సంపాదకీయం

న్యాయానికి దిద్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జెపి రాజఖోవాకు తాకీదు పంపించడం పొరపాటని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అంగీకరించడం రాజ్యాం నియమావళికి మరో ధ్రువీకరణ. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడంపై ఏర్పడిన వివాదంలో జనవరి 27న సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్‌కు తాకీదు-నోటీసు-జారీ చేయడం పెద్దగా ప్రచారానికి నోచుకోని రాజ్యాంగ సంచలనం. తమ రాజ్యాంగ యుక్త విధి నిర్వహణ గురించి గవర్నర్లు కాని, రాష్టప్రతి కాని న్యాయస్థానానికి గాని వివరణ ఇవ్వవలసిన అవసరం లేదన్నది రాజ్యాంగంలోని 361వ అధికరణం నిర్దేశించిన నిబంధన. ఈ నిబంధనను చక్కగా ఎరిగివున్న సర్వోన్నత న్యాయమూర్తులు జెఎస్ ఖేహర్, దీపక్ మిశ్రా, మదన్ బి. లోకుర్, పి. ఘోష్, ఎన్.వి. రమణ 27వ తేదీన తాత్కాలికంగా ఈ ధ్యాసను కోల్పోవడం విచిత్రమైన పరిణామం. అరుణాచల్‌లో రాష్టప్రతి పాలను విధించవలసిందిగా ఎందుకు సిఫార్సు చేయవలసి వచ్చిందో రెండు రోజులలోగా వివరించవలసిందిగా గవర్నర్‌కు ఈ న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తాకీదు జారీ చేయడం రాజ్యాంగ నిబంధనల పట్ల ధ్యాసలేని తనానికి నిదర్శనం. విద్యార్థి దశలోనే ఈ రాజ్యాంగ పాఠం నేర్చుకున్న సర్వోన్నత న్యాయమూర్తులు పాఠం మరచిపోవడం ‘‘్ధమంతులు సైతం పొరపాటు చేస్తారు..’’-్ధమంతాం అపి ప్రమాదః- అన్న నానుడికి మరో నిదర్శనం. 29వ తేదీలోగా సమాధానం చెప్పాలని సర్వోన్నత న్యాయమూర్తులు ఆదేశించినప్పటికీ గవర్నర్ రాజ్‌ఖోవా మాత్రం ఎలాంటి వివరణను దాఖలు చేయకపోవడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణం. సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ నియమాలకు, నిబంధనలకు భాష్యం చెప్పగల సర్వోన్నత సాధికార వ్యవస్థ. సందిగ్ధంగా ఉన్న అంశాలను స్పష్టీకరించే అధికార బాధ్యతలు కూడ సుప్రీంకోర్టుకు ఉన్నాయి. 142వ అధికరణ ప్రకారం తమకున్న అధికారాలకు పరిమితి కాని ఆంక్షలు కాని లేవని 2011 మే నెలలో కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, రాష్టప్రతికి రాజ్యాంగ సందేహాలు కలిగినప్పుడు సందేహ నివృత్తి చేయదగిన అధికారం, బాధ్యత సర్వోన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉన్నాయి. ఇది రాజ్యాంగంలోని 143వ నిబంధన. అందువల్లనే సర్వోన్నత న్యాయాధికార పరిధి క్రమంగా విస్తరించి పోతుండడం రాజ్యాంగ పరిణామం క్రమం. ఈ పరిణామాన్ని న్యాయ క్రియాశీలతగా సమర్ధకులు అభివర్ణిస్తున్నారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక ప్రభుత్వ శాఖ పాలనాధికార పరిధిలోని విధాన నిర్ణయ ప్రక్రియలోకి చొరబడి పోతోందన్నది వ్యతిరేకుల ఆరోపణ. ఈ వ్యతిరేకతను ప్రధానమంత్రులు సైతం వెలిబుచ్చడం ఏళ్ల తరబడి సాగుతున్న వివాద ప్రహసనం. ఏమయినప్పటికీ ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అధికారం సుప్రీంకోర్టుదేనన్నది నిరాకరింపజాలని నిజం. కానీ 361వ అధికరణ స్ఫూర్తిని జనవరి 27న సుప్రీం న్యాయమూర్తులు స్వయంగా ఉల్లంఘించడం ‘శకునాలు చెప్పే బల్లి కుడితి కుండలో పడిన’ చందానికి మరో నిదర్శనం.
