సంపాదకీయం

మహాత్ముని ద్యుతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వ చ్ఛత సృష్టి నిహితమైన సహజ స్వభావం. సృష్టిగతమైన వౌలిక తత్త్వం ఇది.. ఈ స్వచ్ఛతను మాలిన్యం ఆవహించడం ‘అపవాదం’ మాత్రమే. అపవాదం- ఎక్సెప్షెన్- తొలగిపోయి వౌలిక తత్త్వం మళ్లీ అంకురించడం, విస్తరించడం కూడ విశ్వవ్యవస్థలో నిహితమైన సహజ పరిణామ క్రమం. అందువల్ల కాలుష్య విముక్తమైన ప్రకృతి మళ్లీ మళ్లీ ప్రస్ఫుటిస్తూనే ఉంటుంది. సృష్టిగత వాస్తవాలు సమాజస్థితి జీవన విలాసంగా వికసించడం వేద విజ్ఞాన ప్రచోదిత భారతీయత.. హిందుత్వం.. సనాతన జాతీయత. పరిసరాల పట్ల మనకున్న మమకారం ప్రాకృతిక, భౌతిక స్వచ్ఛతను పెంపొందిస్తోంది. ఈ మమకారం వల్లనే మనకు, మన ప్రగతికి, మనసుగతికి, ఆధారమైన, మన అస్తిత్వానికి ప్రాతిపదిక అయిన ‘్భమి’ జడ పదార్థం కాదన్న వాస్తవం అనాదిగా అనంతంగా మనకు స్ఫురించింది. స్ఫురిస్తోంది. ఈ భూమి సర్వసమగ్ర చైతన్యం. ఈ చైతన్యం నుండి సమస్త జీవజాలం పురుడుపోసుకొంటోంది, ఈ మట్టి మానవులకు జీవం, జవం, ప్రాణాధారమైన అన్నం, ఆత్మను వికసింపచేస్తున్న సాంస్కృతిక యోగం. ‘్భమి జాతికి తల్లి’ అన్న వాస్తవం ఈ సాంస్కృతిక యోగం. ‘యోగం’ మానసిక స్వచ్ఛతను పరిరక్షిస్తోంది, శారీరక స్వస్థతకు దోహదం చేస్తోంది! బౌద్ధిక, నైతిక, ధార్మిక, సాంస్కృతిక స్వచ్ఛతలు ఇలా ‘మమకారం’తో ముడివడి ఉన్నాయి. ఈ మమకారం ‘్భమి తల్లి నేను ఆమె బిడ్డడను’అన్న అనాది వాస్తవానికి చిహ్నం, విగ్రహం. ఈ వాస్తవాన్ని జీవనంగా మలచిన మాధ్యమం సంస్కారం! ఈ మాతృభూమికొరకు జీవించడం అందువల్ల బిడ్డల సనాతన స్వభావం అయింది. ఈ బిడ్డలలో కారణజన్ములైనవారు వరాల బిడ్డలు, వజ్రాల సుతులు. ఇలాంటి భరతమాత ప్రియపుత్రులు కృతయుగంలో ఉన్నారు. కలియుగంలోనూ ఉన్నారు. వసిష్ఠుని వంటి వేదద్రష్టలనుంచి వివేకానందస్వామి ధర్మద్రష్టల వరకు, పృథువువంటి శ్రమజీవన సౌందర్యమూర్తుల నుంచి బంకించంద్రుని వంటి విప్లవ మూర్తులవరకు, దిలీపుని వంటి వీరులనుంచి ఛత్రపతి వంటి త్యాగధనుల వరకూ, ప్రవరుని వంటి సౌజన్య భరితులనుంచీ అజాద్ చంద్రశేఖర్ వంటి సౌశీల్య చరితులవరకూ ఈ మాతృ మమకార స్వచ్ఛతకు ప్రతీకలైన భరతమాత బిడ్డలు వేలు.. లక్షలు... ఇలాంటి ప్రియపుత్రుల పరంపరలోని వారు ఆధునికులైన మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్ర్తీ. ఈ ఇద్దరు మహాపురుషులూ అక్టోబర్ రెండవ తేదీన జన్మించిన అమలిన స్వభావులు, స్వచ్ఛతకు ప్రతీకలు, భరతమాత కీర్తికి పతాకలు... మహాత్మాగాంధీ బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమానికి మూడు దశాబ్దులకు పైగా నాయకత్వం వహించాడు, భరతమాతను భౌతిక దాస్య విముక్తను చేయగలిగాడు! లాల్‌బహదూర్ శాస్ర్తీ పంతొమ్మిది నెలలపాటు దేశానికి ప్రధానమంత్రిత్వం వహించాడు. మళ్లీ దూకిన మతోన్మాద దురాక్రమణను తిప్పికొట్టాడు, సరిహద్దులను భద్రం చేశాడు. భరతమాతృ దుష్టశిక్షక ప్రవృత్తిని ధ్రువపరిచాడు.
మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మహాత్మాగాంధీగా వినుతికెక్కడం మూడున్నర దశాబ్దుల బ్రిటన్ దురాక్రమణ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర. క్రీస్తుశకం 1914లో గాంధీ దక్షిణ ఆఫ్రికానుంచి తిరిగి మాతృదేశానికి రావడంతో ఈ చరిత్ర మొదలైంది. ఇది భారతీయ జీవన మూల్యాల పునరుద్ధరణ చరిత్ర. ఈ జీవన సంస్కారాల సమాహారం సాంస్కృతిక స్వచ్ఛత. ఈ సాంస్కృతిక స్వచ్ఛతవల్లనే యుగాలపాటు భరతజాతి విశ్వగురువుగా విరాజిల్లింది. ఈ సాంస్కృతిక స్వచ్ఛత ఈ బౌద్ధిక మానసిక స్వచ్ఛత భౌతిక స్వచ్ఛతను పెంపొందించింది. స్వచ్ఛమైన నదీ జలాలు నిరంతరం పరుగులు తీశాయి. మధుమయమైన మధుర పరిమళాలతో నిండిన పవనాలు స్వచ్ఛ భారతాన్ని లక్షల ఏళ్లు ప్రస్ఫుటింపచేశాయి. అడవులలోను, కొండల కోనలలోను, పర్వత శిఖరాలలోను పెరిగిన స్వచ్ఛమైన గడ్డిని మేసిన ఆవులు అమృత ధారలను కురిపించడం స్వచ్ఛ భారతీ యుగయుగాల కథ. స్వచ్ఛమైన పొలాలు స్వస్థతను సమకూర్చే అన్నాన్ని ప్రసాదించాయి, భరతమాత వినిర్మల హృదయంతో ప్రపంచ ప్రజలకు ఆహారాన్ని, సంస్కారాన్ని విందుచేయడం చరిత్ర. ఈ స్వభావం స్వచ్ఛత, ఈ సంస్కార సమాహారానికి ప్రాతిపదిక సత్యం... ‘సత్యమేవ జయతే’అన్నది సనాతన భారత జాతీయ స్వభావం! విదేశీయ బీభత్సకారులు శతాబ్దులపాటు దురాక్రమణ సాగించిన సమయంలో ఈ స్వచ్ఛత గ్రహణగ్రస్తమైంది, ఈ సత్యం గ్రహణగ్రస్తమైంది. ఈ సంస్కారాలను గ్రహణ విముక్తిచేయడానికి జరిగిన కృషి మహాత్మాగాంధీ జీవన ప్రస్థానం..
