మెయన్ ఫీచర్

చైనా చక్రబంధంలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1962లో ఇండో-చైనా యుద్ధం, 1969లో రష్యా-చైనా సరిహద్దు ఘర్షణలు, 1979లో చైనా-వియత్నాం ఘర్ణణల్లో పాల్గొన్న చైనా సైన్యం ప్రభుత్వం పట్ల నిస్తేజంగా ఉంది. ప్రస్తుత పాలకుడు జింగ్‌పింగ్ ఈ సవాళ్లను అధిగమించడానికి మానవ మార్గాలను అనే్వషిస్తూ తమ అధికారాన్ని సుప్రతిష్టితం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారికున్న మార్గం భారత్‌ను చక్రబంధంలో ఇరికించి యుద్ధ వాతావరణం సృష్టించి, తమ దేశ ప్రజలలో ‘దేశభక్తి’ని ప్రేరేపించడం.

భారతదేశంలో సాయుధ విప్లవం తీసుకొని రావాలని కొందరు దశాబ్దాలుగా ఉవ్విళ్లూరుతున్నారు. 1917లో రాష్యా లో జార్ ప్రభుత్వాన్ని తొలగించడం వారికి స్ఫూర్తినిచ్చింది. ఆ తరువాత మార్క్సు జోస్యం చెప్పినట్లు బ్రిటన్ కార్మికులు తిరగబడతారని ఆశించారు. కాని అది జరగలేదు. అందుకు ప్రధాన కారణం ‘‘దేశభక్తి’’. భారత్ నుండి కొం దరు ప్రముఖ సామ్యవాదులు మాస్కోకు వెళ్లి విప్లవానికి అనుమతి కోరగా స్టాలిన్ వారిని చీవా ట్లు పెట్టి పంపించాడు. అప్పటినుండి విప్లవ శక్తులు సమయంకోసం ఎదురుచూస్తున్నాయి. 1962లో పాలం విమానాశ్రయంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, చైనా ప్రధాని చౌఎన్ లైకి స్వాగతం పలికారు. అదే రోజు చైనా హిమాలయాల్లో భారత భూభాగాలను ఆక్రమించింది. ఇందుకు పూర్వరంగంగా చైనా నాటి టిబెట్‌ను కబళించినప్పుడు నెహ్రూ అది చైనా అంతర్గత సమస్య అని మిన్నకుండిపోయాడు. అంతేకా దు పంచశీలలో హిందూ-చీనీ భారుూభారుూ అని నినాదం ఇచ్చారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయింది. ఐనా భారత్‌లో ఆశించినంత శ్రామిక విప్లవం రాలేదు. అందుకు అనేక కారణాలున్నాయి.
చైనా ఆశిస్తున్నది పరిమితమైన రాజ్య విస్తరణ కాదు. అంతర్జాతీయంగా ఆధిపత్యం. అంటే అమెరికా, రష్యాల స్థానంలో చైనా ప్రపంచ అధినేతగా ఎదగాలన్నది వారి వ్యూ హం. అందుకు సుదూరాల్లో ఉన్న అమెరికా కన్నా వారిని ప్రధానంగా ఎదుర్కొనేది భారత్‌ను మాత్రమే. అందుకే భారత్‌పై వెర్బల్ టెర్రరిజం, ఎకనమిక్ టెర్రరిజం, సాయుధ పోరాటం అనే ముప్పేట దాడిని మొదలు పెట్టింది. ‘చైనా ఛైర్మన్ మా ఛైర్మన్’, ‘్భరత దేశాన్ని ముక్కలు చేయండి’, ‘కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు’, ‘్భరతదేశమే పాకిస్తాన్‌పై దండయాత్ర చేసింది’, ‘్భరత రాజ్యాంగ వ్యవస్థపై మాకు నమ్మకం లేదు’, ‘సుప్రీంకోర్టు జడ్జీలను మేం నమ్మం’ వంటి నినాదాలను జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో, హైదరాబాద్‌లోని హెచ్‌సియులో ఇప్పించడం, దుర్గను సెక్స్‌వర్కర్‌గా చిత్రీకరించడం, శ్రీమహా విష్ణువును పరమ దుర్మార్గుడిగా పేర్కొనడం వంటివి ‘వెర్బల్ టెర్రరిజం’ కిందికి వస్తాయి.
