సంపాదకీయం

హయిఫా స్మృతి.. మోషే ద్యుతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశపు రాజధానిలో నెలకొని ఉన్న ‘తీన్‌మూర్తి’ స్మారక కేంద్రాన్ని ‘తీన్‌మూర్తి - హయిఫా’ స్మృతి చిహ్నంగా ప్రకటించడం వందేళ్ల చరిత్రకు అద్భుతమైన పునరావృత్తి.. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మనదేశంలో అధికార పర్యటన కోసం ఆదివారం కొత్త ఢిల్లీకి అరుదెంచిన వెంటనే ‘తీన్‌మూర్తి’కి వెళ్లి ‘హయిఫా’ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు అంజలి ఘటించడం హీబ్రూల కృతజ్ఞతా స్వభావానికి అద్దం! నెతన్యాహు పర్యటన సందర్భంగా మనదేశానికీ ఇజ్రాయిల్‌కూ మధ్య తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్య, వ్యవసాయ, అంతరిక్ష, సాంకేతిక పరిజ్ఞాన, రక్షణ రంగాలలో ఉభయ దేశాల మధ్య ‘సహకారం’ మరిన్ని ‘మారాకులు’ తొడిగిందనడానికి ఈ నూతన ‘అంగీకారాలు’ ప్రతీకలు. దశాబ్దుల పాటు మోడువారిన ‘్భరత ఇజ్రాయిల్’ సంబంధాలు దాదాపు ఇరవై ఐదు ఏళ్లకు పైగా చిగురులు వేస్తున్నాయి. 1948లో ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటికీ ఆ దేశంతో మన దేశానికి 1993 వరకు దౌత్య సంబంధాలు నెలకొనకపోవడం ఘోరమైన చారిత్రక వైపరీత్యం. దౌత్య సంబంధాలు నెలకొన్న తరువాత కూడ ఉభయ దేశాల మధ్య 2003 వరకు సంబంధాలు అంతంతమాత్రం కావడం అంతర్జాతీయ వ్యూహాత్మక అపవాదం.. 2003లో అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని ఏరియల్ షరణ్ మన దేశాన్ని దర్శించాడు, అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఇజ్రాయిల్‌ను దర్శించగలడన్న ఆశలు కూడ చిగురించాయి. కానీ అది జరగలేదు.. గత జూలైలో మన ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌కు వెళ్లివచ్చాడు. ‘‘మీ రాక కోసం డెబ్బయి ఏళ్లు నిరీక్షించాము.. ఏడు దశాబ్దులపాటు ఎదురు చూశాము..’’ అని ‘టెల్‌అవీవ్’ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం చెప్పిన నెతన్యాహు అప్పుడు ప్రకటించడానికి ఇదీ పూర్వరంగం! భారత ప్రధాని ఇజ్రాయిల్‌ను సందర్శించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన పరిణామం.. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడానికి ‘‘ప్రపంచ పటం నుంచి ఇజ్రాయిల్‌ను తుడిచిపెట్టడానికి’’ 1948 నుంచి యత్నిస్తున్న జిహాదీ బీభత్స మూకలకు కలవరం కలిగించిన పరిణామం! భారత ఇజ్రాయిల్ మైత్రి వడివడిగా వికసిస్తుండడం ఈ ‘మూకల’కు నచ్చని వ్యవహారం.. 2016 నవంబర్‌లో ఇజ్రాయిల్ అధ్యక్షుడు రూవన్ రివ్లిన్ మన దేశానికి వచ్చి వెళ్లడం నరేంద్రమోదీ పర్యటనకు పూర్వరంగం. ఇలా గత కొన్ని నెలలలో ఈ రెండు అతి ప్రాచీన ‘జాతుల’ మధ్య మళ్లీ స్నేహం పెంపొందుతోంది. నెతన్యాహు ప్రస్తుత పర్యటన మరో మైత్రీ ప్రతీక. రాయిసినా ‘సంభాషణల ప్రక్రియ’ మూడవ సదస్సు ప్రారంభ సమావేశంలో మంగళవారం ఆయన చేసిన ప్రసంగం ఉభయ దేశాల మధ్యగల ఈ చారిత్రక సంబంధాలను మరోసారి గుర్తు చేసింది!
మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇజ్రాయిల్ చాలా చిన్న దేశమైనప్పటికీ పరిణత ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ అక్కడ కొనసాగుతోంది! సర్వమత సమభావ వ్యవస్థ ఉభయ జేశాలకు సమానం.. ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను ధ్వంసం చేసి ‘ఇస్లాం మత రాజ్యాన్ని’ స్థాపించడానికి యత్నిస్తున్న ‘జిహాదీ’లు ఏడు దశాబ్దులుగా ఉభయ దేశాలలోను భయంకర హత్యాకాండ సాగిస్తున్నారు. మన దేశంలోకి పాకిస్తాన్ ప్రభుత్వం ‘జిహాదీ’ తోడేళ్లను ఉసిగొల్పుతోంది. ఇజ్రాయిల్‌కి సైతం పొరుగున ఉన్న ‘ఇస్లాం మతరాజ్యా’ల వారు జిహాదీలను ఉసిగొల్పుతున్నారు. మన దేశపు పడమటి సరిహద్దు నుంచి ఇజ్రాయిల్ తూర్పు సరిహద్దు వరకు వ్యాపించి ఉన్న దేశాలలోని జిహాదీల లక్ష్యం ‘అటు ఇజ్రాయిల్‌ను ఇటు మన దేశాన్ని బద్దలు కొట్టడం..’’ ఈ రాక్షస వాంఛ ఎప్పటికీ నెరవేరబోదన్నది చరిత్ర నిరూపించిన నిజం! సోమవారం నాడు ఢిల్లీతో కుదిరిన ‘రక్షణ’ సహకారానికి ఈ బీభత్స ప్రమాదం ప్రధాన ఇతివృత్తం! జిహాదీలు గెలిస్తే ‘సర్వమత సమభావం’ ధ్వంసమైపోతుంది, ‘జిహాదీ’లు ఓడితే ఇస్లాం మతం వారితోసహా అన్ని మతాలవారు హాయిగా జీవించగలరు. చరిత్ర నిరూపించిన ఈ నిజం మోదీ నెతన్యాహు చర్చల తరువాత ధ్వనించిన ప్రధాన భావం..
