సంపాదకీయం

‘భద్రత’కు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైనిక అధికారి ఆదిత్యకుమార్‌కు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం దాఖలు చేసిన ‘ఆరోపణ పత్రం’ ప్రాతిపదికగా ఎలాంటి చర్యలు తీసుకొనరాదని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించడం రక్షణ వ్యవస్థకు లభించిన నైతిక విజయం. అంతర్గత భద్రతను, సరిహద్దుల సమగ్రతను పరిరక్షించడానికై నిరంతర నిర్‌నిద్రులై విధులను వహిస్తున్న సైనికులకు దేశం రుణపడి ఉంది, ప్రజలు రుణపడి ఉన్నారు. పౌరులు సుఖంగా నిద్రించగలుగుతుండడానికి కారణం సైనికులు మేలుకొని ఉండడం! జమ్మూ కశ్మీర్‌లో ఈ జాగరూకత మరింతగా ప్రస్ఫుటిస్తోంది. జమ్మూ కశ్మీర్‌ను మన దేశం నుంచి విడగొట్టాలన్న పాకిస్తాన్ కుట్ర కలియుగం 5049 నుంచి కొనసాగుతోంది. భరత ఖండాన్ని బద్దలు కొట్టడానికి కలియుగం 3814- క్రీస్తుశకం 712లో విదేశీయ జిహాదీలు ప్రారంభించిన బీభత్సకాండకు ఈ కుట్ర కొనసాగింపు. ఈ బీభత్సకాండ విపరిణామ క్రమానికి పరాకాష్ఠ కలియుగం 5049- క్రీస్తుశకం 1947లో అఖండ భారతం ముక్కలు కావడం, పాకిస్తాన్ మతరాజ్యంగా ఏర్పడడం. పాకిస్తాన్ ఏర్పడ్డాక కూడా ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను నిర్మూలించడానికై ‘ఇస్లాం ఏకమత వ్యవస్థ’ జరుపుతున్న బీభత్సకాండ ఆగడం లేదు. పాకిస్తాన్ ఏకమత వ్యవస్థకు, మతోన్మాదానికి ప్రతిరూపం. మన దేశం సర్వమత సమభావానికి, మత సహిష్ణుతకు సజీవ చిహ్నం. జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ కొనసాగిస్తున్న కుట్రకు ఇదీ నేపథ్యం. 1947 అక్టోబర్‌లో పాకిస్తానీ కిరాయి మూకలు జమ్మూ కశ్మీర్‌లో చొరబడి బీభత్సం సృష్టించడం క్రీస్తుశకం 712లో మొదలైన ‘జిహాద్’కు కొనసాగింపు. పాకిస్తాన్ ఏర్పాటుతో జిహాదీల రాక్షస వాంఛలు, రక్తదాహం చల్లారలేదు. ఎందుకంటే జిహాదీ బీభత్సం స్వభావాత్మకమైనది, ప్రతి క్రియాత్మకమైనది కాదు. కిరాయి మూకలతో పాటు పాకిస్తాన్ సైనికులు కూడ జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడడం 1947 నాటి కథ. మూడవ వంతు జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఈ ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’- పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్- పీవోకే-కు మన అధీనంలో మిగిలిన జమ్మూ కశ్మీర్‌కు మధ్య ఏర్పడి ఉన్న ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌వోసీ-ను ప్రచ్ఛన్న బీభత్సకారులు నిరంతరం అతిక్రమిస్తున్నారు. ఈ ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకారులు పాకిస్తాన్ ప్రభుత్వ దళాలు- రేంజర్లు-! పాకిస్తాన్ ప్రభుత్వమే బీభత్స జిహాదీ రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉండడం నడుస్తున్న చరిత్ర! ఈ ‘అధీన రేఖ’ను ప్రత్యక్ష బీభత్సకారులైన జిహాదీలు నిరంతరం దాటి మన వైపునకు చొరబడుతున్నారు. అందువల్ల అధీన రేఖ వద్ద మన సరిహద్దు భద్రతా దళాల- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్- బీఎస్‌ఎఫ్- వారు, సైనికులు మరింత జాగరూకతతో ఉండవలసిన అనివార్యత ఏర్పడింది. ఇలాంటి దేశ రక్షకులపై దేశ విద్రోహులకు, జిహాదీలకు కసి, పగ రగలడం సహజం. కానీ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి ఎందుకని విద్వేషం రగులుతోంది? ఎందుకని మేజర్ ఆదిత్యకుమార్‌ను నేరస్థుడిగా పేర్కొంటూ ప్రథమ ఆరోపణ పత్రం- ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు- ఎఫ్‌ఐఆర్ నమోదైంది?
