సంపాదకీయం

నేపాల్ ‘పయనం’ ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్ ‘పార్లమెంట్’ ఎన్నికలలో వామపక్షాల కూటమి విజయం సాధించడం ఈ ‘పొరుగు దేశం’లో సంభవించిన మరో భారత వ్యతిరేక పరిణామానికి చిహ్నం! ఇరవై రెండేళ్ల క్రితం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. ‘నేపాల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ - సిపిఎన్, యుఎమ్‌ఎల్ - పార్టీ వారు ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియను సమర్థించారు. ‘చీలిక’ తరువాత ఏర్పడిన రెండవ పార్టీ - ‘నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ - దశాబ్దిపాటు భయంకర బీభత్సకాండను సృష్టించింది. ఆ రక్తపాతానికి మూడు వేల మంది బలైపోవడం చరిత్ర! ఈ ‘చీలిక’ చైనా ప్రభుత్వ ప్రేరణతో జరిగింది. నేపాల్‌లో బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడకుండా నిరోధించడం చైనా లక్ష్యం! ఎందుకంటె ‘బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ’ వల్ల నేపాల్ అనాదిగా భారత్‌తో కొనసాగిస్తున్న సాంస్కృతిక, వ్యూహాత్మక స్నేహసంబంధాలు యథాతథంగా కొనసాగుతాయి. భారత్ నేపాల్ దేశాల భద్రత ముడిపడి ఉంది. ఈ ఉమ్మడి భద్రతకు చైనా దురాక్రమణ వల్ల నిరంతరం ప్రమాదం పొంచి ఉంది. నేపాల్‌లో ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చైనా కుట్ర సాగించింది. ఈ కుట్రలో భాగంగానే ‘నేపాల్ మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ - సిఎఎన్, మావోయిస్ట్ - పదేళ్లపాటు ‘సాయుధ సమరం’ పేరుతో బీభత్సకాండ సాగించింది. కానీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం దక్కడం అసంభవమని భావించిన ఈ చైనా ‘ప్రచ్ఛన్న దళం’ - మావోయిస్ట్ పార్టీ - పనె్నండేళ్ల క్రితం సాయుధ మార్గాన్ని వదిలిపెట్టింది, ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నట్లు ‘మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ’ అధినేత పుష్పకమల్ దహాల్ ప్రచండ ప్రకటించాడు. కానీ ఆ తరువాత రెండుసార్లు జరిగిన నేపాల్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో ‘మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్టు పార్టీ’ వారు ‘మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ’ వారు విడివిడిగా పోటీ చేశారు. మూడవ ప్రధాన జాతీయ రాజకీయ పక్షం నేపాలీ కాంగ్రెస్! తొమ్మిదేళ్ల క్రితం జరిగిన మొదటి ‘రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాని, నాలుగేళ్ల క్రితం జరిగిన రెండవ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాని ఏ ‘పార్టీ’కి మెజారిటీ రాలేదు. దీనికి ఏకైక కారణం ఈ ముక్కోణపు పోటీ! ఆ ఎన్నికల తరువాత మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ కొన్ని రోజులు ‘నేపాలీ కాంగ్రెస్’తోను మరికొన్ని సార్లు మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్టు పార్టీతోను జట్టు కట్టింది! మొదటిసారి తొమ్మిదేళ్ల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికలలో అగ్రగామిగా నిలిచిన మావోయిస్ట్ పార్టీ, నాలుగేళ్లక్రితం నాటి ఎన్నికలలో ఘోర పరాజయం పాలై, మూడవ స్థానానికి దిగజారింది! నేపాలీ కాంగ్రెస్ ఆ ఎన్నికలలో మొదటి స్థానం సాధించింది. నూతన రాజ్యాంగం ఏర్పడిన తరువాత ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ‘ఉభయ కమ్యూనిస్టు పార్టీ’లు కలసికట్టుగా పోటీ చేశాయి. ఈ కూటమికి ఘన విజయం లభించడానికి ఇదీ కారణం!! గత ఎన్నికల - రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు -లో మొదటి స్థానంలో నిలిచిన నేపాలీ కాంగ్రెస్ ఇప్పుడు ఘోర పరాజయం పాలు కావడానికి ఈ ‘కమ్యూనిస్టు పార్టీల’ ఏకత ఏకైక కారణం...
ఇరవై రెండేళ్ల క్రితం చీలిన కమ్యూనిస్ట్ పార్టీలోని ఇరువర్గాలు - మార్క్సిస్ట్ లెనినిస్ట్‌లు, మావోయిస్టులు - ఇప్పుడు మళ్లీ ‘ఐక్య కూటమి’ కావడం చైనా వ్యూహంలో భాగం.. ఈ ఎన్నికలలో ‘మార్క్సిస్ట్ లెనినిస్ట్’ పార్టీతో జట్టు కట్టడం ద్వారా ‘మావోయిస్ట్’ పార్టీ తన ఉనికిని మాత్రం కాపాడుకోగలిగింది. ఈ కూటమి గెలిచినప్పటికీ అత్యధిక స్థానాలు ‘మార్క్సిస్టు లెనినిస్టు’ పార్టీకి దక్కడం ఇందుకు నిదర్శనం... మావోయిస్టు అధినేత పుష్పకమల్ దహాల్ ప్రచండ మరోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ అధినేత కృష్ణప్రసాద్ శర్మ ఓలీ మరోసారి ప్రధానమంత్రి అవుతున్నాడు. అయినప్పటికీ చైనా చంకబిడ్డలైన ప్రచండ బృందం వారు తమ ‘్భరత వ్యతిరేక’ కార్యక్రమాన్ని రానున్న రోజులలో కొనసాగించే అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఓలీ ప్రభుత్వం మనుగడ మావోయిస్టు పార్టీ సమర్ధన కొనసాగడంపై ఆధారపడి ఉంది.
