సంపాదకీయం

అనైక్య జనతాదళ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ ప్రజాస్వామ్య సంఘటన-నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్-ఎన్‌డిఏ-లో ‘ఐక్య జనతాదళ్’-జనతాదళ్ యునైటెడ్-‘ఐజద’-పునఃప్రవేశించడం నకిలీ ‘సర్వమత సమభావ’ వాదులకు మరో చెంపపెట్టు! ‘సంయుక్త సంస్కృతి’ ప్రచారకులకు బిహార్‌లో మరో ఎదురు దెబ్బ తగలడం శనివారం నాటి పరిణామం! బిహార్ ముఖ్యమంత్రి నాయకత్వంలో శనివారం పాట్నాలో జరిగిన ‘ఐజద’ సమావేశంలో జరిగిన నిర్ణయం కేవలం లాంఛనమైనప్పటికీ, సమావేశంలో తీర్మానించడంలో ఈ రాజకీయపక్షం ‘ఎన్‌డిఏ’లో ఆధికారికంగా భాగస్వామి అవుతోంది. అందువల్ల కేంద్ర మంత్రివర్గంలో నితీశ్‌కుమార్ మద్దతుదారులకు ప్రవేశం లభించడం ఖాయమన్నది మొదలైన ప్రచారం! ఈ ప్రచారం నితీశ్‌కుమార్ అమలు జరుపుతున్న వ్యూహంలో భాగం! ఇలా ప్రచారం జరిపించడం ద్వారా పార్టీలోని ‘అసంతుష్టుల’ను మచ్చిక చేసుకోవడం నితీశ్ వ్యూహం. ‘ఐజద’ భారతీయ పార్టీతో జట్టు కడుతున్నందుకు ‘నిరసన’గా తిరుగుబాటు బావుటా ఎగురవేసి ‘సమాంతర సమావేశా’లను నిర్వహిస్తున్న శరద్ యాదవ్ నాయకత్వంలోని వర్గం బలం పెరగకుండ నిరోధించడం ఈ ప్రచారానికి కారణం! నితీశ్‌కుమార్ వ్యూహంలోని మొదటి ఎత్తుగడ ఇది. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి ప్రాతినిధ్యం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా కోరడం ఈ ‘ప్రచారం’లోని రెండవ ఎత్తుగడ... శనివారంనాటి ‘ఐజద’ సమావేశం జరుగుతున్న సమయంలోనే ‘ఐజద’లోని శరద్ యాదవ్ వర్గంవారు జరిపిన సమాంతర ‘సభ’ నిరసన విన్యాసాలు ‘ఐక్య జనతాదళ్’ను ‘అనైక్య జనతాదళ్’గా మార్చివేయడం కుతూహలగ్రస్తులను సరికొత్త ‘ఉత్కంఠ’కు గురిచేస్తోంది! 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నితీశ్‌కుమార్ ‘పార్టీ’ ఎన్‌డిఏ నుండి నిష్క్రమించింది. ఇప్పుడు మళ్లీ ఈ పార్టీ ‘ఎన్‌డిఏ’లో చేరిపోవడం చారిత్రక పునరావృత్తికి మరో రాజకీయ సాక్ష్యం. నితీశ్‌కుమార్ అవకాశ వాదానికి మరో నిదర్శనం! 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘్భజపా’ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థి పదవికి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయానికి ‘నిరసన’గా నితీశ్‌కుమార్ ‘ఎన్‌డిఏ’తో తెగతెంపులు చేసుకున్నాడు. అప్పుడు ఇలా తెగతెంపులు చేసుకోవడం ‘ఐజద’ పార్టీ అధ్యక్షుడుగా ఉండిన శరద్ యాదవ్‌కు పెద్దగా ఇష్టంలేదు! అయినప్పటికీ అప్పుడు నితీశ్ కుమార్ మాట నెగ్గింది. ఇప్పుడు ‘్భజపా’తో మళ్లీ జట్టు కట్టడం శరద్ యాదవ్‌కు ఇష్టంలేదు. అయినప్పటికీ నితీశ్‌కుమార్ మాట ఇప్పుడు కూడ నెగ్గింది.. ఐక్య జనతాదళ్ అనైక్య జనతాదళ్‌గా మారింది!
