సంపాదకీయం

వ్యర్థ ప్రయత్నం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత ప్రాతిపదికపై ఇస్లాం తదితర అల్పసంఖ్య వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసంస్థలలోను ‘ఆరక్షణ’ - రిజర్వేషన్-లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం ‘‘గుర్తించడం’’ హర్షణీయ పరిణామం! రాజ్యాంగాన్ని సవరించకుండా ముస్లింలకు ఇతర అల్పసంఖ్య మతస్థులకు రిజర్వేషన్‌లు కల్పించడం సాధ్యంకాదన్న వాస్తవం గురువారం తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రసంగ సారాంశం! అందువల్లనే ‘‘రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా మాత్రమే’’ ముస్లింలకు పనె్నండు శాతం ఆరక్షణలు కల్పించడానికి వీలుందని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు కనుక పార్లమెంటు మాత్రమే సవరించగలదు కనుక, ‘‘కేంద్ర ప్రభుత్వం ఇలా సవరించే పనికి నడుం బిగించాలన్నది’’ తెలంగాణ ప్రభుత్వం వారి కోరిక! ఇలా రాజ్యాంగాన్ని సవరించడానికి నరేంద్రమోదీ ప్రధాన మంత్రిత్వంలోని ‘్భరతీయ జనతా పార్టీ’ ప్రభుత్వం అంగీకరించబోదన్నది బహిరంగ రహస్యం.. మతం ప్రాతిపదికగా ‘రిజర్వేషన్’లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమన్న వాస్తవానికి ‘భాజపా’ కట్టుబడి ఉంది! ఈ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ‘భాజపా’ ‘రిజర్వేషన్’ల వ్యవహారంలో తన విధానాన్ని రూపొందించుకొని ఉంది! అందువల్ల తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించబోదు! ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రభుత్వ నిర్వాహకులు గుర్తించారు! గుర్తించారు కనుకనే ‘కేంద్ర ప్రభుత్వం’ అంగీకరించకపోతే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టం చేశారు! అంటే తమ కోరికను ఆమోదించి తీరాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి హెచ్చరించినట్టయింది... ‘‘లేకుంటే సర్వోన్నత న్యాయస్థానానికెక్కడం...’’ ఖాయం అన్నది ముఖ్యమంత్రి ప్రసంగ ప్రధాన ఇతివృత్తం! ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒకటి రెండు రాష్ట్రాల ‘కోరిక’కు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించి తీరాలా? మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ‘‘మత ‘రిజర్వేషన్’లకు అవకాశం ఇవ్వరాదు’’ అని కోరినట్టయితే, ఆయా రాష్ట్రాల శాసనసభలు ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఎవరి మాటను మన్నించాలి. నిజానికి రాజ్యాంగాన్ని సవరించరాదని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కోరనక్కర లేదు, ఏ శాసనసభ కూడా తీర్మానం ఆమోదించనక్కర లేదు. మత ‘రిజర్వేషన్’లను కల్పించాలని కోరని రాష్ట్రాల ప్రభుత్వాలు, శాసనసభలు ఇలాంటి రాజ్యాంగ సవరణకు వ్యతిరేకమన్నది సహజ పరిజ్ఞానం...!
ఇలా, కేంద్ర ప్రభుత్వం మత ‘రిజర్వేషన్’లను కల్పించడానికి వీలుగా రాజ్యాంగ సవరణను చేయబోదని ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకులకు స్పష్టమైపోయింది, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు స్పష్టమైపోయింది. అందువల్లనే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ ప్రభుత్వంవారు, సర్వోన్నత న్యాయ స్థానానికి చేసే ‘నివేదన’ నిర్దుష్టంగా ఉండాలని ఆటంకాలను అధిగమించే విధంగా ఉండాలని ప్రతిపక్ష నాయకుడు శాసనసభలో వాక్రుచ్చి ఉన్నారు.. సుప్రీంకోర్టునకు ఏమని నివేదిస్తారు?? రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం నివేదిస్తారు! ‘‘మత ‘రిజర్వేషన్’ కల్పించడానికి మేము నిర్ణయించాము. ఇందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. సవరణ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి...’’ అని తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తుందా?? ఇలా అభ్యర్థించడానికి రాజ్యాంగపరమైన అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం అలా ఆదేశించడానికి సైతం రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే విధానాలు, చట్టాలు రాజ్యాంగబద్ధమైనవా? కాదా? అన్న మీమాంసకు మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం సమాధానం చెప్పగలదు. అంతేకానీ, ‘‘్ఫలానా విధానాన్ని రూపొందించడానికి, ఫలానా చట్టం చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి...’’ అని సర్వోన్నత న్యాయస్థానాన్ని కేంద్ర రాష్ట్రాలు కోరవలసిన పని లేదు, కోరినప్పటికీ ‘సుప్రీం’ కోర్టు జోక్యం చేసుకోదు, అనుమతి ఇవ్వదు!
