సంపాదకీయం

ఇరానీ పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాబహార్ ఓడరేవు అభివృద్ధి కార్యక్రమంలో పాకిస్తాన్‌కు చైనాకు భాగస్వామ్యం కల్పిస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించడం మన దౌత్య నీతికి ఎదురౌతున్న వ్యూహాత్మక ప్రతిబంధకం. చాబహార్ ఓడరేవును అభివృద్ధికి చేయడానికి, ఆధునీకరించడానికి వీలుగా ఇరాన్ ప్రభుత్వం ఇదివరకే మన దేశంతో ఒప్పందం కుదుర్చుకునేది. ఈ ఓడరేవు నిర్వహణలో మనకు భాగస్వామ్యం ఏర్పడి ఉంది. పాకిస్తాన్‌తో నిమిత్తం లేకుండా మనకు ఆప్ఘానిస్థాన్‌తోను, మధ్య ఆసియా దేశాలతోను వాణిజ్య సంబంధాలు, రాకపోకల వ్యవస్థ ఏర్పడడానికి చాబహార్‌లో మన భాగస్వామ్యం దోహదం చేస్తోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో అరేబియా సముద్ర తీరంలో నెలకొని ఉన్న గ్వాడార్ ఓడరేవు చైనాకు స్థావరంగా ఏర్పడి ఉంది. దశాబ్దికి పైగా చైనా గ్వాడార్‌లో తిష్ఠవేసి ఉంది. ఈ చైనా ‘తిష్ఠ’ మన పడమటి సరిహద్దునకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. చైనా విస్తరణను దశాబ్దికి పైగా పట్టించుకోని మన ప్రభుత్వం 2015లో ప్రతిఘటించడానికి నడుం బిగించింది. ఈ ‘ప్రతిఘటన వ్యూహం’లో భాగంగానే మన ప్రభుత్వం ఇరాన్‌లోని ‘చాబహార్’ ప్రాంగణంలో ప్రవేశింప గలిగింది. గ్వాడార్ ఓడరేవునకు పశ్చిమంగా నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒమాన్ సింధుశాఖ తీరంలో నెలకొని ఉన్న చాబహార్ ఓడరేవు మన నిర్వహణలో ఉండడం చైనా దురాక్రమణ వ్యూహానికి, వ్యూహాత్మక దురాక్రమణకు గొప్ప ప్రతిఘటన! కానీ మన దేశంతోపాటు చైనాకు, పాకిస్తాన్‌కు కూడ ఈ ఓడరేవు ప్రాంగణం అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించడం విస్మయకరమైన విపరిణామం.... ఇరాన్ ప్రభుత్వంవారి దౌత్య వంచనకు నిదర్శనం. పాకిస్తాన్‌లో పర్యటిస్తుండిన ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ ఝరీఫ్ మహమ్మద్ మార్చి పదమూడవ తేదీన ఇస్లామాబాద్‌లో ఈ ‘వంచన’కు ఆవిష్కరించాడు. ‘ఇస్లామాబాద్ వ్యూహాత్మక వ్యవహారాల అధ్యయన సంస్థ’- ఐఎస్‌ఎస్‌ఐ- వేదికపై ప్రసంగించిన ఝరీఫ్ చేసిన ఈ ప్రకటన మన దేశం పట్ల ‘అమిత్ర వైఖరి’కి నిదర్శనం...
ఈ అమిత్ర వైఖరిని ఇరాన్ ప్రభుత్వంవారు గత పదిహేను ఏళ్లకుపైగా అప్పుడప్పుడు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇరాన్‌నుంచి పాకిస్తాన్ భూభాగం మీదుగా మన దేశానికి ‘ఇంధన వాయువు’ను సరఫరాచేయడానికి ఉద్దేశించిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాకిస్తాన్‌తో కుమ్మక్కయిన ఇరాన్ ప్రభుత్వం భగ్నం చేయడం ఈ ‘అమిత్ర వైఖరి’కి ప్రసిద్ధ నిదర్శనం. ఇప్పుడు ‘చాబహార్’ ఒప్పందాన్ని నీరుకార్చడానికి మాత్రమే కాదు పాకిస్తాన్, చైనాలతో కలసి మన దేశానికి వ్యతిరేకంగా ‘వ్యూహాత్మక వాణిజ్య కూటమి’ని ఏర్పాటుచేయడానికి సైతం ఇరాన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది- ‘చైనా, పాకిస్తాన్ వాణిజ్య వాటిక’- చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్- సిపిఇసి- అభివృద్ధికై భాగస్వామ్యం వహించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని మహమ్మద్ ఝరీఫ్ ప్రకటించడం ఇందుకు నిదర్శనం. బలూచిస్థాన్‌లోని గ్వాడార్‌నుంచి సింకియాంగ్- ఝింజియాంగ్‌లోని కష్‌గఢ్ వరకూ చైనా పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ వాణిజ్య వాటికను ఏర్పాటుచేస్తున్నాయి. ఈ ‘వాణిజ్య వాటిక’ పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ గుండా కొనసాగుతోంది. అందువల్ల ‘పాకిస్తాన్ దురాక్రమణ కశ్మీర్’- పిఓకె-లో ఈ ‘వాటిక’ను నెలకొల్పరాదని మన ప్రభుత్వం చైనా ప్రభుత్వానికి గత మూడేళ్లుగా అనేకసార్లు స్పష్టం చేసింది. కానీ మన అభ్యంతరాన్ని, నిరసనను చైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి భారత వ్యతిరేక వాణిజ్య వాటిక నిర్మాణంలో భాగస్వామ్యం వహించడానికి పెట్టుబడులను పెట్టడానికి ఇరాన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండడం వారి విధానంలో మన దేశం పట్ల నిహితమై ఉన్న ‘అమిత్ర ప్రవృత్తి’కి మరో సాక్ష్యం.
