సంపాదకీయం

స్వాతంత్య్ర ప్రస్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన భరత జాతి మళ్లీ స్వతంత్ర జాతిగా అవతరించిన తరువాత డెబ్బయి వర్షాలు గడిచా యి. వైయక్తిక జీవనంలో ఏడు దశాబ్దుల కాలం సుదీర్ఘమైనది, ఎందుకంటే ‘జీవేయ శరదశ్శతం..’- నూరేళ్లు జీవిస్తాము-అన్నది వ్యక్తిగత ఆకాంక్ష! పరిపూర్ణ జీవన కాలవ్యవధి వందేళ్లు! కానీ ఒక జాతి జీవన ప్రస్థానంలో డెబ్బయి వసంతాల సమయం మహాసముద్రంలోని చిరు కెరటంలోని సగం కంటే తక్కువ! మహా ఉదధిలో చిరుకెరటాలే కాదు, ఉవ్వెత్తున ఎగిసిపడే బృహత్ తరంగాలు అసంఖ్యాకం.. ఈ అసంఖ్యాక తరంగాలు అనాదిగా ప్రభవిస్తున్నాయి, అనంతంగా ప్రస్ఫుటిస్తుంటాయి! భరత జాతి మహా స్రోతస్విని వలె అనాదిగా ప్రవహిస్తోంది, అనంతంగా ప్రవసిస్తోంది! ఈ ప్రవాహ ప్రస్థానంలో పరాక్రమించిన మరో జాతీయ విప్లవ తరంగం బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరం! ఈ సమరం శతాబ్దుల పాటు స్వజాతి సాగించిన సంఘర్షణకు కొనసాగింపు! యుగాలుగా, మహా యుగాలుగా, మన్వంతరాలుగా, కల్పాలుగా రూపొందిన కోట్లాది సంవత్సరాల మన జాతీయ చరిత్రలో స్వాతంత్య్రం నిలబెట్టుకొనడానికి, విదేశీయ విద్రోహులు కబళించిన స్వాతంత్య్రాన్ని మళ్లీ సాధించుకొనడానికి అనేకసార్లు సంఘర్షణ జరుపవలసి వచ్చింది! ప్రస్తుత కలియుగం ప్రారంభమయి ఐదువేల నూట పద్దెనిమిది సంవత్సరాలయింది. ఈ ‘హేమలంబ’ సంవత్సరం ఐదువేల నూట పంతొమ్మిదవది! ఈ కలియుగంలో కూడ బ్రిటన్ కంటే పూర్వం మన దేశ సమగ్రతను, మన జాతీయ సమైక్యాన్ని, మన స్వాతంత్య్రాన్ని, మన సార్వభౌమ అధికారాన్ని భగ్నం చేయడానికి అనేక విదేశీయ దురాక్రమణదారులు యత్నించారు, కొందరు కృతకృత్యులయ్యారు! ఐరోపాలోని ఇతర జాతులు, తురుష్కులు, ఆరబ్బులు, హూణు లు, గ్రీకులు, శకులు వంటి విదేశాలవారు మన స్వాతంత్య్రంపై శతాబ్దులపాటు దాడులు చేసా రు! కొందరు మన స్వాతంత్య్రాన్ని కబళించారు కూడ! ఈ దురాక్రమణ పరంపరలో చివరిది బ్రిటన్‌వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బీభత్సకాండ! ఈ బీభత్సకాండకు రెండు శతాబ్దులకు పైగా బలైపోయిన భరత జాతి తొమ్మిది దశాబ్దులపాటు బ్రిటన్ దురాక్రమణ దారులను దేశం నుండి వెళ్లగొట్టడానికి సంఘర్షణ సాగించింది! క్రీస్తుశకం 1857వ సంవత్సరం మే 10న ఆరంభమైన బ్రిటన్ వ్యతిరేక సాయుధ సమరం 1940వ దశకం నాటికి పరాకాష్ఠకు చేరింది. నేతాజీ సుభాస్ చంద్రవసు-బోసు-సాగించిన స్వాతంత్య్ర సమరం ఈ పరాకాష్ఠ! మహాకవి గుఱ్ఱం జాషువా అభివర్ణించినట్టుగా నేతాజీ, తెల్లజాతివారు ‘్భయాప్తిం క్రుంగి కంగారుగాన్, ఎత్తించెన్ ఎవరెస్టు నెత్తములపై హిందూ రణ స్తంభమున్!’.. రెండవది ‘కాంగ్రెస్’ సంస్థ ఆధ్వర్యవంలో సాగిన అహింసాయుత స్వాతంత్య్ర ఉద్యమం.. మహాత్మాగాంధీ నాయకత్వం ఈ ఉద్యమ విస్తృత ప్రభావానికి విజయరూపం!
