సంపాదకీయం

దిక్కులేని భూమి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం భూమి అంగుళం కూడ అన్యాక్రాం తం కాకపోవడం సంతోషం. ప్రభుత్వానికి రూపాయి కూడ నష్టం కలుగకపోవడం మరింత ఆనందకరం. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్, బాలానగర్ తదితర గ్రామాలలో ఆరువందల తొంబయి మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని దళారీలు, రాజకీయ వేత్తలు, ఇతరేతరులు అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం చేసిన స్పష్టీకరణ జనానికి ఆనందకరం. ప్రభుత్వ భూమి ప్రజల భూమి, ప్రభుత్వ ధనం ప్రజాధనం. మియాపూర్, బాలానగర్ తదితర గ్రామాలలోని దాదాపు ఎనిమిది వందల పదిహేను ఎకరాల భూమిని ‘ప్రభుత్వేతరు’లు, ఘరానా వ్యక్తులు కాజేయడానికి యత్నించినప్పటికీ ఈ కుట్ర భగ్నం అయిందన్నది తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన నిర్ధారణ.. అందువల్ల ప్రభుత్వం భూమి అంగుళం కూడ అన్యాక్రాంతం కాలేదు! ‘అన్యాక్రాంతం కాబోయాయి’ తప్ప అన్యాక్రాంతం కాలేదు. ఇలా అన్యాక్రాంతం కాబోయిన భూమి విలువ ఐదు వేల కోట్ల రూపాయలని, పదివేల కోట్ల రూపాయలని, ఇరవై వేల కోట్ల రూపాయలని ఇంకా ఎక్కువే.. అని ప్రచారం జరిగింది. భూములు అన్యాక్రాంతం కాలేదు కనుక ప్రభుత్వాకి ‘దమ్మిడీ’ కూడా నష్టం వాటిల్లినట్టు కాదు. ఇప్పుడు ‘దమ్మిడీ’లు లేవు కనుక ప్రభుత్వానికి అంటే ప్రజలకు ‘రూపాయి’ కూడ నష్టం వాటిల్లలేదన్నది ముఖ్యమంత్రి చేసిన నిర్ధారణ! అందువల్ల ప్రజాహితం కోరుతున్న ప్రతిపక్షాలు కూ డ సంతోషించాలి! కా నీ, ఈ ప్రభుత్వ భూ ములు అన్యాక్రాంతం కాబోయిన కుట్ర ఫలితంగా ముఖ్యమంత్రి బంధుగణం, సన్నిహిత మిత్ర జనం, అధికారపార్టీ వారు లాభపడ్డారని ప్రతిపక్షాలు నిర్థారించడం ఈ ‘వికృత ప్రహసనం’లో సరికొత్త ఘట్టం! గతంలో కాంగ్రెస్‌లో ఉండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో స్థిరపడి ఉన్న కె.కేశవరావు అన్న రాజకీయ ప్రముఖునికి ఈ ‘అన్యాక్రాంతం కాబోయిన’ భూముల అవినీతితో సంబంధం ఉందన్న ఆరోపణ ఈ వికృత ప్రహసనానికి మరింత ప్రాచుర్యం కల్పించిన పరిణామం. తమ బంధువులు ‘విర్గో గ్లోబల్ మీడియా లిమిటెడ్’ అన్న దళారీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసినట్టు కేశవరావు ధ్రువీకరించడం ‘గొప్ప ఘనకార్యం’.. కొన్న భూములు ప్రభుత్వం వారివన్న వాస్తవం తెలియక ‘విర్గో’ నుంచి కేశవరావు బంధువులు కొన్నారట! అవి ప్రభుత్వం భూములని తెలిసిన తరువాత అమ్మకాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఆయన చెప్పిన మాట.. అందువల్ల ‘అంగుళం’ ప్రభుత్వం భూమి కూడ అన్యాక్రాంతం కాలేదన్న వాస్తవానికి కేశవరావు ‘అంగీకారం’ మరో సాక్ష్యం!
ప్రభుత్వ భూమిని ‘విర్గో గ్లోబల్ మీడియా లిమిటెడ్’ వారు కేశవరావు బంధువులకు ఎలా అమ్మారు? అన్న ప్రశ్న సహజంగానే కలుగుతుంది! ఈ ‘విర్గో’ ఇలా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన, తమ దురాక్రమణలో ఉంచుకున్న అనేక సంస్థలలో ఒకటి మాత్రమే.. ‘గోల్డ్‌స్టోన్’ అన్నది ఎక్కువ శాతం భూములను కొనుగోలు చేసినట్టు ప్రచారమైంది! ‘ట్రినిటీ ఇన్‌ఫ్రా’ అన్నది మరో దళారీ సంస్థ. ఇలాంటి దళారీ సంస్థలు తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశమంతటా కుప్పలు తెప్పలుగా పుట్టలు పగిలి ఉండడం ‘ప్రపంచీకరణ’లో భాగం! దేశంలోని సంస్థలైనా, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలైనా సమాన స్వభావాన్ని సంతరించుకుని ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎమ్మార్’, ‘వాన్‌పిక్’, ‘డీబీర్స్’, ‘రక్షణ’ వంటి సంస్థలు భూ భక్షణ సంస్థలుగా పేరు మోశాయి! అందువల్ల ‘గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటిక్’ వంటివి సరికొత్త ప్రతీకలు మాత్రమే! ‘ప్రపంచీకరణ’కు పతాకాలుగా మారిన ‘బహుళ జాతీయ సంస్థలు’ దేశమంతటా భూమిని ‘కబ్జా’ చేయడానికి ప్రభుత్వాల విధానాలే దోహదం చేస్తున్నాయి!