చైనాలో పనికిమాలిన ఉత్పత్తులను భారత్‌లో ముంచెత్తడం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో భారీగా చైనా సినీ వీడియోలను దింపడం, ఇండియాలోకి నకిలీ కరెన్సీ ప్రవేశపెట్టడం వంటివి ‘ఎకనామిక్ టెర్రరిజం’ కిందికి వస్తాయి. ఇక మూడో అంశం భూటాన్, నేపాల్, పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో చైనా తన స్థావరాలను బలపరచుకోవడం. పాక్‌ను ‘పంజా’గా ఉపయోగించుకోవడం, పాక్ నుంచి లీజుకు తీసుకున్న భూముల్లో చైనా స్థావరాలను నిర్మించుకోవడం, ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులకు ఆయుధాలను సరఫరా చేయడం వంటివి సాయుధ పోరాటం కిందికి వస్తాయి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ ఇలా అన్ని దిశలనుంచి ఇండియాపై దాడికి చైనా వ్యూహరచన చేసింది. భారత్‌ను అడ్డుతొలగించుకుంటే అమెరికా, రష్యాకు బదులు తానే ప్రపంచ అధినేతగా 2020 నాటికి ఎదగాలన్నది చైనా లక్ష్యం! అయితే చైనా అనుకున్న విధంగా ముందుకు పోవడానికి కొన్ని అడ్డంకులున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది, రోజు రోజుకు చైనాలో యువకుల సంఖ్య తగ్గిపోతున్నది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇది వారు అనుసరించిన కుటుం బ నియంత్రణ విధానాల ఫలితం. ప్రస్తుతం చైనా తీవ్ర ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్నది. దీన్నుంచి ఎలా బయటపడాలో చైనాకు అర్థం కావడం లేదు. భారత్‌తో యుద్ధం చేస్తే, అక్కడినుంచి వచ్చే ఆదాయం ఆగిపోతుంది. అంటే చైనా అర్థిక వ్యవస్థకు దెబ్బ. అందుకని చైనా, తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగకుండా, పాకిస్తాన్ ద్వారా ప్రచ్ఛన్న యుద్ధాన్ని చేయిస్తున్నది.
భారత్‌తో పోల్చినప్పుడు చైనా అణ్వస్త్ర పాటవం, సైనిక శక్తి, వైమానిక బలం, వార్షిక బడ్జెట్ కూడా ఎక్కువగా ఉంది. అంతేకాదు మనదేశంలోని పనికిమాలిన ద్వితీయ శ్రేణి ఆటబొమ్మలను డంప్ చేసి, విలువైన యుద్ధ పరికరాలను పాకిస్తాన్‌కు ఇస్తున్నది. భారతీయులకు వలెనే, చైనీయులకు కూడా పూర్వం చాంద్రమాన పంచాంగం ఉండేది. మనవలెనే వారికి నాలుగు ఋతువులు ఉన్నాయి. వసంతకాలంలో ‘డ్రాగన్’-పగడం- పండుగను ఉత్సాహంగా జరుపుకునేవారు. ఈ ప్రాచీన సంస్కృతి ఆనవాళ్లు 1948 తరువాత చైనాలో నిర్మూలించబడ్డాయి. సర్వమానవ సమానత్వం అనే అర్థిక నినాదాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ వివేకానందుడిని, నేతాజీని దూషించడం వల్ల సమసమాజ స్థాపన జరుగుతుందా? చెప్పాలి. వౌలిక వసతుల కల్పనలో దుబాయ్ చైనాలు ముందుండగా ఇండియా చాలా వెనుకబడిన మాట నిజమే. అందుకు ప్రధాన కారణం చైనా నియంతృత్వ దేశం, భారత్, అమెరికాలు ప్రజాస్వామ్య దేశాలు. ఇక్కడ అధికార పార్టీ ఒక అడుగు ముందుకేస్తే, ప్రతిపక్షాలు రెండు అడుగులు వెనక్కి లాగడం అందరికీ తెలిసిన వ్యవహారమే. ‘ఒక జాతిలో మూర్ఖులు ఉంటే ఆ జాతి అస్తిత్వం దెబ్బతినదు కాని ఒక జాతిలో దేశ ద్రోహులు ఉంటే మాత్రం దేశం నిలువ జాలదు’’ అన్నాడు మార్కష్ తుల్లియస్ సిసిరో అనే రోమన్ తత్వవేత్త.
