సంపాదకీయం

హరిత రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాలను నిర్మించడానికి నడుం బిగించడం, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ కార్యక్రమానికి సమాంతర పరిణామం. అక్కడ రాజధాని నిర్మాణానికి ఇక్కడ సచివాలయ నూతన భవన నిర్మాణానికి వ్యతిరేకత ఏర్పడడం ఈ సమాంతర శుభ పరిణామాలలో నిహితమై ఉన్న అపశ్రుతులు. అమరావతి నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా పవిత్రవంతమైన మట్టిని తీసుకొనివచ్చి నిక్షిప్తం చేసి వెళ్లడం చారిత్రక మహాపరిణామం. ఇక్కడ జరిగినట్టుగానే అక్కడ భాగ్యనగరంలో కూడ నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నాడట! నూతన సచివాలయ భవన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నది తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినమాట. సచివాలయం, శాసనసభ, శాసనమండలి, వివిధ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఒకేచోట నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. ఒకటి నూతన రాజధాని నిర్మాణ కార్యక్రమం, రెండవది రాజధానిలో నూతన నిర్మాణాల కార్యక్రమం! ఈ రెండు కార్యక్రమాలకు ఎదురైన అడ్డంకులు తొలగిపోతున్నాయనడానికి శుక్రవారం ‘జాతీయ హరిత న్యాయమండలి’ - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ - ఇచ్చిన తీర్పు నిదర్శనం. అమరావతి నిర్మాణం వల్ల ‘హరిత పరిరక్షణ’కు భంగం కలుగబోదన్నది ‘న్యాయమండలి’ ఇచ్చిన తీర్పు. హరిత నియమాలకు విఘాతం కలుగుతుందని, పర్యావరణం పాడయిపోతుందని, నదీజలాలు కాలుష్యగ్రస్తం అవుతాయని, వరదలు తుపానులు నూతన రాజధాని ప్రాంతాన్ని ముంచెత్తుతాయని ‘నిర్మాణ వ్యతిరేకులు’ చేసిన వాదాన్ని హరిత న్యాయ మండలి తోసిపుచ్చడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గొప్ప విజయం. నూతన రాజధాని నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ పరిరక్షణ నిహితం కావాలన్న ‘హరిత న్యాయమండలి’ ఆదేశాన్ని చిత్తశుద్ధితో అమలు జరుపడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్తవ్యం. నూతన రాజధాని ప్రాంగణంలోని కొండవీటి వాగు ప్రవాహ దిశను, ప్రవాహ గతిని మార్చరాదన్నది ప్రధాన నిబంధన. కొండలను గుట్టలను అడవులను నదులను జలాశయాలను యథాతథంగా ఉంచాలన్న ‘హరిత న్యాయ మండలి’ ఆదేశం అమలు జరిగినట్టయితే అమరావతి ‘సతత హరిత నగరం’గా వికసించగలదు. ఇలా ‘కట్టడాల’ మధ్య పూలతోటల పండ్లతోటల అడవులు నీటిధారలు ఏర్పడడం తోటల మధ్య అడవుల మధ్య జలాశయాల పక్కన ‘కట్టడాలు’ ఏర్పడడం సనాతన భారత జాతీయ నిర్మాణ సంప్రదాయం. ‘‘పాలన’’ పేరుతో మనదేశాన్ని శతాబ్దులపాటు కొల్లగొట్టిన విదేశీయ రాజకీయ బీభత్సకారులు ఈ సంప్రదాయాన్ని ధ్వంసం చేసిపోయారు. కట్టడాల మధ్య పచ్చదనం లేకపోవడానికి, సిమెంటు అరణ్యాలుగా నగరాలు మారడానికి ఇదీ కారణం!
