సంపాదకీయం

మతం? జాతీయతత్త్వం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతంగా మనుగడను సాగించాలి, అసత్యమును వదలి సత్యాన్ని మాట్లాడాలి, గుర్తించాలి.. చీకటి నుండి వెలుగులోనికి పయనించాలి, అశాశ్వత స్థితిని అతిగమించి శాశ్వతత్వాన్ని పొందాలి - అని ఆకాంక్షించడం మతోన్మాదమని ప్రచారం జరుగుతోంది! ఈ భావం సంస్కృతభాషలో - ‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృంతంగమయ! ఓం శాంతిః శాంతిః శాంతిః!’ - అని అభివ్యక్తవౌతుండడం ఇందుకు ప్రధాన కారణం. సంస్కృత భాషలో ఏది చెప్పినప్పటికీ అది ‘హిందూ మతోన్మాదమన్న’’ది విదేశీయ భావదాస్యగ్రస్తుల స్వభావంగా మారి ఉంది.. ఇది శతాబ్దులు సాగిన విదేశీయ భౌతిక దాస్య ఫలితం. అందువల్ల కేంద్రీయ విద్యాలయాలలో ‘‘అసతోమా సద్గమయ’’ అన్న ‘ప్రార్థన’ను చేయించరాదని ఆదేశించవలసిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌లోని ఒక పెద్దమనిషి సర్వోన్నత న్యాయస్థానంలో ‘న్యాయయాచిక’ను దాఖలు చేశాడట! ఈ సంస్కృత వాక్యాల తరువాత ‘విద్యను సంస్కారాన్ని’ ప్రసాదించమని విద్యాధి దేవతను ప్రార్థించే హిందీ గీతం కూడా ‘హిందుత్వం’పై ఆధారపడి ఉందని అందువల్ల ఇతర మతాలవారి, మత విశ్వాసాలు లేనివారి ప్రార్థనలకంటె భిన్నంగా ఉందన్నది న్యాయయాచికను దాఖలు చేసినవారి వాదం!! ఇలా ‘‘హిందూమత’’ ప్రార్థనను ఇతర మతాలకు చెందిన విద్యార్థుల చేత పాడించడం తగదన్నది ‘న్యాయయాచిక’ - పిటిషన్ -లోని ఇతివృత్తం! కేంద్రీయ విద్యాలయాలు కేంద్రప్రభుత్వ సంస్థలు కాబట్టి ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలో ‘సర్వమత సమభావ’ - సెక్యులర్ - పద్ధతులు మాత్రమే పాటించాలన్నది ‘న్యాయ యాచకుల’ ఆకాంక్ష! ఈ విషయమై సమాధానం చెప్పవలసిందిగా సర్వోన్నత న్యాయమూర్తులు రోహింగ్టన్ ఎఫ్.నారిమన్, నవీన్‌సిన్హా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అందువల్ల ప్రభుత్వాలకు ప్రజలకు శిరోధార్యమైన సర్వోన్నత న్యాయనిర్ణయం కోసం వేచి చూడవలసి ఉంది! కానీ అప్పుడే కొంతమంది మేధావులు మనకు ‘సర్వమత సమభావ ప్రార్థన’ - సెక్యులర్ ప్రేయర్ - దొరకదా?? - ప్రజ్ఞావాదాలను ‘దృశ్య ప్రసార మాధ్యమాల’లో ఆవిష్కరిస్తున్నారు! ‘జాతీయత’ను మతంగా చిత్రీకరించి, మన బుర్రలకు ఎక్కించి వెళ్లిన బ్రిటన్ దురాక్రమణదారుల మానస పుత్రులు, వారి వారసులు ఇలా ఈ ‘ప్రజ్ఞావాదాల’ను వినిపించడం కొత్తకాదు..
సర్వమత సమభావం అనాదిగా మనదేశపు వౌలిక అస్తిత్వంలోని అతి ప్రధాన అంశం! సృష్టిగత వాస్తవాలు సమాజస్థిత జీవనంగా భాసించడం ఈ అస్తిత్వంలో మరో ప్రధాన అంశం! మతాలు భాషలు పుట్టడం మార్పు చెందడం చరిత్ర, కొన్ని నశించి ఉండవచ్చు కొత్తవి ఏర్పడి ఉండవచ్చు! కానీ ఈ దేశపు జాతీయ అస్తిత్వం అనాదిగా అద్వితీయంగా కొనసాగుతోంది. అనేకానేక భాషలు, మతాలు ఇతరేతర అగణ్య వైవిధ్యాలు ఈ అద్వితీయ అస్తిత్వంలో సమాన భాగమయ్యాయి! వైవిధ్యాల మధ్య ‘సృష్టి’లో వైరుధ్యం లేదు సమన్వయం ఉంది, వైవిధ్యాలు ఒకదానిని ఒకటి మట్టుపెట్టడం లేదు, సమాన భూమికపై సమాంతరంగా వికసిస్తున్నాయి. ఈ ప్రాకృతిక వాస్తవాన్ని ఒక కవి ‘‘చక్కనైన పూలతోటలో మొక్కలెన్నో ఉన్నవి, హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నా ఏకమై ఉంటున్నవి...’’ అని వివరించాడు! సృష్టికి ప్రతిరూపంగా భాసిస్తున్న మనదేశపు జాతీయ అస్తిత్వం సైతం మొక్కలవంటి మతాలను భాషలను వైవిధ్యాలను సమన్వయంతో వికసించడానికి వీలు కల్పించింది! ఈ జాతీయ అస్తిత్వం పేరు సనాతనతత్త్వం, అజనాభం, భారతీయత, హిందుత్వం.. సనాతన తత్త్వం అంటే ‘శాశ్వతమైనది’ అని అర్థం, ‘అజనాభం’ అంటే సృష్టి స్థానం అని అర్థం! ఈ ‘జాతీయ అస్తిత్వానికి ‘సనాతన’, ‘అజనాభ’, ‘్భరతీయ’, ‘హిందూ’ అన్నవి అనాదిగా పర్యాయపదాలు! భారతీయత అన్నప్పటికీ హిందూ సమానార్థకాలు..