చైనా ఆదాయంలో సింహభాగం పర్యాటక రంగం నుంచి వస్తుంది. ముఖ్యంగా చైనా సందర్శకులు టిబెట్ సౌందర్యాలు ఆస్వాదిస్తారు. 2008లో టిబెట్ ప్రజలు స్వతంత్ర భావనతో ఆందోళన జరిపే సరికి వారి పర్యాటక రంగానికి దెబ్బ తగిలింది. వెంటనే ఉక్కుపాదంతో యు.జెంగ్‌షెంగ్ వంటి పోలిట్ బ్యూరో నాయకులు సైన్యం సహకారంతో ఈ ఉద్యమాన్ని అణచివేసిన సంగతి చైనా చరిత్ర అధ్యయనం చేసిన విద్యార్థులందరికీ తెలుసు. గత అరవై సంవత్సరాలుగా సుందర నందన కాశ్మీరంలో పర్యాటకులు సంఖ్య తగ్గి భారత్ ఆదాయానికి గండిపడింది.
రాయిటర్ వార్తా సంస్థ అందించిన కథనం ప్రకారం చైనా దేశీయ బడ్జెట్ కన్నా మిలిటరీ బడ్జెట్ భారీగా పెంచవలసి వచ్చింది. గత సంవత్సరం 10.1 శాతం మిలిటరీ బడ్జెట్ పెరగ్గా, ఈ ఏడాది 30 శాతం వరకు పెంచుతున్నారు. కార ణం సైన్యంలోని అలజడి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, తైవాన్ ప్రాంతల్లో ఆందోళన చైనాను కలవరపాటుకు గురిచేస్తున్నది. అందువల్ల తెలివైన పాలకులు ప్రజల దృష్టిని అంతర్జాతీయ సమస్యలనుండి దృష్టి మళ్లించాలంటే యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టాలి. ఇందుకు చైనా-పాకిస్తాన్‌లు చేస్తున్నది అదే. వివిధ భారతీయ విశ్వవిద్యాలయాల్లో చైనా, పాక్ అనుకూల వర్గాలు ఈ రెండు దేశాలకు సహకరిస్తున్నాయి. ఇదే జెఎన్‌యు నేపథ్యం.
మీరు రిగ్జిక్ టాంగీ పేరు విన్నారా? ఈశాన్య భారతంలో కాశ్మీరులోని ఆక్సాయ్‌చిన్ వాస్తవాధీన రేఖకు సమీపంలో లఢక్ నుండి 1262 కిలోమీటరు దాటి రెండు రోజులు ప్రయాణిస్తే అక్కడ డిమ్ చౌక్ వస్తుంది. ఇక్కడ ప్రవహించే నదికి అటువైపుసగం, ఇటువైపు సగం గ్రామం ఉంది. మొత్తం గ్రామ జనాభా సంఖ్య 78! నదికి అవతలి భాగాన్ని చైనా ఆక్రమించుకున్నది. 2016, ఆగస్టు 26న డిమ్‌చౌక్‌లో రిగ్జిమ్ టాంగే భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత్ మాతాకీ జై అంటాడు. జనగనమణ పాడాడు. నదికి ఆవలివైపునుంచి చైనా సైనికులు రిగ్జిమ్ టాంగేను బెదిరిస్తూ బూతులు తిడుతుంటారు. ఐనా ఈ దేశభక్తుడు ప్రాణాలకు తెగించి జాతీయ పతాకం క్రమం తప్పకుండా ఆవిష్కరిస్తూనే ఉన్నాడు. ఈ భూభాగాలన్నింటినీ తమతో కలిపేయాలని చైనా రిగ్జిమ్ టాంగేను ప్రలోభ పెట్టింది. అతను దేశభక్తుడు. ససేమిరా వీలుకాదు అన్నాడు. రిగ్జిమ్ టాంగే ఏమీ చదువుకోలేదు. అతనికి జెఎన్‌యు స్కాలర్‌షిప్పులు లేవు. కనీసం చలికాలంలో ధరించేందుకు మంచి బట్టలు కూడా లేవు. నిరంతరం చైనా సైనిక తుపాకీ మోతలనుంచి తనను తాను రక్షించుకుంటూ, ప్రాణాలు అరచేత పెట్టుకొని బతుకుతున్నాడు. గత 60 ఏళ్లనుంచి ఏ ప్రభు త్వం కూడా ఇతగాడి గురించి ప్రజలకు తెలియజేసిన పాపాన పోలేదు. ఇప్పుడు చెప్పండి మనకు ఎవరు ఆదర్శం? రిగ్జిమ్ టాంగేనా? లేక కుహనా సెక్యులరిస్టులా?