ఇలా భౌతిక రాజకీయ ఆర్థిక స్వాతంత్య్ర సాధనకు మాత్రమే కాక భావదాస్య విముక్తి కోసం దశాబ్దుల తరబడి భరత జాతి నిరంతర సంఘర్షణ సాగించవలసి వచ్చింది. ‘వందేమాతరం..’ అంటూ కలమెత్తిన బంకించంద్ర ఛటోపాధ్యాయ ‘్భరత మాత’ సనాతనమైన సర్వోన్నతమైన పరమ దేవత అన్న అనాది వాస్తవాన్ని స్వజాతీయులకు గుర్తు చేయడం ఈ సాంస్కృతిక స్వాతంత్య్ర సమరంలో భాగం! రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి, వివేకానంద స్వామి, లోకమాన్య బాలగంగాధర తిలక్ వంటి మహనీయుల పరంపర, ‘ఆర్య సమాజం’, ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ వంటి సంస్థలు ఈ సాంస్కృతిక భావజాగృతికి దోహదం చేయడం చరిత్ర! మాతృభూమి పట్ల, మాతృ సంస్కృతి పట్ల మమకారం ప్రాతిపదికగా అనాదిగా వికసించిన ఈ జాతీయ నందనవనాన్ని అడవి పందులవలె, తోడేళ్ల వలె చొరబడి శతాబ్దుల పాటు నష్టభ్రష్టం చేసిన విదేశీయ విద్రోహులు చివరికి నిష్క్రమించవలసి రావడం స్వాతంత్య్ర స్వప్నానికి సాకారం! క్రీస్తుశకం 1947 ఆగస్టు 15వ తే దీన ఈ సుందర స్వప్నం సుమధుర వాస్తవంగా ఉదయించింది! స్వాతంత్య్ర సిద్ధితోపాటు అఖండ భారత భూమి ముక్కలు కావడం విదేశీయుల దురాక్రమణ ఫలితంగా సిద్ధించిన భయంకర వారసత్వం! బ్రిటన్ తదితర విదేశీయుల దురాక్రమణకు పూర్వం నాటి అఖండ భారత్‌లో దాదాపు సగం మాత్రమే 1947 ఆగస్టు 15వ తేదీనాడు ‘అవశేష భారత్’గా స్వతంత్ర దేశమైంది! బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, అఫ్ఘానిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్ వంటి దేశాలు 1947 ఆగస్టునకు పూర్వమే మన దేశం నుండి విడిపోయాయి! 1947 ఆగస్టు 15 నాటికి పాకిస్తాన్ విడిపోయింది.. స్వాతంత్య్రం సిద్ధించడం, మన ప్రాదేశిక స మగ్రత భగ్నం కావడం సమాంతర పరిణామాలు! ప్రాదేశిక సమగ్రత భంగపడడం వల్లనే మన దేశానికి పొరుగు దేశాల దురాక్రమణ ప్రమాదం కొనసాగుతోంది.. ఈ ప్ర మాదం మన ప్రగతిని నిలదీస్తుండడం నడుస్తున్న చరిత్ర..
