సంపాదకీయం

తీరుమారని ‘తోడేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హఫీజ్ సరుూద్ అనే జిహాదీ హంతకుడు ‘‘బీభత్సకారుడు కాదని’’ పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం నాడు నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. గతంలో అనేకసార్లు పాకిస్తాన్ ‘పౌర ప్రభుత్వం’ చేసిన ప్రకటనలకు ఇది పునరావృత్తి మాత్రమే! ‘జమాత్ ఉద్ దావా’ - అన్న జిహాదీ ముఠాలోని మొదటి బీభత్సకారుడైన హఫీజ్ సరుూద్ క్రీస్తుశకం 1990లో ‘లష్కర్ ఏ తయ్యబా’ - ఎల్‌ఇటి-అన్న జిహాదీ ముఠాను స్థాపించాడు. లష్కర్ ముఠా అంతర్జాతీయ అభిశంసనకు పలుమార్లు గురికావడంతో ‘జమాత్ ఉద్ దావా’ - జెయుడి-ను ఆరంభించాడు!! ‘జమాత్’ను నిషేధించాలని టెర్రరిస్టు ముఠాగా ప్రకటించాలని, హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించి విచారించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది! తొమ్మిదేళ్లుగా పాకిస్తాన్ ‘పౌర’ ప్రభుత్వం మాటిమాటికీ మాట మారుస్తోంది, అంతకు పూర్వం కూడ పాకిస్తాన్ పౌరప్రభుత్వం అనేకసార్లు మాట మార్చడం చరిత్ర.. సరుూద్‌ను నిర్బంధించామని అతడు బీభత్సకారుడని మొదట ప్రకటించడం కొన్ని నెలల తరువాత అతగాడిపై ఈ అభియోగాన్ని రద్దు చేయడం ఈ మాటమార్చడంలో భాగం. 2008లో ఐక్యరాజ్య సమితి ‘జమాత్’ను టెర్రరిస్టు ముఠాగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ‘జమాత్’ను నిషేధించినట్టు 2008 డిసెంబర్‌లో ప్రకటించి పాకిస్తాన్ పౌర ప్రభుత్వం నిజానికి అంతర్జాతీయ సంస్థలను, అంతర్జాతీయ సమాజాన్ని ఘోరంగా వంచించింది! జమాత్ ఉద్ దావాను నిషేధించినట్లు ఎలాంటి ఆధికారిక ప్రకటన కూడ వెలువడలేదని 2009 జూన్‌లో లాహోర్ హైకోర్టు నిర్ధారించేవరకు ‘జమాత్’ను పాకిస్తాన్ ‘పౌర’ ప్రభుత్వం నిషేధించినట్టుగానే మన ప్రభుత్వం విశ్వసించింది, అంతర్జాతీయ సమాజం విశ్వసించింది. కానీ, ‘‘జమాత్‌ను నిషేధిస్తూ తీర్మానం ఆమోదించే అధికారం ఐక్యరాజ్య సమితికి లేదన్న’’ విచిత్రమైన తీర్పును లాహోర్ హైకోర్టు 2009లో ప్రకటించింది. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసిన ‘జమాత్’ ముష్కరులు భయంకర బీభత్సకాండను సృష్టించారు. నూట అరవై ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణ పైశాచిక కాండను జరిపించిన ‘జమాత్’ను ‘సమితి’ నిషేధించింది. కాని పాకిస్తాన్ ప్రభుత్వం సమితి తీర్మానాన్ని అమలు జరుపలేదు. అమలు జరిపినట్లు అభినయించింది. అందువల్లనే సరుూద్ హఫీజ్‌ను 2009 జులైలో లాహోర్ హైకోర్టు గృహనిర్బంధం నుంచి విముక్తం చేసింది!
నిజానికి 2002 నుంచి సరుూద్ గృహనిర్బంధం నాటకాన్ని పాకిస్తాన్ ‘పౌర’ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సరుూద్‌ను కారాగృహంలో నిర్బంధించకుండా స్వగృహంలోనే మాటిమాటికీ ఎందుకని నిర్బంధిస్తున్నారన్నది అంతుపట్టని వ్యవహారం. ప్రస్తుతం సరుూద్ గత జనవరి నుంచి ‘బీభత్సకాండ వ్యతిరేక చట్టం’ - యాంటీ టెర్రరిజమ్ యాక్ట్ - కింద గృహనిర్బంధంలో ఉన్నాడు. 2001లో మన పార్లమెంట్ భవనంపై దాడి చేసిన ముష్కర మూకలను ఉసిగొల్పిన నేరంపై ఇతగాడిని లాహోర్‌లో గృహనిర్బంధంలో ఉంచారు! కానీ ఆ తరువాత పాకిస్తాన్ పౌరప్రభుత్వం ఇతగాడిపై అభియోగాన్ని రద్దు చేసింది! ఆ తరువాత హఫీజ్ ముఠావారు 2006 జూలై పదకొండున ముంబయిలో పేలుళ్లు జరిపి అనేక మందిని హత్య చేశారు. పాకిస్తాన్ ‘పౌర’ ప్రభుత్వం మళ్లీ హఫీజ్‌ను గృహనిర్బంధంలో ఉంచింది. కానీ అప్పుడు కూడ పాకిస్తాన్ పౌర ప్రభుత్వం మాట తప్పింది. హఫీజ్ నేరస్థుడు కాదని నిర్ధారించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం తరువాత గృహనిర్బంధానికి గురయిన హఫీజ్‌ను లాహోర్ కోర్టు విడుదల చేయడం మరో నాటకం! ప్రస్తుతం, అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరిగింది. అందువల్ల విధిలేక హఫీజ్‌ను నిర్బంధించిన పాకిస్తాన్ మళ్లీ మాటమార్చింది. తనను విడుదల చేయవలసిందిగా లాహోర్ హైకోర్టు ‘హఫీజ్’ దాఖలు చేసిన ‘యాచిక’ విషయంలో (పశ్చిమ) పంజాబ్ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణిని నిర్లజ్జగా ప్రదర్శించింది. సరుూద్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సమర్పించనున్నట్లు శుక్రవారం లాహోర్ హైకోర్టునకు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే శనివారం ‘‘హఫీజ్ బీభత్సకారుడన్న అభియోగాన్ని బలపరిచే సాక్ష్యాలు ఏవీ లేవని’’ పాకిస్తాన్ సుప్రీంకోర్టు నియమించిన న్యాయ సమీక్షా సంఘాని-జ్యుడిషియల్ రివ్యూబోర్డ్-కి పంజాబ్ ప్రభుత్వం నివేదించింది.
