సంపాదకీయం

షాంఘయి ‘సంత’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో ఉన్ని దుప్పటిని కప్పుకోవాలని భావించడం సహజం. చలికాలంలో ‘దు ప్పటి’ దొరకలేదు. ఉన్నవారు దుర్బుద్ధితో దుప్పటిని అమ్మలేదు, ప్రదానం చేయలేదు. హేమంత తుషారం ఆవిరైపోయింది, శిథిల శిశిరం గతించింది. వసంతం వెనుకబడింది! మండువేసవిలో గ్రీష్మతాపంతో విలవిలలాడుతున్న వారికి ఉన్ని దుప్పటి ఎందుకు? అయినప్పటికీ ‘షాంఘయి సంత’లో మనకు ‘ఉన్ని దుప్పటి’ని ప్రదానం చేశారు. ‘సత్రం భోజనానికి అయ్యంగారి సిఫార్సు’ వలె రష్యా ప్రభుత్వం మన దేశం వైపున గట్టిగా నిలబడిందన్నది జరుగుతున్న ప్రచారం. చైనా ప్రభుత్వం ‘ఔదార్యం’ ప్రకటించి మన దేశానికి జూన్ తొమ్మిదవ తేదీన ‘షాంఘయి సహకార సమాఖ్య’- షాంఘయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్- ఎస్‌సిఓ-లో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది. పదహారు ఏళ్ల మన ‘వేచి ఉండడానికి’ ఫలితం లభించినట్టు గొప్ప ప్రచారం జరిగిపోయింది. రష్యా ప్రభుత్వం ‘తెర వెనుకన’ తీవ్ర కృషి చేసి మనకు సభ్యత్వం ఇప్పించిందట! ఇది మన దౌత్య విజయమట! ఈ ‘సభ్యత్వం’ లభించడం మన దేశానికి చైనాతో సన్నిహిత సంబంధాలు మరింత ‘్భల్లూక’ బంధానికి గురైనట్టు మరికొందరు మురిసిపోతున్నారు. నకిలీ పారవశ్యానికి గురై ఉన్నారు. మనకు చైనాతో సన్నిహిత సంబంధాలున్నాయని భావించడం ఘోరమైన ‘అనభిజ్ఞత’- ఇగ్నోరెన్స్-కు నిదర్శనం. అవి మ రింతగా గట్టి పడడానికి ఈ ‘షాంఘయి కూటమి’లో మన చేరిక దోహదం చే సిందన్న భ్రాంతికి గురికావడం మరింత ఘోరం.. కఝఖ్‌స్థా న్ రాజధాని ఆస్తానా లో జరిగిన ‘షాం ఘయి సమాఖ్య’ స దస్సులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చివర, పాకిస్తాన్ ప్రధాని నవాబ్ షరీఫ్ మరో చివర నిలబడి ఉన్న దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యలో చైనా, రష్యా ప్రభుత్వాధినేతలు, మధ్య ఆసియా దేశాలకు చెందిన చిట్టిపొట్టి దేశాల అధినాయకులు నిలుచున్నారు. మన దేశం- సముత్కర్ష ప్రజాస్వామ్య ఆదర్శానికి సముజ్వల స్వరూపం. పాకిస్తాన్- బీభత్స జిహాదీ రాజ్యాంగ వ్యవస్థకు వికృత రూపం. ఆ చివర ఈ చివర ఇలా పాకిస్తాన్‌ను, మన దేశాన్ని నిలబెట్టడం గోమాతను, తోడేలును ఒకే స్థాయిలో సంభావించడం.. మన స్థాయిని పాకిస్తాన్ స్థాయికి దిగజార్చడం చైనా మనకు చేసిన అవమానం. లేదా మన స్థాయికి పాకిస్తాన్‌ను ఎదిగించడం జిహాదీ ఉగ్రవాదాన్ని సర్వమత సమభావ ప్రజాస్వామ్యంతో సమానంగా భావించడం! అన్ని సార్వభౌమ దేశాలు సమానం.. అన్న సిద్ధాంతం అమలు జరిగినట్టయితే అక్షర క్రమంలో సమాఖ్య అధ్యక్షునికి ఇరు వైపులా సభ్యదేశాల అధినేతలు కొలువుతీరాలి.