నితీశ్‌కుమార్‌కు కాని, శరద్ యాదవ్‌కు కాని ఎలాంటి సైద్ధాంతిక నిష్ట లేదన్నది చరిత్ర ధ్రువపరిచిన నిరాకరింపజాలని నిజం! కేవలం అవకాశ వాదం ప్రాతిపదికగా ఈ ఉభయులు ‘సిద్ధాంత నిష్ఠ’ను నటిస్తుండడం బిహార్ రాజకీయ చరిత్ర! రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ ‘అవినీతి’, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రసిద్ధం... నితీశ్‌కుమార్ అవకాశ వాదానికి ఇంతటి ప్రచారం కలుగకపోవడం రాజకీయ విచిత్రం! 2014నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు నితీశ్‌కుమార్ ఎందుకని ‘్భజపా’తో తెగతెంపులు చేసుకున్నాడు? అవకాశవాదం మాటున నక్కిన నకిలీ ‘మత సమభావం’ దీనికి సమాధానం. నితీశ్‌కుమార్ గత నెల 26న లాలుప్రసాద్ యాదవ్‌తో ఎందుకు తెగతెంపులు చేసుకోగలిగాడు? ‘నైతిక నిష్ఠ’ ముసుగును వేసుకున్న ‘అవకాశవాదం’ దీనికి సమాధానం! 2014 నాటి లోక్‌సభ ఎన్నికల పూర్వం నితీశ్‌కుమార్ అభినయించిన ‘సర్వమత సమభావ’-సెక్యులర్-విశ్వాసాలకు, ఇప్పడు నటిస్తున్న ‘నైతిక నిష్ఠ’కు ప్రాతిపదిక అవకాశవాదం మాత్రమేనన్నది ‘్భజపా’ వారు గ్రహించని పాఠం, జనం తెలుసుకోదగిన వాస్తవం!! 2014వ సంవత్సరానికి పూర్వం ‘్భజపా’తో జట్టుకట్టి ఉండిన సమయంలో నరేంద్ర మోదీ పట్ల మాత్రం నితీశ్‌కుమార్ వ్యతిరేకత విడనాడలేదు. నరేంద్ర మోదీ కూర్చునే ‘ఎన్‌డిఏ’ వేదికలమీద తాను కూర్చోబోనని కూడ నితీశ్‌కుమార్ ప్రచారం చేసుకున్న రోజులున్నాయి! ఎన్‌డిఏ తరఫున తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న విచిత్రమైన కోరికను కూడ 2014వ సంవత్సరానికి పూర్వం నితీశ్‌కుమార్ ఆవిష్కరించి ప్రచారం చేసుకున్నాడు. ‘నరేంద్ర మోదీ మతతత్వ వాది’ అన్నది నితీశ్ బృందం చేసిన ప్రచారం. నరేంద్రమోదీ జాతీయతా నిష్ఠ కల, జనం మెచ్చిన నాయకుడని 2014 నాటి ఎన్నికలలో ఋజువైంది... నితీశ్‌కుమార్ పార్టీ 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో బిహార్‌లో ఘోర పరాజయం పాలైంది.
