తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

భద్రతను దెబ్బతీస్తున్న యాంత్రికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు తీగలు లేవు
ఒకప్పుడు టెలిఫోన్‌కి, విద్యుత్‌కి, తీగలు ఉండేవి. కమ్యూనికేషన్ రంగంలో మొదట 3వైర్‌లెస్2 విప్ల వం వచ్చింది. తీగల్లోంచి అక్షరాలు ప్రవహించాయి. ఇ ప్పుడంతా ఉపగ్రహాలే. అక్షరాలే కాదు. చిత్రాలు కూడా. పుస్తకాలు, పత్రికలు...అన్ని రకాల అచ్చు రూపాలు...
ఇప్పుడు అక్షరం అచ్చులో కాదు, తెరమీద రాజ్యం ఏలుతోంది. పుస్తకం చేతిలో కాదు. కంటికే. ఇప్పుడు బటన్ ఒత్తితే పుస్తకం శబ్దమై వినవస్తుంది. ఎవరో చదివితే మనం వింటాం. కళ్ళతో కాదు. చెవులతో వింటాం.
ఒకప్పుడు తీగలు స్తంభాలకు వేలాడేవి. స్తంభాలు నేలలో నిలబడేవి. తుఫానులకి, వర్షాలకి అవి పడిపోయేవి. వాటిని మళ్లీ మనుషులు నిలిపేవారు.
ఇప్పుడు వాయుశబ్ద తరంగాలే తీగలయ్యాయి. ఈ కనబడని తీగల మధ్య పోటీ పెరిగింది. ఈ తీగలు ఉపగ్రహాల కేంద్రాలు స్తంభాలై భూమి ఆకాశం మధ్యగా దిగబడిపోయాయి. ప్రపంచంలో బహుళజాతి పెట్టుబడి విస్తరించినట్టు. ప్రపంచాన్ని కబళించినట్లు, ఎంత పీకినా కదలనంత లోతుగా దిగబడిపోయాయి. ఆకాశ తరంగాల మధ్య పోటీ జగుప్స కలిగించేంత పెరిగింది. ఈ స్తంభాలను కూల్చితే కూలవు. పేల్చితే పాడుకావు. లాభాలు కాంక్రీటుతో బిర్రబిగుసుకు పోయాయి.
సాంకేతిక విప్లవం మహత్తర ఫలితం ప్రసార రంగం. ఇది మానవాళికి లభించిన గొప్ప కానుకగా భావిస్తారు. విద్యుత్ కండక్టర్లు, వైర్లు, కేబుళ్లు లేకుండానే భూమిలోకి, పైపైకి, వేలాది మైళ్ల దూరం వరకు సునాయాసంగా సమాచారం చేరవేయడం అత్యంత సులభమైంది. ఉపగ్రహా ప్రసారాల్లో ముఖ్యమైనవి టీవీ ప్రసారాలు. చేతిలోని రిమోట్‌తో టీవి ప్రసారాల్ని క్షణాల్లో మారుస్తాం. చేతిలోని మొబైల్ కంప్యూటర్‌తో ప్రపంచంలో ఎక్కడైనా ఎవరితోనైనా కనెక్ట్ కాగలం. దీనివల్ల ప్రయోజనాలున్నాయి. కాదనలేం. కాని అన్ని రంగాలవలె ప్రసారరంగం కూడా పెట్టుబడిదారుల చేతుల్లో ఉండటం వల్ల అంతిమంగా వారికే లాభాల పంట పండిస్తుంది.
కాని వేగవంతమైన రీతిలో సమాచారం అప్పటికప్పుడు చేరవేయడం వల్ల ఉపద్రవాలు తగ్గించవచ్చు. ప్రాణాలు నిలుపవచ్చు. వేగపూరిత భావ వినిమయం వల్ల పొరపొచ్చాలను వెంటనే తగ్గించుకోవచ్చు. ఇంటర్నెట్ సౌలభ్యత వల్ల ఎక్కడ నుండైనా పనిచేసుకోవచ్చు. వాతావరణ హెచ్చరికలు చేయవచ్చు. ఏ మూల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విషయాలు ఎవరూ కాదనలేరు. కాని వీటిని ఏవర్గం వారు ఉపయోగించుకోగలరు అనేది ప్రశ్న. ఈ నైపుణ్యాలు, యం త్రాలు, చార్జీలు, ధరలు, ఎవరు మోయగలరు?
