మెయన్ ఫీచర్

అనవసర వివాదాలతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒవైసీ మాట్లాడితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై విమర్శల దాడికి దిగుతుంటాడు. ‘‘తన సిద్ధాంతాలను బలవంతంగా ఇతరులపై రుద్దుతోంది’’ అంటూ ఆరోపిస్తుంటాడు. తన వాదనకు మద్దతుగా 70 లేదా 80 సంవత్సరాల క్రితం నాటి ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తుంటాడు. కానీ వర్తమాన ఆర్‌ఎస్‌ఎస్ లేదా భాజపా నేతలను ఒక్కసారి ప్రశ్నించి చూడండి. ఒవైసీ వెల్లడిస్తున్న ఆయా వ్యాఖ్యలను వర్తమాన భాజపా లేదా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఎవరైనా విశ్వసిస్తారేమో అడగండి. వారిచ్చే సమాధానం చాలు ఒవైసీ చేసే వ్యాఖ్యలు కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినవని చెప్పడానికి!

భారత్ మాతాకీ జై’’ అని ప్రతి భారతీయుడు నినదించడం తప్పనిసరా? అవసరం లేదనే దీనికి సమాధానం వస్తుంది. అత్యుత్సాహం ప్రదర్శించే, అవసరమైతే రెచ్చగొట్టే ప్రవృత్తి ఉన్న ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక సమావేశంలో మాట్లాడుతూ, ‘‘్భరత్ మాతాకీ జై అని తప్పనిసరిగా నినదించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అన్నాడు. మరి సాంకేతికంగా సంకుచిత బుద్ధితో ఆలోచిస్తే అసదుద్దీన్ ఒవైసీ అన్నది నిజమే. కానీ ఇక్కడ మాట్లాడటానికి ఆ ఒక్క సమస్య తప్ప మరోటి లేదన్న రీతిలోతన భావోద్వేగాన్ని వ్యక్తం చేయడంలో అసదుద్దీన్ ఉపయోగించిన భాష, పదజాలం ఎంతమాత్రం సహేతుకం కాదు. భారత్ పట్ల ప్రతిపౌరుడిని (‘‘్భరత ప్రజలమైన మేము..’’) నియతంగా రాజ్యాంగం బద్ధుడిని చేస్తోంది. జాతి, దేశం, సామూహిక, గణతంత్ర, నాగరికత..ఏ పదాన్ని మీరు పలికినా అందులో రాజ్యాంగ లక్షణం అంతర్లీనంగా ఉంటుంది. అందువల్ల కొందరు తమ నిబద్ధతను వ్యక్తం చేయడానికి ‘‘్భరత్ మాతా కీ జై’’ అనే నినాదాన్ని ఎంచుకుంటారు. ఈ నినాదమే కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది. ఒక్కసారి వారికి స్వాతంత్య్రోద్యమకాలాన్ని స్ఫురింపజేస్తుంది. మహాత్ముడి నేతృత్వంలో జాతి నిర్మాణానికి సాహసంతో ముందుకు దూసుకెళ్లేలా చేసిన నినాదం కూడా ఇదే.
మరికొందరు ‘‘వందేమాతరం’’ లేదా ఉర్దూ నినాదమైన ‘‘మాద్రె వతన్’’ అనే నినాదాల ద్వారా స్ఫూర్తి పొందవచ్చు. ఇంకా మరికొందరు ‘‘సర్ జమీన్-ఎ- హిందూస్థాన్’’కు ‘‘సలాం’’, లేదా సుభాష్ చంద్రబోస్ నినాదమైన ‘‘జై హింద్’’ను నినదించవచ్చు. ఎ.ఆర్. రెహమాన్ ఆలాపించిన ‘‘మా తుఝే సలాం’’ అనే గీతాన్ని వింటున్నప్పుడు నేటి తరం యువత రోమాంచితులై తన్మయత్వంలో మునిగిపోవడం మనకు తెలిసిందే. ఆయన 1997లో స్వాతంత్య్ర దినోత్సవ 50వ వార్షికోత్సం సందర్భంగా ఈ గీతాన్ని కూర్చి ఆలాపించారు. ఇంకా దేశంలో చాలామంది ఉన్నారు. వీరు ఎటువంటి నినాదాలను చేయరు. కానీ వౌనంగానే తాము చేసే పనుల ద్వారా రాజ్యాంగం పట్ల నిబద్ధత వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా కష్టించి పనిచేయడం, పన్నులు చెల్లించడం, గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడం వంటి వాటి ద్వారా వారు రాజ్యాంగం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
దేశానికి, భారత రాజ్యాంగానికి నిబద్ధతను వ్యక్తం చేయడమంటే..లేచి నిటారుగా నిలబడి ‘‘్భరత్ మాతా కీ జై’’ లేదా పైన పేర్కొన్న మరే ఇతర నినాదాలనైనా తప్పనిసరిగా చేయాలన్న డిమాండ్ ఏమీ లేదు. కానీ మరొకరు తమ హృదయాల్లో పూజ్యనీయంగా ప్రతిష్టించుకున్న, నినాదాన్ని కావాలని అవహేళన చేసే హక్కు మాత్రం రాజ్యాంగం మరెవరికీ కల్పించలేదు. మరి ఈ కీలకమైన ప్రశ్నకు, ఇచ్చే సమాధానం ఒవైసీని బోనులో నిలబెడుతోంది. కానీ ఆయన అసాధారణ రీతిలో, లేని వివాదాన్ని సృష్టించి రెచ్చగొట్టారు. మతాల మధ్య చిచ్చుపెట్టడానికి యత్నించారు. నిజానికి సాధారణ ముస్లింలు ఈ విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోరు, అసలు వారిదృష్టిలో ఇది ప్రాధాన్యత అంశమే కాదు. ఆయన ఆవిధంగా అనడంలో అంతరార్ధమేమైనా ఉన్నదా? అంటే, ‘్భరత్ మాతా కీ జై’ అని నినదింపజేయడం ద్వారా విగ్రహారాధనను బలవంతంగా ముస్లింలపై రుద్దే నిగూఢ యత్నం ఉన్నదని ఆయన భావన! అంతకుమించిన వెర్రితలంపు మరోటి ఉండబోదు. ఆయన వ్యవహారశైలి సహచర మతస్థులనే ఆగ్రహావేశాలకు గురిచేసింది.
