ఉత్తరాయణం

విషం కక్కిన చైనా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాయిష్ ఏ మొహమ్మద్ జిహాదీ ముఠాకు చెందిన మొదటి హంతకుడు మసూద్ అఝార్‌ను ఐక్యరాజ్యసమితిలో నిర్లజ్జగా సమర్ధించడం ద్వారా చైనా ప్రభుత్వం మరోసారి మనదేశంపై విషం కక్కింది! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత భారత వ్యతిరేక జిహాదీ ఉగ్రవాదాన్ని ఇలా చైనా ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపైన సమర్ధించడం ఇది మొదటిసారి కాదు! పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను మనదేశంపైకి ఉసిగొల్పుతుండడం దశాబ్దుల చరిత్ర! ఈ ఉగ్రవాద నిరోధక తీర్మానాలను ఐక్యరాజ్యసమితి ఆమోదించకుండా చైనా ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో తెర వెనుకనుండి నియంత్రించింది, మరికొన్నిసార్లు బహిరంగంగా అడ్డుకుంది! మొత్తానికి భారత వ్యతిరేక బీభత్సకారులను నియంత్రించరాదని, నిరోధించరాదని తాము కోరుతున్న వాస్తవాన్ని చైనా ప్రభుత్వం వారు దాచుకోవడంలేదు. కానీ ఇలా పరోక్షంగా ఉగ్రవాదులను మనదేశంపైకి ఉసికొల్పుతున్న చైనాను పేరుపెట్టి విమర్శించడానికి మన ప్రభుత్వం ఇప్పటికీ సంశయిస్తూ ఉండడమే జాతీయ వైపరీత్యం! మసూద్ అఝార్ నాయకత్వంలోని జాయిష్ ఏ మొహమ్మద్ ముఠా అంతర్జాతీయంగా పేరుమోసిన జిహాదీ సంస్థ! జాయిష్‌కు అఫ్ఘానిస్తాన్‌లోని అల్‌ఖాయిదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పఠాన్‌కోటలోని మన వైమానిక స్థావరంపై జాయిష్ హంతకులు గత జనవరిలో దాడిచేసి భయంకర బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో జాయిష్ ముఠాలోని మొదటి హంతకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మన ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి లేఖ వ్రాసింది. ఈ ఉత్తరం ప్రాతిపదిక మసూద్ అఝార్‌ను నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చడానికి వీలైన తీర్మానం రూపొందింది! ఐక్యరాజ్యసమితి బీభత్స వ్యతిరేక-కౌంటర్ టెర్రరిజమ్ విభాగం వారు ఈ తీర్మానాన్ని ప్రకటించారు. సభ్య దేశాల ప్రతినిధులకు ఈ తీర్మానాన్ని నివేదించారు. సభ్యదేశాలకు అభ్యంతరం లేనట్టయితే మసూద్‌ను నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చనున్నట్టు ఈ సమితి విభాగంవారు ప్రకటించారు కూడ. శుక్రవారంతో గడువు ముగియనుండగా, గురువారంనాడు చైనా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది! ఫలితంగా తీర్మానం మూలపడింది! మన ప్రభుత్వం చైనాను తీవ్రంగా నిరసించి ఉండాలి! కానీ మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖవారు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తీర్మానం ఆమోదించకపోవడంవల్ల జరుగనున్న వైపరీత్యాలను గురించి మాత్రమే ప్రస్తావించింది. మసూద్ అఝార్‌ను గతంలో నిషిద్ధ వ్యక్తిగా ప్రకటించకపోవడం వల్లనే మన పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడి జరిగిందని ఈ ప్రకటనలో ప్రస్తావించారు. అఝార్ మసూద్ వల్ల అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాద ప్రమాదం పెరగనున్నట్టు కూడ ఈ మన ప్రకటనలో తెలిపారు. కానీ దీనికి కారణవౌతున్న చైనా ప్రభుత్వ విధానాన్ని మన ప్రభుత్వం విమర్శించలేదు...చైనా పేరెత్తడానికి మన ప్రభుత్వం ఎందుకని సిగ్గుపడుతోంది?
