సంపాదకీయం

విద్యావ్యాపారికి వెసులుబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వేతర రంగంలోని పాఠశాలల యాజమాన్యాలవారు ప్రతి సంవత్సరం ‘శుల్కా’ల- ఫీజ్-ను పెంచడానికి వీలు కల్పించాలన్న ప్రతిపాదన సర్వజన సంక్షేమ స్ఫూర్తికి విరుద్ధం. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ బెంగళూరులో మంగళవారం చేసిన విద్యాసంబంధ ప్రసంగ స్ఫూర్తికి ఈ ‘విపరీత ప్రతిపాదన’ విఘాతకరం! అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యాశుల్కాల అధ్యయన సంఘం వారు ఈ విపరీతమైన ప్రతిపాదనను చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించినట్టయితే విద్యారంగంలో ఇంతవరకు అక్రమ వాణిజ్యవేత్తలు నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్న దోపిడీ ఆధికారికంగా వ్యవస్థీకృతం కాగలదు! వాణిజ్య పాఠశాలలవారు ఏళ్ల తరబడి ప్రజలనుంచి ‘్ఫజు’ల రూపంలో, ‘విరాళాల’- డొనేషన్స్ - రూపంలో, ఇంకా వివిధ రూపాయలలో విద్యార్థుల తల్లిదండ్రులను ‘లూటీ’ చేస్తుండటం దశాబ్దులుగా నడిచిపోతున్న దారుణం. .... దేశవ్యాప్తంగా సాగిన ఈ అక్రమాన్ని నిరోధించిన ప్రభుత్వం లేదు. ప్రభుత్వేతర పాఠశాలల నిర్వాహకులు, ఉన్నత అధికారులు, రాజకీయవేత్తలు, దళారీలు కలిసికట్టుగా వ్యవహరిస్తుండటం విద్యారంగాన్ని ఆవహించిన ‘ప్రపంచీకరణ’ దుష్ప్రభావ ఫలితం! అనేక సందర్భాలలో రాజకీయవేత్తలు స్వయంగా ఈ ప్రభుత్వేతర పాఠశాలలను నిర్వహించారు, ఆ తరువాత వాణిజ్యవేత్తలు రాజకీయవేత్తలుగా పరివర్తన చెందడం నడుస్తున్న చరిత్ర! ప్రభుత్వేతర పాఠశాలలకు రెండు దశాబ్దుల క్రితం కేవలం ధనవంతులు, ఉన్నత ఉద్యోగస్థులు, ఇతరేతర ప్రముఖులు, ఘరానాలు తమ పిల్లలను పంపించేవారు. ఇలా పంపించడం నగరాలకు పట్టణాలకు మాత్రమే పరిమితం అయి ఉండాలి. ‘పాల కంకుల’ పరిమళం చెడని పల్లెటూళ్లలోను, చెరకు గానుగలతో తయారయ్యే లేత బెల్లం సుగంధాలు సభలు తీర్చిన గ్రామ సీమలలోను ఈ ‘వాణిజ్య పాఠశాలలు’ పుట్టుకొని రాలేదు. అందువల్ల పల్లె సీమలలోని సాదాసీదా జనాలు ప్రభుత్వపు బడులలోనే తమ పిల్లలను చదివించేవారు! నగరాలలోని, పట్టణాలలోని సామాన్యులు సైతం తమ పిల్లలను సర్కారీ బడులకే పంపించేవారు! అందువల్ల వాణిజ్య పాఠశాలల - కార్పొరేట్ స్కూల్స్ - యజమానులు సాగించిన ‘్ఫజుల’ బీభత్స విస్తృతి తక్కువగా ఉండేది. ప్రచారం తక్కువగా ఉండేది. కానీ క్రమంగా ‘మమీ’, ‘డాడీ’ అని పిలిపించుకోవాలన్న జీవన రీతి - లైఫ్ స్టయిల్, విలాసం - ఫాషన్ - సామాన్య ప్రజల కుటుంబాలకు కూడా విస్తరించిపోయింది. ‘్ఫజు’ల దోపిడీ గురించి వాణిజ్య పాఠశాలల వివిధ రకాల అక్రమాల గురించి ధ్యాస, ప్రచారం విస్తరించడానికి ఇదీ కారణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వేతర పాఠశాలలలో ‘్ఫజు’లు తగ్గించాలన్న ఉద్యమాలు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశమంతటా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది నెలల క్రిందట నియమించిన ఈ ‘విద్యా శుల్కాల’ అధ్యయన సంఘం, శుల్కాలను తగ్గించాలని ‘సిఫార్సు’ చేస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించడం సహజం... జరిగింది మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ కులపతి, సామాజిక సంవేదన శీలి, ప్రముఖ విద్యావేత్త ఆచార్య టి.తిరుపతిరావు అధ్యక్షతన ఏర్పడిన ఈ ‘చతుర్దశ సభ్య సంఘం’ ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రతిపాదనను చేయడం విస్మయకరం! ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రతి ప్రభుత్వేతర పాఠశాల యాజమాన్యం ప్రతి ఏటా పదిశాతం మేర ‘్ఫజు’లను పెంచవచ్చునట! అంతకంటే ఎక్కువ కూడ ఎంతైనా పెంచవచ్చు. దీనికి మాత్రం ప్రభుత్వం అనుమతి కావాలి. ‘క్షేత్రీయ శుల్క క్రమబద్ధీకరణ సంఘం’ - జోనల్ ఫీ రెగ్యులేషన్ సమితి - జెడ్‌ఎఫ్‌ఆర్‌సి - వారికి ముందుగా ఫీజుల అవసరాలను సమర్పించుకోవాలి! ‘సమర్పించుకోవడం’ అన్న విధానాన్ని అధికాధిక పాఠశాలల వారు బహుశా పాటించవచ్చు. అందువల్ల జడ్‌ఎఫ్‌ఆర్‌సి వారు, ప్రభుత్వంవారు అనుమతులు ఇవ్వడం కూడా సహజం. అందువల్ల వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వేతర పాఠశాలలలో, అధికాధిక పాఠశాలలలో విద్యార్థులు చెల్లించవలసిన ‘్ఫజు’లు పది శాతం మాత్రమే ఇంకా ఎక్కువ శాతం పెరగనున్నాయి. విద్యార్థుల వద్ద వసూలు చేస్తున్న ఫీజుల మొత్తం సొమ్ములో కనీసం యాభై శాతం పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులకు ఫీజుల రూపంలో చెల్లించాలన్న నిబంధనను తొలగించాలని కూడా ఈ అధ్యయన సంఘం తెలంగాణ ప్రభుత్వానికి ‘సిఫార్సు’ చేసిందట! ఇదే నిజమైతే యాజమాన్యం వారు ఏళ్ల తరబడి ఉపాధ్యాయులకు జీతాలు పెంచకుండా వారిచేత వెట్టిచాకిరీ చేయించడం ఖాయం!
విజ్ఞత వికసించాలి. సామాజిక న్యాయసాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ‘సంఘం’ ప్రతిపాదనలను తిరస్కరించాలి. ఇప్పుడు వసూలు చేస్తున్న ‘్ఫజు’లను కనీసం ఇరవై శాతం తగ్గించడంద్వారా నిరుపేదలైన విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలి. ప్రాథమిక స్థాయి పేద విద్యార్థులు ప్రభుత్వేతర పాఠశాలలకు చెల్లిస్తున్న ఫీజులను ప్రభుత్వం ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లిస్తోందా? ఇలా రీయింబర్స్‌మెంట్ జరుగుతున్నట్టయితే సామాన్య ప్రజలకు వెసులుబాటు ఉండగలదు. కానీ ఇలాంటి రీయింబర్స్‌మెంట్ ఇంకా మొదలయినట్టు లేదు. ఎప్పుడు మొదలుపెడుతుందో మరి! ఇప్పుడు వ్యవసాయ శ్రామికులు, చిన్న రైతులు, వివిధ వృత్తులవారు గ్రామలలోను, నిర్మాణ కార్మికులు, గృహ ..., కూరలు అమ్ముకునేవారు, కిల్లీకొట్టు యజమానులు పట్టణాలలోను నగరాలలోను తమ పిల్లలను ప్రభుత్వేతర పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇదంతా ప్రపంచీకరణ వ్యామోహం. ప్రభుత్వేతర పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమంలో చదివితే తమ పిల్లలకు పెద్ద ఉద్యోగాలు వస్తాయని, అమెరికాలోను ఆస్ట్రేలియాలోను ఉపాధి లభిస్తుందని ప్రజలలో అత్యధికులు ‘భ్రాంతి’కి గురికావడం ప్రపంచీకరణ ఫలితం! అందువల్ల ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లేవారి సంఖ్య అడుగంటిపోయింది. దీన్ని నిరోధించడానికి ఏకైక ప్రత్యామ్నాయం కనీసం ఎనిమిదవ తరగతి వరకు మాతృభాష మాధ్యమంగా, తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాష మాధ్యమంగా విద్యాబోధన జరగాలి. ఇందుకు కృషి చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాయి. ప్రపంచీకరణ ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్న తీరు ఇది.
ప్రతి సంవత్సరం పది శాతం ఫీజులు పెరిగినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, సంఘటిత, ప్రభుత్వేతర రంగాల ఉద్యోగులు, సంపన్నులు, ఘరానాలు చెల్లించగలరు. ఎందుకంటే ‘ద్రవ్యోల్బణం’తో పాటు వారికి జీతాలు పెరుగుతాయి కానీ అసంఘటిత రంగాలవారు, చిరు ఉద్యోగులు, స్వయం ఉపాధితో జీవించే సామాన్యులు, చిల్లరకొట్టు వ్యాపారులు, గ్రామీణ శ్రామికులు ఎలా చెల్లించగలరు? విద్యాదానం గురించి, విద్యా దానం భారతీయ సంప్రదాయమన్న వాస్తవం గురించి ‘బెంగళూరు సభ’లో రాష్టప్రతి ప్రస్తావించారు. కానీ ప్రభుత్వేతర, వాణిజ్య - కార్పొరేట్ విద్యాలయాల నిర్వాహకులు చేస్తున్నది ఏమిటి??