సంపాదకీయం

వాణిజ్య వైద్య విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారంగంలో కొనసాగుతున్న వాణిజ్య బీభత్సకాండ- కార్పొరేట్ టెర్రరిజమ్-కు ఇది మరో నిదర్శనం. ఈ బీభత్సకాండను న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు నియంత్రించడానికి యత్నిస్తున్నాయి. అయినప్పటికి న్యాయస్థానాల ఆదేశాలను అతి తెలివిగా వమ్ముచేయడానికి వాణిజ్య విద్యాసంస్థల నిర్వాహకులు యత్నిస్తుండడం నడుస్తున్న చరిత్ర. గురువారంనాడు హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానంవారు మరోసారి కొరడా ఝుళిపించవలసి రావడానికి కారణం అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ విద్యా వాణిజ్య బీభత్సం. ప్రభుత్వేతర వైద్య కళాశాలలలో ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులను సంరక్షకులను దోచిపారేస్తున్నారు. ఈ దోపిడీ నాలుగురెట్లు పెరగడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తరువును జారీచేయడం ఉన్నత న్యాయస్థానం వారు గురువారం జారీచేసిన తాత్కాలిక ఆదేశానికి కారణం. ప్రభుత్వం వారి ఉత్తరువును హైకోర్టు న్యాయమూర్తులు తాత్కాలికంగా నిలిపివేయడం ‘స్నాతకోత్తర వైద్య’- పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్- విద్యార్థులకు హర్షం కలిగిస్తున్న పరిణామం. తెలంగాణలోని ప్రభుత్వేతర వైద్యకళాశాలలోని ‘స్నాతకోత్తర వైద్య’ విద్యాతరగతులలో చేరుతున్నవారు ఇంతవరకూ ఐదు లక్షల ఎనబయి ఐదువేల రూపాయల వార్షిక శుల్కం - యాన్యువల్ ఫీ - చెల్లిస్తున్నారట. ఈ వార్షిక శుల్కాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచి భారీ దోపిడీ చేయడానికి వీలు కల్పించాలన్న ప్రభుత్వేతర కళాశాలల యాజమాన్యాల అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం, గుట్టుచప్పుడు కాకుండా, ఆమోదించడం విస్మయకరమైన విపరిణామం! ఇలా వార్షిక శుల్కాన్ని ఒకేసారి దాదాపు నాలుగురెట్లు పెంచడానికి వీలుకల్గించే 78వ ప్రభుత్వ ఉత్తరువు- జి.ఓ.- గత పద్నాలుగవ తేదీన జారీ అయిందట! హైదరాబాద్ ఉన్నత న్యాయమూర్తులు వి.రామసుబ్రహ్మణ్యమ్, జె.ఉమాదేవి ఈ ప్రభుత్వపుటుత్తరువును అమలు జరుపరాదని తత్కాల ఆదేశాలు జారీచేయడం విద్యార్థులకు గొప్ప ఊరట కలిగిస్తున్న పరిణామం. 2011 నుంచి అమలులోఉన్న ప్రభుత్వంవారి ఉత్తరువు ప్రకారం ఇనే్నళ్లుగా వసూలుచేసి ‘వార్షిక శుల్కం’ పరిమాణం దోపిడీ చేస్తున్న తీరునకు నిదర్శనం. అలాంటిది దోపిడీ స్థాయిని నాలుగురెట్లు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించడం అంతుబట్టని వ్యవహారం. ‘ప్రవేశాలు శుల్క క్రమబద్ధీకరణ సంఘం’- అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ- ఏఎఫ్‌ఆర్‌సి- సభ్యులతో సంప్రదించకుండానే ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం ప్రభుత్వానికి మరో అభిశంసన! ఉన్నత న్యాయస్థానం వారికి ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసి ఉంది. ‘్భగీరథ’, ‘కాకతీయ’ నీటి ఉద్యమాల ద్వారాను, వ్యవసాయ పశుపోషణ సంక్షేమ చర్యల ద్వారాను కీర్తిప్రతిష్ఠలను సముపార్జించడానికి యత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అపకీర్తిని తెచ్చిపెట్టే ఇలాంటి దుశ్చర్యకు పాలుపడడం దిగ్భ్రాంతికరం. ప్రభుత్వేతర విద్యాసంస్థల అక్రమాలను నియంత్రించడానికి సైతం గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం యత్నించినట్టు ప్రచారమైంది. కానీ ఇలా వైద్య విద్యా సుంకాన్ని అకస్మాత్తుగా ఇంత భారీగా పెంచడానికి ఎందుకు అనుమతి ఇచ్చినట్టు?? ఈ హెచ్చింపు అన్యాయం... అతార్కికం!