చైనా తన భారత వ్యతిరేక వ్యూహాన్ని నిరంతరం విస్తరిస్తోందనడానికి ‘‘ఇరాన్ ఫిరాయింపు’’ సరికొత్త ధ్రువీకరణ- గతంలో ‘ఇరాన్- పాకిస్తాన్- భారత్’- ఇరాన్, పాకిస్తాన్, ఇండియా- ఐపిఐ- ఇంధన వాయు భూగర్భ మార్గ నిర్మాణ పథకం వమ్మయిపోవడానికి కారణం చైనా ప్రమేయం ఇరాన్ నుంచి గొట్టపు మార్గం గుండా మన దేశానికి ఇంధన వాయువును సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన ఈ శతాబ్ది ఆరంభంనుంచి కొనసాగుతోంది. ‘‘అదిగో ఇదిగో...’’ అంటూ ఇరాన్ ప్రభుత్వం పదేళ్లకు పైగా మన దేశాన్ని ఊరించింది. 2008 ఏప్రిల్‌లో పాకిస్తాన్, శ్రీలంక దేశాలలో పర్యటించిన అప్పటి ఇరానీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నేజాద్ స్వదేశానికి తిరిగి వెడుతూ ఆరుగంటలపాటు కొత్త ఢిల్లీలో ఆగాడు, అప్పటి మన ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌తో చర్చలు జరిపాడు. ‘‘నలబయి ఐదురోజులలో గొట్టపు మార్గం- పైప్‌లైన్- నిర్మాణం గురించి మూడు దేశాల మధ్య ఒప్పందం కుదిరిపోనున్నదని అప్పుడు అహ్మదీ నేజాద్ ఆర్భాటంగా ప్రకటించాడు. కానీ, ఆ తరువాత నాలుగేళ్లు గడిచిన తరువాత కూడ ‘పైప్‌లైన్’ గురించి ఇరాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాకిస్తాన్ భూభాగం గుండా నిర్మాణమయ్యే ‘గొట్టం’ నిర్వహణ కోసం మన ప్రభుత్వం వ్యయాన్ని భరించాలన్న ప్రచారాన్ని ఇరాన్ పాకిస్తాన్ ప్రభుత్వాలు కొనే్నళ్లు కొనసాగించాయి. ఆ తరువాత తమ దేశం గుండా కొనసాగే ‘గొట్టం’ భద్రత గురించి తాము ఎలాంటి హామీ కాని ఇవ్వజాలమని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. చివరికి మన దేశాన్ని ఈ గొట్టపు మార్గం పథకం నుంచి మినహాయించారు. 2012 మార్చిలో పాకిస్తాన్-ఇరాన్ ప్రభుత్వాలు ద్వైపాక్షిక అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ‘పైప్‌లైన్’ పాకిస్తాన్ వరకే నిర్మాణం అవుతుంది! పాకిస్తాన్ నుంచి ఈ గొట్టపు మార్గం ‘ఝింజియాంగ్’ మీదుగా చైనాలోకి పొడిగించాలన్నది 2012 నుండి నడుస్తున్న ప్రతిపాదన. ‘చైనా పాకిస్తాన్ వాణిజ్య వాటిక’- సిపిఇసి- ద్వారా ఈ గొట్టాన్ని నిర్మించాలన్నది ప్రతిపాదన. ఇలా ‘పైప్‌లైన్’ను నిరోహించిన చైనా ఇప్పుడు ‘చాబహార్’ ఒప్పందాన్ని చెడగొట్టడానికి నడుం బిగించింది. భారత, ఇరాన్‌ల మధ్యకల మైత్రి ‘చాబహార్’ ఓడరేవు వాటిక శాశ్వత కేంద్రం అన్న ఆర్భాటం ఇన్నాళ్లుగా జరిగింది. అందువల్ల ఇరాన్ ఇలా మొండి చేయిని ప్రదర్శిస్తుండడం విచిత్రమైన వ్యవహారం.
చాబహార్ అభివృద్ధి ఒప్పందం 2016 మే 23న కుదిరింది. మన ప్రధాని నరేంద్రమోదీ ఇరాన్ అధ్యక్షుడు హాసన్‌రౌహనీ, అప్ఘానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ఇరాన్ రాజధాని టెహరాన్‌లో సమావేశమై ఈ త్రైపాక్షిక అంగీకారాన్ని కుదుర్చుకున్నారు. దాదాపు లక్షా యాబయివేల కోట్లురూపాయల పెట్టుబడులను మన దేశం సమకూర్చగలదన్న ప్రచారం జరిగింది. ఈ ఓడరేవు ఆధునీకరణ ‘మొదటి దశ’ గత డిసెంబర్‌లో పూర్తయింది. ఆ సందర్భంగా మన విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ టెహరాన్‌ను సందర్శించారు. ఈ ఓడరేవు ద్వారా మన దేశంనుండి అప్ఘానిస్థాన్‌కు పప్పులు, గోధుమల ఎగుమతి మొదలైంది. ఫిబ్రవరిలో హాసన్‌రౌహనీ మన దేశంలో జరిపిన పర్యటన మైత్రిని మరింత పెంచింది. కానీ జమ్మూకశ్మీర్‌ను మన దేశంనుంచి విడగొట్టడానికి జరుగుతున్న ‘‘ఉద్యమాన్ని’’ పాకిస్తాన్‌తో కలసి తమ దేశం సమర్ధిస్తోందని జావాద్ ఝరీఫ్ ప్రకటించాడట!