సంపాదకీయం

హఫీజ్ ‘అదృశ్యం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ బీభత్స రాజ్యాంగ వ్యవస్థ కొనసాగిస్తున్న అంతర్జాతీయ వంచన క్రీడలో మరో ఘట్టం మొదలైంది. జిహాదీ బీభత్స ముఠాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించింది. మన దేశంలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకారులు పెద్దఎత్తున చెలరేగుతుండడం సమాంతర పరిణామం. జిహాదీ ముఠాలను నియంత్రించడానికి వీలైన ‘అధ్యాదేశం’- ఆర్డినెన్స్-ను పాకిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్ ఫిబ్రవరి పనె్నండవ తేదీన జారీ చేసినట్టు ప్రచారవౌతోంది. ఇలా పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణకు గురికానున్న ‘ఉగ్ర మృగ’ బృందాలలో ‘లష్కర్ ఏ తయ్యబా’ కూడా ఉందట. ఈ ‘అధ్యాదేశం’ జారీ అయిన సమయంలోనే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘తయ్యబా’ దుండగులు మన జమ్మూ కశ్మీర్‌లో, శ్రీనగర్‌లోని కేంద్ర రిజర్వు పోలీసుల ప్రధాన కార్యాలయంపై దాడులు చేశారు. ‘జమాత్ ఉద్ దావా’, ‘లష్కర్ ఏ తయ్యబా’ వంటి అనేక జిహాదీ ముఠాలను ఐక్యరాజ్యసమితి-ఐరాస- నిషేధించిన తరువాత ఏళ్లు గడిచిపోయాయి. ‘జమాత్ ఉద్ దావా’ను 2008లోనే ‘ఐరాస’ అంతర్జాతీయ బీభత్స ముఠాగా ప్రకటించింది. 2008 నవంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పిన ‘జమాత్’ తోడేళ్లు మన ముంబయిలో భయంకర బీభత్సకాండ జరపడం ‘ఐరాస’ చర్యకు నేపథ్యం. లష్కర్ ఏ తయ్యబాను ‘ఐరాస’ అప్పటికే నిషేధించింది. ‘లష్కర్’, ‘జమాత్’ ముఠాల సంస్థాపకుడు, నిర్వాహకుడు హఫీజ్ సరుూద్ అనే జిహాదీ ముష్కరుడు. ఇతగాడిని నిర్బంధించి, విచారించి శిక్షించాలని 2008 డిసెంబర్‌లో ‘ఐరాస’ సర్వ ప్రతినిధి సభ తీర్మానించింది. ఆ తీర్మానాన్ని పాటించినట్టు, ‘జమాత్’ను నిషేధించినట్టు, ఆ సంస్థలోని మొదటి హంతకుడు హఫీజ్‌ను నిర్బంధించి విచారిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం 2008 డిసెంబర్‌లో ప్రకటించింది. తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. ‘జమాత్’ను పాకిస్తాన్ నిషేధించలేదు, హఫీజ్‌ను విచారించలేదు, శిక్షించలేదు. అంతర్జాతీయ సమాజాన్ని పాక్ ప్రభుత్వం ఇలా దశాబ్దికి పైగా వంచించింది, వెక్కిరించింది, ‘ఐరాస’ను ధిక్కరించింది. 2008 నాటి ముంబయి పేలుళ్లకే కాదు, అంతకుముందు, ఆ తర్వాత మన దేశంలో జరిగిన అనేకానేక బీభత్స ఘటనలకు వౌలిక సూత్రధారి ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’- ఐఎస్‌ఐ. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగంగా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’ నిజానికి ఆ ప్రభుత్వ బీభత్స విభాగం- టెర్రర్ వింగ్! జమాత్, లష్కర్, జాయిష్ ఏ మొహమ్మద్, తహరీక్ ఏ తాలిబన్ వంటి పాకిస్తాన్ ముఠాలను మాత్రమే కాక, అఫ్ఘానిస్తాన్‌లోని హక్కానీ, అల్ ఖాయిదా, తాలిబన్, మన దేశంలో పుట్ట పగిలిన హిజ్‌బుల్ ముజాహిద్దీన్, ‘సిమి’, ఇండియన్ ముజాహిద్దీన్, బంగ్లాదేశ్‌లోని ‘హుజీ’, బర్మాలోని ‘రోహింగియా’ వంటి జిహాదీ ముఠాలన్నింటినీ అనుసంధానం చేస్తున్న బీభత్స వ్యవస్థ ‘ఐఎస్‌ఐ’..