సుగతిని, ప్రగతిని సాధించడమే కాదు ప్రగతి ఫలాలను, సుగతికి దోహదం చేసే సంస్కారాలను ప్రపంచానికి పంచిపెట్టడం భారత జాతిలో అనాదిగా నిహితమై ఉన్న స్వభావం! ఈ స్వభావం కారణంగానే మన దేశంలో సర్వమత సమభావ వ్యవస్థ, సర్వ వైవిధ్య సమభావ వ్యవస్థ అనాదిగా పరిఢవిల్లుతోంది! ఆరబ్బులు మొదలు ఆంగ్లేయుల వరకూ గల విదేశీయ మూకలు శతాబ్దుల తరబడి భగ్నం చేయ ప్రయత్నించినప్పటికీ ఈ వ్యవస్థ భగ్నం కాలేదు, 1947 తరువాత మరింత బలపడింది! స్వతంత్ర భారతదేశం సాధించిన వి జయం ఇది! ప్రజాస్వామ్య రా జ్యాంగ వ్యవస్థ పాదుకొనడం మాత్రమే కాదు, పరిణతి చెం దడం ఏడుపదుల వసంతాల స్వాతంత్య్ర విజయ చరిత్ర! ఒ కప్పుడు మనదేశం ప్రపంచానికి నడవడిని దిద్దింది, విశ్వగురువుగా వినుతికెక్కిం ది! విదేశీయ దురాక్రమణ సమయం లో మోడువారిన ఈ విశ్వవిహిత సంస్కార సువనం మళ్లీ వికసిస్తుండడం స్వతంత్ర భారత విజయ ప్రస్థానం! భారతదేశపు ‘యోగం’ ప్రపంచాన్ని ఉత్తమ మానవీయ సంస్కారంతో ప్రభావితం చేస్తోంది! అంతర్జాతీయ యోగ దినోత్సవం స్వతంత్ర భారత ప్రభావం.. 1947 నాటికి మన దేశం ఆర్థికంగా దివాలా తీసింది. శతాబ్దులపాటు ఈ మట్టి పట్ల, ఈ మాతృభూమి పట్ల మమకారం లేని విదేశీయులు ఈ ‘రత్నగర్భ’ను కొల్లగొట్టి సకల సంపదలను తమ దేశాలకు తరలించిన ఫలితం ఇది! కానీ స్వతంత్ర భారతం మళ్లీ స్వయం సమృద్ధమైంది. 1960వ దశకం వరకు ‘పాలపిండి’ కోసం, ముక్కిపోయిన గోధుమల కోసం విదేశాల వద్ద బిచ్చమెత్తిన దేశం ఇప్పుడు సకల విధ ఆహార ధాన్యాలను, వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది! మహాకవి కరుణశ్రీ అన్నట్టు ఒకప్పుడు ప్రపంచానికి ‘బిచ్చము పెట్టెరా భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్..’ విదేశీయ తస్కర మూకలు 1947 వరకు చెరిచిన ఈ చరిత్ర మళ్లీ పూర్వ శుభ స్వభావాన్ని సంతరించుకుంటోంది..
అణ్వస్త్ర శక్తిగా అవతరించిన భారత్ దురాక్రమణ శక్తుల నుండి ప్రపంచానికి రక్షణ కవచం, సొంత సరిహద్దులను పటిష్ఠం చేయగలుగుతున్న సమగ్ర వ్యూహం, భా రత జాతీయ వౌలిక అస్తిత్వ గరిమను ప్రపంచం మళ్లీ ప రిగణిస్తోంది, గౌరవిస్తోంది.. స్వతంత్ర భారత ‘స్వయమేయ మృగేంద్రతా’ స్ఫూర్తితో త్రివిక్రమ ప్రభలను పంచిపెడుతోంది! మన విజయ పతాకం అంతరిక్షానికి ఎగసింది, భూమి చుట్టూ పరిక్రమిస్తున్న ఉపగ్రహాలు ఈ పతాకానికి ప్రతీకలు..