సంపాదకీయం

చెదలెక్కుతున్న ‘నిప్పు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తుల మధ్య ‘ప్రక్రియ’కు సంబంధించిన ‘వివాదం’ చెలరేగినట్లు ప్రచారం జరగడం మిక్కిలి దురదృష్టకరం. నిజానికి ఇది వివాదం కాదు, వరిష్ఠ న్యాయమూర్తి జె.అచలమేశ్వర్ గురువారం నిర్ధారించిన విచారణ ‘ప్రక్రియ’ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా రద్దు చేశాడు! ఇది కేవలం అభిప్రాయ బేధానికి చిహ్నం! ఇతర న్యాయమూర్తులు చేసే న్యాయ ప్రక్రియకు సంబంధించిన నిర్థారణలను ప్రధాన న్యాయమూర్తి రద్దు చేయవచ్చు, మార్పు చేయవచ్చు! కానీ ఈ సంగతిని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు స్పష్టం చేయవలసి రావడమే విచిత్రమైన విపరిణామం! దీన్ని ‘వివాదం’ అనడం సమంజసం కాకపోవచ్చు! కానీ న్యాయమూర్తుల మధ్య ప్రక్రియకు సంబంధించిన ఏకాభిప్రాయం లోపించడం మాత్రం దురదృష్టకరం. అవినీతి ఆరోపణకు గురి అవుతున్న ఒక మాజీ ఉన్నత న్యాయమూర్తికి వ్యతిరేకంగా దాఖలైన ‘యాచిక’లు ఈ భిన్నాభిప్రాయానికి కారణం.. ఉన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు వినిపించడం ఇది మొదటిసారి కాదు. ఆరోపణలు ఏళ్ల తరబడి వెల్లువెత్తుతున్నాయి. ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఇస్రాత్ కుద్దూసీ మన్రూర్‌కు వ్యతిరేకంగా కేంద్ర నేర పరిశోధన మండలి - సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ - సిబిఐ - అవినీతి ఆరోపణలు దాఖలు చేయడం అందువల్ల ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఈ అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేయడానికై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ‘ప్రత్యేక పరిశోధక బృందం’’ - స్పెషల్ ఇనె్వస్టిగేటివ్ టీమ్ - సిట్ - ఏర్పడాలా వద్దా అన్నది ప్రస్తుతం నడుస్తున్న మీమాంస! ‘సిట్’ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ‘న్యాయ యాచిక’ను విచారించిన న్యాయమూర్తులు అచలమేశ్వర్, అబ్దుల్ ఎస్ నజీర్ ఈ విషయమై సోమవారం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించగలదని నిర్దేశించారు. వరిష్ఠతాక్రమం - ఆర్డర్ ఆఫ్ సీనియారిటీ -లో ఐదుగురు వరిష్ఠ న్యాయమూర్తులు ‘సిట్’ అంశాన్ని విచారించి నిర్ణయిస్తారన్నది న్యాయమూర్తి అచలమేశ్వర్ చేసిన నిర్థారణ. ఇలా నిర్థారించే అధికారం, ఏ న్యాయమూర్తి ఏ వివాదాన్ని, అంశాన్ని విచారించాలని నిర్థారించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే ఉందన్నది శుక్రవారం దీపక్ మిశ్రా చేసిన నిర్థారణ...
వరిష్ఠతాక్రమంలో ప్రధాన న్యాయమూర్తి తరువాతి వాడైన న్యాయమూర్తి అచలమేశ్వర్‌కు ఈ సంగతి తెలియదా? తెలిసినప్పుడు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని న్యాయమూర్తులు అచలమేశ్వర్, అబ్దుల్ నజీర్ ప్రధాన న్యాయమూర్తికి నివేదించి ఉండాలి! అలా జరగకపోవడం ‘‘ఉద్ధరణిలో ఉప్పెన’’ వంటి ఉత్కంఠకు దారితీసింది. కానీ ఈ వివాదాన్ని - ‘సిట్’ ఏర్పాటు వ్యవహారాన్ని - ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా విచారించరాదని, విచారణలో ఆయన ప్రమేయం ఉండరాదని ‘న్యాయయాచిక’ను దాఖలు చేసిన ఒక న్యాయమూర్తి కోరడం మరో విచిత్రం! ఉత్తరప్రదేశ్‌కు చెందిన బి.పి.యాదవ్, పలాస్ యాదవ్ అనేవారు లక్నోలో నడుపుతున్న ‘‘ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్’’ అన్న కళాశాలలో అనేక అక్రమాలు జరుగుతున్నందున ఈ కళాశాలకు రెండేళ్లపాటు ‘అనుమతి’ రద్దయింది. భారతీయ వైద్య అధికారిక మండలి - మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా - ఎమ్‌సిఐ - వారి నియమావళిని ఉల్లంఘించినందుకు తాత్కాలికంగా మూసివేతకు గురి అయిన నలబయి ఆరు వైద్య కళాశాలల్లో ఇది కూడ ఒకటి. 2017-18వ 2018-19వ విద్యాసంవత్సరంలో ఈ కళాశాలలలో కొత్తగా విద్యార్థులు చేరరాదు. