సబ్ ఫీచర్

సిలబస్‌ను మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యా రంగాన్ని యుద్ధ ప్రాతిపదికన సరిచేయకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుంది. ప్రాధమిక పాఠశాలనుండి విశ్వ విద్యాలయాల వరకు విషబీజాలు నాటే చదువును చెప్తున్నారు. సామాజిక శాస్త్రాలు, చరిత్రను జిహాద్, మతమార్పిడి, ఎర్ర విప్లవ వాదుల రచనలు, బోధన, నిర్వహణలో ఆరు దశాబ్దాలుగా నేర్పుతున్నారు. ఫలితంగా నేడు సెంట్రల్ యూనిర్సిటీలు దేశ ధర్మ విద్రోహులకు నిలయాలుగా మారాయి. సినిమా, సాంస్కృతిక మీడియా రంగాల్లో ఈ సూడో అభ్యుదయ వాదుల పెత్తనం నిరాఘాటంగా సాగుతున్నది.
తమిళనాడులో జాతీయ జెండా, జాతీయ గీతాలు విషయంలో ఎంత వివక్ష, నిర్లక్ష్యం ఉన్నాయో ఇంచుమించు ఆంధ్రప్రదేశ్‌లో కూడ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవే పోకలు గమనించవచ్చు. అలెక్స్ జార్జి, ఏకలవ్య సంస్థ తయారుచేసిన సిలబస్ 2011 నుండి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యను అథఃపాతాళానికి తోసేసింది. కొత్త ప్రభుత్వానికి సిలబస్‌ను, పరీక్షా పత్రాలను పరిశీలించే ఓపిక, తీరిక లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో కళ్లు తెరిచింది. పాఠశాలలు ఈ సిలబస్ పుణ్యమా అని ఖాళీ అవుతున్నాయి. యుటిఎఫ్ వంటి వామపక్ష సంఘాలు తమ భావాలున్న వారిని ఎస్‌సిఇఆర్‌టి, డైట్ కళాశాలలు, పరీక్షా విభాగాల్లో నింపుతున్నాయ. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వామపక్షీయుల కబంధ హస్తాల్లోనే కొనసాగుతోంది.. బహుశా అధికార పక్షంతో లోపాయికారీ సంబంధాలు ఒప్పందాలు ఉన్నాయన్నది నిర్వివాదాంశం. మీరు ఒక పాఠశాలను, హాస్టల్‌ను పరిశీలించండి. అక్కడ బైబిల్, మార్క్స్ బోధనల సూక్తులే వుంటాయి. మదర్ థెరిస్సా, గాంధీ మినహా మరే జాతీయ వీరుల చిత్రపటాలు వుండవు. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అశ్లీల అభ్యుదయ వీరుల రచనలే. అశ్లీలత నుండి చిన్నగా దేహద్రోహం వైపు అత్యంత నైపుణ్యంతో నడిపించే సిద్ధాంతకర్తలు విద్యారంగాన్ని గుప్పిట్లో వుంచుకున్నారు. రాజకీయ నిర్ణయంతో రూపుమాపవలసిన ఈ దురాగతాలను ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. వేల కొలదీ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉధ్యోగులు, ఉఫాధ్యాయులు యథేచ్చగా నినాదాలు, వ్యతిరేక ప్రకటనలు, ధర్నాలు, ర్యాలీలు చేయడం, ధనం దండుకోవడం, బ్లాక్ మెయిలింగ్ ఉద్యమాలకు పిలుపునివ్వడం వంటివి చేసే సంఘాలకు మంత్రులు మద్దతివ్వడం, పరోక్షంగా సహకరించడం ప్రభుత్వ డొల్లతనాన్ని సూచిస్తున్నాయి.
ఎర్రజెండా పట్టుకుని ఎపి ఎన్జీవోలు ఉపాధ్యాయులు నిర్వహించే సభలకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు వెళ్లడం, వారికి అనుకూలంగా మాట్లాడడం ఏమిటోమరి! జనవిజ్ఞాన వేదిక నుండి రకరకాల వామపక్ష మారీచ సంఘాలు మారుపేర్లతో చేస్తున్న హడావుడి వెనుక అధికార ప్రతిపక్ష నేతలు అండదండలు పుష్కలంగా వున్నాయి. వారి చీలిక రాజకీయంనుండి బాగా లబ్దిపొందుతున్నారు. ఒక్క శాతం ఓట్లు, కనీసం ఎన్నికైన ఎమ్మెల్యే లేకుండా ఇంత పెద్ద గొంతుతో మాట్లాడతగునా అనే ఇంగితం కూడా లేదు వారికి. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో జరిగే కార్యక్రమాలకు లక్షలాది రూపాయల జీతం తీసుకునే ప్రోఫెసర్ల అండదండలు అందించినట్టే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కృత్రిమ నిరసనలు, మత ప్రచార, మార్పిడులు పాక్ చైనా అనుకూల ప్రచారాల వెనుక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు లెక్చరర్లు, ప్రొఫెసర్లు అంచెలంచెలుగా నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాలు వీరికి కనీస హెచ్చరికలు కూడా చేయలేకపోతున్నాయి. చివరికి దేవాదాయ శాఖ ఉద్యోగ సంఘం వామపక్ష ఎర్రజెండా సంఘమే. ఈ తరహా పైత్యం వక్ఫ్, చర్చి నిర్వహణలో కనపడదు. దీనికంతటికీ పునాది మనది సెక్యులర్ దేశమని, హిందువులు మినహా మిగతావారందరికీ ప్రత్యేక హక్కులు, హోదా ఉంటాయని, భారత్‌ను ముక్కలు చేయడం పవిత్ర కార్యమని, దేశభక్తులు జాతీయ వాదం, ధర్మం, ప్రాచీన సంస్కృతి ఇలాంటివన్నీ ద్వేషించదగినవని వీరు నేర్చుకున్న, నేర్పుతున్న విద్యయొక్క సారాంశంగా ఉంది. అందుకని తక్షణమే పాఠ్యాంశాలను పరిశీలించడానికి నిపుణులను నియమించాలి. వచ్చే విద్యాసంవత్సరంనుండైనా మంచి విలువలున్న సిలబస్‌ను విద్యార్థి లోకానికి అందించాలని ప్రభుత్వ అధినేతలకు మనవి. చాలా సమస్యలకు మంచి విద్యావిధానం పరిష్కారమని పాలకులు గ్రహించాలి. ఆచరణలో చూపించాలి. ఒక్క దేశభక్తి గీతం కూడా పాడలేని విద్యార్థులు దేనికి సంకేతం?

-పి.రాజేశ్వరరావు