ఈ ఎఫ్‌ఐఆర్‌ను సర్వోన్నత న్యాయస్థానం వారు అమలు జరుగకుండా తాత్కాలికంగా నిలిపివేయడంతో రాజ్యాంగ వ్యవస్థ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే దేశభద్రత, సైనికులు, త్రివిధ రక్షణ దళాలు రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నట్టుగా రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. రాజ్యాంగంలోని 246వ అధికరణం ప్రకారం రూపొందిన ఏడవ అనుబంధం- షెడ్యూల్-లో కేంద్ర ప్రభుత్వ విభాగాలను, రాష్ట్ర విభాగాలను, ఉమ్మడి రాజ్యాంగ విభాగాలను నిర్దేశించి ఉన్నారు. ఈ నిర్దేశం ప్రకారం రక్షణ, రక్షణ దళాలపై అధికారం, బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా సైనికులు నేరస్థులపై కాల్పులు జరిపినప్పుడు, ఆ చర్య ‘తప్పా? ఒప్పా?’ అన్నది నిర్ధారించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కానీ విధి నిర్వహణలో భాగంగా కాల్పులు జరిపిన సైనికులకు వ్యతిరేకంగాను, ఈ చర్యను పర్యవేక్షించిన సైనిక అధికారి మేజర్ ఆదిత్యకుమార్‌కు వ్యతిరేకంగాను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చర్యలకు పాల్పడింది. ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ దుస్సాహసం.. అందువల్ల ఎఫ్‌ఐఆర్‌ను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఈ ఎఫ్‌ఐఆర్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నుంచి కోర్టు వివరణ కోరింది.
సర్వోన్నత న్యాయస్థానం సోమవారం జారీ చేసిన ఆదేశానికి పాకిస్తానీ జిహాదీలు కొనసాగిస్తున్న బీభత్సకాండ నేపథ్య వైరుధ్యం. సర్వోన్నత న్యాయ నిర్ణయం వెలువడిన సమయంలో సైతం పాకిస్తానీ జిహాదీ ముష్కరులు, పాక్ ప్రేరితులైన స్థానిక జిహాదీలు సైనికులపైన, సైనిక స్థావరాలపైన దాడులు చేస్తూనే ఉన్నారు. సైనికులను హత్య చేస్తూనే ఉన్నారు. ఈ హత్యాకాండ వల్ల ఏ మాత్రం ఆందోళన చెందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం దేశద్రోహుల బీభత్సకాండను నిరోధించడానికి బదులుగా కశ్మీర్‌లోని సోఫియా జిల్లాలో గత ఇరవై ఏడవ తేదీన కాల్పులు జరిపిన సైనికులపై మాత్రం నేరాలను ఆరోపించింది. మేజర్ ఆదిత్యకుమార్‌పై అభియోగం నమోదు చేసింది. ఇలా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం, భారత రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్లజ్జగా, నిర్భయంగా ధిక్కరించడానికి కారణం స్థానిక రాజకీయ పక్షాల మనస్తత్త్వం. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దులా, ఒమర్ అబ్దుల్లాల నాయకత్వంలోని ‘నేషనల్ ఫ్రంట్’- ఎన్‌సీ- ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డమొక్రాటిక్ పార్టీ- పీడీపీ- దశాబ్దుల తరబడి కశ్మీర్‌లో సైనిక దళాల ఉనికిని వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో సైనిక దళాలు నెలకొని ఉండడం వల్ల మాత్రమే విచ్ఛిన్నకారుల, దేశ విద్రోహ జిహాదీల బీభత్సకాండను ప్రభుత్వాలు ప్రతిఘటించగలుగుతున్నాయి. సైనికులను ఉపసంహరించినట్టయితే దేశద్రోహులు తక్షణం కశ్మీర్ లోయలో సమాంతర పాలనను ప్రారంభించగలరు. సైనికుల ఉనికిని వ్యతిరేకిస్తున్న ఈ స్థానిక, ప్రాంతీయ రాజకీయ పార్టీలు అలాంటి సమాంతర పాలనను పరోక్షంగా సమర్థిస్తున్నాయి. ఇలాంటి ప్రాంతీయ పక్షాలను ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నియంత్రించ లేకపోవడానికి కారణం రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బయ్యవ అధికరణం వల్ల కొనసాగుతున్న జాతీయ వైపరీత్యం.
సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలులో ఉన్న ఈశాన్య ప్రాంతాల్లోను, జమ్మూ కశ్మీర్‌లోను సైనికులకు బీభత్సకాండను నిరోధించడంలో మరిన్ని అధికారాలున్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఎన్‌సీ, పీడీపీ నిరంతరం కోరుతుండడం ఈ ‘పక్షాల’లో నిహితమై ఉన్న దేశ వ్యతిరేకతకు నిదర్శనం. అధికారంలో లేనప్పుడల్లా ఈ పార్టీలు దేశ విద్రోహాన్ని వెళ్లగక్కుతున్నాయి. భాజపాతో కలసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడ ‘పీడీపీ’ స్వభావంలో మార్పు రాలేదన్నది ఆదిత్యకుమార్ వ్యతిరేక చర్య ద్వారా ధ్రువపడింది మరోసారి!