సంపాదకీయం

జల సంధానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాస్నానం, తుంగాపానం - అన్నది యుగయుగాల భారతీయుల జీవన లక్ష్యం... ‘గంగ’తో ‘తుంగ’ అనుసంధానమై ఉండడం భౌతిక వైవిధ్యాల మధ్య నిహితమై ఉన్న సనాతన సాంస్కృతిక ఏకాత్మ స్వభావం. దేశంలోని నదులను అనుసంధానం చేయడం ద్వారా దేశమంతటా పుష్కలంగా నీటిని సమకూర్చాలన్నది వర్తమాన లక్ష్యం! గంగాజలాలను తుంగా నదికి కలపితే, బ్రహ్మపుత్రను కావేరీ నదిలో అనుసంధానం చేయగలిగితే వ్యవసాయ క్షేత్రాల సస్యశ్యామల శోభలు మరింత ఆకుపచ్చతనాన్ని సంతరించుకోగలవన్నది ఆకాంక్ష! ‘‘పచ్చగా ఉండడం’’ అన్నది యుగయుగాలు ప్రకృతి పరిపుష్టికి మాత్రమేకాదు, మానవ జీవన ప్రగతికి కూడ ప్రతీక! అందువల్ల విదేశీయ దురాక్రమణ విముక్త భారత్‌లో డెబ్బయి ఏళ్లుగా నదుల అనుసంధానం గురించి చర్చ జరుగుతోంది! కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు నదుల అనుసంధానానికి పథకాలను రూపొందిస్తున్నాయి కూడ! తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణలో కలుపగలిగింది. కాకతీయ, భగీరథ ఉద్యమ పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం నదుల నీటితో వేలాది చెఱువులను కోట్ల ఇళ్లలోని ‘నల్లా’లను అనుసంధానం చేయడానికి యత్నిస్తోంది! ఇదంతా వివిధ ప్రాంతాలలోని అంతర్గత జలానుసంధాన ప్రయత్నం. కానీ దేశంలోని వివిధ ప్రాంతాలలోని నదులన్నింటినీ పరస్పరం అనుసంధానం చేయగల బృహత్ ప్రణాళిక ఇంకా చర్చల దశలోనే ఉంది! జాతీయ జల వాహినులను అనుసంధానం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించవలసి ఉంది! ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక అవసరాలు జాతీయ జల సంధాన లక్ష్యంతో విభేదించని రీతిలో సామంజస్యం నెలకొనవలసి ఉంది! నదుల ను అనుసంధానం చేయడానికి సహకరించాలని కేంద్ర నీటివనరుల మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రాలకు చేసిన విజ్ఞప్తికి ఇదంతా పూర్వరంగం.. ఈ అనుసంధానం వల్ల సముద్రం పాలవుతున్న నీరు పొలాలకు ఇళ్లకు మళ్లించడానికి వీలవుతుందన్న వాస్తవాన్ని బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పునరుద్ఘాటించాడు. రెండు వేల ఐదు వందల శతకోటి ఘనపుటడుగుల గోదావరీ నదీ జలాలు సముద్రంలో కలసిపోతుండడం పట్ల ఆయన ఆందోళనను వ్యక్తం చేశాడట! దేశంలోని మిగిలిన నదులలోని నీరు ఏమేరకు వృధాగా ఉప్పునీరుగా మారుతున్నాయన్న విషయమై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి! గడ్కరీ ప్రతిపాదనకు తక్షణం స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అనుసంధానానికి సుముఖతను వ్యక్తం చేసింది. అయితే తమ ప్రాంతానికి అవసరమైన పదహారు వందల శతకోటి ఘనపుటడుగుల నీరు నిరంతరం లభించే విధంగా ‘అనుసంధానం’ జరగాలన్నది తెలంగాణ ప్రభుత్వం వారి ఆకాంక్ష..
మానవప్రయత్నం వల్ల జరుగుతున్న ‘అనుసంధానం’ భూగర్భస్థిత జలాల సహజ అనుసంధానానికి అనురూపం! ఉపరితల జలాల జీవన ప్రవాహానికి నిరంతరం దోహదం చేస్తున్న ప్రాకృతిక భాండాగారాలు భూగర్భజలాలు! ‘ఊటలు’ పెల్లుబకడానికి, నీటిబుగ్గలు నర్తించడానికి ఆధారం భూగర్భ జలాలు. చెఱువులు, దొరువులు, దొనలు, పడియలు, చెలమలు, గడుగులు, మడుగులు వేసవిలో సైతం నీటితో నిండి తొణికిసలాడడం మన చరిత్ర! వర్ష ఋతువులో ఉద్ధృతంగా ప్రవహించిన కొండవాగులు, సెలఏళ్లు వేసవిలో స్వచ్ఛమైన నీటితో ‘నాజూకు’గా నడయాడడం కూడా చరిత్ర! ఈ నిరంతర జలదృశ్యాలకు కారణం భూగర్భ జలాలు! భూగర్భం నిరంతరం ఆర్ద్రం కావడం వల్లనే ఉపరితల జలాలు ఆవిరి కాకుండా వేసవిలో కూడ దప్పిక తీర్చేవి, జానపదులు, గ్రామీణులు, గోపాలురు, పశుపాలురు, వనవాసీ జన సముదాయాలవారు ‘నీటి కటకట’కు గురి కాకపోవడానికి కారణం భూగర్భ జలాలు... ఉపరితల జల స్వచ్ఛత భూగర్భ జల స్వచ్ఛతతోను ఉపరితల జల లభ్యత భూగర్భ జల లభ్యతతోను యుగాలుగా అనుసంధానమై ఉందడం భారతీయ చరిత్ర! భారతీయతకూ, పాశ్చాత్య ప్రకృతి ధ్వంస ప్రవృత్తికీ సంఘర్షణ జరిగిన సమయంలో చెఱువులు ఎండిపోయాయి.. కొండవాగులు ఇంకిపోయాయి.. బావులు పూడిపోయాయి, భూగర్భం శుష్కించిపోయింది. ‘్భరతీయత’కు ‘ప్రపంచీకరణ’కు మధ్య గత పాతికేళ్లుగా సాగుతున్న పోరాటం ఫలితంగా నీరు ఆవిరైపోయింది!
