సంపాదకీయం

అస్సాంలో ‘జనసూచిక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాంలో ‘జాతీయ జన సూచిక’ - నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్స్ - ఎన్‌ఆర్‌సి - మొదటి ముసాయిదాను ప్రచురించడం విదేశీయ అక్రమ ప్రవేశకులను పసికట్టడానికి జరుగుతున్న కృషికి దోహదం చేయగలదు. అయితే అక్రమ ప్రవేశకులు అందరూ బయటపడగలరా? అన్నది ఉత్కంఠను కలిగిస్తున్న వాస్తవం..! బంగ్లాదేశ్ నుండి అస్సాం, బెంగాల్, ఈశాన్య ప్రాంతాలలోకి 1947 నుంచి కూడ చొరబడుతున్నవారిలో అత్యధికులు ఇదివరకే నకిలీ పత్రాల సహాయంతో భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారు, ‘రేషన్‌కార్డుల’ను పొందారు, వివిధ బ్యాంకులలోను, ఆర్థిక సంస్థలలోను ఖాతాలు ప్రారంభించారు! ఆస్తులు సంపాదించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందారు. స్థానిక, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వోటర్లుగా ‘నమోదయి’పోయి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు! చాపకింది విషం వలె వీరందరూ అస్సాం అంతటా వ్యాపించి ఉన్నారు! అందువల్ల వీరందరినీ పసికట్టడం సాధ్యమేనా? అన్నది ప్రశ్న! ‘స్వతంత్ర భారత్’లో మొదటిసారిగా 1951లో ‘జనగణన’ జరిగింది. ఈ ‘జనగణన’ ప్రాతిపదిక ‘జాతీయ జనసూచిక’-ను రూపొందించాలన్న ఆదర్శం ఇంతవరకూ దేశవ్యాప్తంగా సాకారం కాలేదు. కానీ అస్సాంలో మాత్రం 1951 నాటి జనగనణ ప్రాతిపదికగా దేశంలోనే మొదటిసారి ఈ ‘ఎన్‌ఆర్‌సి’ రూపొందింది. కానీ తరువాత అస్సాం ‘జనాభా’ పెరుగుదలలోను, వివిధ మతాల ప్రజల నిష్పత్తిలోను విపరీతమైన మార్పులు సంభవించాయి. తూర్పు పాకిస్తాన్ నుంచి ఆ తరువాత బంగ్లాదేశ్ నుంచి లక్షలాది ఇస్లాం మతస్థులు అక్రమంగా మనదేశంలోకి చొరబడిపోయారు. ఈ అక్రమ ప్రవేశకుల సంఖ్య ఒకటిన్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉండవచ్చునన్నది జరిగిన ప్రచారం! ఈ అక్రమ ప్రవేశకులలో అనేకులు భారతీయులుగా నటిస్తూ దేశవిద్రోహ కలాపాలకు, బీభ త్స కలాపాలకు పూనుకోవడం చరిత్ర! ఈ అక్రమ ప్రవేశం వల్ల బెంగాల్‌లోలోను ఈశాన్య ప్రాంతాలలోను స్ధానికుల సామాజిక ఆర్థిక భద్రతకు విఘాతం కలుగడం కూడ చరిత్ర. ఇప్పుడు మళ్లీ అస్సాంలోనే మొదటిసారిగా ‘జాతీయ జన సూచిక’ రూపొందడం చరిత్రకు పునరావృత్తి. కానీ 1951కి 2018కీ మధ్య అస్సాం జనాభాలోను, జనాభాలోని మత నిష్పత్తిలోను ఏర్పడిన విపరీతమైన అంతరం దేశ భద్రతకు, ఆర్థిక సౌష్టవానికి పెనుముప్పుగా పరిణమించింది!!
అస్సాంలోకి చొరబడిన బంగ్లాదేశీయులను ఏరివేయడానికి ఈ కొత్త ‘జాతీయ జనసూచిక’ నిర్దిష్ట, నిర్దుష్ట ప్రాతిపదిక కాగలదా? అన్న ప్రశ్నకంటె సక్రమమైన భారతీయ పౌరులను అందరినీ ఈ ‘సూచిక’ ఇంకా చేర్చకపోవడం అస్సాంలో అలజడి రేగుతోంది! తమ పేర్లు ‘జనసూచిక’లో చేర్చమని కోరుతున్న మూడుకోట్ల ఇరవై తొమ్మిది లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. గత ముప్పయి ఒకటవ తేదీ అర్థరాత్రి విడుదల అయిన తొలి ముసాయిదాలో కోటి తొంబయి లక్షల మందికి మాత్రమే చోటు లభించింది! తొలి ముసాయిదాలో చోటు లభించని వారందరూ అక్రమ ప్రవేశకులు కారని, ఇంకా పరిశీలన పూర్తికానున్నందున కొంతమంది మాత్రమే ‘్భరతీయులు’గా స్థానికులుగా నిర్ధారణ అయ్యారని ‘జాతీయ జన సూచిక’ సంయోజకుడు ‘ప్రతీక్ హజేలా’ స్పష్టం చేసినప్పటికీ సక్రమ పౌరులు అలజడికి గురి అవుతున్నారు! 2002 నాటి అస్సాం జనాభా రెండు కోట్ల అరవై ఏడు లక్షలు! దరఖాస్తుల ప్రాతిపదికగా అరవై రెండు లక్షల మంది ఆ తరువాత పుట్టినవారు లేదా అస్సాంలో స్థిరపడినవారు! ఇలా స్థిరపడినవారిలో అత్యధికులు అక్రమ ప్రవేశకులు. మొదటి జాబితాలో చోటు దొరకని కోటి ముప్పయి తొమ్మిది లక్షల మందిలో బహుశా అత్యధికులు అక్రమ ప్రవేశకులు కానివారి సంతతి కావచ్చు! 1971 మార్చి ఇరవై నాలుగవ తేదీనాటికి అస్సాంలో నివసిస్తుండినవారు వారి కుటుంబ సభ్యులు పిల్లలు వారసులు సక్రమమైన భారతీయ పౌరులన్నది, స్థానికులన్నది 1984లో జరిగిన నిర్ధారణ! ఈ నిర్ధారణ ప్రాతిపదికగానే ఇప్పుడు ‘సూచిక’ రూపొందింది! వివాహ సంబంధం ద్వారా ఇరువై తొమ్మిది లక్షల మంది మహిళలు అస్సాంలోకి వచ్చి స్థిరపడినారట! వీరి వివాహ సంబంధాన్ని ధ్రువపరిచే ‘అర్హత’ పత్రాల సామంజస్యాన్ని, వాటి వివరాల వాస్తవాలను ఇంకా పరిశీలించవలసి ఉంది!
