సంపాదకీయం

దోపిడీకి ‘ప్రేరకులు..?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుళ భవన చలనచిత్ర ప్రదర్శనశాలల- మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్- వారు పైశాచిక పద్ధతిలో వీక్షకులను దోచుకుంటుండడం ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం. బయట ఇరవై రూపాయలకు లభించే ‘ఉప్పు కలిపిన చిప్పులు’ ఈ ‘మల్టీప్లెక్స్ కాంప్లెక్సు’లలో వందా అరవై రూపాయలకు అమ్ముతుండడం దోపిడీ జరుగుతున్న తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి దోపిడీని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైన పూనుకోవడం సంతోషించ దగిన పరిణామం. తిండి పదార్థాలను, ‘మధుర’ పానీయాలను ‘గరిష్ఠస్థాయి చిల్లర ధర’- మాక్జిమమ్ రిటైల్ ప్రయిజ్- ఎమ్‌ఆర్‌పి-లకే విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిబంధనను విధించబోతోందట! చిల్లర ధరలకు టోకుగా విక్రయిస్తున్న ఘరానా వాణిజ్య ప్రాంగణాలలో సైతం తినుబండారాలను ‘ఎమ్‌ఆర్‌పి’ ప్రకారం అమ్మించాలన్నది ప్రభుత్వం నిర్ణయం. ఇలా ‘చిల్లర ధరలకు టోకుగా’ విక్రయిస్తున్న ‘మెగా’ దగా వాణిజ్య సంస్థలు ‘టోకు ధరలకు చిల్లరగా’ అమ్ముతున్నట్టు ప్రకటిస్తున్నాయి. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన దేశంలో సాగిస్తున్న దోపిడీ కార్యక్రమానికి ‘బహుళ భవన చిత్రశాలలు’ నమూనాలుగా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- ‘మల్టీ నేషనల్ కంపెనీస్’- ఎమ్‌ఎన్‌సిల - ప్రభావం మన దేశంలోని అన్నిరంగాలను ముంచెత్తుతుండడం ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్ - వైచిత్రి! జనాన్ని వాణిజ్య సంస్థలు విచ్చలవిడిగా దోచుకొంటుండడం ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- సృష్టించిన ‘మారీచ జాలం’లో భాగం. ‘మార్కెట్ ఎకానమీ’ ప్రపంచీకరణకు వికృత కాయం, భయంకర శరీరం, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల కరచరణాది- కాళ్లు చేతుల వంటి- అవయవాలు! మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు ఈ అవయవాలకు ఆయుధాల వంటివి! ఒక్కొక్క తినుబండారాన్ని బయటి దుకాణాలలో అమ్మే ధరలకంటె ఐదు రెట్లనుండి ఇరవై రెట్లవరకు అమ్ముతున్న ఈ ‘మెగా’- దగా- బహుళ భవన చిత్రశాలల నిర్వాహకులు సమాజ విద్రోహులు, వాణిజ్య బీభత్సకారులు- ఎకనమిక్ టెర్రరిస్టులు-! వీరిలా అధిక ధరలకు అమ్మడంలో న్యాయం లేదు, ధర్మం లేదు. ‘న్యాయం’, ‘్ధర్మం’ అన్న పదాలకు స్వేచ్ఛాయుత వాణిజ్య ప్రపంచంలో చోటులేదు. కనీసమైన వాణిజ్య తర్కానికి, ‘గిరాకీ’ అన్న పదానికి సైతం ఈ ‘్థయేటర్ల’లో ఇలా అమ్ముతున్నవారు నిబద్ధులు కారు, ఈ నీచులు మానవ రూపంలోని మారీచులు, ‘ప్రపంచీకరణ దశకంఠుని’కి దళారీలు..
మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రమే కాదు. రాక్షస- జెయింట్-, బృహత్- మెగా-, సమృద్ధ- మోర్-, చకిత - సూపర్-, సంత- మార్ట్- వంటి ‘బంగారపు’ వనె్నల చినె్నల నామధేయాలలో వెలసిన వాణిజ్య ప్రాంగణాలలోకి వెడుతున్న వినియోగదారులు బయటికి వచ్చేవరకు బందీలు. బయటి ఆహారం ఈ ప్రాంగణాలలో తినరాదు. చలన చిత్ర నగరాలను భారీగా ‘రుసుము’ చెల్లించి సందర్శిస్తున్న వినోద యాత్రికులు ఏది తినాలన్నా, మంచినీరు తాగాలన్నా అక్కడనే కొనాలి. అందువల్ల రెండు బ్రెడ్డుముక్కల మధ్య టమోటా ముక్కను అతికించిన పదార్థాన్ని నూట అరవై రూపాయలుపెట్టి కొనాలి, రెండు ముక్కలు చేసి ఒకసారి ఒక దాన్ని, రెండవసారి రెండవ దాన్ని నోట్లో వేసుకోవాలి! ముందు రోజుననో మూడురోజుల ముందో తయారైన ఆ ‘సాండ్ విచ్’ను తినేసరికి నోరు చెడిపోతుంది. అందువల్ల నీరు తాగాలి! అర లీటర్ నీరు ‘కేవలం నలబయి రూపాయలు’.. సినిమా చూడడానికెళ్లిన వారిలో సగం మందికైనా థియేటర్ల యజమానులు ఇలా నీరు తాగించి పంపిస్తున్నారు!
