సంపాదకీయం

రాజ్యాంగ విశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంద నుంచి కొంతమంది తప్పిపోయారన్నది జరుగుతున్న ప్రచారం. హైదరాబాద్‌లో ఆతిథ్యం పొందుతున్న కర్ణాటక శాసనసభ్యులలో కొందరు చల్లగా జారుకుని ఢిల్లీలో ప్రత్యక్షమయినట్టు శుక్రవారం కొన్ని దూరదర్శన స్రవంతుల - టి.వి.్ఛనల్స్-లో ప్రముఖంగా ప్రసారమయిన ‘‘అతి రహస్యం...’’ కర్నాటకకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు హైదరాబాద్‌కు చేరినట్టు లేదని కొన్ని ‘స్రవంతుల’వారు ‘‘కనిపెట్టారు...’’! ఒక కాంగ్రెస్ సభ్యుడు మాత్రమే దారి తెలియక తప్పిపోయాడని మొదలైన ప్రచారం రాజకీయ కుతూహలగ్రస్తులను దాదాపు శుక్రవారం మొత్తం ‘‘టివి చానళ్ల’’ ముందు ‘మంద’ పెట్టింది... హైదరాబాద్ హోటళ్లలో కర్ణాటక విధానసభ్యుల ‘మంద’... ఛానళ్ల తెరల ముందు కుతూహలగ్రస్తుల మంద! కర్నాటకకు చెందిన కాంగ్రెస్ విధానసభ్యులను, ‘లౌకిక జనతాదళ్’ విధాన సభ్యులను ఇలా హైదరాబాద్‌కు తరలించి మందపెట్టడం సమంజసమా? కాదా? అన్నది ఉత్కంఠ నాటకం తిలకిస్తున్న కుతూహలగ్రస్తులు మొదలుపెట్టిన మరో చర్చ! ‘‘ఇది చర్చించవచ్చును...’’ ‘‘ఇది చర్చించకూడదు...’’- అన్న నిబంధన లేదు... రాజకీయ చర్చ్ధార్తుల స్వేచ్ఛకు అడ్డుకట్టలేదు.... హైదరాబాద్‌కు తరలివచ్చిన కర్నాటక ప్రజాప్రతినిధుల ‘స్వేచ్ఛ’కు మాత్రమే తాత్కాలికంగా అడ్డుకట్టపడింది. ఈ తాత్కాలిక గృహనిర్బంధ వాసాన్ని లేదా తాత్కాలిక అతిథి గృహ నిర్బంధాన్ని కర్నాటక కాంగ్రెస్, లౌకిక జనతాదళ్ సభ్యులు తమకు తాము స్వచ్ఛందంగా విధించుకున్నారన్నది ఆధికారికంగా లేదా బహిరంగంగా విశ్వసించవలసిన వ్యవహారం. ఈ శాసనసభ్యుల పట్ల వీరి నిజాయితీ పట్ల విశ్వాసం లేని ‘అధిష్ఠానం’వారు వీరు తప్పిపోకుండా ‘మంద’పెట్టి కాపలా కాస్తున్నారన్నది ‘అనధికార’ లేదా లోలోపలి వ్యవహారం. ముగ్గురు ‘లౌకిక జనతాదళ్’ సభ్యులు కూడ ‘మంద’నుంచి మాయమయ్యారన్న వదంతి ఈ ‘‘విశ్వాస రాహిత్యం’’ సమంజసమేనన్న వాస్తవానికి మరో ధ్రువీకరణ. దశాబ్దుల తరబడి వివిధ రాజకీయ పార్టీలు ఇలా ‘మంద’లను పెడుతుండడం అంతర్జాతీయంగా మన ప్రజాస్వామ్యం పరువును తీస్తున్న విచిత్ర ప్రహసనం, రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్న రాజకీయం... నిర్లజ్జగా నిర్భయంగా ఒక పార్టీనుంచి మరో పార్టీకి ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులు ఈ వైపరీత్యానికి ప్రాతిపదికలు... భారతీయ జనతాపార్టీకి చెందిన ముగ్గురు కర్నాటక విధానసభ్యులు కూడ పార్టీనుండి ఫిరాయించనున్నట్టు శుక్రవారం జరిగిన ప్రచారం కుతూహలగ్రస్తుల ఉత్కంఠకు పరాకాష్ఠ.
ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు, రాజకీయ చర్చలు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం చెప్పిన తీర్పులకు విచిత్ర నేపథ్యాలు! తాత్కాలిక కర్నాటక రాజకీయాల మాట ఎలా ఉన్నప్పటికీ, దీర్ఘకాల రాజ్యాంగ ప్రక్రియను ప్రభావితం చేయగల సర్వోన్నత న్యాయ నిర్ణయాలు బుధవారం, శుక్రవారం ప్రకటితమయ్యాయి. ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న విచక్షణ అధికారం ‘రాజ్యపాల్’- గవర్నర్-కు ఉందన్నది రాజ్యాంగ నిబంధన. ఈ రాజ్యాంగ వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ధ్రువపరచింది. భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్షం నాయకుడిని, బిఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రిగా నియమించిన కర్నాటక రాజ్యపాల్ వాజూభాయ్‌వాలా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టలేదు. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి బుధవారం తెల్లవారుజామున జరిపిన విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయమూర్తులు ఏ.కె.సిక్రీ, ఎస్.ఏ.బాబ్దే, అశోక్‌భూషణ్ నిరాకరించడం సంబంధిత రాజ్యాంగ నిబంధనలకు మరో పరిపుష్ఠి.
