సంపాదకీయం

‘సభ’ల వెలుపల..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుక్రవారం ముగిసిన రెండవ విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లోను రాజ్యాంగ ప్రక్రియ స్తంభించింది, సభల వెలుపల పార్లమెంట్ భవన ప్రాంగణంలోను, సమీపంలోను బోలెడంత రాజకీయ ప్రక్రియ ఊపందుకుంది. సభల వెలుపల ‘రాజకీయం’ ఇలా ఊపందుకొనడానికి వీలుగా పూర్వ నిర్దేశిత పథకం ప్రకారమే సభల లోపల ‘రాజ్యాం గా’న్ని కుదేలుమనిపించారన్నది సామాన్య ప్రజలకు కలిగిన- ఏర్పడిపోయిన- అభిప్రాయం. మార్చి ఐదవ తేదీన మొదలైనప్పటి నుంచి ఈ ‘రెండవ విడత’ సమావేశాలు ప్రతిరోజూ వాయిదాపడిన తీరు ‘పూర్వ నిర్థారిత పథకాని’కి నిదర్శనం. ఈ పథకాన్ని ఎవరు రచించారు? ఎవరు అమలు జరిపారు? అన్న విషయమై ఉత్కంఠ పూరిత ఊహాగానాలకు విస్తృతమైన అవకాశం ఏర్పడింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గబగబా నడచిన దృశ్యాలు పార్లమెంటు ప్రాంగణంలో ఆవిష్కృతమయ్యాయి. ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ వరకు నడుచుకుంటూ వచ్చేసిందేమోనన్నంత హడావుడి, ఆర్భాటం మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. అనేకమంది ప్రతిపక్ష నాయకులతో ఆమె చర్చలు జరిపారు. శతృఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి వంటి ప్రముఖులతో సైతం బెంగాల్ దీదీ సమావేశమై మంతనాలు సాగించడం గొప్ప రాజకీయ ప్రక్రియ. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు జరిపిన రోజుననే ఈ ముగ్గురు మహానేతలతోను మమతమ్మ మంతనాలు జరపడం కుతూహలగ్రస్తుల ఉత్కంఠను మరింత పెంచిన ‘రాజకీయం’. పార్లమెంట్ సభలు సజావుగా జరిగి ఉండినట్టయితే మమతా బెనర్జీ పనికట్టుకొని సమావేశాల సమయంలో ఢిల్లీకి పరుగులెత్తి రావడానికి వీలుండేది కాదు. ప్రతిపక్ష నేతలంతా సభలలో ఉన్న సమయంలో మార్చి 27, 28 తేదీలలో- ఆమె ఢిల్లీకి వచ్చి ‘్భరతీయ జనతాపార్టీ వ్యతిరేక కూటమి’కి అంకురార్పణ మహోత్సవాన్ని నిర్వహించడానికి వీలుండేది కాదు. ప్రతిపక్షాల దృష్టిలోను, మాధ్యమాలలోని కొందరు ఆర్భాటపు ప్రచారవేత్తల దృష్టిలోను- ‘మమతా బెనర్జీ ఢిల్లీ చర్చలు 2019 నాటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల మహాపరిణామం..’ ఈ గొప్ప ఘటనకు అవకాశం కల్పించిన విధంగా పార్లమెంటు సభలు స్తంభించడం అభిలషణీయమన్నది బహుశా ‘వీరల’ అంతరంగం, ఇతరులకు కుతూహలం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంటు భవనం మెట్లకు వంగి నమస్కరిస్తున్న దృశ్యం ఆవిష్కృతం కావడం ‘సభా స్తంభన పర్వం’లోని మరో ఆసక్తికర సన్నివేశం. మమతా బెనర్జీ చేసిన ఢిల్లీయాత్ర ఇలాంటి రాజకీయ సంతోషాలకు పూర్వరంగం. ఐదవ తేదీన పార్లమెంటు భవనం ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నిర్వహించిన ‘మానవహారం’ సభలు స్తంభించడం వల్ల సంభవించిన మరో రాజకీయ సంతోషం! ఈ మానవహారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు, మార్చి పదహైదవ తేదీవరకు ‘్భజపా’ నాయకత్వంలోని ‘జాతీయ జనతంత్ర సంఘటన- నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్- ఎన్‌డిఏ-లో ఉండి, పదహారున ‘ఎన్‌డిఏతో తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశం పార్టీ వారు కూడ ఈ ‘మానవహారం’లో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఢిల్లీలో ‘దిగి చక్రం వేసినందుకు’ ఇది ఫలితం, కాంగ్రెస్ ‘హారం’లో ‘తెలుగుదేశం’ చేరడం.. ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక తరగతి హోదా’- స్పెషల్ కాటగిరీ స్టాటస్-ను సాధించడానికై తెలుగుదేశం ఈ సైద్ధాంతిక త్యాగం చేయడం ఇరవై మూడు రోజుల పార్లమెంట్ స్తంభనకు పరాకాష్ఠ. ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్’కు చెందిన పార్లమెంటు సభ్యులు పదవులనే త్యాగం చేశారు. కానీ కాంగ్రెస్ వారి మానవహారంలో పాల్గొనలేదు, తెలుగుదేశంతో జట్టుకట్టలేదు. ‘ప్రత్యేక హోదా’ సాధన కంటే పరస్పరం విభేదించుకొనడానికే తెదేపా, వైకాపా నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పార్లమెంటు స్తంభించడంవల్ల ధ్రువపడిన ‘రాజకీయం’.. సభలు నిరవధికంగా వాయిదాపడిన తరువాత ‘్భజపా’కూటమి వారు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిపక్షాల తీరును నిరసించడానికి ఇదంతా నేపథ్యం..