సీసాల నీటిని గరిష్ఠస్థాయి ధరకు మించి దేశంలో ఎక్కడ కూడ అమ్మరాదన్న కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశం ఇప్పటికే అమలులో ఉంది. సినిమా థియేటర్లలో మాత్రం ఇది అమలు జరగడం లేదు. థియేటర్ ప్రాంగణంలో ఏమి జరుగుతున్నదీ గోడలకివతల ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి కనిపించదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైనా ఇలాంటి నిబంధనను విధించడం, సినిమా థియేటర్లలోను, ‘మాల్స్’- వాణిజ్య ప్రాంగణాలలోను ఆహార పానీయాలను ‘ఎమ్‌ఆర్‌పి’కంటె ఎక్కువ ధరలకు అమ్మరాదని నిర్దేశించడం ఆలస్యంగానైనా నిద్రలేచిన చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ ఈ నిబంధనను సినిమా థియేటర్లవారు అతి తెలివిగా ఉల్లంఘించగలరన్న అనుమానం కలగడం సహజం! జంట నగరాలతో సహా దేశంలోని అనేక నగరాలలో ‘ఆటో రిక్షాల’లో మీటర్లు లేవు, ఉన్నప్పటికీ తిరగవు. ఆటోవాలాలు అడిగినంత ఇచ్చి తీరవలసిందే. ‘ఓలా’, ‘ఉబర్’ ‘క్యాబ్’ల ద్వారా ఇంతకు పదింతల దోపిడీ జరుగుతోంది. ఏ ప్రాతిపదికన ఈ ‘క్యాబ్’ కంపెనీల వారు దండుకుంటున్నారన్నది పరమ రహస్యం. ‘మానిటర్’- నిర్దేశిక- తెరపై కనిపించినంత చెల్లించి గోళ్లు ఊడగొట్టుకోవాలి. ఈమధ్య ‘నిర్దేశిక తెర’పై కూడ చెల్లించవలసిన సొమ్ము వివరాలు కన్పించడం లేదు. అందువల్ల చోదకుని దౌర్జన్యవాణి ప్రకటించే మొత్తాన్ని చెల్లించాలి! నడివీధులలో నర్తిస్తున్న ఈ దోపిడీని నిరోధించలేని ప్రభుత్వ యంత్రాంగం వారు థియేటర్ల గోడల మధ్య జరుగుతున్న వాణిజ్య బీభత్సకాండను నిరోధించగలరా? ‘పెప్సీ’, ‘కోకో’ వంటి శీతల పానీయాలు విష రసాయనాలతో కాలుష్యమయమై ఉన్నాయి! వాటిని తాగడం అసహ్యకరమైన అలవాటు. అయినప్పటికీ అమాయక జనం అనేకమంది- అవి తాగడం గొప్ప హాదాకు చిహ్నమని భావించే నకిలీ అనుభూతివాదులు తెగ తాగేస్తున్నారు. వానలో సైతం, జలుబుచేసిన ముక్కుల వారు, నానుకుంటూ వచ్చి తాగిపోతున్నారు. ఈ శీతల పానీయాల వల్ల ఆ జలుబు మరింత ఎక్కువవుతోంది. అందువల్ల ‘మల్టీప్లెక్స్’ థియేటర్‌ల వల్ల- గిరాకీని బట్టి ధరలను పెంచారు. రెండు లీటర్ల సీసాను బయట తొంబయి రూపాయలు పెట్టి కొంటున్న థియేటర్లవారు దాన్ని పది ‘ప్లాస్టిక్’ కప్పులలో నింపుతున్నారట. ఒక కప్పును నూట తొంబయి రూపాయలకు అమ్ముతున్నారట! విశ్రాంతి వ్యవధి- ఇంటర్‌వెల్-లో ఇలా నూట తొంబయి రూపాయలు చెల్లించి ‘పెప్సీ’ని ‘కోకో’ను తాగకపోతే సినిమా చూసిన తమ ‘హోదా’కు భంగకరమని భావిస్తున్న పిచ్చివారు తాగుతున్నారు. తొంబయి రూపాయలకు, పంతొమ్మిది వందల రూపాయలకు మధ్య అంతరం ఎంత? థియేటర్లలోని విక్రేతలకు రెండులీటర్ల శీతల పానీయంపై దాదాపు పద్దెనిమిది వందల రూపాయల లాభం! కొందరు ‘పానీయం’ తాగుతున్నారు, ఇంకొందరు మానవుల రక్తం తాగుతున్నారు! ‘సినిమా’ ప్రేక్షకులకు ఈ దోపిడీ గురించి సూర్యుని వెలుగంత స్పష్టంగా తెలుసు. కానీ స్వచ్ఛందంగా దోపిడీకి గురి అవుతున్నారు..
ఎందుకంటె ఎనిమిది వందల రూపాయలు లేదా తొమ్మిది వందల రూపాయలుపెట్టి ‘సువర్ణ శోభల’- గోల్డ్‌క్లాస్ - టిక్కెట్టు కొని సినిమా చూసేవారికి నూట తొంబయి రూపాయలకు కప్పుడు శీతల పానీయాన్ని సేవించకపోతే ‘నామోషీ’, హోదాకు భంగం. డెబ్బయి ఐదు రూపాయల టిక్కెట్టు అతి తక్కువ స్థాయి. ‘తొమ్మిది వందలు’ రూపాయల టిక్కెట్టు ‘గోల్డ్ క్లాస్’.. హైదరాబాద్ కథ ఇది. బెంగళూరులో ఇంకా ఎక్కువ వెల చేసే టిక్కెట్లు అమ్ముతున్నారట.. కొని సినిమా చూస్తున్నవారికి బెంగలేదు! ‘సినిమా’ చూడడానికి వచ్చిన తరువాత అన్ని ‘ఉపచారాలు’- ఫార్మాలిటీస్- జరగవలసిందే. అధిక ధరలని తెలిసి తెలిసీ కొనాలి, తినాలి, తాగాలి! ‘దోపిడీ’కి ఎవరు స్ఫూర్తి? ఎవరు ప్రేరకులు??