సంపాదకీయం

బీభత్స ‘ప్రజాస్వామ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో కార్గిల్ యుద్ధ విజయ వార్షికోత్సవం జరుగుతుండడం, పాకిస్తాన్‌లో జాతీయ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండడం సమాంతర పరిణామాలు. కార్గిల్ యుద్ధ విజయోత్సవం మనదేశంలో పంతొమ్మిది ఏళ్లుగా జరుగుతోంది. అందువల్ల ఈ పరిణామం పూర్వ నిర్ధారితం, మారదు. ఈ భారత విజయోత్సవం రోజుననే ఫలితాలు వెలువడేలా పాకిస్తాన్‌లో ఎన్నికల కార్యక్రమం నిర్ధారితం కావడం ఆ దేశ సైనికదళాల వ్యూహంలో భాగం. భారత వ్యతిరేక జిహాదీ ప్రవృత్తిని రెచ్చగొట్టడం ఈ సైనిక వ్యూహం! 1999లో మన జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలోకి చొరబడి అనేకరోజుల పాటు తిష్ఠ వేసిన పాకిస్తానీ ప్రత్యక్ష బీభత్సకారుల- జిహాదీల-ను, ప్రచ్ఛన్న బీభత్సకారుల- సైనికుల-ను మన సైనికులు తిప్పికొట్టడం చరిత్ర. తమ పరాజయాన్ని కొత్త ‘పౌర ప్రభుత్వానికి’ గుర్తుచేసి భారత వ్యతిరేకతను పెంపొందించడానికి అని అన్నట్టు పాకిస్తాన్ సైనిక దళాల వారు కార్గిల్ యుద్ధ భారత విజయోత్సవం నాడు తమ జాతీయ శాసనసభ ఎన్నికల ఫలితాలను బహుశా వెల్లడింపచేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ‘పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్‌సాఫ్’- పీటీఐ- విజయం సాధించడం కూడ సైనిక దళాలు నడిపిస్తున్న ‘ప్రజాస్వామ్యం’లో భాగం! రెండు వందల డెబ్బయి రెండు స్థానాలున్న పాకిస్తాన్ జాతీయ శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి కూడ మెజారిటీ స్థానాలు దక్కలేదు. అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘పీటీఐ’ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తదుపరి ప్రధానమంత్రి కాగలడన్నది బుధవారం నాడు మొదలై గురువారం ఊపందుకున్న ప్రచారం. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావాలన్నది సైనిక దళాల అభీష్టం. ఈ అభీష్టంలో మతోన్మాదం నిహితమై ఉంది, భారత వ్యితిరేక జిహాదీ బీభత్సకాండ నక్కి ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో తమ అసమర్ధ దుర్జన ప్రవృత్తి ధ్రువపడిన నాటి నుంచి పాక్ సైనిక దళాలకు మనదేశం పట్ల మరింతగా విరోధం పెరిగింది. ఈ విరోధానికి ప్రాతిపదిక ‘జిహాద్’! ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇస్లామేతర మతాలను సమూలంగా నిర్మూలించి ‘ఇస్లాం’ను ఏకైక మతంగా నిలబెట్టడం శతాబ్దుల తరబడి కొనసాగిన అంతర్జాతీయ ‘జిహాద్’ లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు జిహాదీలు ఎంచుకున్న మాధ్యమం బీభత్సకాండ! పాకిస్తాన్ ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల్లోని జిహాదీ ముఠాలకు అనుసంధాన కేంద్రంగా మారింది. పాకిస్తాన్ సైనిక విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్’- ఐఎస్‌ఐ- ఈ అనుసంధాన వ్యవస్థ! అందువల్ల భారత వ్యతిరేక జిహాదీ బీభత్సకాండను ఉసిగొల్పడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాజకీయవేత్త ప్రధానమంత్రి కావాలన్నది పాక్ సైనిక దళాల వ్యూహం. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఈ ప్రథమ స్థానం ఇమ్రాన్ ఖాన్‌కు దక్కింది. నిజానికి పాకిస్తాన్ సైన్యం దక్కించింది!
