సంపాదకీయం

సింధుశాఖలో ‘బందీ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదీ అరేబియా మన దేశానికి గొప్ప మిత్ర దే శమన్నది జరుగుతున్న ప్రచారం. సౌదీ అరేబియా అమెరికాకు మరింత మిత్ర దేశం. అమెరికా కూడ మనకు మిత్రదేశం. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సౌదీ అరేబియా, పశ్చిమ ఆసియాలోని దాని మిత్రదేశాలు గొప్ప కృషి చేస్తున్నాయన్నది అమెరికా ధ్రువపరచిన ప్రచారం. అమెరికా ధ్రువీకరణ ప్రధానం, వాస్తవం ప్రధానం కాదు. అమెరికా ధ్రువీకరణ కారణంగా ‘తిమ్మి’ ‘బొమ్మి’గాను, ‘బొమ్మి’ ‘తిమ్మి’గాను మారిపోగలవు! ఇదంతా అంతర్జాతీయ రాజకీయం. సౌ దీ అరేబియా ‘నాగరికులు’, దాని ఇరుగు పొ రుగు మిత్రదేశాలలోని ‘నాగరికులు’ భారతీయులను ప్ర ధానంగా యువతులను భయంకర, అమానవీయ బీభత్సకాండకు బలి చేస్తుండడం దశాబ్దుల చరిత్ర. ఈ సామాజిక ఉగ్రవాదాన్ని, లైంగిక బీభత్సకాండను ఆపించడానికి వీలైన వ్యవస్థ సౌదీ అరేబియాలోను, పశ్చిమ ఆసియాలోని సౌదీ మిత్రదేశాలలోను రూపొందకపోవడం భారతీయుల బాధల కు ప్రధాన కారణం. మహిళలను ప్రధానంగా యువతులను బానిసలుగా అమ్మివేసే పైశాచిక బీ భత్సం ‘సౌదీ’లోను, దాని మిత్రదేశాలలోను ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చె ప్పి మన దేశంలోని వివాహిత, అవివాహిత యువతులను సౌదీ అరేబియాకు, ఓమన్‌కు, దుబాయ్‌కు, ఖతార్‌కు తరలిస్తున్న ముఠాలు ఆయా దేశాలలో ఈ యువతులను బానిసలుగా అమ్మేస్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ నిర్వాహకులకు, నిఘా విభాగాలకు, పోలీసులకు, పెద్దలకు ఈ సంగతి స్పష్టంగా తెలుసు. కానీ నిరోధించడం లేదు. ఇలా అమ్ముడుపోయిన బా లికలు, యువతులు వర్ణించడానికి, ఊహించలేని చిత్రహింసల కు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మన ప్రభుత్వం విడివిడిగా ఇలాంటి అభాగ్య యువతులను స్వదేశానికి తిరిగి రప్పించడానికి యత్నిస్తోంది. ఓమన్ దేశంలో ఇలా అమ్ముడైపో యి బానిసగా జీవిస్తున్న రుబీనా ఫతీమా అనే మహిళను స్వదేశానికి రప్పించడానికి సహాయం చేయనున్నట్టు ఇటీవల మన విదేశీ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ ప్రకటించింది. రుబీనా ఫతీమాకు ఓమన్ ‘నరకం’ నుంచి విముక్తి లభించలేదు. మన దేశం నుంచి ఉద్యోగాలకై వెడుతున్న వారికి ‘పర్షియా సింధుశాఖ ప్రాంత దేశాలలో ‘వౌలిక మానవుల’ స్థాయిని లభింపచేయడానికి మన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా?
ఈ ‘తథాకథిత’ మిత్రదేశాల ప్రభుత్వాల వారు మన ప్రభుత్వం మాటను మన్నిస్తున్నారా? అలా మన్నించనపుడు మన దేశం పౌరులు ఆ దేశాలకు వెళ్లరాదని మన ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలనైనా జారీ చేయాలి. ఈ మార్గదర్శక సూత్రాలను లెక్కచేయకుండా సింధుశాఖ- గల్ఫ్‌దేశాల-కు వెళ్లేవారు తమ స్వీయ బాధ్యతపై మాత్రమే ఆదేశాలకు వెళ్లాలని కూడ ప్రభుత్వం హెచ్చరించాలి. దాదాపు మూడేళ్ల క్రితం ఇరాక్‌లో మన దేశానికి చెందిన ముప్పయి తొమ్మిది మంది కార్మికులను ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’- ఐసిస్- జిహాదీ బీభత్స ముఠావారు అపహరించుకోనిపోయారు. ఈ మన ‘శ్రామికుల’కు ఇంతవరకూ ‘నిర్బంధ విముక్తి’ లభించలేదు, వారి జాడ తెలీదు. ఇరాక్‌కు ఉద్యోగాల కోసం వెళ్లవద్దని ఈ ‘అపహరణ’ తర్వాత మన ప్రభుత్వం మన పౌరులకు సలహా ఇచ్చింది. పర్షియా సింధుశాఖ దేశాలలో మన పౌరులను హింసిస్తున్న ‘నాగరికులు’ ప్రచ్ఛన్న బీభత్సకారులు ‘ఐసిస్’ టెర్రిరిస్టుల కంటే మరింత పైశాచికంగా మన పౌరులను హింసిస్తున్నారు. ఇది దశాబ్దులుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న బీభత్సం. అందువల్ల ‘సౌదీ’ తదితర దేశాలకు వెళ్లరాదని ఇప్పుడైనా మన ప్రభుత్వాలు మన పౌరులను హెచ్చరించాలి.
