సంపాదకీయం

రూపాయి పతనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూపాయి విలువ ఆగస్టు పదునాలుగవ తేదీన అభూత పూర్వస్థాయికి పతనమైంది. అమెరికా ‘డాలర్’ విలువ డెబ్బయి రూపాయలకు చేరడం ఈ ‘పతనం’. రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆందోళన చెందనవసరం లేదన్నది దశాబ్దుల తరబడి ప్రభుత్వం చెబుతున్న మాట. అందువల్ల బ్రిటన్ విముక్త భారతదేశంలో రూపాయి విలువ దిగజారిపోతూనే ఉంది. ఇలా రూపాయి విలువ నిరంతరం దిగజారుతోందన్న సంగతి ధ్రువీకరించుకొనడానికి ప్రాతిపదిక మన రూపాయి విలువ అమెరికా వారి ‘డాలర్’తో అనుసంధానమై ఉండడం. ప్రస్తుతం ఒక అమెరికా ‘డాలర్’ను విదేశీయ వినిమయ ద్రవ్య విపణి- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్-లో కొనుగోలు చేయాలంటే మనం డెబ్బయి రూపాయలను చెల్లించాలి. ఇటీవలి కాలంలో, అంటే గత ఆరు ఏళ్లుగా ‘డాలర్’తో పోల్చినప్పుడు రూపాయి విలువ ‘యాబయి నాలుగు’నుంచి ‘డెబ్బయి’కి దిగజారడం నడుస్తున్న చరిత్ర. 2012 మే నెలలో ‘డాలర్’ విలువ యాబయి నాలుగు రూపాయలకు పెరిగింది. 2008లో అమెరికా ఆర్థిక సంస్థలు, వాణిజ్య వ్యవస్థ పెద్దఎత్తున దివాలా తీశాయి. ఆ నేపథ్యంలో 2008లో నలబయి ఐదు రూపాయలకు లభించిన ‘డాలర్’ ధర 2009లో పతనమైంది. 2009లో నలబయి రూపాయలకు ‘డాలర్’ లభించిందట! ఇలా రూపాయి విలువ పెరిగినప్పుడు కూడ వాణిజ్య వర్గాల వారు ఆందోళనను వ్యక్తం చేశారు. అమెరికా ‘డాలర్’ ప్రాతిపదికగా మన రూపాయి విలువ పెరిగినట్టయితే మన ఎగుమతుల పరిమాణం తగ్గిపోతుందట. తద్వారా మన దిగుమతుల విలువ పెరిగి, ఎగుమతుల విలువ బాగా తరిగి విదేశీయ వాణిజ్యంలో భారీ లోటు ఏర్పడుతుందట. తద్వారా మన ‘వార్షిక ఆదాయ వ్యయాల ఖాతా’- కరెంట్ అకౌంట్‌లో లోటు పెరుగుతుందట! అందువల్ల రూపాయి విలువ పెరగరాదన్నది వాణిజ్యవర్గాలు 2009-2010 ప్రాంతంలో చేసిన నిర్ధారణ. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా ‘రూపాయి’ నిరంతరం ‘తన విలువ’ను త్యాగం చేస్తోంది. అందువల్లనే ‘రూపాయి’ విలువ మరింత ఘోరంగా పతనమైనప్పుడల్లా ప్రభుత్వాలు ‘‘ఆందోళన చెందవలసిన అవసరం లేదు’’ అని హామీ ఇస్తున్నాయి. అందువల్లనే 2012 మేలో రూపాయి విలువ భారీగా పతనమైనప్పుడు అప్పటి ఆర్థికమంత్రి ప్రణవ్‌కుమార్ ముఖర్జీ ‘ఆందోళన చెందకండి...’ అని ‘తెలిసిన వారికి’ అభయం ఇచ్చాడు. ‘తెలియని’ కోట్లాది సామాన్య జనానికి భయమే లేదు. ‘అనభిజ్ఞత ఆనందం...’- ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్- అన్న సూక్తి ఆర్థిక రంగంలో ఇలా సమన్వయం అవుతోంది.
ఇలా దాదాపు తొమ్మిదేళ్లలో ‘డాలర్’ ప్రాతిపదికగా రూపాయి విలువ డెబ్బయి ఐదు శాతం పతనమైంది. నలబయి రూపాయలకు లభించిన ‘డాలర్’ను ఇప్పుడు డెబ్బయి రూపాయలు పెట్టి కొనవలసి వస్తోంది. ఇలా రూపాయి విలువ దిగజారడం వల్ల ప్రవాస భారతీయుల- నాన్ రెసిడెంట్ ఇండియన్స్- ఎన్‌ఆర్‌ఐల- నుండి దేశవాసులకు లభిస్తున్న రూపాయల సంఖ్య పెరుగుతోందట. ‘డాలర్’ విలువ అరవై రూపాయలు ఉన్నప్పుడు దేశం బయటి నుంచి మన దేశంలోకి ‘డాలర్’ వస్తే సంబంధిత ‘బ్యాంకు’ ఖాతాలోకి అరవై రూపాయలు జమ అవుతుంది. రూపాయి విలువ తగ్గి ‘డాలర్’ ధర డెబ్బయికి చేరింది, బయటి నుంచి ‘డాలర్’ వచ్చినట్టయితే సంబంధిత ‘ఖాతా’లో డెబ్బయి రూపాయలు జమ అవుతుందట. విదేశాలలోని భారతీయుల నుంచి ‘డాలర్లు’ పొందుతున్న వారికి ఇదో ఆనందం. విదేశాలకు వెళ్లిరావలసిన లక్షల మంది మాత్రం డాలర్లను పొందడానికి నానాటికీ ఎక్కువ, మరింత ఎక్కువగా భారతీయ వినిమయ ద్రవ్యం చెల్లించవలసి వస్తోంది. దేశంలోకి సరకులను దిగుమతి చేసుకుంటున్న లక్షలాది వ్యాపారులు, ఆ ‘అనవసరమైన’ సామగ్రిని కొంటున్న కోట్లాది వినియోగదారులు కూడ- రూపాయి విలువ పతనం కావడం వల్ల- మరిన్ని ఎక్కువ రూపాయలను పోగొట్టుకోవలసి వస్తోంది.. ఆల్కహాల్ వాసన కొడుతున్న మిఠాయిలు, చాక్లెట్లు, బి.టి. రసాయన విషాలు నిండిన ‘శుద్ధి’చేసిన- ప్యాకేజ్డ్- ఆహార పదార్థాలు, విచిత్ర వికృత క్రీడాసామగ్రి, ‘తాళ్లు’, ‘దారాలు’ వంటివి అనవసరమైన దిగుమతులు.
