సంపాదకీయం

‘విదేశాంగ’ వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణు సరఫరాల కూటమి-న్యూక్లియర్ సప్లయ్యర్స్ గ్రూప్-ఎన్‌ఎస్‌జి-లో మన దేశానికి సభ్యత్వం ఇ వ్వరాదన్న చైనా మాట మరోసారి నెగ్గింది. జూన్ ఇరవై రెండవ, ఇరవై మూడవ తేదీలలో స్విట్జర్‌లాండ్ రాజధాని బెర్న్‌లో జరిగిన ‘ఎన్‌ఎస్‌జి’ సభ్య దేశాల సమావేశంలో మన సభ్యత్వం సంగతి చర్చకు వచ్చిందట! ప్ర స్తుతానికి మనకు సభ్యత్వం ఇవ్వరాదని సమావేశంలో నిర్ణయించారట! మన సభ్యత్వం గురించి చర్చించడానికి ఐదు నెలల తరువాత మరో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ‘అణు సరఫరాల కూటమి’ ఈ సమావేశం లో నిర్ణయించడమొక్కటే మన దేశానికి లభించిన ఊ రట. సమావేశంలో చైనా మన సభ్యత్వాన్ని వ్యతిరేకించడం ఈ నిర్ణయానికి ఏకైక కారణమన్నది కొత్త సమాచారం కాదు. రహస్యంగా జరిగే ఎన్‌ఎస్‌జి చర్చల వివరాలు బయటకి రావు. చైనా మాత్రమే వ్యతిరేకించిం దా? మరికొన్ని దేశాలు కూడ వ్యతిరేకించాయా? అ న్నది ఆధికారికంగా వెల్లడి కాలేదు. మనకు మిత్రులెవరు? ప్రత్యర్థులెవరు? అన్న విషయాన్ని మన దౌత్యవేత్తలు తెలిసిన మిత్ర దేశాల నుంచి రాబట్టలేకపోవడం మన దౌత్యానికి వ్యూహాత్మక వైఫల్యం! ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినప్పటికీ ‘ఎన్‌ఎస్‌జి’లో ఏ నిర్ణయం జరగరాదన్నది ఈ ‘కూటమి’ నియమావళి! చైనా 2008 నుంచి మన సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తోంది, మన ప్రభుత్వం గట్టిగా నిరసనలు తెలుపుతునే ఉంది, ఇప్పుడు కూడ చైనా వ్యతిరేకత వల్లనే ‘ఎన్‌ఎస్‌జి’ సభ్యత్వం మనకు దక్కలేదని మన ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇది కూడ ఆశ్చర్యం కాదు. ‘ఆ ఒక్క చైనా’ అన్న శత్రుదేశం నిర్వహిస్తున్న ‘షాంఘయి సహకార సమాఖ్య’-ఎస్‌సిఓ- లో మన ప్రభుత్వం ఇటీవల సభ్యత్వాన్ని పుచ్చుకొనడమే అంతుపట్టని వ్యవహారం. ‘అణుపదా ర్థ పరి జ్ఞాన పరికరాల వి పణివీధి’లోకి మనం అ డుగుపెట్టకుండా చైనా అ డ్డుకుంటోంది. మనం మాత్రం ‘షాంఘయి సం త’ కెళ్లి కొనుగోళ్లు చేయడం సమాంతర విపరిణామం! ఈ ‘షాంఘయి సంత’లోకి జపాన్ అడుగుపెట్టడం లేదు, ఆరబ్ దేశాల వాణిజ్య, రక్షణ, దౌత్య, వ్యూహాత్మ క, ప్రాంతీయ కూటములలో సభ్యత్వం కోసం ఇజ్రాయిల్ దేబిరించడం లేదు. ఈసడించుకుంటున్న చైనా ను మన ప్రభుత్వం దశాబ్దులుగా దేబిరిస్తోంది!
మన దౌత్య వైచిత్రి కావచ్చు, వ్యూహాత్మక వైఫల్యం కావచ్చు, కేవలం ‘షాంఘయి సంత’-అణుకూటమి వ్య వహారానికి పరిమితమై లేదు. ‘విజయ్ మాల్యా’ అనే ఆర్థిక బీభత్సకారుడిని మన ప్రభుత్వం ఇంతవరకు దేశానికి తరలించుకొని రాకపోవడం మన విదేశాంగ నీతికి దాపురించిన మహా మందకొడితనానికి నిదర్శనం. ఏళ్ల తరబడి మన ప్రభుత్వం వారి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసిన బ్రిటన్ ప్రభుత్వం గత ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీన మాల్యాను నిర్బంధించింది. ‘ఇంకేం.. మాల్యాను బ్రిటన్ ప్రభుత్వం విమానమెక్కించి మన దేశానికి తరలిస్తుంది!’ అన్న ఆర్భాటం, హడావుడి మన ప్రభుత్వానికి ఆవహించాయి! నిర్బంధించిన రోజు సాయంత్రానికే మాల్యాకు లండన్‌లోని ఒక ‘మాజిస్ట్రేట్’ తాత్కాలిక నిర్బంధ విముక్తి- బెయిల్-ను ప్రసాదించాడు. మాల్యాను తరలించుకొని రావడానికి సర్వం సిద్ధం చేసుకున్న లండన్‌లోని మన దౌత్య అధికారులు ‘నోటిలో బొగ్గు’ను వేసుకున్నారు! మాల్యా తరలింపునకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను మన ప్రభుత్వం ఇంతవరకూ సమర్పించనే లేదన్నది లండన్‌లోని ‘వెస్ట్‌మినిస్టర్ న్యాయస్థాన సముదాయం’ ప్రధాన న్యాయమూర్తి ఎమ్మాఆర్ బూట్‌నాట్ జూన్ పదమూడవ తేదీన చేసిన నిర్ధారణ! ఇలా విలంబనం చేసినందుకు ఆమె మన ప్రభుత్వాన్ని తప్పుపట్టిందట! ఇలా తప్పు పట్టి ఒకేసారి డిసెంబర్ నాలుగవ తేదీకి అభియోగ విచారణను వాయిదా వేసిందట! అంటే మరో ఆరునెలలపాటు మాల్యా మన దేశానికి రాడు, ‘చట్టబద్ధం’గా ఇంగ్లాండ్‌లోనే స్వేచ్ఛగా ఉండగలడు! ఇదీ మన దౌత్య వ్యూహకర్తల నిర్వాకం..
