సంపాదకీయం

‘అటవీ’ అవినీతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్ - అన్న నానుడి ఆ ‘అమ్మ’కు కూడా వర్తిస్తుంది. అధికారం కోల్పోయిన తరువాత మూడేండ్లు గడిచిపోయాయి. ఇన్నాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకురాలు జయంతీ నటరాజన్‌కు వ్యతిరేకంగా ‘కేంద్ర నేర పరిశోధక మండలి’ వారు ‘అవినీతి ఆరోపణ’ను నమోదు చేశారు. మదరాసులోని జయంతీ నటరాజన్ గృహప్రాంగణంలో శనివారం ‘కేంద్ర నేర పరిశోధక మండలి’ - సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్-సిబిఐ-వారు గాలింపు చర్యలు కూడ చేపట్టడం అవినీతి వ్యతిరేక న్యాయప్రక్రియలో భాగం. మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిన సమయంలో ‘పర్యావరణ, అటవీ పరిరక్షణ’ శాఖ మంత్రిగా ఉండిన జయంతీ నటరాజన్ అవినీతికి పాల్పడిందన్నది అభియోగం. ఝార్‌ఖండ్ ప్రాంతంలోని నూట నలబయి ఒక్క ఎకరాల- దాదాపు యాబయి ఆరు హెక్టారుల - అటవీ భూమిని 2011లో ఒక ప్రభుత్వేతర వాణిజ్య సంస్థకు అక్రమంగా కట్టబెట్టిందన్నది ఆమెపై సి.బి.ఐ. నమోదు చేసిన అభియోగం! హరిత పరిరక్షణ నియమాలకు విరుద్ధంగా అటవీభూమిని పారిశ్రామిక కలాపాల కోసం అక్రమంగా కేటాయించడం వల్ల పర్యావరణం గాయపడుతుండడం దశాబ్దులుగా జరుగుతున్న వైపరీత్యం. అయితే జయంతీ నటరాజన్ ‘ప్రతీక’ మాత్రమే! అటవీ భూములను, వ్యవసాయ భూములను పారిశ్రామిక కలాపాల కోసం కేటాయిస్తున్న ప్రభుత్వ విధానమే దశాబ్దుల తరబడి అవినీతిగ్రస్తమై ఉంది! హరిత నియమాలను పదేపదే సడలించడం ద్వారా 2004- 2014వ సంత్సరాల మధ్య మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ ‘అవినీతి’ని శాసనబద్ధంగా వ్యవస్థీకరించి వెళ్లింది. ఇలా వ్యవస్థీకరించడం ప్రపంచీకరణలో భాగం. ప్రపంచీకరణ వ్యవస్థీకృతం అయిన తరువాత ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ విదేశాల నుంచి దేశంలోకి చొరబడిపోవడం హరిత హననానికి దారితీసింది! ‘పచ్చ’దనానికి ‘ప్రపంచీకరణ’ గొడ్డలిపెట్టుగా మారి ఉండడం అసలు సమస్య! కృత్రిమ ప్రగతిని కొలువుతీర్చుతున్న పారిశ్రామిక కేంద్రీకరణ ఈ గొడ్డలి! ఈ గొడ్డళ్లు దేశమంతటా పచ్చని చెట్లను నరికివేస్తూండడం కొనసాగుతున్న దృశ్యం. అడవులు, వ్యవసాయం నష్టంకాని రీతిలో పరిశ్రమలను వికేంద్రీకృతం చేయడం అనాదిగా భారతీయ పద్ధతి! పరిశ్రమలను ఒకేచోట కేంద్రీకరించడం పాశ్చాత్య దురాక్రమణదారులు మన నెత్తికెత్తిపోయిన వాణిజ్య వారసత్వం. ఈ భూమిపై, భరత భూమిపై మమకారం లేని పాశ్చాత్యులు ఇతర విదేశీయలు ఈ ‘కేంద్రీకృత పారిశ్రామిక’ విధానం ద్వారా భూమిని గాయపరిచారు, పర్యావరణానికి కన్నాలు పెట్టారు, ప్రకృతిని పాడు చేశారు. పచ్చదనాన్ని పారద్రోలారు! ‘ప్రపంచీకరణ’ పాశ్చాత్యుల ఈ దౌష్ట్యానికి నికి కొనసాగింపు..