మార్చి ఐదవ తేదీన రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు పూర్వరంగాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్టస్రమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధం చేశాడు. మత ప్రాతిపదికన ‘ఆరక్షణలు’- కమ్యునల్ రిజర్వేషన్స్- కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని స్పష్టమైన వెంటనే కేసీఆర్ ‘మూడవ కూటమి’ కూటమి గురించి ముచ్చటించాడు. సభలు స్తంభించడం ఈ ‘కూటమి’కి సభల వెలుపల గొప్ప ప్రాధాన్యం లభించడానికి కారణం. మమతా బెనర్జీ వంటి వారు సాగిస్తున్న ‘మూడవ కూటమి’ ఆర్భాటానికి పరోక్షంగా చోదకశక్తి కేసీఆర్. ప్రతిపక్షాలకు జాతీయస్థాయిలో కేసీఆర్ నాయకత్వం వహిస్తే తమ ప్రాధాన్యం మరుగుజ్జుతనాన్ని సంతరించుకొంటుందన్న భయం ‘మమత’ను, ‘మాయ’ను పట్టుకొంది. అందువల్లనే మాయమ్మ ఒకవైపున, మమతమ్మ మరోవైపున నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. పార్లమెంటు స్తంభించిపోవడం వల్ల ఈ ‘వెలుపల ప్రదర్శన’కు గొప్ప అవకాశం లభించింది. కతూహలగ్రస్తులకు ఇది గొప్ప సంతోషం. చంద్రబాబు పార్లమెంటు భవన ద్వారపు సోపానాల వద్ద తశరీరుడై నమస్కరించడం ఈ వెలుపలి ఆర్భాటంలో మరో వినోదం. 2014 మే నెల ఇరవయ్యవ తేదీన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ తరువాత ప్రధానమంత్రి అయిన మోదీ పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద భూమికి నమస్కరించాడు. అప్పుడు ఆర్భాటం లేకుండా అత్యంత సహజంగా ఆయన భూమికి నమస్కరించడం బహుశా ఇప్పుడు చంద్రబాబు గుర్తుచేసుకున్నాడు. అందువల్ల తాను కూడ గత పార్లమెంటు భవనం వద్ద మెట్లకు వందనం ఘటించాడు. ఇది చాలా మంచి పరిణామం. కానీ- మోదీ నమస్కరించినప్పుడు సహజంగా భూమివైపు చూశాడు. ఆయన వీపు, తల వెనుకభాగం మాత్రమే కెమెరాలకు కనిపించాయి. చంద్రబాబు వంగి భూమివైపు చూడలేదు, కెమెరాల వైపుచూస్తూ ‘్భంగిమ’ను ప్రదర్శించాడు. ‘వన్స్‌మోర్’లు కూడ...
సభలు స్తంభించిపోవడం వల్లనే చంద్రబాబుకి ఈ ‘్భక్తిని ప్రదర్శించే’ అవకాశం లభించింది. ‘హోదా’ కావాలన్న రావాలన్న తపన నిజంగా ఉన్నవారు ‘బిల్లు’ను- ప్రభుత్వేతర బిల్లును లేదా ఆధికారిక బిల్లును- ప్రవేశపెట్టాలి, రాజ్యాంగాన్ని సవరించి ‘హోదా’ను ఇవ్వాలని బిల్లులో నిర్దేశించాలి. ‘బిల్లు’పై చర్చ జరుగుతుంది. ఎవరి విధానాలు, అంతరంగాలు, లక్ష్యాలు, ప్రయోజనాలు ఏమిటన్నది ప్రజలకు తెలుస్తుంది. సాధ్యం కాని అవిశ్వాస తీర్మానం కోసం సభ్యులను కూడగట్టగలిగినవారు, ‘హోదా’ కోసం ప్రభుత్వేతర రాజ్యాంగ సవరణ ‘బిల్లు’ను ఎందుకని ప్రవేశపెట్టలేదు. సభల లోపల రాజ్యాంగ ప్రక్రియను భగ్నం చేశారు, ‘వెలుపల’ రాజకీయ ప్రక్రియను ప్రదర్శించారు!