సంపాదకీయం

వానాకాలం చదువుల్లా చట్టసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన చట్టసభల తీరు నానాటికి రాజుగారి గుర్రం గాడిదగా మారింది. వీధి బడులు పెంకుటిళ్లు, రేకుల షెడ్లలో నిర్వహించే రోజుల్లో వర్షం వస్తే పైకప్పులు సరిగా లేనందున పిల్లలకు సెలవు ఇచ్చేవారు. అందుకే వానాకాలం చదువులని పేరు వచ్చింది. నేటి ప్రజా ప్రతినిధులు కూడా చట్టసభల్లో హాజరు వేయించుకోవటం, ఏదో ఒక వంకతో గోల చెయ్యటం, సభలను వాయిదా వేయటం రివాజైంది. ఎవరైనా విమర్శిస్తే సభాహక్కులకు భంగం అంటారు. ప్రజలను దారిలో పెట్టవలసినవారే దారి తప్పితే ఎలా? నేడు పెద్దల సభల్లో ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో సౌమ్యంగా, హుందాగా చర్చించే ప్రజాప్రతినిధులే లేరు. భౌతిక పోరాటాలకు దిగుతున్నారు. మన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల పేరిట బడా వ్యాపార కుటుంబీకులకు, నోరున్నవారికి టిక్కెట్లు ఇస్తాయ. బడ్జెట్‌లను సైతం సమగ్ర చర్చలు, ప్రతిపక్షాలు లేకుండా ఆమోదించుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఆనాడు బ్రిటీష్ ప్రధాని చర్చిల్ భారతీయులకు స్వాతంత్య్రం పనికిరాదని అన్నట్టు మన ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిలో అగ్రరాజ్యాలతో పోటీపడుతున్న వేళ, ఇలాంటి పిల్ల చేష్టలతో పొరుగునున్న చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాలకు చులకనైపోతున్నాం. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో నాలుగైదు ఓట్ల మెజారిటీతో సభలు సజావుగా సాగుతాయి. దేశహితమే గాని పార్టీల, వ్యక్తిగత ఎజెండాలుండవు. సభా కార్యకలాపాలకు భంగం కలిగించే సభ్యులపై- నో వర్క్ నో పేమెంట్.. అని సస్పెన్షన్ వేటువేసి సభ సజావుగా నడిపించాలి. గోల చేస్తే పబ్లిసిటీ, సానుభూతి వస్తుందనుకోవటం భ్రమ. మీడియా సాక్షిగా నేడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు కూడా కుల, మత, ధన ప్రలోభాలకు లొంగకుండా నిత్యం ప్రజల్లో మమేకమై సమస్యలపై గళమెత్తే నేతలను ఎన్నుకుంటే మంచిది. లేకపోతే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్లు అవుతుంది.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
మోదీపై నిందలు ఏల?
బ్యాంకులను దోచుకున్న ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పలాయనం చిత్తగిస్తున్నా ప్రధాని మోదీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కొందరు నిందిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిష్క్రియగా లేదన్నది వాస్తవం. ఆర్థిక నేరగాళ్లకు సహకరించిన బ్యాంకు అధికారులను అరెస్టు చేశారు. నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేశారు. బ్యాంకులు హామీ పత్రాలు ఇవ్వరాదని, రుణగ్రహీతల పాస్‌పోర్ట్ వివరాలను నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. గతంలో ఇలాంటి చర్యలు లేవు. విదేశాలకు పారిపోయిన వారిని వెనక్కి రప్పించేందుకు అంతర్జాతీయ చట్టాలు అడ్డువస్తున్నాయి. విజయ్ మాల్యాకు బ్రిటన్ పౌరసత్వం, నీరవ్‌కు బెల్జియం పౌరసత్వం ఉన్నాయి. వీరిని ఆయా దేశాల చట్టాల పరిధిలోనే విచారించాలి. ఇలాంటి కారణాల వల్ల ఆర్థిక నేరస్థుల కేసుల్లో విచారణలో అనివార్యంగా జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వాల మాదిరి మోదీ హయాంలో అలసత్వం లేదు.
- శాండీ, కాకినాడ
ప్రజాస్వామ్యం ఖూనీ!
పార్లమెంట్‌లో గందరగోళం జరుగుతున్నా ఎలాంటి చర్చ లేకుండానే ఆర్థిక బిల్లులను ఆమోదింపజేస్తున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయానికి వస్తే ‘సభ ఆర్డర్‌లో లేదం’టూ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా సభను వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైకాపా ఎంపీలు అంటున్నారు. అయితే, సభ జరగకుండా గలభా సృష్టించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక బిల్లు ఆమోదం పొందకుంటే సిబ్బంది జీతాలు సహా అన్ని రకాల చెల్లింపులు ఆగిపోతాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చర్చ లేకుండా ఆర్థిక బిల్లును ఆమోదించడానికి రాజ్యాంగమే అవకాశం కల్పించింది. ఇలాంటి వెసులుబాటు అవిశ్వాస తీర్మానానికి లేదు.
- ప్రభాస్, కాకినాడ