సంపాదకీయం

పుస్తకం, మస్తకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషతో భావజాలం విజ్ఞానం సహజంగానే అనుసంధానమై ఉన్నాయి, విజ్ఞానం వికాసంతో అంతే సహజంగా అనుసంధానమై ఉండడం సృష్టిగతమైన సనాతన వ్యవస్థ. ఈ సనాతన - శాశ్వతమైన - సత్యాన్ని ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం పునరావిష్కరించారు! భారతీయ జీవన విధానం అనాదిగా ఈ సృష్టిగత వాస్తవ భూమికపై వికసించడం చరిత్ర! సృష్టిగత వాస్తవం సమాజస్థితంగా ప్రస్ఫుటించడం హైందవ జాతీయ ప్రస్థానం! అందువల్లనే సహేతుకమైన సతార్కికమైన శాస్ర్తియ విజ్ఞానం సామాన్య జనజీవన వాస్తవమైంది, విశ్వాసమైంది, సంప్రదాయమైంది, మతమైంది, ధర్మమైంది, ప్రగతిని సుగతిని సాధించగల సంస్కృతిగా పరిఢవిల్లింది. విజ్ఞానం, - భౌతిక, రసాయన, జీవవైవిధ్య విజ్ఞానం - సామాన్య ప్రజలకు గ్రామీణులకు జానపదులకు ఉపకరించడం వికేంద్రీకృత భారత ఆర్థిక వ్యవస్థ... స్వయం సమృద్ధ గ్రామ వికసనం అనాదిగా ‘ప్రగతి, విజ్ఞానాల’ పరస్పర అనుసంధాన భూమికపై ప్రస్ఫుటించడం చరిత్ర! ఈ చరిత్రను ఈ ప్రగతిని ఈ విజ్ఞానాన్ని ఈ అనుసంధానాన్ని ఈ వికేంద్రీకృత వ్యవస్థను విదేశీయ దురాక్రమణదారుల కలియుగం 4814 - క్రీస్తుశకం 712-వ సంవత్సరం నుంచి ధ్వంసం చేయడం చరిత్ర! బ్రిటన్ పెత్తందార్ల బౌద్ధిక రాజకీయ బీభత్స పాలన సమయంలో మన ప్రాచీన భౌతిక విజ్ఞాన పరంపర భగ్నమైపోవడం జగమెరిగిన సత్యం! మనదేశంలో ప్రధానంగా తెలుగుసీమగా ఇప్పుడు ప్రసిద్ధి పొందిన ప్రాంతంలో వికేంద్రీకృత పద్ధతిలో ఉక్కు కర్మాగారాలు ఏర్పడడం చరిత్ర! పల్లెసీమలలోని చిట్టి యజమానులైన స్వతంత్ర జీవనులైన ‘లోహకారుల’ కొలిమి బట్టీలలో అత్యంత శ్రేష్ఠమైన ‘ఉక్కు’ తయారైంది. క్రీస్తునకు పూర్వం అనేక శతాబ్దుల పాటు ఈ ‘్భరతీయ లోహం’ - ఉక్కు - డమాస్కస్ కేంద్రంగా ప్రపంచ దేశాలకు ఎగుమతి అయింది! ‘డమాస్కస్ స్టీల్’గా చరిత్ర ప్రసిద్ధికెక్కిన ఈ ‘ఉక్కు’ భారతీయ విజ్ఞాన ప్రగతి పరాకాష్ఠకు ఒక ప్రతీక మాత్రమే! ‘ప్రతీక’లు వందలు వేలుగా చరిత్రలో ప్రస్ఫుటించాయి. ‘డమాస్కస్’ ప్రస్తుతం సిరియా దేశపు రాజధాని.. బ్రిటన్‌వారు మన పుస్తకాలను మన భాషలను మాత్రమేకాక మన మస్తకాలను సైతం చెఱచిపోయారు. మన భావజాలాన్ని జీవన దృక్పథాన్ని మలిన పరిచారు! సత్యేంద్రనాథ వసు - బోస్ - నూట ఇరవై ఐదవ జయన్తి ఉత్సవం సందర్భంగా జరిగిన భౌతిక విజ్ఞానవేత్తల శాస్తవ్రేత్తల సదస్సులో ప్రధానమంత్రి చేసిన ‘పునరావిష్కరణ’కు ఇదంతా నేపథ్య చిత్రం.. పుస్తకానికి మస్తకానికి ఉన్న సంబంధాన్ని ఉపరాష్టప్రతి ప్రస్తావించిన తీరు ఈ చరిత్రకు దర్పణం...