తమ పొరపాటును గ్రహించిన సర్వోన్నత న్యాయమూర్తులు సోమవారం గవర్నర్‌కు జారీ చేసిన తాకీదును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడం వారి జౌదార్యం, వారి ఔన్నత్యం. లేనట్టయితే గవర్నర్‌పై న్యాయధిక్కార ప్రహసనం మొదలైపోయింది. ఉపసంహరణ ద్వారా సర్వోన్నత ధర్మాసనం న్యాయమూర్తులు తాము కల్పించిన వైపరీత్యాన్ని తామే తొలగించగలిగారు. కానీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్ గీ సోమవారం ప్రస్థావించిన తరువాత మాత్రమే సర్వోన్నత న్యాయమూర్తులకు 361-1వ అధికరణ ధ్యాసకు రావడం మరో వైపరీత్యం. ఇలా న్యాయమూర్తులు తాత్కాలికంగా నైనా రాజ్యాంగ వ్యతిరేక ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగంలోని 124-4వ అధికరణ పరిధిలోని అసమర్ధత అవుతుందా? కాదా? అన్న సందేహం రాజ్యాంగ వేత్తలకు తలెత్తడం సహజం. అసమర్ధతకు గురి అయిన సర్వోన్నత న్యాయమ్తూలను పార్లమెంటు అభిశంసించవచ్చునని రాజ్యాంగంలోని 124-1వ అధికరణలో నిర్దేశించి ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం వారు తమ ఆదేశాలను తామే ఉపసంహరించడం బహుశా ఇదే మొదటిది కాదు. రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు సైతం పొరబాటున తాము జారీ చేసిన ఉత్తర్వులను తామే ఉపసంహరించుకున్న ఘటనలు గతంలో ఏర్పడి ఉన్నాయి. పొరబాటును న్యాయమూర్తులు దిద్దుకుంటుండడం హర్షణీయం. దిద్దుకోని పొరపాట్లు విచిత్రమైన పూర్వ ఉదాహరణలుగా నిలిచిపోగల ప్రమాదం కూడ ఉంది. సర్వోన్నత న్యాయమూర్తులు 27వ తేదీన గవర్నర్‌కు నోటీసు జారీ చేయాలని నిర్ణయించిన వెంటనే ప్రభుత్వ న్యాయవాదులు కాని, ఇతర వరిష్ఠ న్యాయవాదులు కానీ 361-1వ అధికరణ గురించి అదే రోజున ప్రస్తావించి ఉండాలి. అలా ప్రస్తావించి ఉండినట్లయితే న్యాయమూర్తులు అసలు తాకీదును జారీ చేసి ఉండేవారు కాదు.
రాజ్యాంగంలోని 163వ అధికరణ ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రి అధ్యక్షతన గల మంత్రివర్గం సలహాలను పాటించవలసి ఉంది. మంత్రివర్గం గవర్నర్‌కు ఏ సలహాను ఏ రీతిలో ఇచ్చిందన్న వ్యవహారాన్ని కూడ న్యాయస్థానాలు సమీక్షించజాలవని 163-3వ అధికరణలోనిర్దేశించారు. కానీ గవర్నర్ మంత్రివర్గం సలహాతో నిమిత్తం లేకుం డా స్వతంత్రంగా వ్యవహరించడానికి కొన్ని సందర్భాలలో వీలుందని 163వ అధికరణలో నిర్దేశించారు. అయితే గవర్నర్ ఏఏ వ్యవహారాలో మంత్రివర్గం సలహా, సిఫారసులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించవచ్చునన్న విషయమై వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వివాదాలలో గవర్నర్‌కు వ్యతిరేకంగా మంత్రివర్గాలు ఉన్నత న్యాయస్థానాలకు వినతులు దాఖలు చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో సైతం గవర్నర్‌ను న్యాయ వివాదంలో భాగస్వామిని చేయరాదన్నది సంప్రదాయం. 2011 ఆగస్టులో గుజరాత్ గవర్నర్ కమలా వేణీవాల్ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని కాని మంత్రివర్గాన్ని కాని సంప్రదించకుండానే లోకాయుక్త పదవికి ఆర్‌ఏ మెహతాను నియమించింది. ఈ నియామకాన్ని వ్యతిరేకించిన మంత్రివర్గం గవర్నర్ చర్యను హైకోర్టులో సవాలు చేసింది. అయితే న్యాయ యాచక పత్రం-పిటిషన్-లో గవర్నర్‌ను ప్రతివాదిగా పేర్కొనరాదని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశం మేరకు పిటిషన్ నుంచి గవర్నరమ్మ వేణీవాల్ పేరును మంత్రివర్గం వారు తొలగించవలసి వచ్చింది. గవర్నర్ చర్యను న్యాయస్థానాలు సమీక్షించవచ్చు కాని, గవర్నర్‌ను నేరుగా ప్రశ్నించడానికి వీలులేదన్నది 361-1వ రాజ్యాంగ అధికరణ స్ఫూర్తి.
సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ఒక ధర్మాసనం వారి తప్పు నిర్ణయాలను మరో ధర్మాసనం వారు సవరించిన సందర్భాలు గతంలో ఏర్పడినాయి. జయప్రకాశ్ అసోసియేట్స్ అన్న సంస్థకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వారు వాస్తవాలను కప్పిపుచ్చిన అభియోగంపై 2012లో వందకోట్ల రూపాయల జరిమానా విధించారు. సర్వోన్నత న్యాయమూర్తి అల్తామస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ చెల్లింపును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే 2013 జులై 23న మరో ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం అధ్యక్షతన ఏర్పడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కబీర్ ధర్మాసనం వారి తీర్పును తప్పుపట్టింది. ఇప్పుడు ‘అరుణాచల్’ వ్యవహారంలో సర్వోన్నత న్యాయమూర్తులు తమ తీర్పును తామే తప్పుపట్టుకున్నట్టయింది.