జాతీయ ప్రవేశార్హత పరీక్ష - నేషనల్ ఎలిజబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్- నీట్- ద్వారా పట్ట్భద్ర స్థాయి వైద్య విద్యా- ఎమ్‌బిబిఎస్-తరగతులకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇలా ఎంపికైన విద్యార్థులనుంచి ప్రభుత్వ కళాశాలలలో పదివేల రూపాయల వార్షిక శుల్కం వసూలు చేస్తున్నారట. కానీ ప్రభుత్వేతర కళాశాలలలో భయంకరమైన ‘వార్షిక శుల్కం’- యాన్యువల్ ఫీ- వసూలుచేస్తున్నారు. ఇలా దండుకోవడాలు కూడ దేశమంతటా ఒకే రీతిగా లేదు. వివిధ ప్రాంతాలలో ప్రభుత్వాలు వివిధ రకాలుగా ‘శుల్కా’న్ని నిర్ణయించి నిర్దేశిస్తున్నాయి. దేశమంతటా ఈ ‘కార్పొరేట్ కాలేజీ’ల కామందులు విద్యార్థులనుంచి ఎంతెంత దండుకుంటున్నారన్నది తెలీదు. ప్రభుత్వేతర కళాశాలలలో ‘ప్రతిభాస్థానం’- ఫ్రీ సీట్- లభించిన విద్యార్థులనుంచి యాజమాన్యాలు అరవై వేల రూపాయలను ‘వార్షిక శుల్కం’గా వసూలుచేసుకోవాలి. కాని దేశంలోని వివిధ ప్రాంతాలలో దీనికంటె ఎంతోకొంత ఎక్కువగానే ‘ప్రతిభా స్థాయి’ ప్రవేశం పొందిన విద్యార్థులు చెల్లించవలసి వస్తోంది. ఈ చెల్లింపులకు ‘రసీదు’లు ఉండవట! ఇలా ‘ఫ్రీ సీట్’ పొంది ప్రభుత్వేతర కళాశాలలలో ప్రవేశం పొందిన విద్యార్థులు అరవై వేల రూపాయల వార్షిక శుల్కం చెల్లించాలన్నది దేశమంతటా అమలులోఉన్న నిబంధన. భాగ్యనగరం - హైదరాబాద్-లో దాదాపు రెట్టింపు వసూలుచేస్తున్నారట. అరవై వేలను మాత్రం వార్షిక శుల్కంగా చూపించి మిగిలిన అరవై వేలను రసీదు ఇవ్వకుండానే లాక్కుంటూ ఉన్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. హైదరాబాద్ ఎల్‌బినగర్ ప్రాంతంలోని ఓ వైద్య కళాశాల యాజమాన్యం ఇలా రెట్టింపు శుల్కాన్ని వసూలుచేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తంచేశారన్నది తాజా పరిణామం.
ప్రభుత్వేతర కళాశాలలలోని మొత్తం ‘సీట్ల’లో యాబయి శాతం మాత్రమే ఇలా ‘ప్రతిభాస్థాయి’ వాటాకు కేటాయించడం ప్రభుత్వాలు ఆమోదించిన వాణిజ్య బీభత్సకాండకు మరో ప్రత్యక్ష ప్రమాణం. మిగిలిన యాబయి శాతంలో ముప్పయి శాతం ‘నిర్వాహకుల వాటా’- మేనేజ్‌మెంట్ కోటా-! ఇరవై శాతం ప్రవాస భారతీయుల వాటా- నాన్ రెసిడెంట్ ఇండియన్-ఎన్‌ఆర్‌ఐ- కోటా! ప్రవాస భారతీయులకు వైద్య కళాశాలల ఇతర విద్యాలయాల సీట్లలో వాటా కల్పించడం ‘దోపిడీ’కి పరాకాష్ఠ. ‘మేనేజ్‌మెంట్ కోటా’లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఒక్కొక్కరినుండి నిర్వాహకులు పదకొండు లక్షల రూపాయల వార్షిక శుల్కం వసూలుచేస్తున్నారట. ఇది తెలంగాణలో ప్రభుత్వేతర వైద్యకళాశాలల వారు చేస్తున్న దోపిడీ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో పదమూడు లక్షల రూపాయల ‘వార్షిక శుల్కం’ దండుకుంటున్నారట! దోపిడీ కథ ఇంకా ఉంది. ‘ఎన్‌ఆర్‌ఐ’ కోటాలో సీటు పొందాలంటే ఒక్కొక్క విద్యార్థి ప్రభుత్వేతర కళాశాల యజమానులకు ఇరవై మూడు లక్షల రూపాయలు చెల్లించాలట! ఇది తెలంగాణ కథ. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ‘వార్షిక శుల్కం’ ముప్పయి లక్షల వరకూ పలుకుతోందట! అంటే అర్హత లేని, ప్రతిభ లేని వారు ఐదున్నర ఏళ్లలో కోటినుంచి కోటిన్నర రూపాయల వరకూ ఖర్చుపెట్టి ‘డాక్టర్’ పొందవచ్చు. వైద్యుని రూపమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవచ్చు!
ధర్మప్రాణ దేశమని పేరుగాంచిన ఈ దేశంలో ఇలాంటి క్రూరమైన అధర్మం ధర్మంగా చెలామణి అవుతోంది. మన పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థ స్వభావం ఇది. ప్రభుత్వాలు ఇలా నిర్లజ్జగా ‘కార్పొరేట్’ వైద్య విద్యారంగంలో దోపిడీని ప్రోత్సహించడం దేశమంతటా జరుగుతున్న వాణిజ్య బీభత్సకాండ. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతం అయిన తరువాత ఈ ‘నిర్లజ్జ’ మరింత బరితెగించింది. ప్రతిభ ఉన్న విద్యార్థులు ‘డాక్టర్లు’ అవుతున్నారు, ‘ప్రతిభ’లేనివారు పనికిరానివారు ‘డబ్బుబలం’తో ‘డాక్టర్లు’ అవుతున్నారు. రాజకీయవేత్తలను అక్రమ వాణిజ్య పారిశ్రామికవేత్తలు ప్రభావితం చేయడం గతం. ప్రస్తుతం అక్రమ పారిశ్రామిక వాణిజ్యవేత్తలే రాజకీయవేత్తలుగా చెలామణి అవుతున్నారు. అందువల్ల దేశమంతటా అధికార, ప్రతిపక్ష రాజకీయవేత్తలు లేదా వారి బంధువులు వాణిజ్య వైద్య కళాశాలలను నడిపిస్తున్నారు. ‘్ఫజు’లు భయంకరంగా పెరగడంలోని ‘రహస్యం’ ఇదీ!!