ధనికులకే సాధ్యం అయ్యే ఈ చదువులు, వ్యాపారం, యంత్రాంగం ఫలితాలు అప్రత్యక్షంగా ప్రజలకు సహకారిగా ఉండే వీలుంది. కాని అవి ఆర్జించిపెట్టే లాభాలు ప్రపంచ వ్యాప్తంగా కొందరికే. వారి ప్రయోజనాలను, కీర్తిని అవి సంరక్షింపగలవు.
హైటెక్ నగరంలోని పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదువుకున్న వారికే. అందులోని చిన్న ఉద్యోగాలు కూడా ఆ సంస్థల్లో చదివినా రాణించని వారికే. ఇకపోతే డ్రైవర్లు, ఆఫీసు సహాయకుల ఉద్యోగాలు, సాధారణ కళాశాల చదువులు చదివిన పేదలకు.
నిజానికి ఈ సాంకేతికత యుద్ధ రంగానికి ఎక్కువ ఉపయోగ పడుతుంది. సంప్రదాయ యుద్ధ ఆయుధాల స్థానే సెటిల్లైట్ల యుద్ధ విమానాలు, ఆధునిక రాడార్లు, వంటి ఆయుధాలు అమ్మకం కోసం ప్రపంచం పోటీ పడుతున్నది. వాటిని ప్రదర్శించడం కోసం చిన్న దేశాలపై దండయాత్రలు వాటిని చూసి అమ్మకాలు. వ్యాపార లావాదేవీలు.
నిజానికి వైర్‌లెస్ నెట్‌వర్క్ మానవ జీవితంలోని అనేక రంగాలకు వ్యాపించింది. దానివల్ల ఎంతోప్రయోజనం ఉంది. అలాగే కొంత నష్టం కూడా కనిపిస్తోంది.
మానవాళికి ఈ అభివృద్ధి వల్ల వ్యక్తిగత భ్రదత అపాయంలో పడింది. అసలు వ్యక్తి సమాచారం గోప్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆకాశంలోని వాయుతరంగాలపై హాకర్ల దాడి పెరిగింది. రహస్య సమాచారం అనేది ఎప్పుడైనా బహిరంగం కావచ్చు. తద్వారా మోసగాళ్లు ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు. అనధికార శక్తుల గుప్పిట్లో సాంకేతిక అభివృద్ధి చిక్కిపోయింది. అత్యాధునిక దోపిడీ మార్గం సుగమం అయ్యింది. దీనిని అరికట్టే కొత్త చట్టాలు, పోలీసు వ్యవస్థ మనదేశంలో పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలు మిలటరీ, పాలన రహస్యాలు కూడా బట్టబయలు అయిన ఉదాహరణలు కోకొల్లలు. ఇక మామూలు వ్యక్తుల రహస్య సమాచారానికి దిక్కు ఏది? సెక్యూరిటీ కంట్రోలు అనే ఆలోచన ఇప్పుడిప్పుడే కలుగుతున్నది.
ఏది ఏమైనా ప్రపంచం డిజిటల్ యుగంలోకి ప్రవేశించింది. సంప్రదాయ జ్ఞానం ఉనికే ప్రశార్థకం అవుతున్నది. పాత చింతకాయ పచ్చడి ఆలోచనలకు కాలం చెల్లింది. మనిషి తన చిరునామా కోల్పోయి కొత్త శక్తుల మధ్య బందీ అవుతున్నాడు. దేశాలు స్వాతంత్య్రం లేబుల్ అంటించుకొని అస్వతంత్ర దిశగా పరుగులు పెడుతున్నాయి. సమాజాలు పాశ్చాత్య విలువలు, ధోరణులు జీవన విధానాలలో బందీ అయిపోతున్నాయి.
నిజానికి ఇలాంటి పరిస్థితులు ఏవీ లేని కాలంలో మనిషి జీవించలేదా. హాయిగా బతకలేదా. సమాచారం, జ్ఞానం పంచుకోలేదా.