‘ప్రపంచీకరణ’కు ప్రతినిధులైన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ భూమికి వేల అడుగుల లోతు వరకు కన్నాలు కొట్టి భూగర్భాన్ని గాయపరిచాయి. ‘లావాసా’ సంస్థవారు పడమటి కనుమలను ‘పోస్కో’ ‘వేదాంత’ సంస్థలవారు ఒరిస్సాలోని తూర్పు కనుమలను తవ్వేయడంవల్ల కొండవాగులు కనుమరుగైపోయాయి. వన్యప్రాణుల ‘దప్పిక’ తీరడం లేదు. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ ప్రాంతాలలో ‘పెప్సీ’ ‘కోలా’ వంటి సంస్థలు భూగర్భాన్ని తవ్వి చుక్క మిగలకుండా నీటిని తాగేశాయి. స్వచ్ఛమైన నీరు అదృశ్యమై పురుగుమందుల అవశేషాలు కలసిన శీతల పానీయాలు అవతరించడం ప్రపంచీకరణ.. పారిశ్రామిక కాలుష్యాలతో నదులు వాగులు చెఱువులు దొరువుల నీరు - ఉపరితల జలాలు కలుషితమయ్యాయి. ఎఱువుల విష రసాయనాలతో భూగర్భ జలా లు కలుషితమయ్యాయి. ఇదీ కింద పైన ఉన్న నీటి ప్రవాహాల మధ్య ‘ప్రపంచీకరణ’ శక్తులు సాధించిన కాలుష్య అనుసంధానం! నీరులేని చెఱువులు వాగు లు నదులు పూడిపోయా యి. భాగ్యనగరం వంటి చోట్ల వాటి ఆనవాళ్లు సైతం కనిపించకుండా సిమెంటుతో అంతస్థుల భవనాలను నిర్మించేశారు! దేశమంతటా ఇదే దుస్థితి! పల్లెలలో నీరు పుష్కలంగా లభించడం ‘గ్రామస్వరాజ్యపుగతం’.. నీటి చుక్కలు కనిపించని పారిశ్రామిక కృత్రిమ ప్రగతి ప్రపంచీకరణ సాధించిన వాస్తవం.. పశ్చిమ బెంగాల్‌లో ‘గంగ’ - హుగ్లీ - తోపాటు పదిహేడు ప్రధానమైన నదుల నీరు ముట్టుకుంటే విష రసాయన కాలుష్యాలు అంటుకుంటున్నాయట! నదుల నీటి స్వచ్ఛతను పునరుద్ధరించిన తరువాత, ‘నమామిగంగే’ అంటూ ప్రక్షాళన జరిగిన తరువాత నదుల అనుసంధానం చేయాలి! లేదా ఈ రెండూ సమాంతరంగా జరగాలి! లేకుంటే దేశ ప్రజలు నీటి విషాలతో అనుసంధానం అవుతారు!! నీటికాలుష్యం ప్రపంచీకరణ పతాక, నీటి స్వచ్ఛత భారతీయతకు ప్రతీక...
కేరళలోని ‘పఠాణం తిట్ట’ జిల్లాలోని ‘కరిమరంతోడు’ అన్న నదిని పదహైదు ఏళ్ల క్రితం పూడ్చేశారట! ఒక బహుళ జాతీయ సంస్థ నిర్మించతలపెట్టిన విమానాశ్రయం కోసం ఈ తరతరాల జీవవాహినిని ఎండగట్టేశారు.. ఇదీ ప్రపంచీకరణ! ఆర్ గిరిజ అన్న జిల్లా కలెక్టర్ పదహారు నెలల పాటు కృషి చేసి ఎండిపోయిన ‘వాగు’లో పూడిక తీయించడం భారతీరుూకరణ! వాగు యథావిధిగా జలజలమంటూ ప్రవహిస్తోందట! పాడుపడిన భూములు మళ్లీ సతతహరిత క్షేత్రాలు కానున్నాయి. ప్రగతి భూమార్గం పట్టింది? కానీ భారత జాతీయ సాంస్కృతిక స్రోతస్వినిని ‘ప్రపంచీకరణ’ పూడ్చివేస్తోంది! ఈ సాంస్కృతిక ధునిని ఎవరు పునరుద్ధరిస్తారు??