ముంబయిలో 2008 నవంబర్‌లో జమాత్ ఉద్ దావా, లష్కర్ ముష్కరులు జరిపిన హత్యాకాండకు పూర్వరంగంగా సెప్టెంబర్‌లో ఢిల్లీ, అహమ్మదాబాద్, జైపూర్ నగరాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. నూట అరవై ఐదు మంది బలయ్యారు, ఢిల్లీలోనే ముప్పయి మంది బలయ్యారు. ఈ బీభత్సకాండను జరిపించిన మొహమ్మద్ ఆరీఝ ఖాన్ అనే ముష్కరుడు పదమూడవ తేదీన నేపాల్‌లో పట్టుబడ్డాడు. తాఖీర్ అనే మరో ముష్కరుడు గత డిసెంబర్‌లో నేపాల్‌లోనే పట్టుబడ్డాడు. వీరిద్దరూ దాదాపు ఏడేళ్లపాటు మన దేశం నుంచి నేపాల్‌కు నిర్భయంగా రాకపోకలు సాగించడం విస్తరించిన ‘ఐఎస్‌ఐ’ విష వ్యూహానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఇద్దరూ ఇండియన్ ముజాహిద్దీన్ ముఠాకు చెందినవారు. అంతర్జాతీయ అభిప్రాయానికి తల ఒగ్గి, అమెరికా, ఐరోపా దేశాలు విధించనున్న ఆంక్షలకు భయపడి పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని బీభత్సముఠాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నట్టు అభినయిస్తోంది. ‘ఐరాస’ నిషేధించిన సంస్థలను నిర్మూలించడానికి పాకిస్తాన్ అధ్యక్షుడు జారీ చేసిన ‘అధ్యాదేశం’ ఈ అభినయంలో భాగం! మరోవైపు మన దేశంలో తాము ఏర్పాటు చేసిన ఇండియన్ ముజాహిద్దీన్, ‘సిమి’, హిజ్‌బుల్ వంటి ముఠాలను బలోపేతం చేసేలా పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ పూనుకొంది. ఈ విస్తరణ పథకంలో భాగంగానే నేపాల్ నుంచి ఢిల్లీకి, మన దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆరీఝ ఖాన్ తరచూ రాకపోకలు సాగించాడు, పట్టుబడ్డాడు. పేర్లు భిన్న భిన్నమైనప్పటికీ పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ముఠాలన్నీ ‘ఐఎస్‌ఐ’ ఆజమాయిషీలో పనిచేస్తున్నాయి. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం నిజంగానే ఇప్పుడున్న జిహాదీ ముఠాలను నిర్మూలించినప్పటికీ ఈ ముఠాలలోని కొత్త కొత్త పేర్లతో మళ్లీ కొత్త ముఠాలను ఆరంభించడం ఖాయం!
ఇదంతా ‘ఐఎస్‌ఐ’ దుస్తంత్రంలో భాగం. ‘లష్కర్’ను నిషేధించిన వెంటనే హఫీజ్ సరుూద్ ‘జమాత్’ను ఏర్పాటు చేశాడు. ‘జమాత్’ను నిషేధిస్తే- (నిషేధించినట్టు, నిర్మూలిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రచారం చేస్తోంది.) మరో ‘్ఠమాత్’ ఏర్పడుతుంది. అందువల్ల వౌలిక జిహాదీ మృగమైన ‘ఐఎస్‌ఐ’ తన వైఖరి మార్చుకోనంత వరకూ పాకిస్తాన్‌లో బీభత్స రాజ్యాంగ వ్యవస్థ- టెర్రరిస్ట్ రిజీమ్- అంతం కాదు. ఐఎస్‌ఐ మాత్రమే కాదు, పాకిస్తాన్ పౌర ప్రభుత్వం కూడ సైనిక దళాల అదుపాజ్ఞల్లో ఉంటున్న సంగతి బహిరంగ రహస్యం. ఈ రహస్యం అమెరికా ప్రభుత్వానికీ తెలుసు. పది సంవత్సరాలుగా- 2008లో ముంబయిపై దాడి జరిగిన నాటి నుంచి- జమాత్ ఉద్ దావాను నిషేధించినట్టు మూడుసార్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాని మూడుసార్లు కూడా నిషేధించలేదు. ఇప్పుడు జారీ అయిన ‘అధ్యాదేశం’ దీనికి సరికొత్త సాక్ష్యం. గతంలోనే జమాత్‌ను నిర్మూలించినట్టయితే ఇప్పుడు ‘నిర్మూలించడానికి వీలుగా’ పాకిస్తాన్ అధ్యక్షుడు ‘అధ్యాదేశం’ జారీ చేయవలసిన అవసరం ఏమిటి? ఇది వంచన క్రీడలో సగం మాత్రమే! ఐరాస గతంలోనే ‘బీభత్స సంస్థలు’గా ప్రకటించిన ముఠాలను ఇప్పటివరకూ పాక్ ప్రభుత్వం నిర్మూలించలేదు. మరి ఈ పదేళ్లలో ‘ఐరాస’ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోకుండా చైనా నిరోధించింది. ఇది మిగిలిన సగం.. పాకిస్తాన్ ఇప్పుడు ‘జమాత్’ తదితర బీభత్స బృందాలను నిజంగా నిషేధించిందా? అన్న అనుమానం అందువల్ల అతార్కికం కాదు. ‘చరిత్ర’కు అనుగుణమైనది!
గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్ సరుూద్‌ను మూడుసార్లు అతని ఇంట్లోనే నిర్బంధించింది. 2008 డిసెంబర్‌లో మొదటిసారి గృహనిర్బంధం జరిగింది. కాని మూడుసార్లూ జమాత్‌ను ఆధికారికంగా నిషేధించలేదు. అందువల్ల న్యాయస్థానాలు హఫీజ్‌ను విడుదల చేశాయి. హఫీజ్‌ను నిర్బంధించినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం అభినయించడం, న్యాయస్థానాలు విడుదల చేయడం పాకిస్తాన్ సైనిక దళాలు నడిపిస్తున్న నాటకం! ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ‘అధ్యాదేశం’ జారీ చేసినప్పటి నుంచి మూడు రోజులుగా హఫీజ్ కనిపించడం లేదట! అతడు పరారైన తర్వాతనే ‘అధ్యాదేశం’ వెలువడింది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే అతగాడిని సురక్షితంగా తప్పించింది...