సంపాదకీయం

రాష్టప్రతి రామనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక కావడం మరో చారిత్రక మహా సంఘటన.. ఈ చరిత్ర రాజ్యాంగ ప్రక్రియ ప్రగతికి సంకేతం, ప్రజాస్వామ్య ప్రస్థాన పరిణతికి సముజ్వల దర్పణం, సామాజిక సుఖ సంతోషాల క్రమానుగత వికాసానికి చిహ్నం. అనాది భారత జాతీయ జీవన గరిమకు ప్రతిబింబం! రాష్టప్రతి దేశ ప్రజలలో ప్రథముడు, రా జ్యాంగ పరిరక్షకుడు, సర్వజన సమాకాంక్షలకు సమున్నత ప్రతినిధి, జాతీయ సర్వాభౌమాధికార వ్యవస్థలో సర్వోన్నతుడు. ఈ సర్వోన్నత పదవికి మరోసారి ఎన్నిక జరగడం భారత రాజ్యాంగ పథ గమనంలో చారిత్రక సన్నివేశం. ఈ సందర్భానికి రూపకర్త రామ్‌నాథ్ కోవింద్! ఎన్నికయిన కోవింద్ నోటి వెంట గురువారం వెలువడిన మాటలు కృతకమైన తాత్కాలిక మైన సంగతులకు సంబంధించినవి కావు, సహజమైన శాశ్వతమైన స్వజాతీయ సాంస్కృతిక తత్త్వాన్ని ఆయన మరోసారి ఆవిష్కరించాడు, ‘సర్వేభవన్తు సుఖానః’ అన్నది భారతీయ జాతీయ వౌలిక సంస్కారం.. ‘అందరూ సుఖంగా ఉండెదరు’ అన్న ఈ సంస్కార సాహిత్యం ‘నవ నిర్వాచిత రాష్టప్రతి’ నోట ధ్వనించడం ధ్వనింప చేసిన వాని సంస్కారం. ఇలా ధ్వనింప చేయడం ద్వారా తాను వౌలిక జాతీయతా ప్రాతిపదికపై పయనించగలనన్న విశ్వాసాన్ని రామ్‌నాథ్ కోవింద్ ప్రజల హృదయాలలో పటిష్ఠం చేయగలిగాడు! అందరూ సుఖంగా ఉండడమే రాజ్యాంగ వ్యవస్థ లక్ష్యం, జాతి సాధించగలిగిన పరమోన్నత వి భవం! ఈ సుఖం భౌతిక ప్రగతి, సాంస్కృతిక సు గతి.. సర్వోన్నత పదవిని జూలై 25న అధిష్ఠించనున్న భారతీయు డు తాను ఈ లక్ష్యానికి పునరంకితం అవుతున్నానని చెప్పడం భారత ప్రజలకు హర్షదాయకం, భరతమాతకు గర్వకారణం! రాష్టప్రతి ఎన్నిక రాజకీయమైన ఘటన కాదు, ఏకగ్రీవం కావచ్చు పోటీ జరగవచ్చు.. రాష్టప్రతి ఎన్నిక జాతీయ సంఘటన! ‘రాష్ట్రం’ అంటే సంస్కృత భాషలో, అనేక భారతీయ భాషలలో ‘జాతి’ -నేషన్- అని అర్థం. ‘జాతి’ని భరించేవాడు, జాతిని నడిపించేవాడు రాష్టప్రతి! ‘జాతి’ అని అంటే ప్రజలు-రాష్ట్రం ప్రజాః- అని వేదద్రష్టలు వివరించారు. ఈ అనాది వాస్తవానికి ఆధునిక ధ్రువీకరణ మన రాజ్యాంగం! అధిపతి వల్ల ‘రాష్ట్రం’ పరిపుష్టం అవుతుంది, సమగ్రం అవుతుంది-రాష్ట్రో రాజన్య కృతః-! అందువల్ల భారతీయ జాతీయ పరంపరలో అధినాయకత్వం ‘అధికార భోగం’ కాలేదు! అందరి సుఖం సాధించే పరిపాలనా మార్గం అధి నాయకత్వం! ఈ సంస్కారానికి పునరుద్ఘాటన రామ్‌నాథ్ కోవింద్ విజయ ప్రకటన...