మియాపూర్ తదితర హైదరాబాద్ శివారు గ్రామాలలోని ప్రభుత్వ భూమిని, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-హుడా-కు అప్పగించిన భూమిని ఇతరులు వివిధ వాణిజ్యి సంస్థలకు అమ్మేయడం ఈ వికృత ప్రసహనంలోని వౌలిక ఘట్టం! ఈ కొన్న ‘వాణిజ్య సంస్థలు’ మళ్లీ మరికొన్ని సంస్థలకు అమ్మాయి. ఇలా కొన్న సంస్థల నుంచి రాజకీయ వేత్తలు,వారి బంధువులు, ఇతరులు కొనేయడం ‘అవినీతి’ కార్యక్రమం అమలు జరిగిన తీరు! ప్రభుత్వ భూమిని ‘ఇతరుల’ది గాను, ప్రభుత్వేతరులది గాను ఆధికారిక పత్రాలలో చూపించడం తేలికైన పని కాదు! విస్తృతమైన ఈ ముఠాలలో రాజకీయవేత్తలు, అధికారులు, దళారీలు, ఇతర ‘ఘరానా’లు భాగస్వాములు. లేనట్టయితే ప్రభుత్వం భూమి ఇతరులదని ధ్రువపరిచే ‘పహానీ’ లు, ‘పట్టా‘ పుస్తకాలు తయారు చేయడం అ సంభవం! ఈ ‘ప ట్టాలు’ పుట్టిన తరువాతనే నకిలీ పట్టాదారుల నుంచి సంస్థలకు, ఆ సంస్థల నుంచి ఇతర సంస్థలకూ, ఆ ఇతర సంస్థల నుంచి వ్యక్తులకూ భూముల అమ్మకాలు జరిగాయి. ప్రతి దశలోను విక్రయించే వారి అధీనంలో అప్పటి వరకు భూమి ఉన్నట్టు ‘నిరూపించే’ నకిలీ ‘అధీన ధ్రువ పత్రాలు’-ఎన్‌కంబరెన్స్ సర్ట్ఫికెట్లు- కూడ ఏర్పడడం భూముల ‘కబ్జా’ అవినీతి ప్రహసనంలో భాగం.. సబ్ రిజిస్ట్రార్‌లు, రెవిన్యూ అధికారులు, రాజకీయ వేత్తలు, దళారీ సంస్థలు, ఇంకా ఎందరో కలిసికట్టుగా ‘కృషి’ చేయడం భూమి దురాక్రమణ షడ్యంత్రంలో భాగం.
దొంగలు ఇంటిలోకి చొరబడ్డారు, కానీ సొమ్ము పోలేదు. అయినప్పటికీ దొంగతనం చేయడానికి యత్నించినవారు శిక్షార్హులే! అందువల్లనే మియాపూర్ భూమి దురాక్రమణకు యత్నించిన సబ్ రిజిస్ట్రార్‌లను, కొన్ని సంస్థల ప్రతినిధులను ప్రభుత్వం అరెస్టు చేయించింది. వారిపై విచారణ జరుగుతోంది! కానీ, ఈ సంస్థల నుంచి భూమిని కొన్నవారు, సంస్థలకు భూమిని అమ్మినవారు కూడ ‘విచారణ’కు గురి కావాలి! వారి నిర్దోషిత్వం లేదా నేరాన్ని విచారణ తరువాత న్యాయస్థానాలు ధ్రువపరచాలి! ‘తెలియక’ భూములు కొనుగోలు చేసామని చెబుతున్నవారు తమ తప్పులేదని తామే తీర్పులను ఇచ్చేస్తున్నారు. ఇది విచిత్రమైన న్యాయం.. న్యాయ ప్రక్రియను నీరు కార్చే యత్నం! అందువల్ల వివిధ దశలలో అమ్మినవారిని, కొన్నవారిని కూడ న్యాయస్థానంలో నిలబెట్టవలసిందే.. నిర్దోషులు ఎవరో, నేరస్థులు ఎవరో న్యాయస్థానాలలో నిగ్గు తేలాలి!