సంపాదకీయం

చైనా చెలిమి విలువ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాల్కన్ ఈశ అనే ఉయిఘర్ ఉద్యమనాయకుడికి ప్రవేశ అనుమతి పత్రాన్ని నిరాకరించడం ద్వారా మన ప్రభుత్వం మరోసారి చైనా ప్రభుత్వానికి గౌరవం ఘటించింది. మనదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు ప్రవేశ అనుమతి-వీసా-ని జారీ చేశారు. మరుసటి రోజున విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు వీసాను రద్దు చేశారు. చైనా ప్రభుత్వ నిర్వాహకులను సంతృప్తి పరచడాని కి ఏప్రిల్ 25న విదేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు దీర్ఘమైన వివరణ కూడా ఇవ్వడం చైనీయుల మనోభావాలకు మనమిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఏప్రిల్ 28వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరుగనున్న ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావడానికి వీలుగా ‘ఈశ’ ఈ వీసాను కోరాడట. అందువల్ల దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు 24న వీసాను మంజూరు చేశారు. డాల్కన్ ఈశను చైనా ప్రభుత్వం బీభత్సకారుడని ముద్రవేసింది. సికియాంగ్ - ఝింఝియాంగ్-లో విచ్ఛిన్న కలాపాలను నిర్వహిస్తున్నట్టు ఆయనపై చైనా ప్రభుత్వం అభియోగం మోపింది. ఇరవై ఏళ్లకు పైగా ఈశ జర్మనీలోను ఐరోపా దేశాలలోను ప్రవాస జీవితం గడుపుతున్నాడు. అందువల్ల డాల్కన్ మన దేశానికి రావడం వల్ల తమ దేశం భద్రతకు భంగం ఏర్పడిపోతుందని చైనా అందోళన చెందుతోందట! మన ప్రభుత్వం ధర్మశాలకు రావడానికి ఈశను అనుమతించిన వెంటనే చైనా ప్రభుత్వం పెద్దగొంతుతో నిరసన తెలిపింది. డాల్కన్ ఈ మనదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి బీభ త్స కృత్యం జరుపలేదు. అయినప్పటికీ చైనా వారి శత్రువును మన శత్రువుగా భావించడం మన ప్రభుత్వం నెరపుతున్న చైనా మైత్రిలో భాగం. అందువల్ల చైనావారు నిరసన తెలిపిన తక్షణం మన ప్రభుత్వం ఏప్రిల్ 25న డాల్కన్ వీసాను రద్దు చేసింది. ‘మాకు ముందుగా తెలిసి ఉండినట్టయితే వీసాను జారీ చేసి ఉండేవారం కాము..’ అని మన విదేశాంగ మంత్రిత్వశాఖ వారు చైనా ప్రభుత్వానికి సంజాయిషీ కూడా ఇచ్చుకోవడం మన దేశంలోని చైనా భక్తులు మెచ్చుకోదగిన పరిణామం. దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ‘కంప్యూటర్’లు అడిగిన వారందరికీ వీసాలు ఇచ్చినట్టే దరఖాస్తు పెట్టిన ఉయిఘర్ నాయకుడికి కూడా వీసాను మంజూరు చేశారట! చైనాకు విదేశాంగశాఖ ఇచ్చిన వివరణ ఇది. చైనావారు కనుక్కోబట్టి సరిపోయింది. వీసాను రద్దు చేశారు. కనుక్కోకుండా ఉండి ఉన్నట్టయితే ఆయన మనదేశానికి వచ్చి వెళ్లి ఉండేవాడు. అలా జరిగినప్పటికీ మనకొచ్చిన ప్రమాదం లేదు. కానీ ఇలా అడిగిన వారందరికీ వివరాలు రాయితీయకుండా వీసాలు ఇవ్వవచ్చునా? భారత వ్యతిరేక టెర్రరిస్టులు చొరబడిపోరా.?
ఉయిఘర్ ఉద్యమం టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమంతో సమాంతరంగా నడుస్తోంది. బౌద్ధులు నివసిస్తున్న టిబెట్‌ను చైనా 1959లో దురాక్రమించింది. ఇస్లాం మతస్థులు అధిక్సంఖ్యాకులైన ఉయిఘర్-ఝింఝియాంగ్- ప్రాం తాన్ని చైనా ప్రభుత్వం 1884లోనే తమ దేశంలో కలుపుకొంది. చైనా ప్రభుత్వం దశాబ్దులుగా దురాక్రమణ స్వభావం, దక్షిణాన ఉన్న టిబెట్‌ను, పశ్చిమాన ఉన్న ఝింఝియాంగ్‌ను కలుపుకున్నట్టే ఉత్తరాన ఉన్న మంచూరియాను, మంగోలియాలో అధికభాగాన్ని చైనా ఆక్రమించడం చరిత్ర. డాల్కన్ ఈశ వంటి వారు చైనాకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి నేపథ్యం ఈ చరిత్ర! మధ్య ఆసియాలో పదిలక్షల చదరపు మైళ్లపైన విస్తరించి ఉన్న ప్రాంతాన్ని క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దిలో ఆక్రమించిన జిహాదీలు ఈ ప్రాంతానికి టర్కిస్థాన్ అని పేరు పెట్టుకున్నారు. ఇస్లాం మతం వారు ప్రవేశించకపూర్వం ఈ ప్రాంతంలో బౌద్ధమతం, వైదిక మతం విస్తరించి ఉండేవి. ఈ టర్కిస్థాన్‌ను ఆ తరువాత కాలంలో రష్యన్లు, చైనీయులు ఆక్రమించారు. తూర్పు టర్కిస్తాన్‌ను చైనా ఆక్రమించుకొంది. బ్రిటిష్ వారు సికియాంగ్‌గా పిలిచిన ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం చైనావారు ఝింఝియాంగ్ ఉయిఘర్ ప్రాంతంగా పిలుస్తున్నారు.
