సంపాదకీయం

ప్రతిఘటనకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జపాన్ దేశాల మధ్య నెలకొని ఉన్న సాంస్కృతిక సమానత్వం, రక్షణ వ్యూహాత్మక బంధంగా వికసిస్తోంది! జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే మన దేశంలో పర్యటించిన సందర్భంగా ప్రస్ఫుటించిన పరిణామం ఇది! పాకిస్తాన్ ప్రభుత్వ దళాలు జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీనరేఖ’ - లైన్ ఆఫ్ కంట్రోల్ - ఎల్‌ఓసి-ని అతిక్రమించి కవ్వింపుకాల్పులను జరపడం ఆపడం లేదు. శుక్రవారం జరిపిన ఈ దొంగచాటు కవ్వింపుకాల్పుల ఫలితంగా మన సైనికుడు ఒకరు అమరుడయ్యాడు. మన ప్రతిఘటన కొనసాగుతుండడం మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి షింజో అబే విడుదల చేసిన సంయుక్త ప్రకటనకు వ్యూహాత్మక నేపథ్యం.. ఇలా కవ్వింపుకాల్పులు జరపడం పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రచ్ఛన్న బీభత్సకాండ! ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘జాయిష్ ఏ మొహమ్మద్’ వంటి ‘జిహాదీ’ తోడేళ్లను మనదేశంపైకి ఉసిగొల్పడం పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ప్రత్యక్ష బీభత్సకాండ! గుజరాత్‌లోని అహమ్మదాబాద్ సమీపంలోని సబర్మతి ఆశ్రమ ప్రాంగణంలోను, గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోను మోదీ, అబే జరిపిన చర్చలకు ఉగ్రవాదాన్ని ప్రతిఘటించడం ప్రధాన ఇతివృత్తం కావడం భారత జపాన్‌ల వ్యూహాత్మక మైత్రి విస్తరిస్తోందనడానికి నిదర్శనం! పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది, చైనా పాకిస్తాన్‌ను ఉసిగొల్పతోంది. పాకిస్తాన్, చైనాలు గతంలో ఉత్తర కొరియాను ఉసిగొల్పాయి, ప్రస్తుతం ఉసిగొల్పుతున్నాయి! పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశాన్ని కవ్విస్తున్నట్టుగానే ఉత్తర కొరియా అణ్వస్త్ర పాటవ పరీక్షలతో జపాన్‌ను కవ్విసోంది! షింజో అబే మన దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే ఉత్తర కొరియా జపాన్ మీదుగా దూర లక్ష్య ఛేదక క్షిపణులను ప్రయోగించింది! శుక్రవారం కూడ ఒక ‘క్షిపణి’ జపాన్ మీదుగా దూసుకొనిపోవడం ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు నిదర్శనం! పాకిస్తాన్‌ను మనదేశంపైకి ఉసిగొల్పుతున్న చైనా ఉత్తర కొరియాను జపాన్ మీదికి ఉసిగొల్పుతుండడం తూర్పు ఆసియాను ‘సమర ప్రాంగణం’ చేస్తున్న పరిణామం! మనదేశం వలెనే జపాన్ పరిణతి చెందిన ప్రజాస్వామ్య సమాజం.. ఉత్తర కొరియాలో అరాజకమైన నియంతృత్వ వ్యవస్థ నెలకొని ఉంది. పాకిస్తాన్‌లో ‘సైనికుల చేత, సైనికుల కొరకు సైనికస్వామ్యం’ అదుపాజ్ఞలలో నకిలీ ప్రజాస్వామ్యం నర్తిస్తోంది. చైనాను క్రీస్తుశకం 1949 నుంచి ‘పాలిస్తున్న’ కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వం గత ఇరవై ఏళ్లుగా ‘కాపటలిస్టు’ నియంతృత్వంగా రూపాంతరం చెందింది. హిందూ మహాసాగరం నుంచి ప్రశాంత సముద్రం వరకు విస్తరించి ఉన్న ఆసియా ప్రాంతం కొల్లోలితం అవుతుండడానికి చైనా నియంతల వ్యూహాత్మక దురాక్రమణ కారణం! ఈ వ్యూహాత్మక దురాక్రమణకు భారత జపాన్‌ల మైత్రి ప్రతిఘటన వ్యూహం.. షింజో అబే పర్యటన సందర్భంగా ఈ ప్రతిఘటనాత్మక వ్యూహం మరింతగా బలపడింది..!