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఈ ‘ప్రసాద్’ కళాశాలవారు సుప్రీంకోర్టులో న్యాయయాచికను దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ‘సుప్రీంకోర్టు’లో అనుకూలమైన నిర్ణయాన్ని సాధించిపెట్టడానికి కుట్ర చేసిన వారిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి కుద్దూసీ ఒకరన్నది అభియోగం! ‘న్యాయయాచిక’ను విచారించే సర్వోన్నత న్యాయమూర్తులకు ’‘లంచం’’ ఇస్తే వ్యవహారం సానుకూలవౌతుందని ఈ ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి వైద్య కళాశాల వారికి హామీ ఇచ్చాడన్నది ‘సిబిఐ’ దర్యాప్తులో తేలిన సంగతి! ఆ ‘న్యాయయాచిక’ విచారించిన సర్వోన్నత న్యాయమూర్తులలో ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి అయిన దీపక్ మిశ్రా ఒకరు. లక్నో వైద్య కళాశాలపై విధించిన నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం తొలగించలేదు. ఆ న్యాయయాచికను విచారించిన దీపక్ మిశ్రాకు ప్రస్తుతం ‘కుద్దూసీకి వ్యతిరేకంగా జరుగుతున్న విచారణతో సంబంధం ఉండరాదన్నది ‘సిట్’ను కోరుతున్నవారు కోరిన గొంతెమ్మ కోర్కె! ‘సిట్’ను కోరుతూ రెండు వేఱు వేఱు న్యాయ యాచికలు దాఖలయ్యాయి. రెండింటినీ ఒకే ‘్ధర్మాసనం’ విచారించి ఉండవచ్చు. వేఱువేఱు ధర్మాసనాలు విచారించడం సర్వోన్నత స్థాయి న్యాయ ప్రక్రియలో సమన్వయ లోపానికి నిదర్శనం కావచ్చు... కానీ ఈ ప్రక్రియపరమైన విభేదాలు నాటకంలో అంతర్ నాటకం వంటివి! ఉన్నత న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నట్లు అభియోగాలు దాఖలు కావడమే వౌలిక వైపరీత్యం..
గతంలో ఇలాంటి అభియోగాలు కొన్ని ధ్రువపడినాయి కూడ! నేరస్థులను శిక్షించవలసినది న్యాయమూర్తులు. న్యాయవ్యవస్థ ప్రజలకు రక్షణ కవచం! దుర్బలులను దౌర్జన్యకారులు పీడించకుండా రక్షించగలిగేది న్యాయవ్యవస్థ. మనదేశంలో అనాదిగా న్యాయవ్యవస్థ ఈ సామాజిక రక్షణ వ్యవస్థగా వికసించడం చరిత్ర. ఈ వాస్తవానికి ఆధునిక ధ్రువీకరణ మన రాజ్యాంగ వ్యవస్థ! అవినీతిపరులను, హంతకులను, వివిధ రకాల బీభత్సకారులను విచారించి శిక్షిస్తున్నది న్యాయవ్యవస్థ.. ప్రభుత్వాలు చట్టసభలు ప్రజావ్యతిరేక కలాపాలకు ఒడిగట్టకుండా నిరోధిస్తున్నది కూడ న్యాయవ్యవస్థ మాత్రమే! కానీ అవినీతి నిరోధకమైన వ్యవస్థకే అవినీతి ‘తెగులు’ సోకినట్టయితే ప్రజలకు దిక్కెవరు?? ‘కంచె’ చేలను మేయదు.. ‘నిప్పు’నకు చెద పట్టదు! న్యాయవ్యవస్థ నిప్పువంటిది! మరి చెద ఎందుకు పడుతోంది?? నిప్పులలో కొన్ని చల్లారి ‘బొగ్గు’లుగా మారుతుండడం నడుస్తున్న చరిత్ర.. ఈ ‘బొగ్గుల’కు చెదంటుతోంది! ఈ అక్రమ వైద్య కళాశాలల అవినీతి వ్యవహారంలో ప్రస్తుతం పదవులలో ఉన్న ఇద్దరు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులకు కూడ భాగస్వామ్యం ఉందన్నది ధ్రువపడని ఆరోపణ...
గతంలో, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సౌమిత్రసేన్, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పి.డి.దినకరన్ ఘోరమైన అవినీతి అభియోగ ఆరోపణలకు గురై పదవులకు రాజీనామా చేయవలసి వచ్చింది. లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్టు సౌమిత్రాసేన్‌పై ఆరోపణ వచ్చింది. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని దినకరన్ అక్రమంగా ఆక్రమించినట్టు ధ్రువపడింది. కానీ ఈ ఇద్దరు న్యాయమూర్తులు కూడ ‘‘రాజ్యాంగం కల్పించిన రక్షణ’’లను అడ్డుపెట్టుకొని పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాన్ని కూడ ధిక్కరించి వారు నిర్లజ్జగా వ్యవహరించారు. చివరికి పార్లమెంటు అభిశంసన తప్పదని స్పష్టమైన తరువాత పదవులకు రాజీనామా చేశారు! న్యాయ ధిక్కారానికి పాల్పడిన నేరానికి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు గత మే నెలలో ఆరునెలల జైలు శిక్ష విధించడం సరికొత్త విపరిణామం. కర్ణన్ ఆ తరువాత పదవీ విరమణ చేశాడు...