దాదాపు ఆరున్నర లక్షల చదరపు మైళ్ల-పదహారు లక్షల చదరపు కిలోమీటర్ల-మేర విస్తరించి ఉన్న ఉయిఘర్ చైనాలో అతిపెద్ద పాలనా విభాగం. టిబెట్ కంటె కూడ ఉయిఘర్ పెద్దది. మంచుగడ్డల మయమైన ఈ విశాల ప్రాంతంలో కేవలం రెండు కోట్ల మంది నివసిస్తున్నారు. ఇస్లాం మతస్థులు అత్యధికంగా నివసిస్తున్న ఉయిఘర్‌లో పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ నుంచి చొరబడిన జిహాదీ ఉగ్రవాదులకు స్థావరాలు ఏర్పడడం ఇటీవలి చరిత్ర. అయితే చైనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఈ టెర్రరిస్టులను తొక్కివేసింది. జిహాదీలను ఏరివేయడం కోసం చైనా ప్రభుత్వ దళాలు ఉయిఘర్ ప్రాంతంలోని మసీదుల్లోకి కూడా చొరబడడానికి, మసీదులను విధ్వంసం చేయడానికి సైతం చైనా ప్రభుత్వం వెనుకాడలేదు. అందువల్ల జిహాదీ టెర్రరిజమ్ సమస్య మనకూ, చైనాకూ సమానమని మన ప్రభుత్వం మాత్రమే భావిస్తోంది. కానీ చైనా భావించడం లేదు. జిహాదీలు తమదేశంలో బీభత్సకాండ సృష్టించకపోతే చాలు, భారత్‌లో ఎన్ని హత్యలను చేసినప్పటికీ తమకు అభ్యంతరం లేదన్నది చైనా విధానం. ఫలితంగా చైనాకు దాని మిత్రదేశమైన పాకిస్తాన్‌కు మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిపోయింది. జిహాదీ ఉగ్రవాదులు గత రెండు మూడేళ్లుగా ‘ఉయిఘర్’లో చెలరేగడం లేదు. కానీ జిహాదీలు మనదేశాన్ని బద్దలు కొట్టాలన్నదే చైనా విధానం. అందువల్లనే మసూద్ అఝార్ అనే కరడుకట్టిన హంతకుడిని నిషిద్ధ వ్యక్తిగా ప్రకటించే ప్రభుత్వ ప్రయత్నాన్ని ఐక్యరాజ్య సమితిలో చైనా ప్రభుత్వం నిర్లజ్జగా బహిరంగంగా ఐక్యరాజ్యసమితిలో అడ్డుకుంటోంది. చైనా వ్యతిరేకత కారణంగా మార్చి 31వ తేదీన తీర్మానం సమితిలో రద్దయింది. చర్చకే రాలేదు. హర్కత్ ముఠాకు చెందిన మసూద్ అఝార్ జాయిష్ ఏ మొహమ్మద్ అన్న మరో జిహాదీ ముఠాను ఆరంభించాడు. పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. పఠాన్‌కోట్‌లో మన వైమానిక దళం స్థావరంపై పాకిస్తానీలు జరిపిన దానికి సూత్రధారుడు అఝర్.
టెర్రరిజమ్‌పై ఉమ్మడి పోరు జరపడంలో చైనా మనతో కలసి వస్తుందన్న భ్రాంతి అవశేషం కూడా మసూద్ అఝార్ ఉదంతంతో అంతరించిపోయింది. ఇలా అంతరిచడం వల్లనే మన ప్రభుత్వం ఈ ఉయిఘర్ ఉద్యమకారుడిని వీసా మంజూరు చేసిందన్న భావం మనదేశంలోను, అంతర్జాతీయ సమాజంలోను అంకురించింది. ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ..’ లాగా మన ప్రభుత్వం చైనాకు గుణపాఠం నేర్పిందని సంబరపడ్డాము. అంకురించిన ఆశ మరుసటి రోజున వాడిపోయింది. చైనాపట్ల గతంలో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం అనుసరించిన మోకరిల్లే విధానం మళ్లీ మొదలైందా?