సంపాదకీయం

పఠాన్‌కోటలో పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్‌లోని పఠాన్‌కోటలోని మన వైమానిక దళ స్థావరంపై జనవరి నెల రెండవ తేదీన జరిగిన దాడితో జాయిష్ ఎ మెహమ్మద్ జిహాదీ ముఠా నాయకుడైన మసూద్ అఝార్‌కు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వ సంయుక్త పరిశోధక బృందం-జాయింట్ ఇనె్వస్టిగేషన్ టీమ్-జిట్-వారు బుధవారం తేల్చివేశారట...పాకిస్తానీలు ఇలా తేల్చివేస్తూ ఉన్న సమయంలో మన ప్రత్యేక పరిశోధన బృందం వారు నోట్లో వేళ్లు వేసుకుని నిశే్చష్టులై ఉండడం ఆవిష్కృతమవుతున్న వైపరీత్యం! నిజానికి ఈ వేళ్లు మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులవి! ఇప్పుడు ఈ వేళ్లు వారి ముక్కుల మీద ఉన్నాయి. గతంలో మన్‌మోహన్‌సింగ్ ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వం మతిమాలిన రీతిలో పాకిస్తాన్ వంచనకు గురి అయ్యేది. ప్రస్తుత ప్రభుత్వం అతి తెలివిని ప్రదర్శించి వంచన ముందు తలను వంచుతోంది! పాకిస్తాన్ ప్రభుత్వం వారి ఈ దర్యాప్తు బృందం పఠాన్‌కోటను సందర్శించి నేర పరిశోధన జరపడం హంతకులు హత్యను గురించి ఆరా తీయడం వంటిది! పాకిస్తానీ జిహాదీలు మన దేశంలో హత్యాకాండ జరపడం ఇంతవరకూ కొనసాగిన చరిత్ర. ఈ బీభత్సకాండను నిరోధించలేని మన ప్రభుత్వాలు కనీసం దర్యాప్తు జరిపి దోషులను నిర్ధారించగలిగేది, ఆ నేరస్థులు పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్నారని ప్రకటించగలిగేది. కానీ పఠాన్‌కోటకు పాకిస్తాన్ దర్యాప్తు బృందం రావడం ఈ చరిత్రలో కొత్త మలుపు! ఇకపై దోషులెవరో మన ప్రభుత్వం వారు, పాకిస్తానీ బీభత్స ప్రభుత్వం వారు ఉమ్మడిగా నిర్ధారించనున్నారు. అంటే ఉభయులూ అంగీకరిస్తే తప్ప ఫలానా పాకిస్తానీ హంతకులు నేరస్థులని నిర్ధారణ జరిగే అవకాశం లేదు! పఠాన్‌కోటలో మన వైమానిక దళం స్థావరంపై జరిగిన దాడికి జాయిష్ ఎ మొహమ్మద్ ముఠా మొదటి హంతకుడు మసూద్ అఝార్ ప్రధాన సూత్రధారి అని మన ప్రభుత్వం నిర్ధారించింది. ఇప్పుడు పఠాన్‌కోటను సందర్శించిన పాకిస్తాన్ బృందం వారు అబ్బే...మసూద్ అఝార్‌కు ఈ దాడితో సంబంధం ఉన్నట్టు ఆధారాలు లేవు! అని నిగ్గుతేల్చారు. అందువల్ల అఝార్ దోషి అని మన ప్రత్యేక పరిశోధక బృందం-స్పెషల్ ఇనె్వస్టిగేషనన్ ఏజెన్సీ-సిట్ వారు పాకిస్తాన్ బృందాన్ని ఒప్పిస్తే తప్ప ఈ జాయిష్ ఏ మొహమ్మద్ ముఠా వాడిని శిక్షించే అవకాశం లేదు..మన ప్రభుత్వం వారి ఘోరమైన స్వయంకృతాపరాధం ఇది! పఠాన్‌కోటపై దాడి చేసిన దుండగులను పాకిస్తాన్ ప్రభుత్వమే ఉసి గొల్పిందన్న వాస్తవాన్ని ధ్రువపరిచే సాక్ష్యాధారాలను మన సిట్ సేకరించింది! అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వమే దోషి అని మనం ప్రకటించాలి! అలా జరగలేదు! పాకిస్తానీ బృందాన్ని ఆహ్వానించింది. ఆ బృందానికి మన సిట్ ఆధారాలను నివేదించింది. హతుని తరఫువారు హంతకునికి సాక్ష్యాధారాలను నివేదించినంత మాత్రాన హంతకుడు తన నేరాన్ని అంగీకరిస్తాడా? ఆధారాలతో నేరాన్ని ధ్రువపరిచి హంతకుడిని శిక్షించాలి! మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి అంతర్జాతీయ సమాజానికి ఆధారాలను నివేదించి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థ-టెర్రర్ రిజీమ్-గా ప్రకటింపచేయడానికి కృషి చేసి ఉండాలి...