బెంగాల్‌లోకి, అస్సాంలోకి ఇన్ని దశాబ్దులుగా లక్షల సంఖ్యలో ఇస్లాం మతస్థులు చొరబడడానికి కారణం జిహాదీల షడ్యంత్రం. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉండిన అఖండ భారత్ ప్రాంతాలు తూర్పు పాకిస్తాన్‌గా, పశ్చిమ పాకిస్తాన్‌గా ఏర్పడడం ఈ కుట్రకు ప్రాతిపదిక. తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్‌గా మారింది. తమ సరిహద్దుకు సమీపంలోని అవశేష భారత్ ప్రాంతాలలోకి చొరబడడం ద్వారా స్థిరపడడం ద్వారా ఆయా ప్రాంతాలను ‘ఇస్లాం’ జనబాహుళ్యంగా మార్చడం ఈ కుట్ర! అలా ఇస్లాం జనబాహుళ్యంగా మారిన భారత ప్రాంతాలను మరోసారి భారత్ నుండి విడగొట్టాలన్నది ‘జిహాదీ’ల కుట్ర! కశ్మీర్ లోయ నుంచి హిందువులను నిర్మూలించడం, అస్సాంలోను బెంగాల్‌లోను బంగ్లాదేశీయ ముస్లింలను నింపడం ఈ ‘పాకిస్తానీ - బంగ్లాదేశీ’ జిహాదీ కుట్ర! ఈ కుట్రకు వ్యతిరేకంగా ‘అస్సాం ఛాత్ర సంఘర్ష పరిషత్’ తదితర జాతీయ సంస్థలు 1970వ దశకం నుంచి ఉద్యమం నిర్వహించాయి. ఈ ఉద్యమం కారణంగా అస్సాం ప్రగతి స్తంభించిపోయింది, అక్రమ ప్రవేశకులను గుర్తించి బంగ్లాదేశ్‌కు తిప్పి పంపించడానికి వీలుగా 1982-83లో ప్రభుత్వం రూపొందించిన ‘చట్టం’ అమలు జరగడానికి ఆ చట్టంలోనే ప్రతిబంధకాలు ‘నిహితం’ కావడం మరో ఘోరం! ‘న్యాయ మండలుల ద్వారా అక్రమ ప్రవేశకుల గుర్తింపు’ - ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్స్ - ఐఎమ్‌డిటి అన్న ఆ చట్టం ప్రకారం విదేశీయులు ఎవరన్నది ఋజువు చేయవలసిన బాధ్యత స్థానిక ప్రజలది.. స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే పోలీసులు, అధికారులు ‘విదేశీయుల’పై అభియోగాలను నమోదు చేసి విచారణ జరపాలన్నది చట్టంలోని నిబంధన. బంగ్లాదేశీయులు ‘‘స్థానికులు’’గా మారిన గ్రామాలలో బస్తీలలో ఎవరు ఫిర్యాదు చేయాలి! నిజమైన స్థానికులు ఫిర్యాదు చేసినట్టయితే ‘జిహాదీ’లు వారిని బెదరించేవారు, హతమార్చేవారు! ఫలితంగా ఇరవై ఏళ్లలో కొన్నివేల ‘్ఫర్యాదులు’ మాత్రమే నమోదయ్యాయి. కొన్ని వందల అభియోగాలు మాత్రమే ధ్రువపడినాయి! ఇరవై రెండు ఏళ్ల తరువాత 2005లో సర్వోన్నత న్యాయస్థానం ఈ ‘గుదిబండ’ - ఐఎమ్‌డిటి - చట్టాన్ని రద్దు చేసింది!
బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురైన హిందువులు మనదేశానికి శరణార్థులుగా వచ్చి చేరారు. ఇది దేశ విభజనలో ముడిపడిన సమస్య! ‘అఖండ భారత్’ వలెనే ‘అవశేష భారత్’ సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ! అందువల్ల 1947 తరువాత మన దేశం నుంచి ఏ మతంవారు కూడా తరిమివేతకు గురికాలేదు. కానీ ఇస్లాం మత రాజ్యాలుగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి హిందువులు తరిమివేతకు గురి అవుతున్నారు. మన దేశానికి వచ్చి చేరిన ఈ హిందూ శరణార్థులు అక్రమ ప్రవేశకులు కారు. వారికి భారతీయ పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన పార్లమెంటు ‘బిల్లు’ హర్షణీయం...