ముంబయి నుంచి అహమ్మదాబాద్ వరకు ఐదువందల ఆరు కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్న బుల్లెట్ రైలు మార్గానికి ఉభయ దేశాల ప్రధాన మంత్రులు శంకుస్థాపన చేయడం షింజో అబే పర్యటన వల్ల సంభవించిన ప్రధాన ఆర్థిక పరిణామం. 2022 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ రైలు ప్రారంభం కానున్నదట! బ్రిటన్ దాస్య విముక్త భారతదేశం 2022లో స్వాతంత్య్ర వజ్రోత్సవాల - డెబ్బయి ఐదేళ్ల ఉత్సవాలు-ను జరుపుకోనుంది! భారత స్వాతంత్య్ర సమరంలో జపాన్ చరిత్ర ముడివడి ఉండడం ఈ రైలుమార్గం ద్వారా మరోసారి స్ఫురిస్తోంది! అండమాన్ దీవులను, ఈశాన్య ప్రాంతాలను బ్రిటన్ దురాక్రమణ నుండి 1943లో విముక్తి చేయగలగిన స్వతంత్ర భారత సమర సారథి నేతాజీ సుభాసచంద్ర ‘వసు’ - బోసు - జపాన్ సహకారంతోనే ఈ విజయాన్ని సాధించడం చరిత్ర! ఈ చరిత్రను మననం చేసుకొనడానికి స్వాతంత్య్ర వజ్రోత్సవాల ‘బుల్లెట్ రైలు’ మన ప్రతీక కాగలదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు జరుపుతన్న ‘అంకుర’ - స్టార్ట్‌అప్ - ‘్భరత్‌లో నిర్మించండి’ - మేక్ ఇన్ ఇండియా - పథకాల స్ఫూర్తిని విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల చొరబాటు దెబ్బతీస్తోంది. కానీ ఈ ‘బుల్లెట్ రైలు’ పథకాన్ని విదేశీయ సంస్థల పెట్టుబడులు ఆవహించడం లేదు. ఇది మరో శుభ పరిణామం...
ఎందుకంటె లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయమయ్యే ఈ బుల్లెట్ రైలు పథకాన్ని కేంద్రప్రబుత్వం స్వయంగా పర్యవేక్షించనుంది. నిర్మాణ వ్యయంలో దాదాపు ఎనబయి ఐదు శాతాన్ని జపాన్ ప్రభుత్వం ఋణంగా మాత్రమే సమకూర్చనుంది. అతి తక్కువ వడ్డీతో యాబయి ఏళ్లపాటు ఈ ఋణాన్ని మనం తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడం జపాన్ మనకిచ్చిన బహుమానం. మనదేశపు ‘మారుతి’ సంస్థ తయారు చేయనున్న ‘విద్యుచ్ఛక్తి’తో నడిచే కార్లకు జపాన్‌వారి ‘సుజుకీ’ సంస్థ ‘బ్యాటరీల’ను తయారు చేయనున్నదట! ఈ ‘బ్యాటరీ’ల కర్మాగారాన్ని ‘సుజుకీ’ సంస్థ గుజరాత్‌లోనే ఏర్పాటు చేయడం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ స్ఫూర్తికి అనుగుణం! విదేశీయులు వౌలికమైన విద్యుత్, ఇంధన తైలం, ఇంధన వాయువు, సిమెంటు, ఉక్కు, బొగ్గు రంగాలలో మాత్రమే తమ పెట్టుబడులను పెట్టడానికి మన ప్రభుత్వాలు అనుమతించాలన్నది భారత స్వయం సమృద్ధికి విఘాతం కలుగని ఆర్థికసూత్రం! కానీ విదేశీయులు ‘సేవల’ రంగంలోని, వ్యవసాయ రంగంలోని, అప్పడాలను, ఆవకాయలను, సేమ్యాలను, శీతల పానీయాలను, మిఠాయిలను తయారు చేసే ఆహార రంగంలోకి చొరబడిపోవడం ‘ప్రపంచీకరణ’ కథ! అందువల్ల వౌలిక రంగమైన ‘విద్యుత్’ పరిశ్రమలో జపాన్ పెట్టుబడులు ‘స్వయం సమృద్ధికి ‘స్వావలంబన’కు విఘాతకరం కాదు! ఈ పారిశ్రామిక సహకారం నిజానికి ప్రధానం కాదు! మన దేశాన్ని నాలుగు వైపుల నుంచి దిగ్బంధం చేయడానికి యత్నిస్తున్న చైనా దురాక్రమణ వ్యూహాన్ని అడ్డుకోవడం అతి ప్రధానం! ఆఫ్రికాలోని ‘జిబౌటీ’ దేశంలో సైతం చైనా సైనిక స్థావరాలను స్థాపించడం మన పడమటి సముద్ర తీరానికి మరింతగా పెరిగిన ప్రమాదం... తమ దేశానికి దక్షిణంగా వియత్నాంకు తూర్పుగా విస్తరించి ఉన్న సముద్రంపైన, తమ దేశానికి తూర్పుగా జపాన్‌కు దక్షిణంగా ఉన్న సముద్రంపై చైనా ప్రభుత్వం చెలాయిస్తున్న అక్రమ ఆధిపత్య ధోరణి ఈ ప్రాంతంలో అలజడికి కారణం! ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం ఆరంభించిన ‘యాక్ట్ ఈస్ట్’- తూర్పువైపుగా కార్యాచరణ-, జపాన్ వారి ‘స్వేచ్ఛా ప్రశాంత సాగరం! ఉమ్మడిగా చైనా ‘విస్తరణ’ను ప్రతిఘటించనున్నాయి.
ఈ ప్రతిఘటనా క్రమంలో అబే పర్యటన మరో ప్రగతి పదం! సహస్రాబ్దులకు పూర్వం హైందవ సంస్కారాలు, జపాన్‌ను ప్రభావితం చేశాయి. మన దేశంలో పుట్టిన బౌద్ధమతం ఉభయ దేశాల మధ్య సాంస్కృతిక వారథి కావడం నడుస్తున్న చరిత్ర.. ఈ చరిత్రలో నరేంద్రమోదీతో కలసి షింజో అబే, ఆయన భార్య అకీ అబే సబర్మతీ నదికి పూజలు చేయడం మరో సాంస్కృతిక అధ్యాయం...