అందువల్లనే వౌలికమైన ప్రార్థనలు ఏ ఒక్క మతానికి కాని చెందినవి కాలేదు! మొత్తం జాతీయులకు మాత్రమేకాక విశ్వమానవులందరికీ ఆమోదయోగ్యమైన ప్రార్థనలను భారతీయులు లేదా హిందువులు యుగయుగాలు కొనసాగిస్తున్నారు! ‘‘్భ మేమతర్నిధేహిమా, భద్రయా సుప్రతిష్ఠతు’’ - నేలతల్లీ మమ్ము సకల శుభములతో భద్రముగా జీవించనిమ్ము - అన్న ప్రార్థనలో ఏ మతం ఉంది?? దేశప్రజలందరూ మాతృభూమి బద్దలైనప్పుడు భూమిని ప్రార్థించడం ఏకమత ప్రార్థన అవుతుందా? సర్వమత ప్రార్థన అవుతుందా? లేక కొన్ని మతాలవారు మాతృభూమికి బిడ్డలు కారా? కాదని చెప్పడం అతార్కికం అన్యాయం.. అలాగే అగ్ని, నీరు, ఆకాశం, గాలి కూడా దేశంలోని సర్వప్రజలకు సమానం! అందువల్ల ఈ పంచభూతాలను ప్రస్తుతించే ప్రార్థనలు జాతీయ ప్రార్థనలు మాత్రమే కాదు, అంతర్జాతీయ మహామంత్రాలు! అలాగే మానవీయ సంస్కారాలను గుర్తు చేసే ప్రబోధించే వాక్యాలు కూడా ఏ మతానికి పరిమితం కాకపోవడం ఈ జాతీయ చరిత్ర! ‘‘పరస్పరం రక్షించుకుందాము, కలసి తిందాము, కలసి పనిచేద్దాము, కలసిమెలసి చదువుకుందాము’’ - ‘‘సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు...’’ అని ప్రార్థించడం, ‘‘మావిద్విషావహై’’ - పరస్పరం విరోధించరాదు - అని కోరడం సర్వమతాలకు సంబంధించి భారత జాతీయ సంస్కారం, హైందవ జాతీయ వారసత్వం! శక్తిని విద్యను సంపదను ఆకాంక్షించడం మత ప్రార్థన ఎలా అవుతుంది??
కానీ అనాదిగా ఉన్న మన జాతీయతను - సర్వమత భాషావైవిధ్య సంపుటమైన జాతీయతను - బ్రిటన్ పెత్తందార్లు కేవలం ఒక ‘మతం’గా ప్రచారం చేశారు! ఫలితంగా జాతీయ తత్త్వం ‘మతతత్త్వ’మన్న ప్రచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆంగ్లేయుల మానస సంతతి కొనసాగిస్తోంది... అందువల్లనే ‘‘వందేమాతరం’’ అన్న ప్రార్థన కూడా ‘మతతత్త్వ ముద్ర’కు బలైంది! బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరకాలంలో ‘వందేమాతరం’ గీతం దేశభక్తుల గుండెలలో మహామంత్రంగా మారుమోగింది. మాతృభూమి భౌతిక స్వరూపాన్ని, సాంస్కృతిక స్వభావాన్ని వివరించిన ఈ గీతం భారతీయుల అనాది మాతృభక్తి ప్రవృత్తికి అనురూపం. మాతృభూమి తత్త్వాన్ని మాతృదేశం పరమోన్నత దేవత అన్న సత్యాన్ని మరచినవారికి మహాకవి బంకించంద్ర చటర్జీ ఈ వాస్తవాలను గుర్తు చేయడానికై ‘ఆనందమఠం’ అన్న నవలలో ఈ గీతాన్ని పొందుపరిచాడు. కానీ మహమ్మదాలీ జిన్నా నాయకత్వంలోని పాకిస్తాన్‌వాదులు కాంగ్రెస్ ఉద్యమ సంస్థలోని వారి అనుకూలురు ఈ గీతాన్ని వ్యతిరేకించడం చరిత్ర. కానీ స్వతంత్ర భారతదేశంలో కూడా ‘వందేమాతరం’ గీతాన్ని సంపూర్ణంగా ఆలపించకపోవడం కొనసాగుతున్న వైపరీత్యం. విచక్షణ మళ్లీ వికసించాలి. అసత్యం నుంచి సత్యానికి.. అసతోమా సద్గమయ!