సంపాదకీయం

‘చతురస్ర’ దౌత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పు ఆసియా దేశాలతో మన చారిత్రక స్నేహ సంబంధాల ధ్యాస మరింత పెరగడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిలిప్పీన్స్‌ను సందర్శించడం వల్ల జరిగిన శుభ పరిణామం! హిందూ మహాసాగర, ప్రశాంత మహాసముద్ర సంగమ స్థలి అయిన ఆగ్నేయ ఆసియా ప్రాంత దేశాలు వేల ఏళ్లుగా మన దేశంతో సాంస్కృతిక సమానత్వం కలిగి ఉండడం ఈ పర్యటనకు ‘‘ప్రచారం కాని’’ నేపథ్యం.. భారతదేశంలోని గంగానది ఆగ్నేయ ఆసియా దేశాల ప్రజల సాంస్కృతిక స్మృతి పథం నుంచి తొలగకపోవడం నడుస్తున్న చరిత్ర! టిబెట్‌లో పుట్టి అనేక ఆగ్నేయ ఆసియా దేశాలలో ప్రవహిస్తున్న ‘మెకాంగ్’ నది మరో గంగా ప్రవాహం! థాయ్‌లాండ్ భాషలో ‘మెకాంగ్’ అన్న పదానికి ‘మాతృగంగ’ అని అర్థం! ఇదీ భారతదేశంతో ఆగ్నేయ ఆసియా దేశాలకున్న సమాన చారిత్రక వారసత్వ భూమిక! ఈ వారసత్వం ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనిలా నగరంలో ‘ఆసియాన్’ శిఖర సమావేశాల సందర్భంగా మరోసారి ఆవిష్కృతమైన రామాయణ నృత్య నాటిక ద్వారా మరోసారి పరిమళించింది. ‘ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి’ - అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టరన్ ఆసియన్ నేషన్స్ - ఆసియాన్ - ప్రధాన వేదికగా మనిలాలో మూడు రోజుల పాటు వివిధ అంతర్జాతీయ సదస్సులు జరిగాయి! ఈ సదస్సుల ప్రధాన ఇతివృత్తం హిందూ మహాసాగర, ప్రశాంత సముద్ర ప్రాంత దేశాల మధ్య సహకారం! ‘ఆసియాన్ కూటమి’ దేశాలకు నలువైపుల నెలకొని ఉన్న దేశాలతో ఈ ‘కూటమి’ దేశాల సంబంధాలు విస్తరిస్తూ ఉండటం గత రెండు దశాబ్దుల పరిణామక్రమం! ఈ సంబంధాల మధ్య సహజమైన చారిత్రక స్నేహం నిహితమై ఉండడం ఒక ప్రధాన వాస్తవం. ఈ కూటమికి పశ్చిమంగా ఉన్న మన దేశం ఈ వాస్తవానికి ప్రతీక! లుక్‌ఈస్ట్ - తూర్పు వైపు దృష్టి- అన్న మన ప్రభుత్వ విధానం ‘యాక్ట్ ఈస్ట్’ - తూర్పు వైపుగా కార్యాచరణ -గా వికసించడం నరేంద్రమోదీ పర్యటనకు పూర్వరంగం. మనిలాలో మన ప్రధాని వివిధ ‘ఆసియాన్’ అధినేతలతో జరిపిన ద్వైపాక్షిక, బహుళ పక్షీయ చర్చల వల్ల ఈ వికాసక్రమం మరింత విస్తరించింది!! 1967 ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇండోనేసియా, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ దేశాల ‘ఆసియాన్’గా ఏర్పడినాయి. థాయ్ రాజధాని బాంకాక్ వేదికగా తొలి సమావేశం జరిగింది. ఇదే ‘‘బాంకాక్ ప్రకటన’’... ఆ తరువాత ఈ కూటమిలో బర్మా - మ్యాన్‌మార్ - కంబోడియా, లావోస్, బ్రూనీ, వియత్నాం దేశాలు చేరాయి!! ‘ఆసియాన్’తో మన దేశం జరిపిన పదిహేనవ శిఖర సభ మనిలాలో భాగస్వామ్య సమావేశం..