సౌదీ అరేబియా, ఓమన్, ఖతార్, ఐక్య అరబ్ ఎమిరేట్స్, యెమన్, ఇరాక్, ఇరాన్ వంటి అన్ని పశ్చిమ ఆసియా దేశాలలోను ఇంధన తైలం, ఇంధన వాయువు నిక్షేపాలు మితిమీరి నెలకొని ఉండడం ఆయా దేశాల ‘నడమంత్రపు సిరి’కి కారణం. శతాబ్దుల పాటు ఎడారులలో గుడారాలు వేసుకుని బతికిన, ఇతర దేశాలకు వెళ్లి కొల్లగొట్టి జీవించిన ఈ దేశాలవారు ‘తైలం’,‘వాయువు’ల కారణంగా ఐదారు దశాబ్దుల పూర్వం సంపన్నులైపోయారు. కానీ ‘సమృద్ధి’ కారణంగా ఈ దేశాల ప్రజల సమష్టి ప్రవృత్తిలో మానవీయ సంస్కారాలు వికసించలేదు. ఎక్కడో అక్కడ మంచివారు ఉండవచ్చు.. కానీ ఆయా దేశాల ప్రజల సమష్టి చిత్తవృత్తిని మాత్రం ఇతర దేశాల ప్రజలను పశువులుగా భావించే అమానవీయ స్వభావం ఇప్పటికీ ఆవహించి ఉంది. అసలు సమస్య ఇదీ.. సజ్జనుని సంపద సైనికుని ఆయుధం వలె రక్షణ కల్పిస్తుంది, దుర్జనుని సంపద గజదొంగ చేతిలోని ఆయుధం వలె ‘క్షతి’ని కలిగిస్తుం ది. ఈ ‘గల్ఫ్’ దేశాల ప్రజల సమష్టి స్వభావం ‘క్షతి’ కారకం- ఇతరుల ను గాయపరచడం- కా వడం వౌలిక స మస్య. ఇతర మతాలను ఇతరుల వైవిధ్యాలను నష్టం చేయడమనే పైశాచిక జిహాదీ ప్రవృత్తి ఇప్పటికీ ఈ దేశాల ప్రజల్లో అత్యధికులను ఆవహించి ఉంది. సర్వమత సమభావయుక్త ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ దేశాలలోని సంపన్నులు భారతీయులను కాని, ఇతర దేశాల వారిని కాని మానవులుగా గుర్తించగలరు!
అంతవరకూ భారతీయ మహిళలను రెండవ అంతస్థు నుంచి కిందకు తోసి చంపడం, వారి ఒంటిమీద వాతలు పెట్టడం, తిండి పెట్టకుండా మ లమల మాడ్చి చంపడం, వికలాంగులుగా మా ర్చడం వంటి పైశాచిక కృత్యాలను ‘గల్ఫ్’ దేశాల సంపన్న గృహస్థులు కొనసాగిస్తూనే ఉంటారు. వారి ఇళ్లలో ‘పనికత్తెలు’గా కుదిరిన భారతీయ మహిళలు ఈ బీభత్సకాండకు బలి అవుతూనే ఉంటారు. హైదరాబాద్‌కు చెందిన అర్షియా బేగమ్ అనే మహిళను జెడ్డాలోని ఓ సౌదీ సంపన్నుడు నిర్బంధించి ఉన్నాడన్నది పదునాలుగవ తేదీన ప్రచారమైన సరికొత్త బీభత్సం. సైరంధ్రి- బ్యూటీషియన్- ఉద్యోగం ఇప్పిస్తామని మభ్యపెట్టి ఆమెను జెడ్డాకు తరలించారు, ఈ సంపన్నుడి ఇంట్లో ‘పనిమనిషి’ని చేశారు. ఆమె తిరిగి రాదలచుకొంది. కానీ మూడు లక్షల రూపాయలు చెల్లిస్తేనే ‘విముక్తి’ ప్రసాదిస్తామని ‘యజమాని’ షరతు విధించాడట! అర్షియాకు బంధ విముక్తి ఎప్పుడో? హైదరాబాద్‌కు చెందిన సబాహ్ ఫాతిమా అనే ఇరవై ఏళ్ల యువతిది కూడ సౌదీలో ఇదే వ్యధ.. ఏళ్ల తరబడి ఇలాంటి అభాగ్యుల కథలు ప్రచారవౌతూనే ఉన్నాయి.. అయినప్పటికీ యువతులు వంచితులై తరలిపోతూనే ఉన్నారు....