తొమ్మిది వేల కోట్ల రూపాయలను అక్రమంగా బ్యాంకుల నుండి, ఇతర సంస్థల నుంచి పొందిన మాల్యా వాటిని ఎగవేసి బ్రిటన్ పారిపోయాడు! లండన్ కోర్టు న్యాయమూర్తి ఇలా తప్పుపట్టిన తరువాత ఆదాయం పన్ను విభాగం కార్యాచరణ మండలి వారు తొమ్మిది వందల కోట్ల రూపాయల ఎగవేతకు సంబంధించిన ఒక అభియోగాన్ని ముంబయిలోని ఒక న్యాయస్థానంలో దాఖలు చేశారట! ఈ అభియో గం దాఖలు కావడంతో ఇంగ్లండ్ నుండి మాల్యాను తరలించుకొని రావడానికి వీలు కలుగుతుందట- డిసెంబర్ నాలుగవ తేదీ తరువాత! ఇంత దీర్ఘకాలంపాటు తరలింపు విచారణను లండన్ న్యాయస్థానం ఎందుకని వాయిదా వేసినట్టు? మన ప్రభుత్వం తరఫున లండన్ కోర్టులో నిలబడిన న్యాయవాది ఆరన్ వాట్‌కిన్స్ ఈ విషయమై న్యాయమూర్తికి నివేదించ లేదు! ‘నన్ను తరలించుకొనిపోగలమని వేల కోట్ల రూపాయల కలలు కంటూ ఉండండి..’ అంటూ- ‘ఘరానా మద్యం దళారీ’ అయిన మాల్యా మాధ్యమ ప్రతినిధుల ముందు మన ప్రభుత్వాన్ని వెక్కిరించడం నడుస్తున్న నాటకంలో సరికొత్త మలుపు! ఈనాటకాన్ని బ్రిటన్ నడిపిస్తోంది. బ్రి టన్ గొప్ప ప్రజాస్వా మ్య దేశం!
జాకీర్‌నాయిక్ అనే మతోన్మాద జిహాదీ ఉగ్రవాదిని సౌదీ అరేబియా నుంచి మన దేశానికి తరలించుకొని రావడంలో మన ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని ప్రచారవౌతోంది! జా కీర్ నాయిక్ ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’-ఐఆర్‌ఎఫ్-అన్న ప్రభుత్వేతర స్వ చ్ఛంద సంస్థను స్థాపించి దేశ విదేశాలలో వందల కోట్ల రూపాయల నిధులను వసూలు చేశాడు. ఇతగాడు ప్రచ్ఛన్న బీభత్సకారుడని, జిహాదీ ఉగ్రవాదులను నడిపిస్తున్న సూత్రధారుడని, బంగ్లాదేశ్‌లో 2016లో జరిగిన భయంకర బీభత్సకాండకు ఇతడే వ్యూహకర్త అని ధ్రువపడింది. విదేశాల్లో సైతం ఇతగాడికి అనుబంధ సంస్థలున్నాయి! ముంబయి కేంద్రంగా అనేక ఏళ్లపాటు ఉగ్రవాద మృగాలను ఉసిగొలిపిన జాకీర్ బంగ్లాదేశ్‌లో జరిగిన బీభత్సకాండ తరువాత సౌదీ అరేబియాకు పారిపోయాడు! ఇతగాడు నిర్వహించిన ‘ఐఆర్‌ఎఫ్’ను మన ప్రభుత్వం నిషేధించింది. సౌదీ అరేబియాలో జాకీర్ నాయిక్ సురక్షితంగా ఉన్నాడు! బంగ్లాదేశ్‌లో హిందువులను నిరంతరం హత్య చేస్తున్న బీభత్సకారులకు, మన దేశంలో ఉగ్రవాద కలాపాలను నిర్వహిస్తున్న వారికి ‘ఐఆర్‌ఎఫ్’ నిధులు లభించాయి! పాకిస్తాన్‌లో ఉన్న దావూద్ ఇబ్రహీం, మసూద్ అఝార్ వంటి మతోన్మాద హంతకులను మనం మన దేశానికి తరలించుకుని రావడం కష్టం. శత్రుదేశమైన పాకిస్తాన్ సహకరించదు. ‘మిత్ర’ దేశమైన సౌదీ అరేబియాలో నక్కి ఉన్న జాకీర్ నాయిక్‌ను పట్టుకుని తరలించుకొని రావడంలో కష్టం ఏమిటి?? నాయిక్‌ను ని ర్బంధించవలసిందిగా అంతర్జాతీయ పోలీస్ సంస్థ-ఇంటర్‌పోల్-ను మన ప్రభుత్వం కోరిందట! సౌదీ ప్రభుత్వాన్ని నేరుగా ఎం దుకు కోరకూడదు. నాయిక్‌ను మన దేశానికి పంపించవలసిందిగా సౌదీ ప్రభుత్వాన్ని మన విదేశాంగ వ్యవహారాల శాఖ ఇంకా కోరవలసి ఉందట...