సంపాదకీయం

కశ్మీర్‌లో ‘రాజీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీతో కలిసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-పిడిపి-అధినేత ముఫ్తి మెహబూబా అంగీకరించడం గొప్ప చారిత్రక ఘటనగా అభివర్ణితమవుతోంది. వాస్తవానికి ఇది చారిత్రక పునరావృత్తి. గత ఏడాది మార్చిలో ఇదివరకే భాజపా, పిడిపిల కూటమి జమ్మూకశ్మీర్‌లో అధికార పీఠాన్ని అధిరోహించింది. మెహబూబా ముఫ్తి తండ్రి ముఫ్తి మహమ్మద్ సరుూద్ అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. గత జనవరిలో ఆయన మరణించిన తరువాత ఏర్పడినట్టు ప్రచారమైన రాజకీయ శూన్యం ఇప్పుడు తొలగింది. తొలగిందని భాజపా వారు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుండడమే ఈ రాజకీయ శూన్యం తొలగిపోయిందనడానికి భాజపా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం చారిత్రక పునరావృత్తి. చరిత్ర ఇంత త్వరగా పునరావృత్తం కావడం ఏమిటని కొందరికి సందేహం కలుగవచ్చు. కానీ పునరావృత్తి అన్న వాస్తవం మారదు. ఏమయినప్పటికీ చారిత్రక ఘటనలు దుర్ఘటనలు కావచ్చు. సంఘటనలు కావచ్చు. దుర్ఘటనలను సైతం సంఘటనలుగా భావించడం భ్రాంతికి నిదర్శనం...్భజపా, పిడిపి కూటమి ప్రభుత్వం మళ్లీ ఏర్పడడం దుర్ఘటనా? లేక సంఘటనా? అన్న మీమాంసకు మాత్రమే దేశ ప్రజలు గురై ఉన్నారు. భాజపా, పిడిపి సిద్ధాంతాలు, విధానాలు కార్యాచరణ పద్ధతులు పరస్పరం విరుద్ధంగా ఉండడం, వికర్షించుకొంటూ ఉండడం చరిత్ర నిరూపించిన సత్యం. అందువల్ల ఈ ఉభయ పక్షాలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఏమిటనన్నది మీమాంసకు ప్రాతిపదిక. అయితే ఇలాంటి సందేహం మొదటిసారి పిడిపి,్భజపా ప్రభుత్వం ఏర్పడినప్పుడే తలెత్తి ఉంది. అందువల్ల ఇప్పుడు మళ్లీ వైరుధ్యాల మధ్య పొత్తు కుదరడం గురించి కొత్తగా సందేహాన్ని వ్యక్తం చేయడం తగదన్నది మరో తర్కం. ముప్తిమహమ్మద్ సరుూద్ గత ఏడాది మార్చి ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన దృశ్యాలు మాధ్యమాలలో ఆవిష్కృతమయ్యాయి. ఈ ప్రశంసలను సహజంగానే అప్పుడు భాజపా నిరసించింది. అయినప్పటికీ ఉభయ పక్షాలు ముఫ్తి మహమ్మద్ సరుూద్ నేతృత్వంలో కలసికట్టుగా ప్రభుత్వాన్ని నిర్వహించాయి. ఉభయ పక్షాల విధానాలలో అప్పటికీ ఇప్పటికీ మార్పు రాలేదు. అందువల్ల ముఫ్తి మెహబూబా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడడం వల్ల భాజపా కాని పిడిపి కానీ కొత్తగా పడుతున్న రాజీ లేదు.
పడవలసినంత మేరకు భాజపా గత ఏడాది ముఫ్తి మహమ్మద్ సరుూద్ ప్రభుత్వం ఏర్పడినప్పటికే పడిపోవడం చరిత్ర. జమ్మూకశ్మీర్ దశాబ్దులపాటు కల్లోలగ్రస్తం కావడానికి మూల భూతమైన భారత రాజ్యాంగపు 370వ అధికరణం జాతీయ వైపరీత్యం. భారతీయ జనతాపార్టీ ఈ రాజ్యాంగపు అధికరణాన్ని రద్దు చేయాలని దశాబ్దుల తరబడి కోరింది. కాని పిడిపి వారు 370వ అధికరణం ప్రసాదిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి కంటె మరింత విస్తృత విద్రోహకమైన స్వయం పాలన-సెల్ఫ్‌రూల్-ను కోరుతోంది. ఈ స్వయంపాలన నిజమయ్యే పక్షంలో జమ్మూకశ్మీర్ దాదాపు మరో స్వతంత్ర దేశంగా అవతరించడం ఖాయం. ఈ తమ విచ్ఛిన్న వాదాన్ని పిడిపి వారు గత ఏడాది మార్చి నాటికి కాని, ఇప్పటికి కానీ విడనాడలేదు. ఇలాంటి దేశ వ్యతిరేక పిడిపితో జాతీయ సమగ్రతా నిష్ఠకు దర్పణం వలె భాసిస్తున్న భాజపా చేతులు కలిపింది. కూటమిగా ఏర్పడడం ద్వారా భాజపా క్రమంగా తన జాతీయతా వాదంతో పిడిపిని ప్రభావితం చేసి ఆ ప్రాంతీయ పక్షాన్ని విచ్ఛిన్నవాదం నుండి విముక్తం చేయగలదన్న ఆశాభావం గత ఏడాది మార్చిలో వ్యక్తమైంది. కానీ జరిగిన చరిత్ర ఈ ఆశాభావం ఆవిరికావడం మాత్రమే. గద్దెనెక్కిన తొలి రోజుననే పాకిస్తాన్‌ను పొగడిన ముఫ్తిమహమ్మద్ సరుూద్ ఆ తరువాత భాజపా వారికి మింగుడు పడని అనేకానేక వివాద విధానాలను ఏకపక్షంగా అమలు జరిపేశాడు. ఆ ఘటనా క్రమాన్ని భాజపా విస్మయంతో వీక్షించిన దృశ్యాలు ముఫ్తిమహమ్మద్ పాలనలో ఆవిష్కృతమయ్యాయి.