అప్పటికీ ఇప్పటికీ ‘్భజపా’ విధానం మారలేదు, నరేంద్ర మోదీ సిద్ధాంత స్వభావం మారలేదు! ఊసరవెల్లివలె నితీశ్‌కుమార్ మాత్రం రంగులు మార్చాడు. ఇప్పుడు ఆయనకు ప్రధాన అంశం అవినీతిపై పోరాటం! కానీ లాలు ప్రసాద్ తనయుడు ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ‘అవినీతి’ని ఎందుకు వ్యతిరేకించాడు? బిహార్‌లో తన ప్రభుత్వానికి లాలుప్రసాద్ యాదవ్ పార్టీ మద్దతు లేకపోయినప్పటికీ ‘్భజపా’ మద్దతుతో తాను అధికారంలో కొనసాగగలనన్న విశ్వాసం కుదిరింది కనుక! ఒకవేళ ‘్భజపా‘ మద్దతు తనకు లభించి ఉండకపోయినట్టయితే లాలు యాదవ్‌తో తెగతెంపులకు నితీశ్‌కుమార్ తెగించి ఉండేవాడా? అవినీతి ఆరోపణలకు గురి అవుతున్న తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించాడు, నితీశ్‌కుమార్ ఆయనను మంత్రివర్గం ఎందుకు తొలగించలేదు? ఎందుకని శాసనసభలో తన ‘మెజారిటీ’ నిరూపించుకోవడానికి సిద్ధపడలేదు? ఎందుకంటే దాదాపు ఇరవై రోజుల పాటు ఆయనకు భాజపా మద్దతుపై విశ్వాసం కుదరలేదు, భాజపా వారు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోయినట్టయితే నితీశ్‌కుమార్‌కు ‘అవినీతి’ వ్యతిరేక నిష్ఠ బహుశా కలిగి ఉండేది కాదు. లాలు ప్రసాద్‌ను అవినీతిపరుడని న్యాయస్థానాలు నిర్ధారించిన తరువాతనే నితీశ్‌కుమార్ ఆయనతో పొత్తుపెట్టుకున్నాడు, శాసనసభ ఎన్నికలలో గెలిచాడు! ఇప్పడు ‘్భజపా’ను వ్యతిరేకిస్తున్న ‘సంయుక్త సంస్కృతి-కాంపోజిట్ కల్చర్-ను రక్షించాలని ఆర్భాటం చేస్తున్న శరద్ యాదవ్ గతంలో ‘్భజపా’ను ప్రశంసించిన వాడే! ఎన్‌డిఏలో తమ పార్టీ గతంలో భాగస్వామిగా ఉండినప్పుడు శరద్ యాదవ్‌కు, అధికార పదవులను అనుభవించిన శరద్‌యాదవ్‌కు ‘కాంపోజిట్ కల్చర్’ గుర్తుకు రాలేదు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా చెలామణి అవుతున్న రాజకీయ విదూషకుడు రాహుల్‌గాంధీతో కలిసి శరద్‌పవార్ ఈ ‘కాంపోజిట్ కల్చర్’ సంయుక్త సంస్కృతిని రక్షిస్తాడట! మనదేశంలో అనాదిగా అనేక వైవిధ్యాలున్నాయి, వివిధ భాషలు, ప్రాంతాలు, వివిధ మతాలు, సంప్రదాయాలు.. ఇంకా అసంఖ్యాక వైవిధ్యాలున్నాయి! కానీ ‘సంస్కృతి’ మాత్రం ఒక్కటే, జాతీయత ఒక్కటే! ఈ అద్వితీయ సంస్కృతిని బ్రిటన్ దొరలు మతంగా చిత్రీకరించారు, అద్వితీయ సంస్కృతి స్థానంలో ‘సంయుక్త సంస్కృతి’ని ప్రవేశపెట్టారు. ఈ తథాకథిత-సోకాల్డ్- సంయుక్త సంస్కృతి నిజానికి భావదాస్యంతో కల్తీ అయిన సంకర సంస్కృతి. ఈ సంకర సంస్కృతిని రక్షించడానికి కంకణం కట్టుకున్నవారు ఆంగ్లేయుల మానసపుత్రులు...బిహార్ రాజకీయం తాత్కాలికమైనది. ‘సంకర సంస్కృతి’ని ప్రచారం చేస్తున్న వారి విష ప్రభావం దీర్ఘకాలికమైనది..