తొమ్మిదేళ్ల క్రితం మావోయిస్టు నేత ప్రచండ మొదటిసారి నేపాల్ ప్రధానమంత్రి అయ్యాడు. పదకొండు నెలల ‘పాలన’లో ఆయన ప్రభుత్వం అనేక భారత వ్యతిరేక కలాపాలను సాగించింది! బోధనలోను, పాలనలోను హిందీ ప్రాధాన్యం తగ్గించారు. పశుపతినాథ దేవాలయంలో రెండువేల ఏళ్లకు పైగా కర్నాటక ప్రాంతానికి చెందినవారు అర్చకులుగా కొనసాగుతున్నారు. ఈ సంప్రదాయాన్ని రద్దు చేయడానికి అప్పటి ప్రచండ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి సమ్రాట్ విక్రముడు అఖండ భారత దేశాన్ని పాలించాడు. విక్రముని సామ్రాజ్య రాజ్యాంగ వ్యవస్థలోని యాబయి ఆరు భారత రాజ్యాలలో నేపాల్ ఒకటి! ‘శకుల’ దురాక్రమణను తిప్పికొట్టిన సమ్రాట్ విక్రముడు తన విజయచిహ్నంగా నూతన ‘కాలగణన’ పద్ధతిని ఆరంభించాడు. అది ‘సంవత్’ - విక్రమ శకం -! ఈ ‘సంవత్’ను విక్రముడు నేపాల్‌లోనే లాంఛనంగా ఆరంభించడం చరిత్ర... అప్పటి నుంచి రెండువేల సంవత్సరాలకుపైగా ‘విక్రమ సంవత్’ నేపాల్‌లో ఆధికారిక కాలగణన పద్ధతి! ఈ ఆధికారిక విక్రమ సంవత్‌ను ప్రచండ ప్రభుత్వం రద్దు చేసింది! బ్రిటన్ దురాక్రమణదారుల ‘పాలన’ స్థిరపడే వరకు నేపాల్ అఖండ భారత్‌లో భాగం! అనాదిగా నేపాల్ భద్రతతో భారత భద్రత, భారత ప్రగతితో నేపాల్ ప్రగతి ముడివడి ఉన్నాయి. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది నుంచి, బ్రిటన్ పాలిత భారత్‌లో చేరని, నేపాల్ స్వతంత్ర దేశమైంది. ఇరవై శతాబ్ది ఆరంభంలో బ్రిటన్ కూడ నేపాల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. మనదేశం బ్రిటన్ ముక్తమైన తరువాత మనదేశం నేపాల్ స్వతంత్ర దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ ఉభయ దేశాల సాంస్కృతిక జాతీయత ఒక్కటే! 1949లో ఉభయ దేశాల మధ్య కుదిరిన ‘వాణిజ్యం, రాకపోకల ఒప్పందం’, 1950లో కుదిరిన ‘స్నేహం, శాంతి’ అంగీకారం ఈ తరతరాల సాంస్కృతిక జాతీయ సమానత్వానికి ప్రతీకలు! ఈ ఒప్పందాలను రద్దు చేయాలని ప్రచండ బృందం వారు ఇరవై ఏళ్లుగా కోరుతున్నారు.
నేపాల్ సైనిక దళాలను చైనాకు అనుకూలంగా తీర్చిదిద్దాలన్న వ్యూహం బెడిసికొట్టడంలో పదకొండు నెలలు గడవకముందే ప్రచండ ప్రధానిగా పదవీచ్యుతుడయ్యాడు!! నాలుగేళ్ల క్రితం జరిగిన ‘పరిషత్’ ఎన్నికలలో ఘోరంగా ఓడినప్పటికి ప్రచండ గత ఏడాది ఆగస్టులో మళ్లీ ప్రధాని అయ్యాడు. కాగలగడం ‘మావోయిస్టుల’ బెదరింపు రాజకీయాలలో భాగం. అయినప్పటికీ ఈ సంవత్సరం జూన్‌లో ప్రచండ మళ్లీ పదవిని పరిత్యజించవలసి వచ్చింది. ఇప్పుడు ప్రచండ మద్దతు నూతన ప్రధాని ఓలీకి ఎంతకాలం ఉంటుందో?? ఎందుకంటె గత ఏడాది ఓలీ ప్రధానమంత్రి పదవిని కోల్పోవడానికి కారణం మావోయిస్టులు మద్దతును ఉపసంహరించడం!