు, రవాణాశాఖ అధికారులు ప్రమాద స్థలంలో ఆ పిల్లర్‌ను పరిశీలించారు. రెండు కోట్లు విలువ చేసే కారు 200 కి.మీ స్పీడుతో ఢీకొట్టినా పిల్లర్‌కు ఏమీ కాలేదు. మెట్రో పిల్లర్ల నిర్మాణంలో నాణ్యత ఈ ప్రమాదం ద్వారా తేలినట్టు అయింది.
- వెల్జాల చంద్రశేఖర్

కెసిఆర్ సామ్యవాదం
‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షనల్ సెంటర్’ (హైటెక్స్)లో గతం లో అప్పటి సి ఎం చంద్రబాబు హ యాంలో అంతర్జాతీయ, జాతీయ సదస్సులే జరిగేవి. సా ధారణ ఉద్యోగుల సదస్సులంటే సాదాసీదా సమావేశ మందిరాలకే పరిమితం. తెలంగాణ సిఎం కెసిఆర్ హైటెక్స్‌లో వరుస గా నిర్వహిస్తున్న సదస్సులతో కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు కూడా ఆనందపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారుల సదస్సును హైటెక్స్‌లో కెసిఆర్ నిర్వహించారు. తాజాగా ఎస్‌ఐ క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సదస్సును హైటెక్స్‌లోనే నిర్వహించారు. హైటెక్స్‌లో సదస్సును నిర్వహించడం, లంచ్ ఏర్పాట్లు చేయడం అంటే ఆషామాషీ కాదు. ఖజానాపై భారం పడుతుంది. వాటిని లెక్కచేయకుండా ఇక్కడ ఉద్యోగులతో విస్తృత సమావేశాలను నిర్వహిస్తున్న ఘనత కెసిఆర్‌దే.
- శైలేంద్ర

అచ్చిరాని దూకుడు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నిజాం కాలేజీలో సభ నిర్వహించి, తెరాస ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తామన్నారు. ‘దూకుడుగా వెళ్లాలో వద్దో తెలియక ఇన్నాళ్లూ ఇలా ఉన్నాం, ఇప్పుడు చూపిస్తాం తడాఖా..’ అని బిజెపి నేతలు ప్రకటించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో బిజెపి ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నా, ఒక్క డివిజన్‌లోనూ వారి ‘దూకుడు’కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ దూకుడు పెంచినా బోర్లా పడ్డారు. ఇప్పుడు ఇంకా దూకుడుగా వెళతాం అని ‘కమలనాథులు’ సెలవిస్తున్నారు. యుపి నుంచి నగరంలోని బిజెపి కార్యకర్తలకు 60 బైక్‌లు పంపించారు. ఆ బైక్‌లపై ఎంత దూకుడుగా వెళతారో? ఏం సాధిస్తారో తేలాలంటే రెండేళ్లు ఆగాలి మరి!
- మురళి