ఇలా దక్కించడం 2008 నుంచి నడుస్తున్న చరిత్ర. ఇది మొదటి వైపరీత్యం. తమ దేశంలోని ‘రాజకీయ ప్రముఖత వ్యర్థులు.. అసమర్ధులు.. భారత వ్యతిరేక బీభత్సకాండను అనుకున్నంత స్థాయిలో కొనసాగించలేని వారు.. అవినీతిపరులు..’ అని ఎప్పటికప్పుడు జనానికి నిరూపించడం సైనిక దళాల నియంతృత్వ వ్యూహంలోని రెండవ వైపరీత్యం. ఏ రాజకీయ నాయకుడు కాని ఎక్కువ కాలం అధికార పీఠ ప్రతిష్ఠుతుడు కావడానికి వీలులేని రీతిలో సైనికదళాల వారు కథను నడిపిస్తున్నారు. ఏ ప్రధానమంత్రి కాని ‘తమ పెదవులకు మించిన పన్ను’గా మారరాదన్నది సైనిక దళాల వ్యూహం. 1999లో కార్గిల్‌లోకి చొరబడిన పాకిస్తానీ దళాలు, బీభత్సపు తోడేళ్లు తోకముడిచి పారిపోవలసి వచ్చింది. తమ పరాజయానికి అప్పటి ప్రధాని, ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’ అధినేత నవాజ్ షరీఫ్ కారకుడు- అన్నది సైసికదళాల నిర్ధారణ. అందువల్ల సైనిక దళాల అధిపతి పరవేజ్ ముషారఫ్ ప్రధాని పదవి నుంచి షరీఫ్‌ను తొలగించాడు. దేశద్రోహం నేరంపై ఉరి తీసినంత పనిచేశాడు. కానీ ఉరి తీయలేదు. దేశం నుంచి వెళ్లగొట్టాడు. 2008 నాటికి ముషారఫ్ సైనిక దళాల అభిమానానికి దూరమయ్యాడు. అందువల్ల ప్రజాస్వామ్య నాటకాన్ని సైనిక దళాల వారు మళ్లీ మొదలుపెట్టారు. 2008లో జాతీయ శాసనసభకు ఎన్నికలు జరిపించారు. సైనిక దళాల అభీష్టం మేరకు అసఫ్ అలీ జర్దారీ నాయకత్వంలోని ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ విజయం సాధించింది. జర్దారీ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త. బేనజీర్ భుట్లో మరో మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో కుమార్తె. జుల్ఫికర్ అలీ భుట్టోను 1978లో అప్పటి సైనిక నియంత జియాఉల్ హక్ ఉరితీసి చంపించాడు. మారిన పరిస్థితుల్లో పరవేజ్ ముషారఫ్ బేనజీర్ భుట్టో నాయకత్వంలోని ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’- పీపీపీ-కి 2008 ఎన్నికల్లో అనుకూల వైఖరిని ప్రదర్శించాడు. ఎందుకంటే 1999లో తాను పదవీచ్యుతిని కలిగించిన నవాజ్ షరీఫ్ తిరిగి అధికారం స్వాధీనం చేసుకోరాదన్నది సైనిక నియంత ముషారఫ్ అభీష్టం. అందువల్ల 2008 ఎన్నికల్లో పీపీపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ భుట్టో కుటుంబం పట్ల విరోధం కల సైనికదళాల్లోని కొన్ని జిహాదీ శక్తుల కుట్ర ఫలితంగా 2008 నాటి ఎన్నికల ప్రచారం సందర్భంగా బేనజీర్ భుట్టో హత్యకు గురైంది. ఆ తర్వాత దేశాధ్యక్షుడైన అసఫ్ అలీ జర్దారీని, ముషారఫ్‌ను కూడ సైనికదళాల వారు వదిలించుకున్నారు. 2013లో నవాజ్ షరీఫ్‌భు గెలిపించారు. అదే షరీఫ్‌ను ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా చేశారు. న్యాయస్థానాలు సైనిక దళాల చేతుల్లో కీలుబొమ్మలు. అందువల్ల షరీఫ్ అవినీతి ధ్రువపడింది.
ఇప్పుడిలా ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవిలో కూర్చొనబెట్టడానికి సైనిక దళాలు యత్నిస్తుండడం సైనిక దళాలు ఆడుతున్న ప్రజాస్వామ్య నాటకంలో ఓ భాగం. జర్దారీ కంటే అతని పార్టీకి చెందిన మాజీ ప్రధాని యూసఫ్ రజా జిలానీ మరింత భారత వ్యతిరేకి, జిహాదీ స్వభావం కలవాడు. జిలానీ కంటే నవాజ్ షరీఫ్ మరింత మతోన్మాది. ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్‌ను మించిన ప్రచ్ఛన్న బీభత్సకారుడు. అందువల్లనే సైనిక దళాల వారు ఇమ్రాన్‌ను ఇప్పుడు గెలిపించారు. ఇమ్రాన్ కూడ బహిరంగంగానే సైనిక దళాలకు విధేయతను ప్రకటించాడు. అంతేకాదు, ఎన్నికల ప్రచార సమయంలో కూడ మన దేశంపై విరోధాన్ని వెళ్లగక్కాడు. మూడుసార్లు పెళ్లి చేసుకోవడం ఈ మాజీ క్రికెట్ ఆటగాడి వ్యక్తిగత వ్యవహారం.. కానీ ఇతగాడు అనేకమంది మహిళలతో వివాహేతర లైంగిక సంబంధాలను కలిగి ఉన్నాడన్నది అంతర్జాతీయగా ప్రచారమవుతున్న ‘వ్యభిచారం’! సైనిక దళాలకు ఇతగాడు నచ్చడం పాకిస్తాన్‌లో పెరుగుతున్న జిహాదీ శక్తుల బలానికి నిదర్శనం. పేరుమోసిన టెర్రరిస్టు హఫీజ్ సరుూద్ నడిపిస్తున్న ‘మిల్లిత్’ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది. దీని వల్ల జిహాదీ బీభత్సకాండకు శృంగభంగం జరిగిందన్న విశే్లషణలు మొదలయ్యాయి. కానీ ఇదంతా సైనికుల వ్యూహంలో భాగం! ప్రత్యక్ష బీభత్సకారుల ఓటమి, ప్రచ్ఛన్న బీభత్సకారుల విజయం. ఇమ్రాన్ ఖాన్ కరడుకట్టిన రాజకీయ- ప్రచ్ఛన్న బీభత్సకారుడు.