రాష్టప్రతి పదవిని అధిరోహించడం తన లక్ష్యం కాదని, కాలేదని కోవింద్ చెప్పడం ఈ జాతీయ సంస్కారానికి అనుగుణం! ‘అందరూ సుఖంగా ఉండాలి’ అన్నది లక్ష్యం! మన రాజ్యాంగం ప్రవచిస్తున్న సర్వజన సంక్షేమ వ్యవస్థ ఇదే! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని చిన్న పల్లెలోని నిరుపేద వ్యవసాయ కుటుంబంలో డెబ్బయి ఒక్క ఏళ్లక్రితం, 1945 అక్టోబర్ ఒకటవ తేదీన జన్మించిన రామ్‌నాథ్ కోవింద్ అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పదవిని అధిష్ఠించనుండడం ఈ సామాజిక సంక్షేమానికి వైవిధ్యాలతో కూడిన మన జాతీయ సమాజంలో నిహితమై ఉన్న సహజ సమన్వయానికి నిదర్శనం! కుల మత భాషా ప్రాంత వైవిధ్యాలన్నీ జాతీయ తత్త్వంలో సమన్వయం అవుతుండడం ఈ దేశంలో అనాది జీవన స్వభావం! రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతి కావడం ఈ జాతీయ జీవన స్వభావానికి మరో ధ్రువీకరణ! ఈ దేశంలో ఎందరెందరో రామ్‌నాథ్ కోవింద్‌లు ఉన్నారని, ‘రాత్రికి భోజనం లభించగలదన్న విశ్వాసంతో రోజంతా కాయకష్టం చేస్తున్న నిరుపేదల’ అభ్యున్నతి తన లక్ష్యమని ఆయన చెప్పాడు! ‘కామ యే దుఃఖ తప్తానాం ప్రాణిణాం ఆర్తి నా శనమ్...’- ‘బాధలకు గురి అవుతున్న ప్రాణుల దుఃఖాన్ని దూరం చేయడమే నా ఆకాంక్ష’- అన్న సనాతన భారతీయ లక్ష్యం రామ్‌నాథ్ కోవింద్ విజయంలో ప్రస్ఫుటిస్తోంది! మాతృభూమి బిడ్డలందరి సమష్టి లక్ష్యమది. రామ్‌నాథ్ కోవింద్ భరతమాత వరాల బిడ్డడు! జాతీయతా భావ నిబద్ధుడు..
భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ‘జా తీయ ప్రజాస్వామ్య కూటమి’ అభ్యర్థిగా రాష్టప్రతి పదవికి పోటీ చేసిన కోవింద్ తనతో పోటీ చేసి ఓడిన ప్రతిపక్ష అభ్యర్థిని మీరాకుమార్‌కు శుభాకాంక్షలను, కృతజ్ఞతలను తెలియజేయడం రాజకీయాలకు అతీతమైన జాతీయతకు నిదర్శనం! ఎన్నికలు ముగిసే వరకు మాత్రమే అభ్యర్థుల మధ్య పోటీ, విధానాల విభేదం. ఫ లితం వెలువడిన తరువాత విజేత మొత్తం వోటర్ల ప్రతినిధి. రాష్టప్రతి ఎన్నిక విషయం తో ఈ సూత్రం మ రింత వా స్తవం! ‘రాజకీయం’ అంటని రా జ్యాంగ అధినేత రాష్టప్రతి! రాజ్యాంగం అ మలు జరిగిన తరువాత తొలి రాష్టప్రతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ సంప్రదాయానికి శాశ్వత శ్రీకారం. తాను వర్తమాన సాకారం కాగలనన్నది కోవింద్ తన విజయ ప్రసంగం ద్వారా ధ్వనింపచేశాడు! బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, ప్రణవ్ కు మార్ ముఖర్జీ వంటి తన పూర్వులను రామ్‌నాథ్ కోవింద్ పేర్కొనడం ఇం దుకు నిదర్శనం. రాష్టప్రతి నిర్భయంగా, నిష్పక్షంగా, వివాద రహితంగా వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తి..
ఈ స్ఫూర్తికి భిన్నంగా వివాదాలను సృష్టించిన రాష్టప్రతులు కూడ గతంలో కొందరు ఉన్నారు! కానీ ప్రధానమంత్రితో మంత్రివర్గంతో పార్లమెంటు నిర్ణయాలతో విభేదించడం ‘వివాదాన్ని’ సృష్టించినట్టు కాజాలదు! దేశహితం ప్రాధాన్య ప్రాతిపదికగా మంత్రివర్గంతో రాష్టప్రతి విభేదించవచ్చు! ఇలా విభేదించడానికి రాజ్యాంగంలోని డెబ్బయి నాలుగవ అధికరణం వీలు కల్పిస్తోంది కూడ! దేశహితం కోరి అలా విభేదించకపోవడం వల్లనే కొందరు రాష్టప్రతులు ప్రధానమంత్రికి ‘చేతిముద్రలు’-రబ్బర్ స్టాంప్స్-అన్న ఆరోపణకు గురి అయ్యారు. కానీ వివాదాలను సృష్టించకుండా మంత్రివర్గాన్ని మంచి మార్గంలో నియంత్రించగలిగిన రాజేంద్ర ప్రసాద్ రాష్టప్రతులకు అనుసరణీయుడు! అదే మార్గంలో రామ్‌నాథ్ కోవింద్ పయనించగలడన్న విశ్వాసం విజయంతో వికసించింది!