ఈ సమావేశానికి సమాంతరంగా మనిలాలో ముప్పయి ఒకటవ ‘ఆసియాన్’ భాగస్వామ్య సమావేశం జరిగింది. ‘ఆసియాన్’కు దక్షిణంగా ఆగ్నేయంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు విస్తరించి ఉన్నాయి! ఉత్తరంగా చైనా, దక్షిణ కొరియా దేశాలు నెలకొని ఉన్నాయి. తూర్పున-ఈశాన్య ప్రాంతాన - జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు -యుఎస్‌ఏ- ఉన్నాయి. ఈ పరస్పర వైరుధ్య వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాలు నిహితమై ఉన్న ఈ దేశాలన్నీ ‘ఆసియాన్’ వాణిజ్య భాగస్వామ్య సదస్సులో పాల్గొంటుండటం ‘ఆసియాన్’ ప్రపంచానికి వ్యూహాత్మక కేంద్ర బిందువుగా మారిందనడానికి నిదర్శనం! చైనా ‘విస్తరణ’ ఆసియాన్ దేశాలకు ప్రధాన ప్రమాదంగా పరిణమించి ఉంది. దాదాపు అన్ని ఆసియాన్ దేశాలతోను జపాన్‌తోను చైనాకు ప్రాదేశిక వివాదాలు - టెర్రిటోరియల్ డిస్‌ప్యూట్స్ - కొనసాగుతున్నాయి! హిందూ మహాసాగర, ప్రశాంత మహాసముద్రం మధ్య విస్తరించి ఉన్న రెండు ప్రాంతాలు ప్రస్తుతం చైనా వ్యూహాత్మక దురాక్రమణకు ఆలవాలమై ఉన్నాయి! వియత్నాంకు తూర్పుగాను చైనాకు దక్షిణంగాను, మొదటి సముద్ర ప్రాంతం విస్తరించి ఉంది. జపాన్‌కు దక్షిణంగాను, చైనాకు తూర్పుగాను రెండవ సముద్రం నెలకొని ఉంది. ఈ రెండు సముద్రాలలోను చైనా వ్యూహాత్మక దురాక్రమణను ‘ఆసియాన్’ దేశాలు జపాన్, అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలు నిరోధించడానికి యత్నిస్తున్నాయి. అయినప్పటికీ ‘ఆసియాన్’ దేశాలతో చైనాకు వాణిజ్య భాగస్వామ్యం పెరుగుతుండడం విచిత్రమైన వ్యవహారం. ఈ వైచిత్రి ‘మనిలా’ సభల ద్వారా మరోసారి ఆవిష్కృతమైంది... పనె్నండవ తూర్పు ఆసియా శిఖర సభ ద్వారా ధ్రువపడింది.. భద్రత, రక్షణ వంటి వాటికంటె వాణిజ్యం ప్రాధాన్యం సంతరించుకొనడం ‘ప్రపంచీకరణ’ ప్రభావం....
విస్తరిస్తున్న చైనా దురాక్రమణ వ్యూహాన్ని అడ్డుకొనడానికి వీలుగా ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లతో కలసి మన దేశం చతురస్ర కూటమిని ఏర్పాటు చేయగలగడం ‘ఆసియాన్’ సభల సందర్భంగా సంభవించిన మరో అంతర్జాతీయ పరిణామం! ఈ చతురస్రం - క్వాడ్‌లేటరల్ అలియన్స్ -క్వాడ్ - ఇటీవల లాంఛనంగా అవతరించింది. ‘క్వాడ్’ ప్రభుత్వాధినేతలు తొలి సమావేశం జరపడానికి ‘ఆసియాన్’ సభలు వేదిక కావడం చైనాకు నచ్చని వ్యవహారం.. ఇన్ని ఏళ్ల తరువాత చైనా ప్రసక్తిలేని ఒక ‘దౌత్య సంఘటన’- చతురస్ర కూటమి ఏర్పడడానికి కారణం చైనా దుందుడుకుతనం. వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనా, జపాన్‌ల మధ్య విస్తరించి ఉన్న అంతర్జాతీయ సముద్ర జలాల - ఇంటర్నేషనల్ వాటర్స్ - ను తన సార్వభౌమ జలాలు - టెర్రిటోరియల్ వాటర్స్ - గా మార్చడానికి చైనా పదేళ్లుగా యత్నిస్తోంది. వియత్నాంకు తూర్పుగా ఉన్న సముద్రంలో మన దేశం చమురు నిక్షేపాలను అనే్వషించాలని వియత్నాం కోరింది. కానీ ఈ ప్రయత్నాన్ని ఆరేళ్లుగా చైనా అడ్డుకుంటోంది. రెండేళ్ల క్రితం చైనా ఈ సముద్ర ప్రాంతాన్ని, గగనతలాన్ని ‘స్వీయ రక్షణ మండలం’గా ప్రకటించిన తరువాత ఈ మొత్తం సముద్ర ప్రాంతం అంతర్జాతీయ వైరుధ్యాలకు ఆలవాలమైంది. తమ అనుమతి లేకుండా విదేశాల నౌకలు, విమానాలు ఈ ప్రాంతంలో ప్రవేశించరాదన్న చైనా దౌర్జన్య విధానాన్ని ‘ఆసియాన్’ దేశాలు నిరసించాయి. జపాన్, దక్షిణ కొరియా, అమెరికా నౌకలు విమానాలు చైనా అనుమతి లేకుండానే సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు ప్రజాస్వామ్య దేశాలు - భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ - ‘చతురస్ర కూటమి’ ఏర్పడడం అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకొంది!
ఈ వ్యూహాత్మక, వాణిజ్య, రాజకీయ, దౌత్య క్రీడల ప్రచార ఆర్భాటంలో నిహితమై ఉన్న ప్రచారం కాని మహా విషయం ‘ఆసియాన్’ దేశాలతో మన సాంస్కృతిక సమానత్వం విస్తరిస్తూ ఉండడం... విభిన్న మతాల ఆగ్నేయ ఆసియాలో సహస్రాబ్దులపాటు హైందవ సంస్కృతి విస్తరించడం చరిత్ర. అందువల్ల ప్రాచీనకాలంలో ‘ఆసియాన్’ కూటమి ప్రాంతాన్ని ‘విస్తృత భారత్’ - గ్రేటర్ ఇండియా - అని పిలిచారు. అతి పెద్ద హైందవ ఆలయం ‘ఆంగ్‌కార్ వాట్’ - అంకురవటం లేదా అంగార వాటిక కంబోడియాలో ఉంది...