సంపాదకీయం

పర్యావరణ ‘వైరుధ్యం’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదవ కులాల ప్రగతి కోసం, ఈ కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు జరుపతలపెట్టిన పథకాలు ఆ కులాలకు మాత్రమే కాక తెలంగాణ గ్రామీణ ప్రజలందరికీ ప్రయోజనం కలిగించగలవు. వారంలో ఏడు రోజుల పొడవునా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలపాటు వ్యవసాయ రంగానికి విద్యుచ్ఛక్తిని సరఫరా చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన కూడ గ్రామీణ ప్రజల సమష్టిహిత సాధనకు దోహదం చేయగలదు! పాడి పంటలు వౌలికమైన సహజమైన ప్రగతికి ప్రాతిపదికలు. ఏ ఇతర ‘సదుపాయాలు’ ‘్భగాలు’ లేకపోయినప్పటికీ జనం జీవించగలరు. కాని తిండి లేకపోయినట్టయితే మానవులు మాత్రమే కాదు, జీవజాలం మొత్తం మనుగడ సాగించలేదు! అందువల్ల పాడి, పంట మన సమాజపు మనుగడకు ‘్భమిక’లు... కోకాపేట్‌లో గొల్ల, కుర్మ సముదాయ భవనాలకు శుక్రవారం శంకుస్థాపన జరిగిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రసంగంలో కూడ వివిధ కులాల సమష్టి హితంతో ముడివడిన సమన్వయం ధ్వనించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, క్రీస్తు శకం 2029 నాటికి రాష్ట్రం విస్తీర్ణంలో యాబయి శాతం మేర అడవులు ఏర్పడేందుకు వీలైన చర్యలను ప్రారంభించినట్టు ప్రకటించారు! తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ గ్రామీణ వికాస రథానికి చక్రాలైన పాడి పంటలను పెంపొందించడానికి యత్నిస్తున్నాయి! సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! కానీ సమాంతరంగా ఈ ప్రాకృతిక, వ్యవసాయ, గ్రామీణ ప్రగతికి విఘాతకరమైన కలాపాలకు కూడ ప్రభుత్వాలు ఒడిగడుతున్నాయి. ఉదాహరణకు లక్షలాది గొర్రెలను, బర్రె - గేదె - లను కుర్మ, గొల్ల కులాల వారికి పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇవి దేశవాళీ పశువులు, ప్రకృతి సిద్ధమైన జీవ ప్రక్రియకు ప్రతీకలు. అదే దేశవాళీ ఆవులను కూడ యాదవ కులాలకు పంపిణీ చేయడం వల్ల ఆరోగ్యవంతమైన పాలు పెరుగు నెయ్యి మాత్రమేకాక సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన గోమూత్రం, గోమయం - ఆవు పేడ - కూడ లభిస్తాయి! కానీ కృత్రిమ పద్ధతులలో రూపొందే ‘బ్రాయిలర్’ గొర్రెలను కూడ భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక పరిశోధన సంస్థ ‘సిఫార్సు’ చేసిందట...
మానవుల ఆరోగ్యం జంతుజాలం ఆరోగ్యంతోను, జంతుజాలం ఆరోగ్యం వృక్షజాలం ఆరోగ్యంతోను ముడివడి ఉండటం ప్రకృతి నిహిత జీవన సత్యం! ఈ స్పష్టగత వ్యవస్థలోని జీవ వైవిధ్య సమతుల్యాన్ని పరిరక్షించడం యుగయుగాలుగా భారత జాతీయ జీవన ప్రస్థానంలోని వౌలిక సంస్కారం! ఈ వౌలిక సంస్కారం గత కొన్ని దశాబ్దులుగా అడుగంటి పోతోంది. ఫలితంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. ప్రకృతి నిరంతరం గాయపడుతోంది, అటవీ భూముల వైశాల్యం వ్యవసాయ క్షేత్రాల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది! పాలిచ్చే ఆవుల సంఖ్య పాడిపశువుల సంఖ్య అంతరించి పోతుండడం వ్యవసాయ వైపరీత్యంతో ముడివడిన సమాంతర విపరిణామం! అటవీ వైశాల్యం తగ్గిపోవడం వల్ల వన్య ప్రాణులు సంఖ్య తగ్గడమే కాదు కొన్ని జాతుల వన్య ప్రాణులు పూర్తిగా అంతరించి పోయాయి! ఇలా అంతరింపచేసిన మానవ కృత్యాల వల్ల సంభవిస్తున్న భయంకర పరిణామాలకు మానవులు బలి అయిపోతున్నారు. ‘్భస్మాసుర క్రీడ’కు ఆధునిక మానవ చేష్టలు, ‘పునరావృత్తి’గా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర... ఈ ‘చరిత్ర’ను పాశ్చాత్య దేశాల వారు ఆరంభించారు. బ్రిటన్ ‘దొరలు’ మన దేశంపై పెత్తనం సాగించిన సమయంలో మనకు అంటగట్టారు! ప్రకృతిలోని సహజ ‘సంతులన’ వ్యవస్థను పరిరక్షించే జీవన విధానాన్ని భగ్నం చేసి, ప్రకృతిని నిరంతరం గాయపరుస్తున్న ‘కృత్రిమ నాగరికత’ కొలువు తీరిపోయింది! పరస్పరం విరోధిస్తున్న పరిణామాలు వ్యవసాయ, గ్రామీణ, పర్యావరణ సమతుల్యాన్ని సన్నగిల్లజేస్తున్నాయి!