ఇలా పిడిడి తన విధానాలను సడలించకపోవడం ధ్రువపడిన వాస్తవం. కానీ భాజపా, మాత్రం తన జాతీయతా నిష్ఠకు విరుద్ధమైన ప్రకటనను గత ఏడాది మార్చి కంటె ముందుగానే చేసింది. రాజీ పడింది. అది రాజీ పడడం, కాదని భాజపా బుకాయించవచ్చుగాక..ఉభయ పక్షాలు కలిసి కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గత సంవత్సరం ఫిబ్రవరి 24న ఒప్పందం కుదిరింది. మరునాడు రాజ్యసభలో ‘‘్భరత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసేందుకు తాము ప్రయత్నించడం లేద’’ని ప్రభుత్వం వారు స్పష్టం చేశారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలోను, ఆ తరువాత జమ్మూకశ్మీర్ శాసనసభకు జరిగిన ఎన్నికల సమయంలోను కూడ భాజపా చేసిన వాగ్దానానికి రాజ్యసభలో చేసిన ఈ ప్రకటన విరుద్ధం. పిడిపిని బుజ్జగించడానికి భాజ పా ప్రకటించిన తరువాత మాత్రమే మార్చి ఒకటవ తేదీన ముఫ్తి మహమ్మద్ సరుూద్ ముఖ్యమంత్రి అయ్యా డు. 370వ అధికరణ వల్ల జమ్మూకశ్మీర్‌కు లభించిన ప్రత్యేక ప్రతిపత్తి లక్షలాది హిందువులను కశ్మీర్ లోయ నుంచి జిహాదీలు వెళ్లగొట్టడానికి దోహదం చేసింది. హిందువులను మళ్లీ లోయ ప్రాంతంలోని తమ నివాసాలకు రప్పించడానికి మార్చి, జనవరి నెలల మధ్య ముఫ్తి మహమ్మద్ సరుూద్ చేసింది గుండు సున్న. భాజపా ప్రభావితం చేయగలిగిందా, ప్రభావితమైందా? దశాబ్దుల పాటు కాంగ్రెస్ పాటించిన తప్పుడు విధానాన్ని భాజపా పాటించినంత మాత్రాన తప్పులు ఒప్పులు అయిపోతాయా?
స్వయంపాలన-సెల్ఫ్‌రూల్- సిద్ధాంతం పట్ల సరుూద్ కంటె ఆయన కుమార్తె మెహబూబాకు నిష్ఠ ఎక్కువ. 2008లో ఈ దేశ వ్యతిరేక స్వయంపాలన సిద్ధాంత పత్రాన్ని పిడిపి వారు ఆవిష్కరించారు. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్-పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూకశ్మీర్-పిఒకె-ను పిడిపి వారి ఈ పత్రంలో పాకిస్తాన్ పాలిత కశ్మీర్-పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్-పిఓకె-గా పేర్కొన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిష్కార సంఘం వారు కూడా పిఓజికె’ను ‘పిఓకె’గా పేర్కొనడాన్ని భాజపా తప్పు పట్టింది. ఈ పదజాలాన్ని పిడిపి వారు ఇప్పటికీ విడనాడిన దాఖలా లేదు. ఎవరు రాజీపడుతున్నట్టు? తమ తండ్రి మరణించిన తరువాత దాదాపు ఎనబయి రోజులపాటు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా భీష్మించిన మెహబూబమ్మను భాజపా వారు చివరికి ఒప్పించారు. దీనివల్ల ఆమె ప్రాధాన్యం ప్రతిష్ఠ పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆమెతో చర్చలు జరపడం ఆమె ప్రతిష్ఠకు పరాకాష్ఠ! ఇదీ చారిత్రక పరిణామక్రమం...