బిజినెస్

ప్రయాణికులకు స్పైస్‌జెట్ రీయింబర్స్‌మెంట్ సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. తమ ప్రయాణికులకు సోమవారం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విమాన రాకపోకల్లో చోటుచేసుకునే అసౌకర్యాలకుగాను ప్రయాణికులకు రీయింబర్స్‌మెంట్ సదుపాయాన్ని కల్పించింది. ముందే బుక్ చేసుకున్న మార్గాల్లో విమానాలు రద్దైనా, ఆలస్యమైనా ప్రయాణికులకు మరో ఫ్లైట్ టిక్కెట్ కోసం రీయింబర్స్‌మెంట్ ఉంటుందని ప్రకటించింది. 90 నిమిషాలకుపైగా ప్రయాణాల్లో విమానాలు రద్దు లేదా ఆలస్యమైతే ప్రయాణికులకు 24 గంటల్లోగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని స్పష్టం చేసింది. అయతే షరతులు వర్తిస్తాయని స్పైస్‌జెట్ ప్రకటనలో పేర్కొంది.

తగ్గిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) లేదా జెట్ ఫ్యూయెల్ ధర సోమవారం కిలోలీటర్‌కు 4,765.5 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ ఎటిఎఫ్ ధర 35,126.82 రూపాయలుగా ఉంది. అలాగే నాన్-సబ్సిడీ ఎల్‌పిజి (వంటగ్యాస్) సిలిండర్ ధర కూడా 82.5 రూపాయలు తగ్గింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలూ సోమవారం అతి స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర 4 పైసలు, డీజిల్ ధర 3 పైసల చొప్పున తగ్గించాయి ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోతున్న ముడి చమురు ధరలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం.

ఎస్‌బిఐ నూతన
గృహ రుణ పథకం
ముంబయి, ఫిబ్రవరి 1: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ సోమవారం ఓ నూతన గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించామని, ‘ఎస్‌బిఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్’ పేరుగల ఈ పథకం క్రింద మరింత రుణ మొత్తాన్ని అందుకోవచ్చని ఓ ప్రకటనలో ఎస్‌బిఐ స్పష్టం చేసింది. దీంతో మరింత పెద్ద ఇంటిని కొనుగోలు చేసే వీలుంటుందని పేర్కొంది.