అలా జరగకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం నాగరిక వ్యవస్థ కొనసాగడానికి అవకాశం ఏర్పడింది. వారి బృందం మన దేశానికి వచ్చి దర్యాప్తు జరపడానికి మనం అంగీకరించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెరిగింది! బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మన ప్రధాని నరేంద్ర మోదీ జిహాదీ ఉగ్రకృత్యాలకు బలైన వారికి అంజలి ఘటిస్తుండిన స మయంలోనే మనదేశంలో పాకిస్తాన్ జిహాదీ హంతకులు దర్యాప్తులు జరుపుతున్నారు! పాకిస్తాన్ సైనిక దళాలలోని, పోలీసులలోని, న్యాయవాదులలోని, మేధావులలోని, ప్రభుత్వ నిర్వాహకులలోని అత్యధికులు కొందరు పాకిస్తాన్ జిహాదీలు ఉగ్రవాదులుగా చెలామణి అవుతుండగా మరి కొందరు పాకిస్తానీ జిహాదీలు పోలీసులుగా పరిశోధకులుగా సైనికులుగా ప్రభుత్వ నిర్వాహకులుగా చెలామణి అవుతున్నారు. ఇలాంటి ప్రచ్ఛన్న ఉగ్రవాదులే ఇప్పుడు నేరపరిశోధక రూపంలో మన దేశానికి వచ్చారన్న అనుమానం అతార్కికం కాదు! ఎందుకంటే పాకిస్తాన్ సమాజపు సమష్టి తత్త్వం జిహాదీ ఉగ్రవాదం! అందువల్లనే పాకిస్తాన్‌లో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ లేదు! మన దేశంలో సమాజ సమష్టి ప్రవృత్తి సర్వమత సమభావం! అందువల్లనే మనం సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉన్నాము! ఇదీ తేడా...
అందువల్ల పాకిస్తాన్ దర్యాప్తు బృందాన్ని మనదేశంలోకి అనుమతించడం జిహాదీ మత విద్వేషానికి నాగరికతను మానవీయతను ఆపాదించినట్టు మాత్రమే అయింది! భారత ప్రభుత్వమే పాకిస్తానీ ఉగ్రవాద ప్రభుత్వ వ్యవస్థను నాగరిక ప్రభుత్వ వ్యవస్థగా అంగీకరించింది...ఆ ప్రభుత్వంతో కలిసి మెలసి పనిచేస్తోంది. అందువల్ల పాకిస్తాన్ దుశ్చర్యలను మనమెందుకు వ్యతిరేకించాలి? అని ప్రపంచ దేశాలు భావించడానికి మన ఈ విధాన వైపరీత్యం దోహదం చేస్తోంది. ఈ విధాన వైపరీత్యం దశాబ్దులుగా సాగుతోంది. పాకిస్తానీ దర్యాప్తు బృందం మన దేశానికి రావడమే పరాకాష్ఠ! ఇలా మనం పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వం పట్ల కఠినంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలేదు కనుకనే, అమెరికా పాకిస్తాన్‌కు మళ్లీ మళ్లీ మారణాయుధాలను సమర శకటాలను సమకూర్చుతోంది. ఇటీవల ఎఫ్16 యుద్ధ విమానాలను మరో ఎనిమిదింటిని పాకిస్తాన్‌కు సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. మన ప్రభుత్వం పాకిస్తాన్ జిహాదీ ప్రభుత్వంతో కలిసి దర్యాప్తులు పరిశోధనలు చేస్తున్నంత కాలం అమెరికా వంటి ఆయుధాలను అమ్ముకునే దేశాలను విమర్శించే నైతిక అధికారం మనకు ఎలా ఉంటుంది? రష్యా కూడ పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందాలను, ఆయుధ విక్రయ అంగీకారాలను కుదుర్చుకుంది! పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గతంలో ప్రధానిగా ఉన్నప్పుడు మన ప్రభుత్వాన్ని ఘోరంగా వంచించాడు. అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో ఒకవైపు మైత్రి చర్చలు జరుపుతూనే మరోవైపున కార్గిల్‌లోకి కిరాయి హంతకులను, సైనికులను ఉసిగొలిపాడు! ఇప్పుడు మనదేశానికి వచ్చిన పాకిస్తాన్ దర్యాప్తు బృందం వారు మన భౌగోళిక, వ్యూహాత్మక, స్థితిగతులను తెలుసుకుని వెళ్లగలరు. ఈ బృందం వారు మరోసారి బీభత్సకాండను జరపడానికి కుట్ర జరపబోరన్న హామీ ఎవరిస్తారు?
పఠాన్‌కోటకు పాకిస్తాన్ బృందం విచ్చేసిన పరిణామ క్రమంలో గొప్ప గందరగోళం నెలకొని ఉండడం మన ప్రభుత్వ అంతర్గత సమన్వయ రాహిత్యానికి అద్దం..పాకిస్తాన్ బృందం రానున్నట్టు జనవరిలోనే విదేశాంగ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ ప్రకటించారు. పాకిస్తాన్ బృందం ఏదీ మన దేశానికి రాదని, మన ప్రభుత్వం రానివ్వదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఐదురోజుల తరవాత స్పష్టం చేశారు. ఇలా ఈ జిట్ వస్తుందని రాదని అమాత్యులు అనేకసార్లు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసారు. చివరికి పాకిస్తాన్ బృందం రాకను సుషమా స్వరాజ్ నేపాల్‌లో ధ్రువీకరించింది. ఈ నిర్ణయం గురించి తనకేమీ తెలీదని దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ మార్చి 18న ప్రకటించడం అంతర్గత విభేదాలకు పరాకాష్ఠ...