సంపాదకీయం

వ్యవసాయ వైఫరీత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులను ఆదుకొనడానికి తెలుగు రాష్ట్రాల ప్ర భుత్వాలు వివిధ పథకాలను అమలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది! ఈ ప్రచారం హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం మంగళవారం జారీచేసిన ఆదేశాలకు విచిత్రమైన నేపథ్యం.. సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నందున రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలి. కాని తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను రైతులకు ప్రభుత్వాల సహాయం అందడం లేదని ఆరోపిస్తూ వేఱు వేఱు ‘న్యాయ యాచిక’లు హైకోర్టులో దాఖలయ్యాయి. అందువల్ల అర్హులైన రైతులందరికీ తెలుగు రా ష్ట్రాల ప్రభుత్వాలు అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల ప్రయోజనం అందడం లేదన్నది స్పష్టం. ప్రధానంగా రైతులు చెల్లించవలసిన రుణాలను రద్దు చేసే పథకం సమగ్రంగా అమలు జరగడం లేదన్నది ఈ ‘న్యాయ యాచిక’లు దాఖలు కావడానికి కారణం. రైతుల ఆత్మహత్యలను నిరోధించడానికి ఈ రుణమాఫీ పథకం దోహదం చేసి ఉండాలి. రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ కొనసాగుతున్నట్టు పిటిషనర్లు ఉన్నత న్యాయస్థానికి నివేదించారు. అందువల్ల ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ రుణ మాఫీ పథకం అమలు జరుగుతున్న తీరు గురించి సమగ్ర ప్రగతి నివేదిక- స్టేటస్ రిపోర్టు-లను సమర్పించ వలసి ఉంది. ఈ ‘స్టేటస్ రిపోర్టు’లను దాఖలు చేయవలసిందిగా ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూ ర్తి రజని ఆదేశించడంతో ప్రభుత్వాలు చేస్తున్న ‘రుణ మా ఫీ’ వివరాలు సమగ్రంగా వెల్లడయ్యే అ వకాశం ఉంది. ఎం దుకంటె ప్రభుత్వా లు ప్రకటించిన స హాయ చర్యలు అ మలు కాలేదన్న రాజకీయ ప్రచారం కూడ ఉభయ రాష్ట్రాలలోను సమాంతరంగా జరుగుతోంది. ఈ సమాంతర ప్రచారం ‘న్యాయ యాచికలు’ దాఖలు కావడానికి నేపథ్యం..
పరస్పర విరుద్ధ పరిణామాలు వ్యవసాయ రంగాన్ని ఆవహించి ఉండడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే కాదు, దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోను కొనసాగుతున్న అయోమయ స్థితి. ఈ అయోమయ స్థితి ఏర్పడడానికి అతి ప్రధాన కారణం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ దుష్ప్రభావం. కానీ ఈ వాస్తవం ప్రభుత్వ నిర్వాహకుల తలలకు, రైతన్నల జీవితాలకు ఎక్కకపోవడం జాతీయ వైపరీత్యం. మిరపకాయలు, కందుల ఉత్పత్తులు విపరీతంగా పెరగడం హర్షణీయం. కానీ ఇలా ఉత్పత్తిని పెంచినవారు భయంకరమైన నష్టాలకు గురి కావడం ‘ప్రపంచీకరణ’ ప్రభావం. ప్రభుత్వాలు వారాల తరబడి నిష్క్రియాపరత్వానికి గురి కావడం ప్రతి సంవత్సరం ఏదో ఒక పంట విషయంలో పునరావృత్తం అవుతున్న చరిత్ర. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నడుములు బిగించి సహాయం ప్రకటించే సరికి రైతులు భారీ నష్టాలకు తమ ఉత్పత్తులను అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వాలు మద్దతు ధరలను పెంచిన తరువాత జరుగుతున్న పరిణామం- దళారీలు ధరలను పెంచి వినియోగదారులను దోచుకోవడం! ఇదంతా ప్రపంచీకరణను అమలు చేస్తున్న ‘బహుళ జాతీయ సంస్థల’ షడ్యంత్రంలో భాగం..