సత్యేంద్రనాథ వసు జయన్తి ఉత్సవాల సందర్భంగా కలకత్తాలో జరిగిన శాస్త్ర సదస్సులో నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి ప్రసంగించడం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, భౌతిక ప్రగతితో అనుసంధానమై ఉందన్న వాస్తవానికి పునరావృత్తి! శాస్తవ్రిజ్ఞానం నిరుపేదల జీవనప్రగతితో అనుసంధానం కావాలన్నది నరేంద్రమోదీ చెప్పిన మాట! బ్రిటన్ ‘దొరలు’ ఈ అనుసంధాన విజ్ఞానపు వెలుగులను దిగమింగి సామాన్య ప్రజలను విద్యలకు దూరం చేశారు. సంపద, పరిశ్రమలు, ప్రగతి, విజ్ఞానము కేంద్రీకృతం కావడం బ్రిటన్ దుర్జనుల చీకటి పాలన ఫలితం. అలాంటి అజ్ఞానపు అంధకారపు ‘యామిని’లో అంకురించిన విజ్ఞానపు వెలుగుల ‘ఆమని’ సత్యేంద్రనాథ వసు... జగదీశచంద్ర వసు - బోసు - వంటి కారణజన్ములైన భారతీయ విజ్ఞానవేత్తల పరంపరలోని వాడు సత్యేంద్రనాథ్. క్రీస్తుశకం 1858లో జన్మించిన జగదీశ చంద్రుడు జీవలక్షణ శాస్త్ర పరిశోధనలో విశ్వఖ్యాతిని గడించాడు, 1894లో ప్రభవించిన సత్యేంద్రనాథుడు గణితశాస్త్రం, భౌతిక శాస్త్ర పరిశోధనలో భారత జాతీయ ప్రతిభా పతాకాన్ని విశ్వవీధులలో ఎగురవేయగలిగాడు. జర్మనీలో జన్మించిన విశ్వవిఖ్యాత యూదు శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్‌తో కలిసి సత్యేంద్రనాథ్ వసు జరిపిన పరిశోధనలు నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలకు దోహదం చేశాయి. ‘విద్యుదయస్కాంత తాపం’ గురించి - ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ - ఉభయులు ఉమ్మడిగా పరిశోధనలు జరిపారు...
సత్యేంద్రనాథ్ వసు ఇలా జన్మభూమికి ప్రతిష్ఠను పెంపొందించిన వజ్రాల బిడ్డడు. శాస్త్ర విజ్ఞానం, నిరుపేదల ప్రగతికి ఉపకరించాలన్న మోదీ పునరుద్ఘాటన అందువల్ల సత్యేంద్ర నాథునికి నిజమైన నివాళి! విజ్ఞానం కేవలం పుస్తకాలలో నిండి నిబిడీకృతం కావడం వల్ల జనజీవన ప్రగతికి అది దోహదపడదు. పుస్తకాలలోని విజ్ఞానం, సాహిత్యం జనావళి మస్తకాలలోకి ఎక్కాలన్నది ఉపరాష్టప్రతి విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పదకొండవ తేదీ వరకు జరుగనున్న ఇరవై తొమ్మిదవ అఖిల భారత పుస్తక ప్రదర్శన ప్రారంభ సభలో చెప్పినమాట! పుస్తకాల మాధ్యమంగా మస్తకాలు వికసించాలని విజ్ఞానవంతం కావాలని వెంకయ్య నాయుడు చెప్పినమాట భారత జాతీయ సంప్రదాయానికి పునరుద్ఘాటన! పుస్తకాలను చదవడానికి విజ్ఞానవంతులు కావడానికి అనివార్యమైన మాధ్యమం భాష! భాషా పరిరక్షణ, పుస్తకాల పరిరక్షణ పరస్పరం ముడివడి ఉన్నాయి. వీటి పరిరక్షణ ద్వారా మన మస్తకాల పరిరక్షణ మాత్రమే కాదు, మన జీవన భద్రత పదిలవౌతోంది! అందువల్ల, మాతృభాషను పరిరక్షించడానికి తమ ప్రభుత్వం ఇతోధిక కృషి చేయగలదని విజయవాడ పుస్తకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వరాల మూట! ఈ ‘సంవత్సరం తెలుగుభాష పరిరక్షణ వత్సరం’ కాగలదన్నది ఆయన చేసిన సంకల్పం! భాషా పరిరక్షణ ద్వారా విజ్ఞానంతోపాటు సంస్కారాలు కూడ వికసించగలవన్న శాశ్వత సత్యం ఉపరాష్టప్రతి నోట ధ్వనించడం మరింత ఆనందకరం.. భౌతిక విజ్ఞానం ‘ప్రగతి’నిస్తుంది, బౌద్ధిక సంస్కారం సుగతిని కలిగిస్తుంది. ‘ప్రగతి’ ‘సుగతి’ మానవజీవన ప్రస్థాన రథానికి సమాన ప్రాధాన్యంకల చక్రాలు! తాళ్లపాక తిమ్మక్క, తరిగొండ వెంగమాంబ, రంగాజమ్మ, ముద్దుపళని, మొల్ల వంటి వారు వ్రాసి రాసులు పోసిన సంస్కార సాహిత్యాన్ని ఆధునికులు చదవాలన్నది వెంకయ్య నాయుడి అభిమతం.. అలా చదవాలంటే విద్యార్థుల తెలుగుభాషా పటిమ పెరగాలి..
వివిధ దేశాలలో స్థిరపడి ఉన్న భారతీయ శాస్తవ్రేత్తలు పెద్ద సంఖ్యలో స్వదేశానికి తిరిగివచ్చి స్థిరపడుతుండడం ముదావహం. ఇలా తిరిగివచ్చినవారి సంఖ్య అంతకుపూర్వం ఐదేళ్లలోకంటె గత ఐదేళ్లలో డెబ్బయి శాతం పెరగడం సత్యేంద్రనాథ్ వసు, జగదీశ్ చంద్ర వసు వంటి పూర్వజులకు నిజమైన నివాళి!! నరేంద్ర మోదీ చెప్పినట్టు విజ్ఞానం స్వదేశీకరణ జరుగుతోంది...