అందువల్ల భారతీయతకు ప్రపంచీకరణకు మధ్య కొనసాగుతున్న సంఘర్షణ అసలు సమస్య! మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం ‘ప్రపంచీకరణ’ కోసం భారతీయ పారిశ్రామిక పద్ధతులను బలిపెట్టింది! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు లక్షల ఎకరాల అటవీ భూమిని, వ్యవసాయ భూమిని కట్టబెట్టింది! జయంతీ నటరాజన్ 2011లో అప్పగించిన ఈ నూట నలబయి ఒక్క ఎకరాల భూమి ఈ విస్తృత పరిత హననంలో భాగం మాత్రమే! ప్రత్యేక ఆర్థిక మండలుల- స్పెషల్ ఎకనామిక్ జోన్స్- చట్టం అమలులోకి వచ్చిన తరువాత అడవుల విధ్వంసం వేగవంతమైంది. వ్యవసాయ భూములలోని తమలపాకుల తోటలను తెగనరికారు. వరిపొలాలను రైతుల కళ్ల ఎదుటే దగ్ధం చేశారు! మహారాష్టల్రోని పడమటి కనుమలకు ‘లావాసా’ వంటి సంస్థ, తూరుపుకనుమలలోని మహేంద్రగిరి, నియాంగిరి సీమలకు ‘పోస్కో’ వంటి సంస్థలు తూట్లు పొడవడం చరిత్ర! ఈ అటవీ హననం కారణంగా కొండవాగులు ఎండిపోయాయి. వన్యమృగాలు పారిపోయాయి. వనవాసీ ప్రజలు తమ ఆవాసాలను వదలి ఇతర ప్రాంతాలకు తరలిపోవలసిన దుస్థితి ఏర్పడింది!
జయరామ్ రమేశ్ అటవీ, పర్యావరణ మంత్రిగా ఉన్నన్నినాళ్లు హరిత నియమాలకు విరుద్ధంగా అటవీభూమిని, వ్యవసాయ భూమిని ప్రత్యేక ఆర్థిక మండలులకు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు కేటాయించడాన్ని అడ్డుకున్నట్లు ప్రచారమైంది. ఆయనను ఈ మంత్రిత్వశాఖ నుంచి తప్పించాలని ‘బహుళ జాతీయ సంస్థల’ వారు మన్‌మోహన్ సింగ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు కూడ ప్రచారమైంది! ఇలా ఒత్తిడి తేవడం ఆశ్చర్యం కాదు! ‘ప్రపంచీకరణ’ మొదలైన మొదటి దశాబ్దిలో ‘బహుళజాతి వాణిజ్య సంస్థల’ యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం చరిత్ర. కాని ‘ప్రపంచీకరణ’, ‘స్వేచ్ఛావిపణి’ - మార్కెట్ ఎకానమీ - ముదిరిన తరువాత వాణిజ్య పారిశ్రామిక రంగం రాజకీయ రంగంలో ఏకత్వాన్ని సాధించింది. బహుళ జాతీయ వాణిజ్య వేత్తలు ప్రభుత్వ విధానాలకు తెరవెనుక ‘రూపకర్తలు’గా మారారు! ఈ రాజకీయ వాణిజ్య అనుసంధానం కారణంగానే దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు వ్యవసాయ అటవీ భూములను బహుళ జాతీయ సంస్థలకు అప్పగించే విధానాన్ని బలపరిచాయి, బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘‘హరిత నియమాల - గ్రీన్‌రూల్స్ - ను అతిగా పాటించడం వల్ల ప్రగతి స్తంభించి పోతుందని’’ అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ 2011 ఫిబ్రవరి మూడవ తేదీన ఢిల్లీలో జరిగిన ‘‘సడలని ప్రగతి’’ - సస్టయినబుల్ డెవలప్‌మెంట్ - సదస్సులో చారిత్రక ప్రకటన చేశారు. ఆ తరువాత 2011 జూలై 12వ తేదీన మన్‌మోహన్‌సింగ్, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా, జయరామ్ రమేశ్‌ను పర్యావరణ, అటవీ పరిరక్షణ శాఖ నుంచి తప్పించారు. జయంతీ నటరాజన్ స్వతంత్ర హోదాగల సహాయమంత్రిగా పర్యావరణ, అటవీ పరిరక్షణ శాఖను స్వీకరించింది.
అప్పటినుంచి వివిధ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు విరివిగా అనుమతులను ఇవ్వడం, అటవీ భూమిని, వ్యవసాయ భూమిని పారిశ్రామిక ప్రాంగణాల ఏర్పాటు కోసం కేటాయించడం వంటి ఆధికారిక కలాపాలు వేగవంతమయ్యాయి! ఇదంతా ప్రపంచీకరణ పేరుతో శాసనబద్ధమైపోయిన విస్తృత అవినీతిలో భాగం! అందువల్ల ఈ యాబయి ఆరు హెక్టారుల అటవీ భూమిని పారిశ్రామిక కలాపాలకు కేటాయించడంలో అవినీతి జరిగి ఉంటే, ‘నాటకంలో అంతర్నాటకం’వలె అది విస్తృత అవినీతిలోని ఒక భాగం! విస్తృత అవినీతి వ్యవస్థ ప్రపంచీకరణ! జయంతీ నటరాజన్ ‘‘అవినీతి’’ మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వ విధానానికి ‘ప్రతీక’ మాత్రమే! మన్‌మోహన్‌సింగ్ కాంగ్రెస్ అధిష్ఠానం నడిపించిన పాత్రధారి.. సూత్రధారి కాంగ్రెస్ అధిష్ఠానం.