ఇలా మాటమార్చడంతో హఫీజ్‌ను, మరో ముగ్గురు ‘జమాత్’ జిహాదీ హంతకులను నిర్బంధం నుంచి విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.. హఫీజ్ సరుూద్ కాని అఝార్ మసూద్ కాని మరో ముష్కరుడు కాని కేవలం పాత్రధారులు, వీరిని లష్కర్, జమాత్, ‘జాయిష్ ఎ మొహమ్మద్’ వంటి జిహాదీ ముఠాలను రూపొందించిన బీభత్స వ్యవస్థ పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ ముఠాలను, మన దేశంలో బీభత్సకాండను నిర్వహిస్తున్న ‘హిజ్‌బుల్ ముజాహిదీన్’ ‘సిమి’ ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద పైశాచిక బృందాలను పాకిస్తాన్ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ -ఐఎస్‌ఐ-అనుసంధానం చేస్తోంది. పాకిస్తాన్ ప్రభు త్వం గూఢచర్య విభాగంగా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’ నిజానికి ఉగ్రమూకల ముఠాలను అనుసంధానం చేస్తున్న బీభత్స వ్యవస్థ! మనదేశంలోకి ‘అల్‌ఖాయిదా’ ముఠా, ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’ - ఐసిస్ - వంటి ‘జిహాదీ’ ముఠాలు చొరబడడానికి ప్రేరకశక్తి ‘ఐఎస్‌ఐ’.. బర్మా-మయన్మార్-నుంచి చొరబడి మనదేశంలో తిష్ఠవేసి ఉన్న ‘రోహింగియా’లను సైతం ‘టెర్రరిస్టులు’గా రూపొందించడానికి ‘ఐఎస్‌ఐ’ కుట్రను కొనసాగిస్తోంది! ఇన్ని రోజులుగా అంతర్జాతీయ సమాజాన్ని వంచించిన, ధిక్కరించిన పాకిస్తానీ సైనిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయ సమాజాన్ని వికృతంగా వెక్కిరిస్తోంది. ‘ఐఎస్‌ఐ’కి సాయుధ తీవ్రవాదులతోను, బీభత్సకారులతోను సంబంధాలున్నాయని పాకిస్తాన్ సైనిక అధికారి ‘‘మేజర్ జనరల్’’ అసీఫ్ గఫూర్ అనేవాడు ఈనెల ఐదవ తేదీన ప్రకటించాడు. పాకిస్తాన్ సైనికదళాల నిర్లజ్జకు నిర్భయానికి ఇది నిదర్శనం. హఫీజ్ సరుూద్ ప్రారంభించిన ‘మిల్లీ ముస్లింలీగ్’ అన్న రాజకీయ సంస్థ ఎన్నికలలో పోటీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడ ఈ ఆసీఫ్ గఫూర్ అనేవాడు స్పష్టం చేశాడు. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి ‘జిహాదీ రాజ్యాంగ వ్యవస్థలు’గా మారాయన్నది మరోసారి స్పష్టమైంది! మన ప్రభుత్వం ఈ పాకిస్తానీ బీభత్స ప్రభుత్వంతో ఇప్పటికీ దౌత్య సంబంధాలను కొనసాగిస్తుండడం విస్మయకరం...
పాకిస్తాన్‌లో రెండురకాల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మొదటిది సైనిక వ్యవస్థ.. సర్వాధికారాలను సైనిక దళాల వారు చెలాయిస్తున్నారు! రెండవది సైనిక దళాల నియంత్రణకు లోబడి ‘ప్రజాస్వామ్యాన్ని’ అభినయిస్తున్న ‘పౌర’ ప్రభుత్వం.. సైనిక దళాలవారు బీభత్సకారులను మనదేశంలోకి ఉసిగొల్పుతున్నారు!! ఇలా ఉసిగొల్పడం మాననంత వరకు పాకిస్తాన్‌తో సకలవిధ సంబంధాలను మనం ఇప్పటికైన రద్దు చేసుకోవాలి!!