కఝఖ్‌స్థాన్‌లో సదస్సు జరిగింది కాబట్టి ఆ దేశపు ప్రభుత్వ అధినేత, ఆయనకు ఇరువైపులా భారత ప్రధాని, చైనా అధినేత ఝీజింగ్ పింగ్ కూచోవాలి. అలా జరగలేదు. ఒక సందర్భంలో మన ప్రధానిని వెనుక వరుసలో కూడ నిలబెట్టారు. ఇదంతా ‘రామాయణంలో పిడకల వేట’ వంటిదని కొందరనవచ్చు. ‘షాంఘయి సంత’ రామాయణం కాదు, చైనా రచించిన ‘రావణీయం’! మనతో పాటు పాకిస్తాన్‌ను కూడ చేర్చుకోవడం ఈ ‘రావణీయం’లో ప్రధాన ఇతివృత్తం. పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా నిరంతరం ఉగ్రవాదపు జిహాదీ తోడేళ్లను ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్‌ను ‘బీభత్స వ్యవస్థ’- టెర్రరిస్టరిజెమ్-గా ప్రకటించి అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న మన విధానం ఏమైనట్టు? లక్ష్యం ఏమైనట్టు?? పాకిస్తాన్‌తో కలసికట్టుగా ‘షాంఘయి కూటమి’ ద్వారా మనం బీభత్స వ్యతిరేక సమరం జరపడం సాధ్యమేనా? అంతర్జాతీయ సమాజంలో మన ‘విధాన విశ్వసనీయత’ ఏమవుతుంది? ఆరబ్ దేశాలతో కలసి ఇజ్రాయిల్ ‘కూటమి’ని ఏర్పాటు చేసిందా?
కమ్యూనిస్ట్ నియంతృత్వం కుప్పకూలిన తర్వాత ‘యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్’- యుఎస్‌ఎస్‌ఆర్- అన్న ‘సోవియట్ రష్యా’ పదిహేను దేశాలుగా ఏర్పడడం ‘షాంఘయి కూటమి’ ఏర్పాటుకు నేపథ్యం. రష్యా, కఝఖ్‌స్థాన్, కిర్గిఝస్థాన్, తజకిస్థాన్‌లను కలుపుకొని చైనా ప్రభుత్వం ‘షాంఘయి ఐదు’ అన్న కూటమిని ఏర్పాటు చేసింది. 2001లో ఉఝబెకిస్థాన్ చేరికతో ఇది ‘షాంఘయి సహకార సమాఖ్య’గా మారి చైనా ‘తోడేలు’కు తోకగా అవతరించింది. రష్యాలు, చైనాలు తప్ప మిగిలినవి మధ్య ఆసియా దేశాలు. ఈ మధ్య ఆసియాలో ఇంధన వాయు, ఇంధన తైలాలు దండిగా ని క్షిప్తమై ఉన్నాయి. ఈ సహజ సంపద ను కొల్లగొట్టడం చై నా లక్ష్యం. రెండు దశాబ్దులకు పైగా మన దేశానికి, మధ్య ఆసియా దేశాలకు మధ్య ‘ఇంధన వినిమయం ఒప్పందా లు’ కుదరకుండా చై నా అడ్డుపడుతోంది. ఈ దేశాలు చైనా ప్రాబల్య మండలంలోకి చేరిపోరాదన్నది 1990 దశకం నాటి రష్యా లక్ష్యం. అందువల్ల రష్యా ఈ ‘కూటమి’లో చేరింది. బోరిస్ ఎల్టిసిన్ అధ్యక్షుడిగా ఉండిన సమయంలో 2000వ సంవత్సరం వరకూ అమెరికా ఏకైక ‘అగ్రరాజ్యం’. అమెరికా ఆధ్వర్యంలోని ‘ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి’- నాటో-లో సైతం చేరాలని అప్పుడు రష్యా ప్రయత్నించింది. కానీ ‘నాటో’లో కాని ఐరోపా సమాఖ్యలో కాని రష్యాను కలుపుకోలేదు. 2000వ సంవత్సరం తరువాత వ్లాదిమిర్ పుతిన్ పాలనలో రష్యా మారిపోయింది. చైనాతో జట్టుకట్టింది. ఇపుడు ‘నాటో’లో చేరాలని రష్యా భావించడం లేదు. ఎందుకంటే చైనాకు పోటీగా అగ్రరాజ్యంగా ఎదిగి ఉంది.
మన దేశం 2005నకు పూర్వం ఈ షాంఘయి కూటమిలో చేరాలని భావించింది. అప్పటికి చైనా వచ్చి పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో తిష్ఠ వేయలేదు. పాకిస్తానీ టెర్రరిస్టులకు బాసటగా నిలవలేదు, అణు సరఫరాల దేశాల కూటమిలో మనదేశం చేరడాన్ని అడ్డుకోలేదు. అరుణాచల్, కశ్మీర్‌లలో చైనా జోక్యం పెరగలేదు. ఇప్పుడివన్నీ జరిగిన తరువాత ఈ ‘షాంఘయి సంత’లో మనం చేరడం చైనాకు తోకగా మారడం. ఈ సభ్యత్వం ‘ఇప్పించిన రష్యా’ అణుసరఫరాల దేశాల కూటమిలో మనకు సభ్యత్వం ఇప్పించడానికి ఎందుకని కృషి చేయడం లేదు? చైనాకు రష్యా తోకగా మారి ఉంది!