మరిక్కడ ‘‘ముస్లింల సమస్య’’ ఏమిటి? ముస్లింల మనోభావాలపై ప్రభావం చూపడమా? లేక తమ మతవిశ్వాసాన్ని పాటించకుండా అడ్డుపడటమా? ఒక్కసారి మనం 25 ఏళ్ల వెనక్కి వెళదాం. 1991 నాటి వసంతరుతువు కాలం. అప్పుడు భారత్‌లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మండల్ కమిషన్ ఏర్పాటును ప్రకటించారు. మరోవైపు రథయాత్ర, ఇంకోవైపు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ నిర్ణయించుకోవడం ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలకు ప్రకటన వెలువడింది. నిజంగా నాటి రాజకీయ పరిస్థితి ఎంతో ఉద్రిక్తంగా ఉన్నదనే చెప్పాలి. భారత్, జాతీయత అనే అంశాలపై విభిన్న సైద్ధాంతిక భావనల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణమది.
సరీగ్గా ఇదే సమయంలో ‘హమ్’ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ జనతాదళ్ రాజకీయవేత్త ఒకరు ప్రచారం మొదలుపెట్టాడు. నిజానికి ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో రెండోదశ ప్రారంభ చిత్రం. అంటే అప్పటివరకు ‘యాంగ్రీ యంగ్ మన్’గా పేరు ప్రఖ్యాతులు గడించిన అమితాబ్ పెద్ద వయసు పాత్రలు ధరించడానికి శ్రీకారం చుట్టింది ఈ చిత్రంతోనే. అప్పుడే విడుదలైన ఈ చిత్రంలో ‘‘జుమ్మా చుమ్మా దే దే..’’ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. చిత్రంలో హీరో తన ప్రేయసిని ఉద్దేసిస్తూ పాడిన పాట ఇది. మరి జుమ్మా లేదా శుక్రవారం ఇస్లాంలో పవిత్రమైన రోజు. ఆదే రోజున ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. 1991 నాటి ఆ జనతాదళ్ నాయకుడి దృష్టిలో ఈ పాట ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉంది. అంతేకాదు ఇది ముస్లిం వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించడమే కాక, వారిని రెచ్చగొట్టే రీతిలో ఉన్నదని సదరు జనతాదళ్ నాయకుడి భయం! అందుకని తక్షణమే ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ ఆందోళన చేపట్టాడు. నిజానికి ఆయన చేసే వాదనకు అర్థం లేదు. అసలు ముస్లిం ప్రజలు, ఆ నాయకుడు లేవనెత్తిన అంశాన్ని పట్టించుకోలేదు. పైగా ఆ పాటను మరీ మరీ వినడం ద్వారా ఎంతగానో ఆనందించారు. మతాలకతీతంగా ప్రజలను ఆకట్టుకున్న పాట అది! ఇందుకు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. కోల్‌కతాలో అత్యధికంగా ముస్లింలు నివసించే ప్రాంతం ఒకటుంది. ఈ రచయిత కూడా సరీగ్గా అదే సమయంలో అక్కడ నివాసం ఉన్నారు. పాన్‌వాలాల దగ్గరినుంచి కోల్‌కతా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల వరకు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు. చుట్టుపక్కల ప్రాం తంలో ఈ పాట ఎప్పుడూ వినిపిస్తుండేది. మరెక్కడా దీనిపై ‘ఆగ్రహం’ లేదా ‘ఆవేశం’ వెల్లువెత్తిన సందర్భాలు కనిపించలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మొహల్లాలు తీవ్రంగా ప్రతిస్పందిస్తారని విశ్వసించడం ఎంత అర్థరహితమో దీనితో స్పష్టమైంది. దీనివల్ల అందరూ అంచనా వేసిన విధంగానే ఈ ‘చిల్లర’ వివాదం కొద్ది రోజుల్లోనే సమసిపోయింది. కానీ తాను సృష్టించిన వివాదం సదరు రాజకీయవేత్తను స్వల్పకాలంపాటు వార్తల్లో ఉండేలా చేసినా, తర్వాత క్రమంగా కొంతకాలానికి కనుమరుగైపోయాడు.