‘ప్రపంచీకరణ’ దుష్ప్రభావం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశమంతటా సమగ్ర సమీక్ష జరపడం తక్షణావసరం. ఫలానా పద్ధతిలో విధానాలను రూపొందించాలని ప్రభుత్వాలను కోరే న్యాయాధికారం తమకు లేదని మంగళవారం ఆదేశాలు జారీచేసిన హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులన్నందువల్లనే బహుశా ఇలా స్పష్టం చేయవలసి వచ్చింది. ప్రభుత్వాలు నిర్థారించుకున్న విధానాలను, రూపొందించిన పథకాలను అమలు చేయాలని మాత్రమే తాము ఆదేశించగలమని ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం సభ్యులు స్పష్టం చేశారు. ‘ప్రపంచీకరణ’ భూమికపై నిలబడి ప్రభుత్వాలు విధానాలను రూపొందిస్తుండడం వౌలిక వైరుధ్యం..
నకలీ పత్తి విత్తనాలను అమ్మే సంస్థలు పుట్టుకొని రావడం, పుట్టలుగా వ్యాపించడం ఈ వౌలిక వైరుధ్యానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో కోటి రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టివేశారట! కానీ అమెరికా వారి ‘మొన్‌సాంటో’ వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు దశాబ్దుల తరబడి భారీ ధరలకు పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి వేల కోట్ల రూపాయలు దోచుకోవడం ప్రపంచీకరణలో భాగం! జన్యు పరివర్తక- జెనటిక్ మోడిఫికేషన్- జిఎం- ప్రక్రియ ద్వారా తయారైన ‘మహా సంకర జాతి’ విత్తనాలలో ‘బాసిలస్ తరుంజెనిసిస్’- బి.టి- అనే విష జీవ రసాయనం ఏ ర్పడుతోంది. ఈ ‘బి టి’ పత్తి రెండేళ్లు బాగా పండి, మూడ వ ఏడు రైతుల కొం ప ముంచడం ఈ వౌలిక వైరుధ్యంలో భాగం. తెల్లటి, ఎ ర్రటి, గులాబీరంగు లో విచిత్రమైన పు రుగులు పుట్టుకొచ్చి పంజాబ్‌లో పనె్నం డు లక్షల ఎకరాల్లోని పత్తిని భోంచేశాయి. ఆత్మహత్యలకు రైతులు పాలుపడుతుండడానికి ఇది ఒక ప్రధాన కారణం. నకిలీ పత్తి విత్తనాలను తయారుచేసే ముఠాలు రంగంలోకి దిగడానికి ప్రధాన ప్రేరకం ‘బహుళ జాతీయ సంస్థలు’ చట్టబద్ధంగానే అధిక ధరలకు ‘బిటి’ విత్తనాలను అమ్మడం! అరకిలో పత్తి విత్తనాలను వెయ్యి రూపాయలకు పైగా ధర పెట్టి కొన్న రైతులు అప్పులు పాలవడంలో ఆశ్చర్యం ఏముంది? నాలుగు వందల యాబయి గ్రాముల విత్తనాలు తొమ్మిది వందల రూపాయలు! దోపిడీ చేసింది ఎవరు? ఇపుడు ‘బిటి’ ఆవాలను సైతం మనకు అంటగట్టడానికి బహుళ జాతీయ సంస్థలు కుట్ర చేస్తున్నాయి. ఈ ఆర్థిక బీభత్సకారులు, విదేశాల నుంచి పడుతున్న బహుళ జాతీయ సంస్థల దోపిడీదారులు పెద్ద మనుషులుగా చెలామణి కావడం ప్రపంచీకరణ! వీరంతా గౌరవనీయులైన ‘పెట్టుబడిదారులై’ ప్రభుత్వ నిర్వాహకుల సరసన కూర్చుని గరిమను గడిస్తుండడం ప్రపంచీకరణ.
ఈ ప్రపంచీకరణ శక్తులు వ్యవసాయ రంగంలో సృష్టించిన, సృష్టిస్తున్న కల్లోలం గురించి అన్ని ప్రభుత్వాలు ‘స్టేటస్ రిపోర్టు’లను తయారు చేయాలి. ప్రభుత్వాలు అనేక రాష్ట్రాలలో రుణాలను మాఫీ చేస్తున్నాయి. ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగింది. అయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో రైతులు నిరాశతో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మూలకారణం- ‘ప్రపంచీకరణ’!