సేంద్రియ వ్యవసాయానికి సమాంతరంగా కృత్రిమ రసాయనాల విషపు టెరువులు, విరుచుకు పడుతున్నాయి. ‘జన్యు పరివర్తక - జనటికల్లీ మోడిఫైడ్ - ప్రక్రియ ద్వారా తయారవుతున్న విత్తనాలలోని బాసిలస్ తురింజెనిసిస్ - బిటి - అన్న రసాయన విషం భూమిని రైతుల బతుకులను పాడుచేస్తోంది. కొత్త రకం విష క్రిములను, కీటకాలను, ఈగలను సృష్టించి పంటలపైకి ఉసిగొల్పుతోంది! ‘మొనసాంటో’ వంటి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’లు విత్తనాల విక్రయం ద్వారా సాగిస్తున్న వాణిజ్య బీభత్సకాండను మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రభుత్వాలు కొంత వరకు నిరోధించగలిగాయి. కానీ ‘బిటి’ పంటలను నిషేధించకపోవడం వ్యవసాయ ప్రకృతిని పాడు చేస్తున్న విపరిణామం! ఆవుల పశువుల ‘పేడ’ను ఎరువుగా వాడడం వల్ల ‘వానపాములు’ విస్తరిస్తున్నాయి. భూమిని దున్ని సారవంతం చేస్తున్నాయి. రసాయనం ఎఱువుల దుర్వాసన భరించలేక వానపాములు భూమి లోపలికి పారిపోతున్నాయి. ఇదీ విధాన నిహిత వైరుధ్యం! ముప్పయి మూడేళ్లకు పూర్వం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో, ‘యూనియన్ కార్బయిడ్’ కర్మాగారం నుండి విష వాయువు వెలువడి, వందల మంది ప్రాణాలను తీసింది. కానీ విష వాయువు వెలువడిన సమయంలో ‘హోమం’ చేసిన కుటుంబాలలోని వారికి ఎలాంటి ఆపద కలుగలేదు, వారు సురక్షితంగా విష వాయు ప్రమాదం నుంచి బయటపడినారు. ‘హోమం’లో ఉపయోగించిన ఆవు నెయ్యి, ఇతర ‘గవ్యాలు’ - ఆవుపేడ, మూత్రం, పాలు, పెరుగు నెయ్యి - గంధపు చెక్కల వంటి ప్రాకృతిక ఓషధులు విష రసాయన వాయువును తరిమివేశాయి. కానీ ఇప్పుడు ‘హోమం’లో దేశవాళీ ఆవుల నెయ్యి, గవ్యాలు వాడడం లేదు. ‘జెర్సీ’ ఆవుల పాలు వాడుతున్నారు. నెయ్యి వాడుతున్నారు! ‘జెర్సీ’ ఆవులో ‘ఆవు లక్షణాల’ కంటె ‘ఇతర జంతువుల’ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి! ఈ ‘కల్తీ’ వ్యవస్థీకృతమై పోయింది! దేశవాళీ ఆవులు పర్యావరణకు చెలికత్తెలు.. జెర్సీ ఆవులు ప్రకృతిని పాడు చేస్తున్న శత్రువులు...
అందువల్ల తెలంగాణ ప్రభుత్వం కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కాని ‘కృత్రిమ ప్రగతి’ ప్రలోభంతో ఈ ‘బ్రాయిలర్’ గొర్రెలను ప్రోత్సహించరాదు! ‘బ్రాయిలర్’ కోడిని కాక దేశవాళీ కోడిని పెంచాలన్న ధ్యాస గ్రామాలలో మళ్లీ ఎందుకు విస్తరిస్తోంది! ‘కోత’కు తప్ప ‘కూత’కు పనికి కృత్రిమ జాతి కోళ్లు మానవుల ఆరోగ్యానికి హానికరమన్నది ప్రచారం కాని వాస్తవం, వీటివల్ల పర్యావరణం కాలుష్యగ్రస్తమై పోయింది. ‘బ్రాయిలర్’ గొర్రెల కథ ‘బ్రాయిలర్’ కోళ్లకు పునరావృత్తి.. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడాలి! ‘బ్రాయిలర్’ పశువులు దేశవాళీ పశువులకు విరోధులు...