అందువల్ల మత ‘రిజర్వేషన్లు’ కల్పించడానికి మాకు అనుమతి ఇవ్వండి-అని తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరడం రాజ్యాంగ అనభిజ్ఞత - కాన్‌స్టిట్యూషనల్ ఇగ్నోరెన్స్-కు చిహ్నం కాగలదు. రాష్ట్ర ప్రభుత్వాలు ‘మత రిజర్వేషన్’లు కల్పిస్తూ చట్టాలు చేసినా, ఉత్తరువులు జారీ చేసినా వాటి ‘రాజ్యాంగ బద్ధత’ను సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాలు సమీక్షించగలవు! ఈ సమీక్ష ఇప్పుడు కొనసాగుతోంది! ఇస్లాం మతస్థులకు ‘రిజర్వేషన్’లను కల్పించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడుసార్లు ప్రయత్నించింది. మూడుసార్లు కూడా ఈ నిర్ణయాన్ని హైకోర్టు ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని నిర్ధారించింది. ఇప్పుడు ఈ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది! సర్వోన్నత న్యాయస్థానం తీర్పుకోసం వేచి ఉండవలసిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకుంది. అలా వేచి ఉండకుండా మరోసారి శాసనసభలో ‘బిల్లు’ను ఆమోదింప చేయడం పరోక్ష న్యాయధిక్కారం... గత ఏప్రిల్ పదిహేడవ తేదీన ఇలా ‘మత రిజర్వేషన్’ల బిల్లును తెలంగాణ విద్యామండలి - శాసనసభ, శాసనమండలి-ఆమోదించింది! ఈ బిల్లు రాజ్యాంగంలోని పదహైదవ అధికరణం స్ఫూర్తికి విరుద్ధం. అందువల్ల ఇది ‘చట్టం’ అయినట్టయితే న్యాయ సమీక్షలో ఆ చట్టం రద్దు కావడం ఖాయం...
ఇస్లాం మతస్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలోను విద్యా సంస్థలలోను ఐదుశాతం ఆరక్షణలను కల్పించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తరువు - జిఓఎంఎస్ 33-ను ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం 2004 సెప్టెంబర్‌లో రద్దు చేసింది. ఇలా మత ‘రిజర్వేషన్’లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని కూడ హైకోర్టు 2005 నవంబర్‌లో రద్దు చేసింది. పట్టువదలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లతో మరోసారి రూపొందించిన చట్టాన్ని కూడ ఉన్నత న్యాయస్థానం 2010 ఫిబ్రవరిలో రద్దు చేసింది. ఈ తీర్పుపై దాఖలయిన ‘అప్పీలు’ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. తుదితీర్పు వెలువడే వరకు ఈ నాలుగు శాతం ‘రిజర్వేషన్ల’ను అమలు జరుపవచ్చునన్నది 2010 మార్చిలో జారీ చేసిన మధ్యంతర ఆదేశం... పనె్నండు శాతం ‘రిజర్వేషన్’ల వల్ల గతంలో సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పును ఉల్లంఘించినట్టు కాగలదు. మొత్తం ‘రిజర్వేషన్లు’ యాబయి శాతానికి మించరాదు! ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి మినహాయింపులను పొందగలమన్నది తెలంగాణ ప్రభుత్వం పగటికల! కానీ ‘‘మత రిజర్వేషన్లు’’ రాజ్యాంగబద్ధం అయినప్పుడు కదా ఈ ‘‘మినహాయింపు’’...!!