మహాత్మాగాంధీ దక్షిణ భారత్‌లోని ‘మాల్‌గుడి’ పట్టణానికి వచ్చాడు. పురపాలకులు, పట్టణ ప్రజలు గాంధీకి ఘన స్వాగతం చెప్పారు. వీధులగుండా ఊరేగింపు నడిచింది. పురపాలక సంఘం అధ్యక్షుడు మహాత్ముడిని తన విలాసవంతమైన భవన్తిలో విడిది చేయమని కోరాడు. కొద్దిసేపు ఆ భవనంలో కూర్చున్న గాంధీ జనంలో దూరంగా నిలబడి ఉన్న, మురికి బట్టలు వేసుకొని ఉన్న ఒక బాలుడిని గుర్తించాడు. గాంధీ ఆ బాలుడిని తనవద్దకు పిలిచాడు, ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. ఆ బాలుడు దళితుడు. గాంధీ ఆ బాలునికి జనంలోని మిగిలిన పిల్లలకు కమలా- సంతరా- ఫలాలను పంచిపెట్టాడు. ఒడిలోని బాలుడు కమలా ఫలాలను తింటూ విత్తనాలను నలువైపులకూ ఉమ్మివేయడం ఆరంభించాడు... ‘అలా ఉమ్మివేయరాదు, విత్తనాలను జాగ్రత్తగా ఒలిచి పక్కనపెట్టాలి...’అని బాలుడికి చెప్పిన గాంధీ ఒక్కొక్క ‘తొన’ ఒలిచి విత్తనాలను ఒక కాగితంపై పెట్టడం ప్రదర్శించి ఆ బాలుడికి నేర్పాడు. బాలుని ‘్ఫలహారం’ తరువాత గాంధీ ఆ బాలుని చేయి పట్టుకొని బయలుదేరాడు. ఆ ప్రయాణం దళిత బస్తీవైపు... మాల్‌గుడిలో నాలుగు రోజులుండిన మహాత్ముడు దళితవాడలోనే బసచేశాడు! నిర్లక్ష్యానికి గురై దుర్గంధం నిండిన దళితవాడ రాత్రికి రాత్రి పరిశుభ్ర జీవన వాటికగా మారిపోయింది. గాంధీ మూడు గంటలకు- తెల్లవారుజామున - నిద్రలేచాడు. గంటసేపు నాలుగుగంటల వరకు ‘రాట్నం’పై నూలు వడికాడు, నాలుగునుంచి ఐదు గంటలవరకూ నడిచాడు. ఐదు గంటలనుంచి స్నానాదులు నిర్వర్తించి సూర్యునికి ఉదయ సమయాన స్వాగతం చెప్పేవాడు, సామూహిక ప్రార్థనలో పాల్గొనేవాడు! సూర్యోదయానికి ముందు నిద్రలేవడం భారతీయ జీవన సత్యం. గాంధీజీ ఈ సత్యపాలన చేశాడు, ఈ సమయపాలన చేశాడు! మాల్‌గుడిలో ఉన్నప్పుడు కాని, మాల్‌గుడి చుట్టూఉన్న వందల గ్రామాలలో దుర్భిక్ష గ్రస్తులను పరామర్శించిన రోజులలో కాని గాంధీ తన నిత్య దినచర్యను మానలేదు, నియమపాలన మానలేదు. ఇది సత్య నిష్ఠ. గ్రామాలలో కూడ ఆయన నిరుపేదల ఇళ్ళలోను, రాగి చెట్టుకిందనూ విడిది చేశాడు! ఇది స్వచ్ఛ నిష్ఠ... సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆర్‌కె నారాయణ్ తన ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా’అన్న- ‘మహాత్ముని అనుమతికోసం’- నవలలో గాంధీని ఇలా దర్శించాడు! ఇది ‘క్విట్ ఇండియా’ఉద్యమానికి పూర్వంనాటి ఘటన. ‘మాల్‌గుడి’ వాస్తవానికి మైసూరు.
మహాత్ముడు మరణించి డెబ్బయి ఏళ్లయింది. ఆయన జన్మించి నూట నలబయి తొమ్మిదేళ్లు అయింది! ఇది నూట యాబయ్యవ జయంతి సంవత్సరం! గాంధీ కలలు కన్న ‘రామరాజ్యం’ స్వరూపం వికేంద్రీకరణ, స్వభావం స్వదేశీయ జీవనం! ‘కేంద్రీకరణ’, ‘విదేశాల పెట్టుబడులు’ గాంధేయ సిద్ధాంతాలకు విరుద్ధం. భారతీయతకు విరుద్ధం! ‘నూలు వడకడం’ వికేంద్రీకరణ... గ్రామీణ పరిశ్రమ! ‘ప్లాస్టిక్’ కాలుష్యానికి విరుగుడు ‘పత్తి’!! స్వచ్ఛతకు ప్రతీక ‘నూలు’... రాట్నం!