ఇలా కుదిరిన ఒప్పందాలకు పెరుగుతున్న సహకారానికి రెండువేల ఏళ్ల చరిత్ర సాక్షీభూతం. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది వరకూ మధ్యధరా సముద్రపు తూర్పుతీరాన విస్తరించి ఉండిన యూదుల దేశాన్ని - హీబ్రూ భాషా సంస్కృతులను - రోమన్లు ధ్వంసం చేశారు. అలా ‘పాలస్తీనా’ నుంచి నిర్వాసితులైన యూదులు రెండువేల ఏళ్లపాటు ప్రపంచమంతా చెల్లాచెదురయ్యారు. ‘బైజాంటిన్’, ‘ఒట్టమాన్’ వంటి సామ్రాజ్యాలు ఆ తరువాత పాలస్తీనాలో యూదు సంస్కృతిని నామరూపాలు లేకుండా నశింప చేశాయి. యూదులు శరణార్థులుగా శతాబ్దుల పాటు విదేశాలలో తలదాచుకున్నారు. దాదాపు అన్ని దేశాలలోను స్థానికులు ఈ శరణార్థులను చిన్నచూపు చూశారు, వేధించారు! భారతదేశంలో మాత్రమే తమకు స్థానికులతోపాటు సమాన ఆదరణ గౌరవం ఆతిథ్యం ఉపాధి లభించాయని యూదులు పదేపదే చెప్పుకున్నారు. నెతన్యాహు ఢిల్లీలో మరోసారి చెప్పాడు. 1918లో మొదటి ప్రపంచయుద్ధం సమయంలో పాలస్తీనాలోని, మధ్యధరా సముద్రతీరంలోని ‘హయిఫా’ ఓడరేవు పట్టణాన్ని తురుష్కుల నుంచి ‘‘బ్రిటన్ మిత్ర దేశాల’’ కూటమి వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ యుద్ధంలో మైసూరు, హైదరాబాద్, జోథ్‌పూర్ ‘రాజ్యాల’కు చెందిన భారతీయ సైనికులు వీరోచితంగా పోరాడడంవల్ల మాత్రమే ‘హయిఫా’కు తురుష్కుల నుంచి విముక్తి లభించింది. ఈ ‘హయిఫా’ విముక్తి ప్రపంచంలోని యూదులు తిరిగి తమ ‘స్వభూమి’కి వెళ్లి స్థిరపడడానికి దోహదం చేసింది! ఇలా స్థిరపడడం 1948లో ‘ఇజ్రాయిల్’ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి దారితీసిన శుభపరిణామం! రెండువేల ఏళ్లపాటు దేశం లేని యూదుజాతికి ఇలా దేశం లభించింది! అందువల్లనే ‘హయిఫా’ను విముక్తం చేసిన భారతీయ సైనికుల పట్ల, రెండువేల ఏండ్లు తమకు ఆత్మీయత ఆతిధ్యం ఇచ్చిన హైందవ జాతిపట్ల ఇజ్రాయిల్ - యూదు - హీబ్రూ - ప్రజలకు కృతజ్ఞత ఏర్పడి ఉంది..
నెతన్యాహు ఢిల్లీలో దిగిన వెంటనే ‘తీన్‌మూర్తి’ని దర్శించి భారతీయ అమర వీరులకు అంజలి ఘటించడం ఈ కృతజ్ఞతకు చిహ్నం!.. హయిఫాను విముక్తం చేయగలిగిన భారతీయ సమరవీరులలో అమరులైన నలబయి మందికి తరతరాల స్మృతిచిహ్నం ‘తీన్‌మూర్తి’! 2008 నవంబర్‌లో పాకిస్తాన్ జిహాదీలు ముంబయిలో జరిపిన భయంకర బీభత్సకాండకు నూట అరవై ఆరు మంది బలయ్యారు. రబ్బీ గార్వియెల్ హాల్ బర్గ్ అనే యూదు జాతీయుడు, ఆయన భార్య కూడ మరణించారు! వారి రెండేళ్ల కుమారుడు మోషే హాల్‌బర్గ్ మాత్రం బతికి బయటపడినాడు. పదకొండేళ్ల మోషే హాల్‌బర్గ్‌ను మోదీ గత జూలైలో ఇజ్రాయిల్‌కు వెళ్లినప్పుడు కలుసుకున్నాడు. ఈ చిన్నారి మోషే ఇప్పుడు ముంబయికి రావడం జిహాదీ బీభత్సంపై సర్వమత సమభావానికి మరో విజయం..