ఒక చిత్రగీతానికి, భారత్ పట్ల తన తత్పరతను వ్యక్తం చేస్తూ చేసే నినాదానికి ఎంతో తేడా ఉంది. ఇక్కడ ఈ రెండింటిని సరిపోలుస్తూ చిత్రీకరించడం ఈ సంఘటనలను ఓకే గాటన కట్టడానికి చేసే యత్నం ఎంతమాత్రం కాదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన నిష్టుర సత్యం ఒకటుంది. అసదుద్దీన్ ఒవైసీ వంటి ముస్లిం నేతలు, ఇటువంటి చౌకబారు జిమ్మిక్కులకు పాల్పడటం ద్వారా ముస్లిం సమాజాన్ని ఆకర్షిస్తున్నారు తప్ప, నిజంగా దేశంలోని కోట్లాది మంది ముస్లింలకు వీరు నిజంగా చేసిందేమీ లేదు. ఇందులో 1991లో చిత్ర గీతంపై అనవసరంగా రాద్ధాంతం చేసిన జనతాదళ్ నాయకుడికి, ఒవైసీకి పెద్దగా తేడా ఏమీ లేదు. తరుచుగా ప్రజల నోళ్లలో నానుతూ, టెలివిజన్ ఛానళ్లలో కనిపించే స్ఫుటమైన నేత అసదుద్దీన్ ఒవైసీ. నిజంగా చెప్పాలంటే జాతీయ మీడియా అతగాడి పట్ల ఎంతో జాగరూకతతో వ్యవహరిస్తోంది. అతణ్ణి విచారించలేకపోవడం, కఠినమైన ప్రశ్నలు సంధించలేకపోవడం గొప్ప నిరుత్సాహం కలిగించే అంశం. ఇందుకు కారణాలు ఏంటని పరిశీలిస్తే.. బహుశా మీడి యా వ్యక్తులకు ఒవైసీని ఇంటర్వ్యూ చేయ డం ఇష్టంలేకపోవడం, లేదా బహుశా గూగుల్ సెర్చ్ ద్వారా త్వరగా సమాచారం సేకరించడంలో నిమగ్నం కావడం కారణం కావచ్చు.
ఇక్కడొక విరోధాభాసను పరిశీలించండి. ఒవైసీ మాట్లాడితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై విమర్శల దాడికి దిగుతుంటాడు. ‘‘తన సిద్ధాంతాలను బలవంతంగా ఇతరులపై రుద్దుతోంది’’ అంటూ ఆరోపిస్తుంటాడు. తన వాదనకు మద్దతుగా 70 లేదా 80 సంవత్సరాల క్రితం నాటి ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తుంటాడు. కానీ వర్తమాన ఆర్‌ఎస్‌ఎస్ లేదా భాజపా నేతలను ఒక్కసారి ప్రశ్నించి చూడండి. ఒవైసీ వెల్లడిస్తున్న ఆయా వ్యాఖ్యలను వర్తమాన భాజపా లేదా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఎవరైనా విశ్వసిస్తారేమో అడగండి. వారిచ్చే సమాధానం చాలు ఒవైసీ చేసే వ్యాఖ్యలు కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినవని చెప్పడానికి!
‘‘ఖాసిం రజ్వీ విధానాలను మీకు ఆమోదయోగ్యమేనా’’ అని ఒవైసీని ఎవరైనా అడిగారా? ఖాసిం రజ్వీ ఎంఐఎం వ్యవస్థాపకుడు. రజాకార్ మిలిషియాకు కమాండర్. కర్కోటకుడు, మతదురహంకారి అన్న పేర్లు మూటకట్టుకున్నవాడు కాదా? మరి అటువంటి ఖాసిం రజ్వీని ఆమోదించబోనని ఒవైసీ బహిరంగంగా మనకు చెప్పగలడా? ఈ ప్రశ్నలకు ఆయన స్పందనే ఆయన అసలు నైజాన్ని బయట పెడుతుంది.

- అశోక్ మాలిక్