సిమెంటు కట్టడాల కూపంగా రాజధానిని నిర్మించడం తమ అభిమతం కాదన్నది ‘హరిత న్యాయ మండలి’ వారు అవరోధాలను తొలగించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట! అందువల్ల కాలుష్య రహితమైన ఆకుపచ్చని అందాల నగరంగా అమరావతి ఏర్పడబోతోందని ఆశించవచ్చు! కొండవీటి వాగును కాని కృష్ణా జలాలను కాని, అటవీ ప్రాంతాన్నికాని కొండలను గుట్టలను కాని పరిరక్షించడం అంటే వీటిని పరిశుభ్రంగా ఉంచడం. కాలుష్యం కేంద్రీకృతంకాని విధంగా రాజధాని నిర్మాణం జరుగనున్నదన్నమాట! కానీ నూతన రాజధానిని ‘తొమ్మిది నగరాల’ కూడలిగా ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకం ఈ హరిత పరిరక్షణకు విఘాతకరం కాగలదన్నది సామాన్య విజ్ఞానం. జనం విపరీతంగా కేంద్రీకృతం కావడం కాలుష్యం విస్తరించడానికి ప్రధాన కారణం! అందువల్ల జనం వికేంద్రీకృతం అయ్యే విధంగా మాత్రమే రాజధానుల నిర్మాణం జరగాలి! దీన్ని సైద్ధాంతికంగా వల్లించడం సులభం, ఆచరణాత్మక జీవన వారస్వతంగా మార్చడం కష్టం! రాజధానుల నిర్మాణంకాని రాజధానులలో నిర్మాణాలు కాని ఈ ఆచరణాత్మక జీవన వాస్తవ భూమికపై నిర్మాణం జరిగినప్పుడు కాలుష్యం కేంద్రీకృతం కాదు. కాలుష్యాన్ని గ్రహించి జీర్ణించుకొని పచ్చదనపు పరిమళాలను పంచగల సహజ పారిశుద్ధ్య ప్రక్రియ ప్రకృతిలో నిహితమై ఉంది! కాని, ప్రతి చదరపు అడుగులోను, ప్రతి చదరపు కిలోమీటరు ప్రాంగణంలోను, ప్రతి వంద చదరపు కిలోమీటర్ల క్షేత్రంలోను ప్రకృతి జీర్ణం చేసుకోగల కాలుష్యానికి గరిష్ఠస్థాయి ఉంది. ఈ గరిష్ఠ స్థాయికి మించిన కాలుష్యం వెలువడుతుండడం వల్ల కాలుష్యాన్ని ప్రకృతి జీర్ణం చేసుకోలేకపోతోంది! నగరాలలో నిర్మాణమైపోయిన, నిర్మాణం కాబోతున్న అంతస్థుల భవనాలు ఆకాశహర్మ్యాలు భూమి పట్టలేనంతగా జనాన్ని, వాహనాలను, కాలుష్యాన్ని కేంద్రీకరిస్తున్నాయి
ముప్పయి మూడు వేల ఎకరాల అమరావతి ప్రాంగణంలో ఎనిమిదో తొమ్మిదో బృహత్ నగరాలను నిర్మించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇది జనాభా కేంద్రీకరణకు దారితీయగల పరిణామం! పది ఇరవై తొంబయి వంద అంతస్థుల భవనాలు కూడ ఏర్పడనున్నాయన్నది జరుగుతున్న ప్రచారం! ‘అంతస్థుల’ వల్ల జనం, కాలుష్యం కేంద్రీకృతమై కొలువుతీరగలవు. ఎతె్తైన కట్టడాలను నిర్మించడం భారతీయులకు అనాదిగా తెలుసు. కాని దేశంలో వేళ్లమీద లెక్కపెట్టగల ఎతె్తైన కట్టడాలు మాత్రమే వెలిశాయి. ఎందుకంటె ఒక కుటుంబం నివసించదగిన స్థలంలో ఒకదానిపై ఒకటిగా పది కుటుంబాలను ఇరవై కుటుంబాలను ఇంకా ఎక్కువ కుటుంబాలను నివసింపచేయడం వల్ల జనసాంద్రత పెరిగి కాలుష్యం కేంద్రీకృతం అవుతుందని భూగర్భం ఎండిపోతుందని భారతీయులకు తెలుసు...
అందువల్ల అమరావతిని ‘నిలువున’ నిర్మించకుండా అడ్డంగా విస్తరింప చేయడం అభిలషణీయం. ‘పాలనానగరం’ ‘న్యాయ నగరం‘ - ఈ రెండింటిని మాత్రమే ‘అమరావతి’లో నిర్మించడం వల్ల రాజధాని నగరం ఆకుపచ్చని అందచందాలతో అలరారగలదు. ఈ రెండు నగరాలలోని భవనాలను కూడా రెండస్థులతో నిర్మించినట్టయితే ప్రకృతి జీర్ణం చేసుకోగలిగినంత కాలుష్యం మాత్రమే వెలువడుతుంది. ముప్పయి మూడు వేల ఎకరాల ప్రాంగణంలో సగం తోటలకు పచ్చదనానికి అడవులు పెంచడానికి కేటాయిస్తే చంద్రబాబు నాయుడు ఇటీవల చెప్పినట్లు యాబయిశాతం పచ్చదనం విస్తరిస్తుంది. రాష్ట్ర విస్తీర్ణంలో యాబయి శాతం మేర చెట్లను అడవులను పెంచాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. మిగిలిన క్రీడావాణిజ్య, విద్యా, సాంస్కతిక నగరాలవంటివి జిల్లా కేంద్రాలలో నిర్మించినట్టయితే ‘వికేంద్రీకృతం’ అన్న ఆదర్శం ఆకృతిదాల్చగలదు. తెలంగాణ ప్రభుత్వం సచివాలయాన్ని తరలించడం వల్ల నగర మధ్యంలో జనం, కాలుష్యం తగ్గడానికి వీలుంది. కానీ సచివాలయాన్ని, శాసన మండలిని శాసనసభను, హైకోర్టును ఇతర కార్యాలయాలను మహానగరానికి కనీసం యాబయి కిలోమీటర్ల ఆవలకు తరలించినట్టయితే మహానగరంలో కాలుష్యం తగ్గడానికి వీలుంది. భుననగిరి వద్దనో, షాద్‌నగర్ సమీపంలోనో చేవెళ్ల వద్దనో సిద్దిపేట వద్దనో ఈ పాలనా నగరాన్ని నిర్మించడం మేలు. గుజరాత్‌లోను ఒరిస్సాలోను ఇలా పాత రాజధానులకు సమీపంలో కొత్త రాజధానులను నిర్మించి ‘వికేంద్రీకరణ’ను సాధించారు...