జీవనావసరాల అనే్వషణ నిరంతరాయంగా కొనసాగింది. పలు పాత నాగరికతల్లోని అద్భుత జీవన అవగాహనని పరికించి చూస్తే, గగుర్పొడుస్తుంది. మంచి చెడుల మధ్య జరిగిన పోరాటంలో జ్ఞానం తనవంతు పాత్ర పోషించింది. మనిషి తరపున నిలిచి అనేక దేశాలలో, ఖండాలలో ఒక సౌహార్ర్ద్భావన పెంచి పోషించింది.
సాంకేతికంగా, సమాచార వినిమయం, జ్ఞాన వినిమయం పెరిగాకే మనిషి సంకుచితత్వానికి గురయ్యాడు. తీగలు భూమీద ఉన్న కాలంలో మనిషి తన స్వేచ్ఛను కాపాడుకున్నాడు. అది ధ్వని వాయు తరంగ వేగం పొందాక మనిషి జీవితం బహిరంగం అయ్యింది. ఒక సంత అయ్యింది. సంతలోని సరుకులా ఎవరు పడితే వారు కొనుక్కుని వాడుకునేదిగా మారిపోయింది.
పరిశోధన, అనే్వషణ, నైతికంగా అతనిదే కాని ఈ జ్ఞానం అంగడిలో సరుకుగానే దానికి వెల, విలువ పెరిగాక సొంత ఆస్తిగా మారింది.
తీగలు లేని కాలంలోనే సమాచారం ఉన్నది ఉన్నట్లుగా చేరింది. ఎలాంటి కలపడాలు లేవు. కాల్పనికాంశలు కొన్ని జోడింపబడినా సమాచారం ఉండేది. ఇటునుండి అటు వెళ్లిన దానిలోని అసలు విషయం అర్థం అయ్యేది. ఇప్పుడు కళ్లముందే దృశ్య శ్రవణ రూపాలలో వ్యతిరేకార్థంలో సమాచారం చేరుతున్నది. యంత్రాన్ని మోసగించడం సులభం. కనుపించే మనిషిని మోసగించడం కొంత కష్టం. అతని భావాలతో, సున్నితత్వాలతో ఆడుకోవడం మరో సాదాసీతా మనిషికి సాధ్యం కాదు. మోసానికి, అకృత్యానికి పాల్పడే శక్తులు ఇప్పటితో పోలిస్తే అప్పుడు తక్కువ. మనిషి మనిషితో సంప్రదించే పరిస్థితి ఉన్నంత కాలం మానవ మోసం కొన్ని పరిమితులలో ఉండేది. పరికరాలు, సాంకేతికత ఆ పాత్ర నిర్వహిస్తున్న నేటి కాలంలో ఎన్నో అవకాశాలు పెరిగాయి. మొత్తం సమాజాన్ని, దేశాన్ని, జాతిని, మానవ సమాజాలను, ఒక్కసారి మోసం చేయవచ్చు. దీనినే ఘరానా మోసం అంటారు. ఇది వ్యవస్థీకృతంగా జరుగుతున్నది. దానికి సాంకేతికత సహకరిస్తున్నది. అది ఉన్నవారి చెప్పుచేతల్లో అది బానిస.
మొన్నటి వరకు జాతీయోద్యమంలో కానీండి, తెలంగాణ రైతాంగ పోరాటంలో కానివ్వండి, భావ ప్రసారం ద్వారానే ప్రజలు గెలిచారు. ఒకరి నుండి మరొకరు. నోటి నుంచి చెవి వరకు. వందల మైళ్ల దూరం చైతన్యం అత్యంత వేగంగా పరుగెత్తేది. ఎవరిని చేరాలో వారిని కదిలించేది. అంగ్లేయ సామ్రాజ్య శక్తులను, దేశీయ కరుడుగట్టిన భూస్వామ్య పాలకులను గద్దె దించింది ప్రజల మనోభావాల వ్యాప్తే. అది నినాదం రూపంలో. పాట రూపంలో.. మాట రూపంలో... కళా రూపంలో... విద్యుత్తయ ప్రసారమైంది. అది తగల వలసిన హృదయాలను తగిలేది. చేరవలసిన చోటికి చేరేది. అందుకే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించింది. ఇది యాంత్రిక యుగం.
మనిషి ముందున్న ఏకైక లక్ష్యం యంత్రాన్ని రూపుమాపి మనిషిని నిలపడం. మానవతని కలగనడం.
తిరిగి తీగలు మొలవాలి.
తిరిగి మానవ శరీరాలలోకి ప్రసారశక్తి రావాలి.