మసూద్ అఝార్ అనేవాడు మూడు దశాబ్దులకు పైగా మన దేశాన్ని బద్దలుకొట్టే కార్యక్రమాన్ని అమలు జరుపుతున్న భయంకర బీభత్సకారుడు. హర్‌కత్-అల్-అన్సర్ అన్న జిహాదీ సంస్థ ద్వారాను ఆ తరువాత జాయిష్ ఏ మొహమ్మద్ ద్వారాను మనదేశానికి వ్యతిరేకంగా జిహాదీ హత్యాకాండలను నిర్వహిస్తున్నాడు. 1994లో జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఈ దుండగుడు పట్టుబడ్డాడు. 1999లో జైల్లో నుంచి పారిపోవడానికి విఫలయత్నం చేశాడు. ఈ విఫలయత్నంలో సజ్జద్ అఫ్ఘానీ అనే మరో హంతకుడు హతుడయ్యాడు. తిరిగి పట్టుబడిన అఝార్‌ను టెర్రరిస్టులు ఆ తరువాత విడిపించుకోగలగడం మన జాతీయ చరిత్రలో ఒక విషాద ఘట్టం. నూట ఎనబయి ఏడు మంది ప్రయాణం చేస్తుండిన మన విమానాన్ని జిహాదీలు 1999 డిసెంబర్ చివరలో అపహరించుకునిపోయారు. ఎనిమిదిరోజులపాటు అఫ్ఘానిస్తాన్‌లోని కాంథహార్ నగరంలో ఈ మన విమాన ప్రయాణీకులు బందీలుగా ఉన్నారు. అఝార్‌ను మరో ఇద్దరు జిహాదీ హంతకులు ఉమర్ సరుూద్ షేక్, ముస్తాక్ అహ్మద్ ఝార్‌గార్‌లను మనదేశంలోని జైళ్లనుండి విడుదల చేసి సురక్షితంగా పాకిస్తాన్‌కు పంపించాలన్నది విమానం అపహరణ కర్తల కోరిక! అలా విడుదల చేయకపోయినట్టయితే విమాన ప్రయాణీకులందరినీ హత్యచేసి విమానాన్ని పేల్చివేస్తామని అపహరణకర్తలు మన ప్రభుత్వాన్ని బెదిరించారు. విధిలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం 1999 డిసెంబర్ 31న అఝార్‌ను మిగిలిన ఇద్దరినీ అపహరణ కర్తలకు అప్పగించింది. విమాన ప్రయాణీకులను విడుదల చేయించింది!
అప్పటినుంచి పాకిస్తాన్‌లో సురక్షితంగా తిష్ఠవేసి ఉన్న మసూద్ అఝార్ మన దేశంలో జరిగిన అనేక బీభత్స ఘటనలకు సూత్రధారి! ఇప్పుడు ఈ దుండగుని అనుచరులే పఠాన్‌కోటపై దాడి చేసారన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం. కానీ పఠాన్‌కోటకు వచ్చి దర్యాప్తు జరిపిన పాకిస్తాన్ సంయుక్త పరిశోధక బృందం వారు మాత్రం అఝార్‌కు పఠాన్‌కోటపై జరిగిన దాడిలో ఎలాంటి సంబంధం లేదని తేల్చివెళ్లారు. ఐక్యరాజ్యసమితిలో అఝార్ వ్యతిరేక తీర్మానాన్ని అడ్డుకొనడం ద్వారా చైనా ప్రభుత్వం ఇలా పాకిస్తాన్ దుస్తంత్రాన్ని మరోసారి బాహాటంగా సమర్ధించింది. మసూద్ అఝార్ పఠాన్‌కోటపై దాడికి సూత్రధారుడని నిర్ద్వంద్వంగా ధ్రువపడిన తరువాత మళ్లీ పాకిస్తాన్ పరిశోధక బృందం దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వడం మన ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పిదం! పాకిస్తాన్ బృందం ఇలా మన దేశానికి వచ్చి దర్యాప్తు చేయడంవల్ల అంతర్జాతీయ సమాజంలో ఆ దేశంపట్ల విశ్వసనీయత ఏర్పడింది! ఒక దేశంలో హత్యాకాండ జరిపించిన శత్రుదేశం వారు హత్యాకాండకు గురి అయిన దేశానికి వచ్చి దర్యాప్తు జరపడం ఆధునిక ప్రపంచ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి. ఈ వైపరీత్యం మన స్వయంకృత అపరాధం. పాకిస్తాన్ ప్రభుత్వానికి మన ప్రభుత్వమే విశ్వసనీయతను పెంచింది. చైనాకు సాకుదొరికింది. అఝార్‌పై సమితి నిషేధాస్త్రం పడకుండా అడ్డుకుంది. అఝార్‌ను సమితి నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చి ఉండినట్టయితే, అతడిని అరెస్టు చేసి మన దేశానికి తీసుకుని రావడానికి వీలు కలిగి ఉండేది! అంతర్జాతీయ నిఘా సంస్థ ఇంటర్‌పోల్ ద్వారా అరెస్టు వారంట్-రెడ్ కార్నర్ నోటీస్-ను జారీ చేయడానికి వీలు కలిగి ఉండేది.
చైనాలోని సింకియాంగ్ ప్రాంతంలో కూడ జిహాదీ బీభత్సకారులు అనేకసార్లు హత్యాకాండ జరిపారు. కానీ చైనా ప్రభుత్వం ఈ టెర్రరిస్టులను ఉక్కుపాదంతో తొక్కివేసింది. టెర్రరిస్టులను పట్టుకొనడానికై చైనా దళాలు మసీదుల లోకి సైతం చొచ్చుకునిపోయి వారిని ఏరివేశారు! అయినప్పటికీ మన దేశంలో జిహాదీలు పాకిస్తానీ తొత్తులు విధ్వంసం సృష్టించడాన్ని చైనా సమర్ధిస్తోంది! ఈ అనాగరిక అమానవీయ చర్యలకు పాల్పడుతున్న చైనాకు మన ప్రభుత్వం పరుషమైన పదజాలంతో నిరసన తెలపాలి! అలా తెలుపకపోవడం దశాబ్దికి పైగా మనం అంతర్జాతీయ సమాజంలో చులకన కావడానికి దోహదం చేసింది. తమ దేశంపై దాడి చేయనంత వరకు జిహాదీలు మన దేశంపై దాడి చేయడం చైనా ప్రభుత్వానికి ఆమోదయోగ్యం...