ముఖ్యమంత్రిని ‘రాజ్యపాల్’ నియమిస్తాడు, ముఖ్యమంత్రి సలహాకు అనుగుణంగా ఇతర మంత్రులను రాజ్యపాల్ నియమిస్తాడు... వీరు ‘రాజ్యపాల్’ అభీష్టం కొనసాగినంతకాలం పదవులలో ఉంటారు- అని రాజ్యాంగంలోని నూట అరవై నాలుగవ అధికరణం నిర్దేశిస్తోంది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు సమష్టిగా రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించవలసి ఉంటుంది- అని కూడ ఈ అధికరణం నిర్దేశిస్తోంది. ఈ సమష్టి బాధ్యతను నిర్వహించడంలో భాగం శాసనసభ విశ్వాసాన్ని పొందడం, శాసనసభలోని సంఖ్యాబాహుళ్య- మెజారిటీ- విశ్వాసాన్ని పొందడం. అందువల్ల ఈ రెండు నిబంధనల- తన అభీష్టం, విధానసభ విశ్వాసం-కు అనుగుణంగా ముఖ్యమంత్రిని నియమించడంలో ‘రాజ్యపాల్’ తన ‘విచక్షణ’ను ఉపయోగించాలి. నిష్పక్ష న్యాయమూర్తి వలె ‘రాజ్యపాల్’ వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తి. అలా వ్యవహరించగలిగిన ‘రాజ్యపాల్’ విధానసభ విశ్వాసం ఎవరికి ఉండగలదన్నది గ్రహించగలడు... ఎంతమంది గవర్నర్‌లు ఇలా ‘విచక్షణ’ను సద్వినియోగం చేస్తున్నారు? అన్నది మహాకవి కాళిదాసు చెప్పినట్టుగా ‘‘వారివారి అంతఃకరణ గీటురాయిగా ఎవరికివారు నిర్ణయించుకోవాలి..’’- ‘‘సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః’’. అందువల్ల ‘రాజ్యపాల్’కు ముఖ్యమంత్రిని నియమించడంలోగల అధికారాన్ని నిరోధించకపోవడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం ఈ రాజ్యాంగ నిబంధనలను మరోసారి పుష్టీకరించింది. ఏ పార్టీకి శాసనసభలో ‘మెజారిటీ’ లేనప్పుడు అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించాలన్న నిబంధన రాజ్యాంగంలో లేదు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయం మాత్రమే. ఈ సంప్రదాయం కూడ ‘రాజ్యపాల్’ విచక్షణలో భాగం! అందువల్లనే సర్వోన్నత న్యాయస్థానం బహుశా ఈ విషయమై వ్యాఖ్యానించలేదు.
ముఖ్యమంత్రిగా నియుక్తుడైన అభ్యర్థికి శాసనసభ విశ్వాసం లభించడం సమాంతర పరిణామమన్నది రాజ్యాంగంలోని నూట అరవై నాలుగవ అధికరణం- రెండవ ఉప అధికరణం- స్ఫూర్తి! అందువల్ల నియుక్తుడైన ముఖ్యమంత్రి సాధ్యమయినంత సమయంలో ఈ ‘విశ్వాసాన్ని’ ప్రకటింపచేయాలి! ఈ ‘సమయం’ గురించి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం చేసిన నిర్ధారణ భవిష్యత్తునకు మార్గదర్శనం. ఈ విశ్వాసం పొందడానికి యడియూరప్ప ఏడురోజులు మాత్రమే గడువును కోరాడట. కానీ ‘రాజ్యపాల్’ పదిహేను రోజుల గడువును ప్రదానం చేశాడు. ఈ గడువును మూడురోజులకు కుదించడం సర్వోన్నత న్యాయస్థానం ‘అనిశ్చిత స్థితి’ కాలవ్యవధిని, రాజకీయపు బేరసారాలకు కల ‘అవకాశాన్ని’ తగ్గించగలిగింది. ప్రమాణ స్వీకారం సమయంలోనే ‘మెజారిటీ’ మద్దతు ఉన్న ముఖ్యమంత్రికి దాన్ని ధ్రువపరచడానికి పదిహేను రోజుల దీర్ఘకాల ప్రయత్నం అక్కరలేదన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం. అందువల్ల శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కర్నాటక విధానసభలో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గవలసి ఉంది. ఎన్నికల సందర్భంగా పరస్పరం కత్తులు దూసుకున్న, విధాన వైరుధ్యాలను ప్రకటించుకున్న కాంగ్రెస్, లౌకిక జనతాదళ్ పార్టీలు ఎన్నికల తరువాత ‘కూటమి’గా ఏర్పడడం రాజకీయ అనైతిక తీరుకు నిదర్శనం, జన వంచనకు చిహ్నం! అందువల్ల ఈ ‘కూటమి’ ఏర్పాటును జనం మెచ్చరు. సమయం వచ్చినప్పుడు తీవ్రంగా అభిశంసించగలరు. కానీ ‘ భాజపా’ సైతం అనైతికతకు పాల్పడి ‘‘్ఫరాయింపుల’’ను ప్రోత్సహిస్తే, ఆ పార్టీని సైతం జనం అభిశంసించక మానరు...! మహాభారతకారుడు చెప్పినట్టు, ‘‘నీతి పథంబునన్ బ్రతుక నేర్చుట ఉత్తమ భంగి...!’’