అమెరికా ‘డాలర్’ విలువ, ‘యూరో’వంటి సంపన్న దేశాల ‘వినిమయ ద్రవ్యం’ విలువ నిరంతరం పెరుగుతుండడం, భారత్ వంటి ప్రవర్ధమాన దేశాల ‘వినిమయ ద్రవ్యం’ విలువ తగ్గిపోతుండడం అంతర్జాతీయ అనుసంధాన ఆర్థిక వైచిత్రి. ఈ వైచిత్రి క్రీస్తుశకం పదహారవ, పదిహేడవ శతాబ్దుల నుంచి గత శతాబ్ది నడికొనేవరకు ఐరోపా దేశాల వారు ప్రపంచంలోని ఇతర దేశాలను చేసిన దోపిడీ ‘వారసత్వం’. చిన్న దేశాలైన ‘ఐరోపా’ వారి ‘స్థూల జాతీయ ఆదాయం’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- విలువ, పరిమాణం మన దేశం వంటి అతిపెద్ద దేశాల ‘జిడిపి’ విలువ కంటె, పరిమాణం కంటె చాలా ఎక్కువగా ఉండడానికి ఈ వికృత ‘వారసత్వం’కారణం. పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్‌లాండ్స్- డచ్చి-, బ్రిటన్ వంటి ఐరోపా దేశాల వారు ఇతర ఖండాలలోని దాదాపు అన్ని దేశాలను మూడు నాలుగు శతాబ్దుల పాటు దురాక్రమించడం చరిత్ర. మన దేశంలో కూడ ఈ దురాక్రమణ రెండువందల ఏళ్లకు పైగా కొనసాగింది. పదిహేడవ శతాబ్ది నుండి ఫ్రాన్స్, బ్రిటన్ మన దేశంలో కొల్లగొట్టుకొనిపోయిన బంగారం, వెండి తదితర సంపద ఐరోపాలో సంభవించిన ‘పారిశ్రామిక విప్లవ’ ప్రగతికి పెట్టుబడులుగా మారడం చారిత్రిక వాస్తవం. రెండు శతాబ్దులపాటు ప్రవర్ధమాన దేశాలను దోపిడీ చేసిన బ్రిటన్ వాణిజ్య బీభత్సం ప్రస్తుతం వ్యవస్థీకృతమై ఉన్న అంతర్జాతీయ ఆర్థిక అసమానతలకు వౌలిక ప్రాతిపదిక. అమెరికాను, ఆస్ట్రేలియాను దురాక్రమించిన ఐరోపా వారు ఆయాచోట్ల అనాదిగా ఉండిన ‘స్వజాతుల’ను సామూహికంగా హత్యచేసి నిర్మూలించడం చరిత్ర. ఆస్ట్రేలియాలోను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోను ప్రస్తుతం స్వజాతులుగా చెలామణి అవుతున్న ‘తెల్లవారు’ ఐరోపా నుండి చొరబడిన అక్రమ ప్రవేశకుల వారసులు. మన దేశం వంటిచోట్ల ‘స్వజాతి’ని ఐరోపా వారు నిర్మూలించలేకపోయారు, కానీ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించి నిష్క్రమించారు...
ఇలా 1947 నాటికి ఆర్థికంగా దివాలా తీసిన మన దేశం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో సంపన్న దేశాలతో పోటీ పడవలసి రావడం ‘మన వినిమయ ద్రవ్యం’- రూపాయి- విలువ నిరంతరం దిగజారడానికి ఏకైక కారణం! మన దేశం ‘సాపేక్షం’గా ఈ డెబ్బయి ఏళ్లలో అంతర్గతంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది, కానీ అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం ఫలితంగా మన దేశం ఇప్పటికీ అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనా, దక్షిణ కొరియా వంటి సంపన్న దేశాల దోపిడీకి గురి అవుతూనే ఉంది. 1960వ దశకంలో ‘డాలర్’ విలువ ఏడున్నర రూపాయలు మాత్రమే! ప్రస్తుతం ‘డాలర్’ విలువ డెబ్బయి రూపాయలు. మన దేశం ఈ అంతర్జాతీయ వాణిజ్య భల్లూక బంధం నుంచి విముక్తం అవుతుండిన సమయంలో మరో వైపరీత్యం సంభవించింది. అది, వాణిజ్య ప్రపంచీకరణ.. స్వేచ్ఛా వాణిజ్యవ్యవస్థ! ‘్భల్లూక బంధం’ నుంచి ‘కబంధ బంధం’లోకి మన ఆర్థిక వ్యవస్థ పయనించడానికి కారణం ఈ ‘ప్రపంచీకరణ’... ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ నుంచి మన దేశం వైదొలగనంత వరకూ మన ‘రూపాయి’ ఇంకా ఇంకా బక్కచిక్కిపోతూనే ఉంటుంది...