అమెరికా అంతర్జాతీయ ఆధిపత్య వాంఛ, బ్రిటిష్ వలసవాదం, ఖలీఫా ఉగ్రవాద విస్తరణ ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాని తెలియని విషయం చైనా ఉగ్రవాద విస్తరణ. పూర్తిగా హిమాలయ పాద సానువుల్లోని రాజ్యాలను కబళిస్తూ భారత్‌ను అస్థిర పరుస్తూ తమ ఏజెంట్ల ద్వారా ఇండియాలో అంతర్యుద్ధానికి ప్రేరేపిస్తున్నది. చైనా భూతల స్వర్గమంటూ ప్రచారం చేసే పంచమాంగ దళాన్ని వివిధ రాష్ట్రాలలో నిర్మించడంలో చైనా విజయం సాధించింది. ఐతే చైనా అంతర్గత వైఫల్యాలు బయటి ప్రపంచానికి తెలిసే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పాలకులు అంతర్గత ఆర్థిక సంక్లిష్టలతో సతమతమవుతున్నారు.
లోగడ చైనా రెండంకెల వృద్ధి సాధించింది. ఐతే ఇప్పుడు వారి అభివృద్ధి వెనుకబడటంతో, అక్కడి ధనవంతులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకై ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా వంటి పెట్టుబడి దారీ దేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం. దేశ ప్రజలకు ఉద్యోగాలు లేకపోతే తిరుగుబాటు చేస్తారు. చైనా అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ప్రజలకు తిండి ఉద్యోగాలు కావాలంటూ రోజుకు 500 ఆందోళనలు దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇది 1946 నాటి మావోసేటుంగ్ ఉద్యమకాలాన్ని స్ఫురింపజేస్తున్నది. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ఒక వ్యాసం వచ్చింది. దాని ప్రకారం ప్రస్తుత ప్రభుత్వానికి అక్కడి మావో అభిమానులు ఒక వినతిపత్రం సమర్పించారు. మావో 120వ జన్మదినం సందర్భంగా మావో స్ఫూర్తి దేశమంతటా నింపండి, అని వారు వేలాది మంది సంతకాలు చేసి వినతిపత్రం సమర్పించారు. మావో గొప్ప దేశభక్తుడే కాని ఆయనను దేవుణ్ణి చేసి పూజించడం, గుడి కట్టడం తగదు అని ప్రస్తుత అధినేత ప్రకటించాడు.
షాంఘై, గాంగ్‌డాంగ్ హనన్ ప్రావెన్స్‌లో మావో అభిమానులు తమ ప్రియతమ నేతకు గుడులు కట్టారు. గాన్సు ప్రావిన్స్‌లోని జింగ్జియాన్ రాష్ట్రంలోని మావో దేవాలయం వద్ద ఆయన అభిమానులు గుమికూడి ప్రస్తుత ప్రభుత్వ ధోరణిని నిరసించారు. 1962లో ఇండో-చైనా యుద్ధం, 1969లో రష్యా-చైనా సరిహద్దు ఘర్షణలు, 1979లో చైనా-వియత్నాం ఘర్ణణల్లో పాల్గొన్న చైనా సైన్యం ప్రభుత్వం పట్ల నిస్తేజంగా ఉంది. ప్రస్తుత పాలకుడు జింగ్‌పింగ్ ఈ సవాళ్లను అధిగమించడానికి మానవ మార్గాలను అనే్వషిస్తూ తమ అధికారాన్ని సుప్రతిష్టితం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారికున్న మార్గం భారత్‌ను చక్రబంధంలో ఇరికించి యుద్ధ వాతావరణం సృష్టించి, తమ దేశ ప్రజలలో ‘దేశభక్తి’ని ప్రేరేపించడం. అంటే అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్‌చిన్, సియాచిన్ వంటి ప్రాంతాలను చైనాలో కలుపుకునే యత్నం చేస్తే దేశ ప్రజల దృష్టి ఆర్థిక సమస్యలనుంచి మళ్లుతుంది. ఇది చాలా దేశాల్లో విజయవంతంగా జరిగిన రాజకీయ ప్రయోగమే. సరిగ్గా 2016లో పాక్-చైనాలు ఇదే పని చేస్తున్నాయి. ఇదిలావుండగా చైనా ఖాట్మండుకు బుల్లెట్ ట్రైన్ వేయబోతున్నది. ఇది వ్యూహాత్మక చర్య. అలాగే టిబెట్ నుండి అణ్వాయుధాలు అరుణాచల్ ప్రదేశ్, మేఘా లయ వంటి వాటిపైన వేయడం చాలా సుల భం. దీనిని భారత్ పరిగణలోకి తీసుకోవాలి.

- ముదిగొండ శివప్రసాద్